27, జనవరి 2013, ఆదివారం

హాలీవుడ్ రేంజ్ లో కమల్ "విశ్వరూపం"

ఒకప్పుడు కమల్ సినిమా రిలీజ్ అంటే మొదటి రోజు మొదటి ఆట చూసాకే ఇంటర్ ఫైనల్ పరీక్ష రాసిన రోజులు. గెస్ట్ రోల్ లో కమల్ నటించినా సరే మొదటి రోజే చూసేయ్యాలి.. కమల్ వైవిధ్య భరితమైన పాత్రల ఎంపిక మీద అంత నమ్మకముండేది. గత కొన్ని ఏళ్ళుగా కమల్ సినిమా వొస్తుందో- లేదో తెలియని పరిస్థితి, ఖర్చు (బడ్జెట్) భరించలేక సినిమా సగంలో ఆగిపోవడం లేదా కాంట్రావర్సీలు , ఒక వేళ ఒచ్చినా తెలుగు లో డబ్బింగ్  అవుతుందని  గారంటీ లేదు. ఒక వేళ  అయినా, అది అమెరికాలో మా లోకల్ సినిమా హాలికి ఒచ్చే అవకాసం తక్కువే. అలాంటి ఎన్నో అవకాశాల మధ్య కష్టపడి 'దశావతారం' ఒక్కటీ చూడగలిగాను. మిగిలిన సినిమాలు అంతంత మాత్రమే.  ఈ మధ్య కమల్ సినిమా అంటే "బావుందని తెలిస్తే అప్పుడు చూద్దాములే', అన్న స్టేజి కి నేను కూడా ఒచ్చెసాను. అందుకే  "విశ్వరూపం" ప్రివ్యూ  షో కి వెళ్ళే ప్రయత్నం చెయ్యలేదు. అసలు ప్రివ్యూ పడితే తరవాత రోజు చూద్దాములే అని ఆగాను.  సరే ప్రివ్యూ పడి  జనాలు రివ్యూ చూసాక, హమ్మయ్య మళ్ళీ కమల్ సినిమా చూడొచ్చు అని ఒక ఇద్దర్ని పోగేసి మంచు పడుతుంటే ధైర్యం చెప్పి సినిమాకి లాక్కెళ్ళా.

సినిమా మొదలే ఒక కధక్ డాన్సర్ గా - అదీ ఆడంగి లక్షణాలు వున్న కధక్ టీచర్ గా కమల్ ఆదరగోట్టేస్తాడు. ఇంతలో ఆసక్తికరమైన కొన్ని సంఘంటనల మధ్య ఒక అద్భుతమైన ఏక్షన్ ఎపిసోడ్. మామూలు సినిమాలకు బిన్నంగా - సహజత్వానికి దగ్గరగా అప్పుడప్పుడు కొంచెం మొదటి భాగంలో సాగినట్లున్నా కానీ సినిమా ఆద్యంతం మనల్ని కట్టి పడేస్తుంది. మొదటి నించీ చివరి వరకు కెమెరా పనితనం మనం హాలీవుడ్ సినిమా చూస్తున్నామా అనిపించేలా వుంటుంది. దానికి తోడు హాలీవుడ్ ఏక్షన్ మూవీ కి ఏ మాత్రం తీసిపోని ఫైట్లు (సుమో లు ఎగరడం, చిటికేస్తే బాంబులు పేలడం లాంటి కృత్రిమత లేకుండా).. ఏ మాత్రం భారత దేశంలో తీయకుండా కధకి సరిపడే అద్భుత లొకేషన్ లు. వుండాలి కాబట్టి తప్పదని  పాటలు ఇరికించే ప్రయత్నం ఏదీ  చెయ్యలేదు. సినిమా చూస్తున్నంత సేపూ మన బుర్రకి కొంత ఆసక్తి కరంగ (సినిమా అయ్యాక కూడా), కొంత ఆలోచింప చేసేలా వుంటుంది. జరిగిన కధని వివిధ భాగాలుగా ఒక్కో క్యారెక్టర్ గతాన్ని నెమరు వేసుకుంటున్నట్లు చూపించిన పద్ధతి బావుంది, ఇలాంటివి మామూలు ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకోలేరేమో అని నా అనుమానం. 

  శేఖర్ కపూర్ ఒక మంచి సపోర్టింగ్ రోల్ చేశాడు. మరీ భయపెట్టే కండల విలన్ కాకపోయినా, మనం టీవీ లో చూసే తీవ్రవాది లాంటి రోల్ లో రాహుల్ బోస్ చాలా బాగా చేశాడు. అమెరికన్ నటి పూజా  కుమార్, పూర్తి హీరోయిన్ లా అనిపించక పోయినా, పాత్రకి సరిపడా న్యాయం చేసింది. పెద్ద పాత్ర కాకపోయినా ఆండ్రియా బావుంది.తనలో ఒక అద్బుతమైన దర్శకుడు ఉన్నాడని  కమల్ మరోసారి నిరూపించాడు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బావుంది. ఇక స్టంట్లు, సెట్లు, చాయాగ్రహణం అయితే హాలీవుడ్ చిత్రాలకి ఏ మాత్రం తీసిపోకుండా వున్నాయి. క్రిష్ణుడి  పాటకి చేసిన డాన్సు అన్దరినీ కట్టి పడేస్తుంది. 

సగటు తెలుగు సినిమా లాగా కామెడీ లేదు, ఐటెం సాంగు లేదు, సుమోలు లేవలేదు, హీరొయిన్ నచ్చలేదు లాంటి కారణాలతో ఈ సినిమా మిస్ చేసుకోవద్దు.  హాలీవుడ్ సినిమా బావుంది అంటే మనం ఎలా చూస్తామో అలాగే చూడండి. అఫ్ కోర్స్ మరీ చిన్న పిల్లలని తీసుకెళ్లే సినిమా కాదు. నాకు మాత్రం ఈ సినిమా ఇంగ్లీష్ లో కూడా రిలీజ్ చేసుంటే మంచి గుర్తింపు ఒచ్చేదేమో అనిపించింది. ఏదైతేనేం కమల్ (నట) విశ్వరూపం  చాలా ఏళ్ళ తరవాత మళ్లీ చూపించాడు. ఇండియన్ సినిమాని హాలీవుడ్ స్థాయికి దగ్గరగా తీసుకెళ్తూ ...