29, ఆగస్టు 2013, గురువారం

నా మొదటి లఘు చిత్రం - వన్ మోర్ ఛాన్స్

మొన్న ఇండియా సెలవు మీద వెళ్లి నప్పుడు, ఒక నాలుగు రోజులు కేటాయించి ఒక షార్ట్ ఫిలిం తీసాను .

ఇది నా మొదటి లఘు చిత్రం. అనుకున్న కధ - స్క్రీన్ ప్లే నించి, ఈ సినిమా పూర్తి చెయ్యడానికి నిర్మాణంలో చాలా రాజీ పడవలసి వొచ్చింది. ముఖ్యంగా వెనక్కి ఒచ్చే ఐదు రోజుల ముందు మొదలుపెట్టినందుకు రెండు రోజులు మాత్రమే షూటింగ్ కి  కేటాయించి పూర్తి చెయ్యవలసి వొచ్చింది. ఆ తరవాత మూడు రోజులు ఎడిటింగ్ వర్క్ తో సినిమా పూర్తి చేశాము. ఇది కేవలం నేర్చుకోవాలనే ఆసక్తితో చేసిన చిత్రం.  ఎన్నో విషయాలలో మేము ఇంతకంటే బాగా చెయ్యవచ్చు అని మాకే అనిపించింది. కానీ ఒకటి చేసాము, చెయ్యగలిగాం అన్న సంతృప్తి మటుకు మాకు మిగిలింది.


 దీని పేరు "వన్ మోర్ ఛాన్స్".  ఇది చూడాలంటే ఈ కింద లింక్ క్లిక్ చెయ్యండి.  చూసి మీ అభిప్రాయం తెలియచెయ్య గలరు.

  వన్ మోర్ ఛాన్స్

http://youtu.be/m3u6cPuM_Hg
 వన్ మోర్ ఛాన్స్


గమనిక: ఫోటో క్లిక్ చేస్తే పని చెయ్యదు. లింక్ పైన క్లిక్ చెయ్యగలరు.