1, ఫిబ్రవరి 2011, మంగళవారం

అబ్బాయిలు ఎప్పుడూ అమ్మాయిలని ఎందుకు ప్రేమిస్తారు...



వారం అంతా ఎక్కడో పని చేసి, వీకెండ్ ఇంటికి ఒచ్చి నా కూతురు చెప్పిన కబుర్లు వింటూ భోజనం చేసి టీవీ ఆన్ చేసాను. నాతో పాటు TV చూస్తున్న నా కూతురు "మా" టీవీ లొ ఒస్తున్న సినేమా "రోబో" లొ యుగళ గీతం చూసి నన్ను ఒక డౌట్ అడిగింది. "డాడీ! WHY BOYS ALWAYS FALL IN LOVE WITH GIRLS ?" అని. కళ్ళు తిరిగి కింద పడినంత పని అయ్యింది. ఎందుకంటె నా కూతురు వయసు ఇంకా నాలుగే. నిజానికి నా ముద్దుల తల్లి అడిగే ప్రశ్నలకి నేను అలవాటు అయ్యి అంతగా ఆశ్చర్యపోను. మొదట్లో అదేదో సినిమాలో గిరిబాబులా ఆకాశం కేసి చూసి "దేవుడా! ఎందుకు నాకు కూతుర్నిమ్మంటే క్వొశ్చన్  బ్యాంకు నిచ్చావు" అని ప్రశ్నించేవాడిని. తరవాత మెల్లిగా ఆలోచించి సమాధానం చెప్పడం అలవాటు చేసుకున్నాను. కానీ ఇది ఎంసెట్ లొ అవుట్ అఫ్ సిలబస్ క్వొశ్చన్, అదీ యం పీ సి  వాడికి బోటనీ క్వొశ్చన్ లాంటిది. ఈ ప్రశ్న దాని మనసులోకి ఎలా ఒచ్చిందంటే, అది చూసే అరా-కొరా తెలుగు సినిమాలలో ఎప్పుడూ హీరొయిన్ వెంట హీరో పడడం, చివరికి ROBO సినిమాలో ROBO కూడా హీరొయిన్ వెంట పడుతుంటే దానికి ఇలాంటి సందేహం ఒచ్చింది. నేను వెంటనే ఆపుకోలేని నవ్వుని, నా ముఖ కవలికలని కవర్ చేసుకుని "ఎక్కడ నేర్చుకున్నావు ఇది?' అని అడిగా లేని కోపం చూపించే ప్రయత్నం చేస్తూ. "నో వేర్" అని చెప్పి మాట మార్చేయడం నా కూతురికి అలవాటు.




నా కూతురు తెలివి గురించి చెప్పాలంటే- నేను మా ఆవిడ ఎప్పుడైనా ఘర్షణ పడితే ఇది నేను ఏమి చెయ్యలేదు, నేను గుడ్ గర్ల్ అంటుంది. మీ ఇద్దరూ కోపం నా మీద చూపించకండి ఇందులో నా తప్పేమీ లేదని అందులో అర్ధం. ఎప్పుడైనా వాళ్ళ అమ్మను కార్ లోంచి డ్రాప్ చేసి "మీ అమ్మ ని ఓదిలేసాను, ఇంక నువ్వు డాడీ దగ్గరే వుండాలి" అని ఏడిపిస్తే, "చిన్న పిల్లలు మమ్మీ లేకుండా ఉండలేరు.", అని సెంటిమెంట్ తో కొట్టి రెండు కన్నీటి చుక్కలు రాల్చి నేను కంగారుగా ఓదార్చే స్టేజి కి తీసుకొస్తుంది. పైన రెండు సందర్భాలలో అది ప్రదర్శించే తెలివి నన్ను కొంచెం పుస్తకాలూ అవీ చదివి, దాని వయసుని బట్టి ఆలోచనలు పసిగట్టే ప్రయత్నం చేసేలా చేసాయి. అయినా సరే నా కూతురు వయసుకి మించిన పరిణతి తో నా ప్రిపరేషన్ సరిపోవట్లా. 

నా కూతురు నాకు ఇలాంటి షాక్ లు చిన్నప్పటి నించీ ఇస్తోంది. రెండేళ్లప్పుడు అనుకుంటా ఒక సారి ఇంటికి ఒచ్చి "నిక్ గాడికి నేను నచ్చాను, నన్ను పెళ్లి చేసుకుంటాడట" అన్నప్పుడు నాకు నవ్వాలో ఏడవాలో తెలియలేదు.


మూడేల్లప్పుడు ఒక సారి ఇంటికి ఒచ్చి "నాన్న, నేను ఎందుకు బ్రౌన్ గా వున్నాను. తెల్లగా ఎందుకు లేను?" అంది. అప్పుడేదో ఇంద్ర ధనుసులో రంగుల్లా అన్ని రంగులలో మనుషులు వుంటే లోకం అందంగా వుంటుంది అని చెప్పి సర్దేసా. ఏం చేస్తాము నా వన్నీ నీ పోలికలు అని చెప్తే, తెల్లగా వున్న అమ్మ పక్షం చేరుతుందని, లేదా మరిన్ని ప్రశ్నలు సందిస్తుందని. అప్పటినించీ దీనికి నలుపు, బ్రౌన్ రంగుల గురించి ఏది చెప్పాలన్నానేను బాగా ఆలోచించి మరీ చెప్తా.


ఒక రోజు ఇంటికి ఒచ్చాక "నాన్నా! నాకు డే కేర్ లొ ఒక ట్విన్ సిస్టర్ ఉంది" అంది. ఈ మధ్య డే కేర్ లొ కొత్తగా చేరిన జయ (నల్ల అమ్మాయి) రంగూ, నా రంగూ ఒకటే కాబట్టి అది నా ట్విన్ సిస్టర్ అని వాదిస్తూ కూర్చుంది. దీని చేత అది కాదు అని ఒప్పించే టప్పటికి నా తల ప్రాణం తోకలో కొచ్చింది. మీరు మరీ ఎక్కువ ఊహించకండి- నాకు తోక లేదు. ఏదో సామెత అంతే.  హమ్మయ్య దీన్ని కన్విన్సు చేసానని సంబరపడుతుంటే నిన్న "నాన్నా నేను నువ్వు ఒకే రంగులో, బుగ్గ సోట్టల్తో ఒకేలా  ఉంటాము. నువ్వు నేను ట్విన్స్" అనడం మొదలెట్టింది.
ఈ మధ్యనే TANGLED సినిమాకి వెళ్తే నా కూతురు అడిగిన ప్రశ్నలకు నా వెనక కూర్చున్న ముసలామె సినేమా అయ్యాక నన్ను తట్టి మరీ నా కూతురు వయసెంత అని అడిగింది. నాలుగు అని చెప్తే ఆవిడ సమాధానం "మీ అమ్మాయి ప్రశ్నలు వింటే ఏడో ఎనిమిదో అనుకున్నా, ఎత్తు చూస్తే తక్కువ అనిపించి అలా అడిగాను. నాలుగేళ్ళకే ఇన్ని ఇలాంటి ప్రశ్నలా?" అంది.



ఇలా వుంటుంది నా కూతురితో.  దీనికి తోడు మా ఆవిడ లేని పోని చిన్ని కృష్ణుడు కధలు చెప్పి, కృష్ణుడు  ఒస్తాడని కాకమ్మ కబుర్లు చెప్తే, "కృష్ణుడు ఇంకా ఎందుకు రాలేదు? ఎలా ఒస్తాడు? ఎప్పుడు ఒస్తాడు?" అని ఒక రోజంతా పదే పదే విసిగించింది.


పోనిలే అవసరానికో అబద్ధం అని చెప్పి మా అమ్మాయి ప్రశ్నల నించి తప్పించుకోడం చాలా కష్టం. ఎప్పుడైనా మనం వేరే సమాధానం చెప్తే "మరి నా మూడేల్లప్పుడు నాకు అలా చెప్పావు, ఇప్పుడు ఏంటి ఇలా చెప్పావు" అని నిలదీస్తుంది. ఒక సారి మా అమ్మాయికి DRY COUGH ఒస్తే, "తల్లి! కొంచెం మంచినీళ్ళు తాగు. నీకు DRY COUGH ఒచ్చింది" అన్నాను. "DRY అంటే తెలుగులో ఏంటి?" అని అడిగింది. పొడి- అని చెప్పాను. వెంటనే "డాడీ! పొడి అంటే నాయనమ్మ నాకు దోశ లలోకి నంచుకోడానికి పంపించేది, కదా!" అని నిలదీసింది. అది పుట్నాల పొడి, ఇది పొడి దగ్గు అని చెప్తే ఊరుకోలేదు. అదే పొడి ఇది కాదు అంటుంది.  
ఈ సారికి ఎలాగోలా దాటేసినా "అబ్బాయిలు ఎప్పుడూ అమ్మాయిలని ఎందుకు ప్రేమిస్తారు...?" అనే ప్రశ్నకు దాని వయసుకు తగ్గ సమాధానం చెప్పడానికి నేను విపరీతమైన research చెయ్యాలి. ఈ టపా చదివే మీరు సరైన సమాధానం తెలిసీ చెప్పక పోయారో  ప్రశ్నా పత్రం లాంటి నా కూతురు లాంటి పిల్లలు మీ ఇంట కూడా పుట్టి ప్రశ్నలతో మిమ్ములను వేధించు గాక! తెలిస్తే కామెంటి నా కష్టం తీర్చండి.

17 కామెంట్‌లు:

  1. నేను గుడ్ గర్ల్
    నిక్ గాడికి నేను నచ్చాను, నన్ను పెళ్లి చేసుకుంటాడట
    నాన్నా నేను నువ్వు ఒకే రంగులో, బుగ్గ సోట్టల్తో ఒకేలా ఉంటాము. నువ్వు నేను ట్విన్స్
    మరి నా మూడేల్లప్పుడు నాకు అలా చెప్పావు, ఇప్పుడు ఏంటి ఇలా చెప్పావు :)

    మీ బుడ్డిది సూపరో సూపరు.

    "మీరు సరైన సమాధానం తెలిసీ చెప్పక పోయారో..."

    ఇప్పుడు దీన్ని మేం శాపమనుకోవాలా? :). అర్జంటుగా The art of cursing పుస్తకంకొని చదవండి.

    హ్మ్మ్.. నా తెలివితేటలెలావున్నాయో పరీక్షించుకుంటాను.

    అబ్బాయిలు ఎప్పుడూ అమ్మాయిలని ఎందుకు ప్రేమిస్తారు?
    అబ్బాయిలకి అమ్మాయిలు వేసుకునే గౌన్‌లూ, ఫ్రాకులంటే అంటే ఇష్టం కాబట్టి.

    రిప్లయితొలగించండి
  2. సడేలే...ఇక్కడ మేమూ అదే ప్రాబ్లమ్ తో చస్తున్నాం బాబూ...

    రిప్లయితొలగించండి
  3. ee rojjullo pillalu chichara pidugulu mi paapa baagaa ekkuva. nijamgaane good girl.Miru luckey...-:)

    రిప్లయితొలగించండి
  4. naaku mee paatlu artham autunnaay naaku kanapadaboye rangu rangula chukkalu kooda leelagaa kanipistunnay...

    nenu emi answer cheyyalo ante mind blank aipoyindi Chandu.. meeru questions vaati answers avi raasipettandi ekkadainaa.. naaku avasaram ainappudu avi guide laaga vaadukuntaa.

    nenu kooda meetopaatu research chesi malli vacchi answer chestaa...

    రిప్లయితొలగించండి
  5. Indian Minerva,
    మీ సమాధానం బావుంది. ట్రై చేస్తా.

    రిప్లయితొలగించండి
  6. Tejaswi,
    అయ్యో పాపం. మీకు కూడా మా కష్టాలే

    రిప్లయితొలగించండి
  7. HarshaBharath,
    Good answer, very appopriate because she always talks about Princesses.

    రిప్లయితొలగించండి
  8. నాక్కూడా అలాంటి కూతురుంటే బాగుండు అనిపించింది... అప్పుదే కాదండొయ్.. పెళ్ళయ్యాక.. :-)

    ఈ సమాధానం ట్రై చెయ్యండి... "ఆమ్మాయిలైతేనే బాగా ప్రేమిస్తారు గనక అని చెప్పండి.."

    రిప్లయితొలగించండి
  9. VASU,
    Definitely you will have a daughter like her. May god bless you with a daughter. I will tell her that.

    రిప్లయితొలగించండి
  10. Baagundi...My abbayi kooda idey question adigaadu..
    Why indian movies lo abbayi ammayini love chestaadu ani..

    రిప్లయితొలగించండి