1, డిసెంబర్ 2010, బుధవారం

ఆరంజ్ అందరికీ నచ్చదు - కానీ కొందరిని ఆలోచించేలా చేస్తుంది

 చిన్నప్పుడు మా అమ్మమ్మ చెప్పినట్లు నీరు పల్లమెరుగు , అలాగే ప్రేమ కూడా అంతే. స్వచ్చమైన ప్రేమ ఎప్పుడూ మనకి తల్లి తండ్రుల నించి దొరుకుతుంది. అలాగే మనం కూడా మన పిల్లలకి ఇచ్చినంత ప్రేమ మనకి జన్మ ఇచ్చిన తల్లి తల్లి తండ్రులకు కూడా ఇవ్వం. ఎందుకంటే ఆశించకుండా ఇచ్చే ప్రేమే గొప్పది. ఇదంతా ఎందుకు చెపుతున్నానంటే ఈ సినిమా సబ్జెక్టు జీవిన్తాంతం ప్రేమించడం సాధ్యం కాదు అన్న హీరో స్టొరీ. అయితే అది చేదు నిజం. ప్రేమని అందమైన రంగులలో ప్యాక్ చేసి అమ్మే సినిమా అనే ఒక వస్తువుని నిజం చెప్తానంటే కొనుక్కోడానికి ఎవడూ రాడు. అందుకనే ఆరంజ్ అందరికీ నచ్చదు.  పరుగు కూడా ఇలాంటి నిజం చెప్పే ప్రయత్నం. అదీ ఆడలేదు.
సినిమా లో కొన్ని మంచి పాయింట్స్ ఏంటంటే - అందరూ ప్రేమ వుందని అబద్ధం చెప్పి తన భాగస్వామిని నమ్మిస్తారు.
నిజం చెప్పి ప్రేమించడం కష్టమే. అలాగే కొన్ని ఏళ్ళ తరవాత ప్రేమ కరిగిపోతున్దన్నది కూడా వాస్తవమే. విడిపోయే అవకాశాలు చాలా మందికి ఒచ్చినా వాటిని ఎవ్వరూ (చాలా మంది) వుపయోగించుకోరు. చివర్లో ఇంకొంచం ప్రేమించే ప్రయత్నం చేస్తా అన్న కాన్సెప్ట్ బావుంది.మన ప్రేమ మన కార్ హెడ్ లైట్ లాంటింది - దాన్ని నమ్ముకుని ముందుకు వెళ్ళాలి కానీ, అవతలి వాళ్ళ ప్రేమ ని నమ్ముకుని ముందుకు వెళ్ళడం అనేది ఎదుటి బండి హెడ్ లైట్ లో చీకట్లో డ్రైవ్ చెయ్యడం అన్నది మంచి ఉదాహరణ. భాస్కర్ ఆలోచనలు బావున్నా, దానికి మంచి పాయింట్స్ తయారు చేసుకున్నా, సబ్జెక్టు చెప్పే పద్ధతి మార్చాలి.
ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ కొంచెం డ్రా బ్యాక్. ముఖ్యంగా జేనేలియా హెయిర్ స్టైల్ చాలా చండాలంగా ఉంది. ఆ హెయిర్ స్టైల్ మూలంగా కొంచెం ముదురుగా కనిపించింది. చరణ్ నవ్వు, DIALOGUE డెలివరీ అస్సలు బాలేదు. ఈ నాటి తెలుగు హీరో లెవ్వరూ పెళ్లి అనే పదాన్ని సరిగ్గా పలకలేరు. ఎవడైనా పెళ్లి అని సరిగ్గా అంటే వాడికి ఉత్తమ నటుడు అవార్డు ఇచ్చేయచ్చు. దానికి తోడు సినిమాలో సగం వరకు మనం హీరో కాన్సెప్ట్ తో ఏకీభవించం.తరవాత మనకి హీరో కాన్సెప్ట్ ఎక్కే టైం కి  CLIMAX ఒచ్చేస్తుంది. చివరకి హీరో కాన్సెప్ట్ మార్చేస్తాడు. సినిమా మొదటి నించి మనం ప్రేక్షకుడిని మనతో తీసుకెళ్ళకపోతే ఆ సినిమా చివరకి నచ్చడం చాలా కష్టం. దానికి తోడు పాటలు సినిమాలో అంత IMPACT అనిపించలేదు. బయటే బావుండి వుంటాయి. FIGHTS అసలు సినిమాకి నప్పలేదు. ఫస్ట్ హాఫ్ లో అయితే కొంచెం లిప్ సింక్ కూడా సరిగ్గా లేనట్లు అనిపించింది. సినిమాలో అన్ని పాత్రలు -చివరకి హీరో తో సహా తన అభిప్రాయాన్ని మార్చుకుంటారు. దానితో ప్రేక్షకుడు అస్సలు ఒప్పుకోడు. సినిమా అంతా అందులో పాత్రల లాగే CONFUSE ఐన ప్రేక్షకుడు సినిమా బాలేదు అన్న క్లారిటీ తో హాలు నించి బయటకు ఒస్తాడు.
అసలు మనం కోరుకునే ప్రేమ, గుర్తింపు కోసం మనం పడే తపన మాత్రమే. అలా ప్రేమించబడాలంటే మనలో ప్రేమించ దగ్గ లక్షణాలు వుండాలి. ప్రేమించుకునే ఇద్దరి మధ్య మొదట్లో వుండేది ఆకర్షణ మాత్రమే. అది కరిగిపోయే నాటికి వాళ్ళ మధ్య అవగాహన కుదిరితే ఆ బంధం నిలుస్తుంది. ఆ అవగాహనకి పునాది నమ్మకం. మనం అవతల మనిషి మంచి కోసం మన స్వార్ధం లేకుండా కృషి చేసినప్పుడే అవతల మనిషి మనల్ని తన కోసం ప్రేమిస్తాడు. అవన్నీ ఒదిలేసి ప్రేమ అనే గుర్తింపు కోసం నిత్యం డిమాండ్ చేస్తూ అవతల మనిషిని సతాయిస్తుంటే, ప్రేమ సంగతి దేవుడు ఎరుగు - భరించడమే కష్టం అయిపోతుంది.  
  సినిమాలో  పీసులు పీసులు గా చెప్పిన కాన్సెప్ట్స్ బావున్నాయి. మహిళా ప్రేక్షకులకు అస్సలు నచ్చదు. కానీ కొంచెం పరిపక్వత వున్న వాళ్ళని ఆలోచించేలా చేసే కాన్సెప్ట్స్ వున్నాయి. ఆలోచించేలా చేసినా కూడా సినిమా నచ్చుతుందని లేదు.
 అందుకే ఈ సినిమా మీద నా రివ్యూ, "ఆరంజ్ అందరికీ నచ్చదు - కానీ కొందరిని ఆలోచించేలా చేస్తుంది".

26 వ్యాఖ్యలు:

 1. మీ రివ్యూ చదివాకా, సినిమా ఖచ్చితంగా చూడాలనిపిస్తున్నది.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. ur review is right bro....its only for limited audience only....concept is gud but failed to narrate it properly.....

  ప్రత్యుత్తరంతొలగించు
 3. "ఎవడైనా పెళ్లి అని సరిగ్గా అంటే వాడికి ఉత్తమ నటుడు అవార్డు ఇచ్చేయచ్చు."
  హ హ హ.
  ఇంకా నయం. పెళ్ళి అని సరిగ్గా పలికినవాడికి పెళ్ళిచేస్తాననలేదు!

  ప్రత్యుత్తరంతొలగించు
 4. "ROCK"ESH,
  Thanks for the comment. Yevarikaina Poorthigaa nachchadam kashtam. Partlu partlu gu nachchuthundi. Nenu choosina theatre lo naalugo roju mugguru maathrame prekshakulu vunnaru.

  ప్రత్యుత్తరంతొలగించు
 5. rajesh t,
  చరన్ని భరించగలిగే ఓపిక ఉంటే ఒక సారి చూడవచ్చు.

  ప్రత్యుత్తరంతొలగించు
 6. కొత్త పాళీ,
  నిజమే నండి. ఈ సినేమా లో ఎన్నో సార్లు హీరొ పెళ్లి అనే పదం ఉచ్చరించినప్పుడు "హత విధీ!" అనుకున్నాను. అదే మా తెలుగు మాస్టరు ఐతే చెయ్యి జాపిన్చి హీరొ ఫైట్స్ మరిపించే రేంజ్ లో... హష్ హష్.. అని రియల్ మ్యూసిక్ తో బెత్తం పట్టి అర చేతుల్లో అరిశలు పుట్టించేవారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 7. good review

  ఇటువంటి సినిమాలను పబ్లిసిటితో నెక్స్ట్ రేంజ్ తీసుకొని వెళ్ళవచ్చు. అంటే కొందరిని మరికొందరిగా మార్చవచ్చు. కాని ఆ సూచనలు కనిపించడం లేదు. కారణం:
  1) సినిమాకు ఖర్చు పెడితే చాలు అనుకునే వేస్ట్ నిర్మాత ..
  2) రాజకీయ పరిస్తితులు

  ప్రత్యుత్తరంతొలగించు
 8. a2zdreams,
  నిజమే. నాలుగో రోజు ముగ్గురు కోసం సినేమా వేసిన థియేటర్ వాడి మీద నాకు చాలా జాలి వేసింది. కనీసం కొంత ఐనా పబ్లిసిటి చెయ్యాల్సింది.

  ప్రత్యుత్తరంతొలగించు
 9. చాలా బాగుంది మీ రివ్యు.బాయాస్డ్ గా లేకుండా బాగా వ్రాసారు.నేను చెర్రీ ఫాన్ :( కానీ మీరు అన్నట్టు కొన్ని చోట్ల నాకు తను నచ్చలేదు :( అందరి సంగతేమో కానీ ఆరెంజ్ సినిమా మాత్రం నాకు కొంచెం అర్ధమయింది.సినిమ అంటే నాలుగు పాటలు...రెండు ఫైట్లు అనుకునే మామూలు జనాల బుర్రకి ఎక్కడం కష్టం.అదే సినిమలో తనని తను చూసుకుని ప్రశ్నించుకోగలిగితే అర్ధమవుతుంది ఈ కాన్సెప్ట్. నాకు కొన్ని కొత్త డౌట్లు ఉద్భవించాయి....కొన్ని డౌట్లు క్లారిఫై అయ్యాయి :)) కానీ ఇది ఒక నిజాయితీ ఉన్న సినిమా అని చెప్పొచ్చు.

  ప్రత్యుత్తరంతొలగించు
 10. ఇందు,
  థ్యాంక్ యూ. నిజమే. ఇలాంటి సినిమా తియ్యటం సాహసమే. సిన్సియర్ ప్రయత్నం చేసినందుకు మెచ్చుకోవాలి.

  ప్రత్యుత్తరంతొలగించు
 11. మంచి రివ్యూ రాసారు.

  నాకు సినిమా చూడడం వీలు పడలేదు. DVD వచ్చిన తరవాత చూడాలి.

  ప్రత్యుత్తరంతొలగించు
 12. Just now I have watched the Orange movie. Really concept is good and some times lies needed for to continue the love.

  People want new stories but some how don't like these kind of stories.

  Who likes this movie : Married people and lovers .

  Its looks like intentionally some people are writing wrong reviews about this movie. This is one of the best movie which has the real life concept and encountered to every human beings life.

  If you miss this movie definitely you will not see the relation ship in other angle.

  ప్రత్యుత్తరంతొలగించు
 13. @ ఆ హెయిర్ స్టైల్ మూలంగా కొంచెం ముదురుగా కనిపించింది.

  hmm u seem to be wrong ,  @ సినిమా మొదటి నించి మనం ప్రేక్షకుడిని మనతో తీసుకెళ్ళకపోతే ఆ సినిమా చివరకి నచ్చడం చాలా కష్టం.

  stop thinking about hero..just fallow heroines tention and brahmi's analysis...then meet hero at climax :D

  ప్రత్యుత్తరంతొలగించు
 14. "ఆ అవగాహనకి పునాది నమ్మకం. మనం అవతల మనిషి మంచి కోసం మన స్వార్ధం లేకుండా కృషి చేసినప్పుడే అవతల మనిషి మనల్ని తన కోసం ప్రేమిస్తాడు."..........చాలా బాగా చెప్పారు. మీ రివ్యూ ఆలశ్యంగా చూసాను. బాగా రాసారు. నేను నిన్ననే ఒక రివ్యూ రాసాను.

  ప్రత్యుత్తరంతొలగించు
 15. ఆ.సౌమ్య,
  థాంక్స్ అండీ. మీ రివ్యూ చదివాను. చాలా బాగా రాశారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 16. manishi tana identity kosam premimpabadalani anukuntadu. Right! avatali vadi prema mida depend avadanni verevadi head light lo mana karu drive cheyatam to polchavu supar! I agree with you.

  ప్రత్యుత్తరంతొలగించు
 17. regular stories ki binnam ga vundi,naku nachindi .kottdanam kavalanteru teeste chudaru!!
  heroin is drawback,
  charan inka baga cheyali...
  mana vallu telugu tution pettinchukunte baguntundi...
  nice analsysis...

  ప్రత్యుత్తరంతొలగించు
 18. నేను ఈ సినిమా ధియేటర్ లో చూడడం మిస్ అయాను. కానీ మన ' మా ' టీ వి వాళ్ళు ఊరుకోరు కదా..మొన్న నెప్పుడో ,టీ వి..లో చూసి, ఒక రివ్యూ రాద్దామా? అను కుంటూ ఉన్నాను..ఈ లోపల , ఇవాళ మీ రివ్యూ చదివాను, నేను వేరే రాయక్కర లేదు ..అనిపించింది.
  నావి సేం టో సేం అవే అభిప్రాయాలు.
  నిజ జీవితం లో సినిమా లో చూపించిన ప్రేమ సీన్లు ..పెళ్లి తో ముగుస్తాయి, ఇంక అక్కడి నించి, మంచం మీద పడేసిన తడి టోవేల్, మా అమ్మా లాగ వండలేని, వంకాయ కూర ,చాల ముఖ్యం అయిపోతాయి..ప్రేమ..అనేది..ఏదో ఒక అవస్థ కాదు..
  జీవితం లో ముఖ్య మైన తిండి, బట్ట, గూడు అమర్చు కోవడం..లో శ్రమిస్తూంటే.. ప్రేమ కిటికీ లోంచి పారి పోకుండా ,కాపాడ గలిగేది..
  పరస్పరం..నమ్మకం..మీరు రాసిన..ఆ వాక్యం..నిజం గ నిజం..
  ఇంక ఇది ఒక బ్లాగ్ లాగ మారిపోక ముందే..సెలవ్..బాగుంది మీ రివ్యూ.
  వసంతం.

  ప్రత్యుత్తరంతొలగించు