నా విషాదం నీ ఆనందాన్ని
పాడు చేస్తుందని నాకనిపిస్తే
నా విషాదాన్ని నాలోనే
సమాధి చేసేసుకుంటాను
20, సెప్టెంబర్ 2010, సోమవారం
19, సెప్టెంబర్ 2010, ఆదివారం
ఒక్కోసారి నేను
ఒక్కోసారి నేను
ఎగసి పడే కెరటంలా
ఉవ్వెత్తున పైకెగసి
అందని తీరాలని
అందుకోడానికి పరిగేడుతూంటాను
ఒక్కోసారి నేను
మబ్బుల వెనక జాబిల్లిలా
మొహానికి ముసుగేసుకుని
నలుగురిలో నేనున్నా
సిగ్గుతో ముడుచుకుపోతాను
ఎగసి పడే కెరటంలా
ఉవ్వెత్తున పైకెగసి
అందని తీరాలని
అందుకోడానికి పరిగేడుతూంటాను
ఒక్కోసారి నేను
మబ్బుల వెనక జాబిల్లిలా
మొహానికి ముసుగేసుకుని
నలుగురిలో నేనున్నా
సిగ్గుతో ముడుచుకుపోతాను
16, సెప్టెంబర్ 2010, గురువారం
నా ప్లాస్టిక్ నవ్వుల ప్రపంచం
మనసులోని ఆలోచనలని మూట కట్టి మూల పారేసి
విషాద భావాలన్నిటికీ రహస్యంగా వీడ్కోలు పలికి
మనసుకు ముసుగు వేసి మొహానికి రంగులు వేసి
అసహజమైన ప్లాస్టిక్ నవ్వులు అలవోకగా చిందిస్తూ
నిత్య జీవన స్రవంతి నాటకంలో
ప్రపంచ రంగస్థలం మీద
ఏ హంగూ లేని
నా సహాయక పాత్రని పోషించేస్తున్నాను

14, సెప్టెంబర్ 2010, మంగళవారం
ఏదో ఒక రాగం
sree బ్లాగ్ లో రాసిన పోస్ట్ (http://sreeszone.blogspot.com/2010/09/naa-chitti-koona.html#లింక్స్)
చదివాక నాకు అమ్మ గుర్తుకొచ్చింది. అమ్మ గుర్తుకొచ్చినప్పుడల్లా నాకు ఈ పాట గుర్తుకొస్తుంది.
ఏదో ఒక రాగం పిలిచిందీ వేళ
నాలో నిదురించే గతమంతా కదిలేలా
నా చూపుల దారులలో చిరు దివ్వెలు వెలిగేలా
నా ఊపిరి ఊయలలో చిరునవ్వులు చిలికేలా
జ్ఞాపకాలే మైమరపు జ్ఞాపకాలే మేల్కొలుపు
జ్ఞాపకాలే నిట్టూర్పు జ్ఞాపకాలే ఓదార్పు
ఏదో ఒక రాగం ||
అమ్మా అని పిలిచే తొలి పలుకులు జ్ఞాపకమే
రావమ్మా అని అమ్మే లాలించిన జ్ఞాపకమే
అమ్మ కళ్ళలో అపుడపుడు చమరింతలు జ్ఞాపకమే
అమ్మ చీరనే చుట్టే పాప జ్ఞాపకం
అమ్మ నవ్వితే పుట్టే సిగ్గు జ్ఞాపకం
ఏదో ఒక రాగం ||
గుళ్ళో కథ వింటూ నిదురించిన జ్ఞాపకమే
బళ్ళో చదువెంతో బెదిరించిన జ్ఞాపకమే
గవ్వలు ఎన్నో సంపాదించిన గర్వం జ్ఞాపకమే
నెమలి కళ్ళనే దాచే చోటు జ్ఞాపకం
జామ పళ్ళనే దోచే తోట జ్ఞాపకం
ఏదో ఒక రాగం ||
అమ్మ గురించి సిరివెన్నెల రాస్తే మనకి అమ్మ గుర్తుకొస్తుంది. అంత అద్బుతంగా వుంటుంది సిరివెన్నెల పాట. దానికి చిత్ర గొంతు కలిస్తే అంతే. అమృతాన్ని తలదన్నే అమ్మ తనం విలువ మనకు గుర్తు చేస్తుంది.
ఇది చదివిన అందరూ ఒక్క సారి అమ్మను గుర్తుచేసుకుంటారు కదూ.
లేదంటే పక్కన వున్న మనిషిని ఒకటి పీకమని రిక్వెస్ట్ చెయ్యండి. వెంటనే గుర్తుకొస్తుంది అమ్మ. ఫీల్ అవ్వకండి. అమ్మ మరి బాధల్లోనే గుర్తుకొస్తుంది.
పాట లింక్
Link will take you to http://www.raaga.com/

12, సెప్టెంబర్ 2010, ఆదివారం
దూరం చెరిపేదేలా?
నీ చేరువలో నేను వున్నప్పుడు
అడుగడుగునా నన్ను నిలదీస్తావు
అనుమానంతో కడిగేస్తావు
నిన్ను కాపాడుతుంటే కస్సుమంటావు
ఓదారుస్తుంటే అక్కర్లేదంటావు
తప్పు దిద్దుతుంటే తూర్పార బడతావు
సాయం చెయ్యబోతే కసురుకుంటావు
నిన్ను పల్లకి ఎక్కించాలనుకునే నా బలగాలని
నీ పదునైన పలుకులతో పొడి చేస్తావు
నా వెనక గోతులు తవ్వి
నావన్నీ శ్రీరంగ నీతులని చాటేస్తావు
నేను నీకు పట్టం కట్టిన మన సామ్రాజ్యంలో
నీ అసూయ తో ఆరని చిచ్చు పెడుతుంటావు
నీ నిందలు నిజాలు కావని నీకు తెలుసు
నీ మాటలు నిజాలు కావని నాకు తెలుసు
మన అనుబంధం నా ప్రేమకి ప్రతిబింబం
నీకే అర్ధం గాని నువ్వు నాకు అర్ధమవుతావు
చేరువలో మనమున్నా మన మధ్య వున్న
ఈ దూరం చెరిపేదేలా?
అంకితం: అనుబంధాలని నమ్మకం పునాదుల మీద నిర్మించలేని మనుషులని సహనంతో భరిస్తున్న అందరికీ
Image taken from: http://www.freakingnews.com/

దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)