ఆ గదిలో ఈ సాహసానికి ఒడిగట్టిన మా లాంటి వాళ్ళు ఏ విధంగా ఉంటారో అని ఊహించుకుంటూ మేము ఆ గదిలోకి అడుగుపెట్టాము. అక్కడ మాకు ముగ్గురు చాకులాంటి కుర్రాళ్ళు కనిపించారు. వారి వయసు పదహారు- పద్దెనిమిది మధ్యలో వుంటుంది. వాళ్ళు అంతా వయసులో వుండే వుద్రేకం తో ఒచ్చిన ఊపులో ఒక రకమైన ఉత్సాహం తో వున్నారు. "ఆ వయసులో చేస్తే ఒక సాహసం, ఈ వయసులో చేస్తే ఏం పోయేకాలం అని జనం అనుకుంటారు ...", అంటూ నా అంతరాత్మ మళ్ళీ లేచి మొత్తుకోబోయింది. "చస్స్.. నోర్ముయ్యసే.." అని దాన్ని తుంగలో తొక్కి, ఇంక నిశబ్దంగా వుంటే వీడు ఇలాగే లేస్తాడని, పక్క నున్న కుర్ర కారుని ప్రశ్నలతో గోకాను.. "ఎందుకు ఈ సాహసం చేస్తున్నావు? ఇంట్లో తెలుసా ఇలా చేస్తున్నట్లు?" అని. దానికి వాడు "ఇది చెయ్యకపోతే నన్ను నేను క్షమించుకోలేను, ఈ రోజు కోసం ఎన్నాళ్ళో ఎదురు చూసా. నేను ఇలా చేస్తున్నట్లు మా అమ్మకి తెలిస్తే నన్ను చంపేస్తుంది" అన్నాడు. బుద్ధున్న ఏ పెద్ద వెధవైనా ఇలాగే చెప్తారు.. ఈ మెంటలోడు తప్పితే.. అని మళ్ళీ నా అంతరాత్మ లేస్తూంటే... "నువ్వు ఒల్లకోరా!.. వూ.. జెల్ల కొట్టీస్తన్నావు.. " అని వాడిని అదమాయించే లోపు.. "అందరూ వృత్తాకారంలో మూగండి" అన్న కేకకి నేను అందరితోపాటు అక్కడ గుమిగూడాను.
ఇంకో పిల్లవాడు దీని కోసం వాడు డబ్బులు ఎలా పోగేసిందీ చెపుతున్నాడు. అది వింటే ఏదో రిక్షా తొక్కే పేద వాడు పొదుపు చేసి నానో కారు కొన్న స్టొరీ కన్నా కూడా జాలిగా ఉంది. అందరూ వాళ్ళ తల్లి తండ్రులకి తెలిస్తే వాళ్ళని ఎలా చంపేస్తారు అన్న దాని మీద ఒకడిని మించి ఒకడు రేంజ్ పెంచుకుంటూ గొప్పలు పోతున్నారు. ఆ పిల్ల కాయల మధ్యలో మేమిద్దరమూ, ఇంకొక నడి వయసు ఆడా-మగా వున్నాము. మేము నలుగురం మాత్రము డాక్టర్ విజిట్ కి వెళ్ళిన పేషెంట్, వెయిటింగ్ రూం లో నిశబ్దంగా చుట్టు పక్కల వాళ్ళని గమనిస్తూ ఆలోచిస్తాడు చూడండి- అలా ఉన్నామన్న మాట. అక్కడ మన జబ్బు పక్కన పెట్టి -- పక్కన వాడికి ఎంత భయంకరమైన జబ్బో అనే అనుమానంతో మౌనంగా, అతనికీ మనకీ వున్న దూరం (ఆ జబ్బు మనకు అన్టనంత వుండాలి అని) మనసులోనే లెక్క వేసుకుంటూ కొంచెం దూరం జరుగుతూ...మనం మాట్లాడితే మన జబ్బు గురించి చెప్పాల్సిన అవకాశం ఎక్కడ వుంటుందో అని మౌనంగా ఉంటాము కదా, అల్లా అన్న మాట.
అందరం వృత్తాకారంలో గూడాక, "క్వయిట్ ప్లీజ్.." అనే అరుపుతో, అందరూ సంభాషణని ఆపేశారు. "ఈ సాహసానికి మీరంతా తయ్యారా? " అన్న ఇంస్త్రుక్టర్ ప్రశ్నకి "యే..." అని కుర్రాళ్ళ కేకలు.. అందులో సన్నగా "య" అన్న మా నలుగురి గొణుగుడు కలిసిపోయింది. ఈ సాహసం ఎలా చెయ్యాలి అన్న దానికి ముందు తర్ఫీదు ఇస్తుంటే, మెదడులో ఎన్నో ఆలోచనలు... "ఇవన్నీ నాకు అప్పుడు గుర్తున్టాయా?... ఒక వేళ భయంతో మెదడు ఫ్రీజ్ ఐపోతే, ఏంటి పరిస్థితి? దేని తరవాత ఏది చెయ్యాలో ఎలా గుర్తుపెట్టుకోవాలి?... ఇక్కడ ఇన్నిఅనుమానాలూ నా ఒక్కడికేనా? అందరికీ అర్ధం అయ్యి, నాకు అర్ధం కాకపోతే మళ్ళీ ఎన్ని సార్లు అడిగినా చెప్తారా? అసలు మళ్ళీ చెప్పమంటే ఏమనుకుంటారో?.." లాంటి అనుమానాలతో నిశబ్దంగా ... మొదటి రోజు డ్రిల్ కి ఒచ్చిన కుర్రాడి లాగా - మందని ఫాలో అయ్యి టీచర్ కంట్లో పడకుండా మేనేజ్ చేసినట్లు చేసేసాను. ఇప్పుడు అనుమానాలతో డ్రిల్ అయ్యింది.. అసలు సాహసం ఇప్పుడుంది.. ముందుంది ముసళ్ళ పండగ అనుకుంటూ.. మిగిలిన మూడు ముసళ్ళనీ ... అదే ముసలాళ్ళనీ నా కళ్ళతో వెతికాను..
"ఇప్పుడు ఎవరికైనా భయంగా వుంటే ఇప్పుడే ఆపెయ్యచ్చు.. " అని ప్రకటించాడు instructor ... పక్క వాడు "నా వల్ల కాదు".. అంటే బావుండును అని అనుకుంటూ వున్నాను నేను... అలా అనే ధైర్యం చెయ్యడం కూడా ఒక గొప్ప అనిపించింది ఆ క్షణంలో .. మన భయాన్ని ఒప్పుకునే ధైర్యం చెయ్యకపోతే.. మనం ధైర్యం నటిస్తూ భయం మాటున ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ఈ సాహసం చెయ్యడం ఎంత కష్టమో అని మెదడు బేరీజు వేయడానికి ట్రై చేసి ఫెయిల్ అయ్యింది.. "నేను డ్రాప్.. " అన్నాడు మూడో ముసలి... కళ్ళల్లో మెరుపుతో మెచ్చుకున్నట్లు మా ముగ్గురి చూపులు... "నేను కూడా డ్రాప్" అంది అతనితో వున్న ఆడ ముసలి..
హమ్మయ్య!.. మనం ముందు డ్రాప్ అయ్యి ఎవ్వరూ అవ్వకపోతే అది పిరికితనం అని అనిపించుకుంటుంది.. అదే ఆల్రెడీ ఇద్దరు డ్రాప్ అయితే మనం అందరిలో ఒకడు.. అసలు ప్రపంచంలో ప్రతీ మనిషీ ఈ గుంపులో ఉండడానికే ఇష్టపడతాడు. అందుకే ముందు కోచ్చేవాళ్ళు తక్కువ.. ఎవడైనా ఒస్తే.. ఆ ఒకడికి ఇద్దరు తోడైతే.. మందలో చేరడానికి అందరూ సిద్ధమే..
నెక్స్ట్ నీదే వంతు అన్నట్లుగా ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నాము.. నేనూ.. నా కజినూ...
(క్షమించండి.. రాత్రి ఒకటిన్నర.. రేపు ఆఫీసు..కాబట్టి ... Climax తరువాత టపాలో.. కొంచెం ఓపిక పట్టండి...... సశేషం)

sky diving?? idi daarunam chandu.. ee teaser show entandi baabu... naaku shh gapchuplo AVS laaga kadupubbi potundikkada...
రిప్లయితొలగించండిదీపావళి శుభాకంక్షలు......
రిప్లయితొలగించండిమీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు
రిప్లయితొలగించండి- శి.రా.రావు
శిరాకదంబం
పేకాటలో డ్రాప్ కాదు కదా!
రిప్లయితొలగించండిహ్మ్! ఇవాళా చెప్పలేదుగా!! కానివ్వండి...మాంఛి ధ్రిల్లర్ స్టోరీ కదా!!ఏంచేస్తాం!!పైన ఉన్న 'శ్రీ' గారు మాత్రం భలేభలె హింట్లు ఇచ్చేస్తున్నారు :)
రిప్లయితొలగించండిమర్చిపోయా!! మీకు మీ కుటుంబానికి 'దీపావళి ' శుభాకాంక్షలు....ముఖ్యంగా చిన్నారి 'శ్రీ' కి :)
సస్పెన్సు సంగతి సరేగాని కొన్ని గొప్ప జీవిత సత్యాల్ని ఆవిష్కరించారు.
రిప్లయితొలగించండిsree,
రిప్లయితొలగించండిNext part lo thelusthundi.
hanu,
రిప్లయితొలగించండిథ్యాంక్ యూ.
srrao,
రిప్లయితొలగించండిథ్యాంక్ యూ.
a2zdreams,
రిప్లయితొలగించండికాదు లెండి.
ఇందు,
రిప్లయితొలగించండిథ్యాంక్ యూ. మా సిరి కి చెప్పాను లెండి.
కొత్త పాళీ,
రిప్లయితొలగించండిథ్యాంక్ యూ.