నీ జీవిత పయనానికి గమ్యం నిర్దుష్టం
నాకు పయనమే జీవితమవ్వడం నా అదృష్టం
హద్దులలో సంచరించడం నీ గొప్పతనం
హద్దులు అధిగమించడమే నా అభిమతం
ఒడ్డించిన విస్తరి లాంటిది నీ జీవితం
విడదీయలేని చిక్కుముడి నా జీవితం
జీవితమనే ప్రశ్నకు నువ్వు జవాబైతే
జీవితానికే నేనొక ప్రశ్నను..
అర్ధమయ్యీకానట్టుందండీ :) కానీ బాగుంది...చిన్నగా,చక్కగా :)
ప్రత్యుత్తరంతొలగించుకొంత మంది గోల్స్ అనీ, లిమిట్స్ అనీ, ప్లాన్స్ అనీ చాలా జాగ్రత్తగా ఉంటారు. ఇంకొందరు ఏ మాత్రం డిసిప్లిన్ లేకుండా, కొంచెం అడ్వెంచర్, తక్కువ ఎఫర్ట్ తో, పెద్దగా ప్లానింగ్ లేకుండా ఎలాగోలా సక్సెస్ సాధిస్తారు.. ఈ రెండో రకం వాళ్ళు జీవితం జర్నీ లాగా బాగా ఎంజాయ్ చేస్తారు. వీళ్ళు చాలా మందికి క్వెస్చన్ మార్కు గాళ్ళు..
ప్రత్యుత్తరంతొలగించు