అమ్మా! నన్ను చంపెయ్యకు
నీ నీడలో పెరుగుతున్న మొగ్గని
నన్ను నువ్వే చిదిమెయ్యకు
ఆడపిల్లనైన పాపానికి
ఆదిలోనే నన్ను తుంచేయకు
కడుపులో నేనునప్పుడే
నీ కర్కశత్వానికి బలి చేయకు
ఆడదానివి కాబట్టే కదా నువ్వు
అమ్మ అనబడే అదృష్టానికి నోచుకున్నావు
ఆడపిల్లనని తెలిసాక - నన్ను ఎందుకిలా
అంతం చెయ్యాలని చూస్తున్నావు
ఆడపిల్లగా పుట్టడం నా శాపం అయితే
పుట్టించడం ఆ దేవుడి పాపం
దేవుడి పాపానికి నాకెందుకు శిక్ష
లోకం చూడని నాపై ఎందుకింత కక్ష
నెలలు నిండిన ఆ రోజుల్లో
నీ కడుపులో నేను కదులుతుంటే
నువ్వెంతగా ఆనందించావని
కాళ్ళతో నిన్ను నేను మెత్తగా తంతుంటే
బాధని ఎంత ప్రేమగా భరించావని
ఇప్పుడు నేను అబ్బాయిని కాదని తెలిశాక
పసిపాపనని చూడకుండా పగ తీర్చుకుంటావా
నిన్నింక ఎప్పుడూ కష్టపెట్టనమ్మా
నన్ను కూడా నీలాగే బ్రతకనివ్వమ్మా
THOUGHTFUL.
రిప్లయితొలగించండిSree Garu,
రిప్లయితొలగించండిThank you.