23, ఫిబ్రవరి 2013, శనివారం

వైశూ ప్రేమలో ఈశూ - మాంచి రొమాంటిక్ లవ్ స్టొరీ -2


అయితే ఈశూ విషయాన్ని అక్కడితో ఒదల్లేదు. పెళ్లి రోజు దగ్గర పడిపోతోంది, తను రాసుకున్న లిస్టు లో ముఖ్యమైన ఐటెం గా పెట్టుకున్నాడో ఏమో, నాకు మళ్ళీ ఒకటి రెండు సార్లు ఆఫీసు టైం లో కాల్ చేసాడు..

 "సర్! మనం పాట ఎలాగైనా పూర్తి చెయ్యాలి", అంటూ.  నేను కొంచెం బిజీ గా వుండి, తనకీ పెళ్లి పనులతో తీరిక లేక..చిన్న చిన్న ఫోన్ డిస్కషన్స్  జరిగాయి తప్ప పాట రాయడం అనే పని ముందుకు సాగలేదు..
ఆ మాటల్లో నీ పాట సాహిత్యం బానే వుంది కానీ అందులో ఫీల్ లేదు, నేను కొన్ని పాటలు చెప్తాను అవి విని ఎలా వున్నాయో చెప్పు అని కొన్ని పాటలు చెప్పాను..
మన వాడికి కొన్ని సిరి వెన్నెల రొమాంటిక్ సాంగ్స్ "నిలువద్దం నిను ఎపుడైనా", "ఎక్కడ వున్నా పక్కన నువ్వే " లాంటివి వినమని సజెస్ట్ చేసాను.

వీటన్నిటితో పాటూ అడక్కుండా ఒకటి రెండు సలహాలు కూడా పారేసాను... పెళ్ళికి ముందు చాలా మంది ఇలాగే అనుకుంటారని, కానీ మొదట్లో వున్నజోరు చాలా మందికి చివర దాకా ఉండదని. పైగా నీ ఉద్దేశ్యం బావుంది కానీ పాట అయ్యేంత వరకు ఎక్కువ ఆశలు పెట్టుకోకని. మనోడు యేమని అనుకున్నాడో ఏమో?

"సర్! నేను వెళ్ళడానికి ఇంకా వారం రోజులే టైం వుంది. మనం పాట రాసి పంపితే ట్యూన్ కట్టి రికార్డు చెయ్యడానికి కనీసం మూడు రోజులు పడుతుంది", అన్నాడు ఒక రోజు కంగారుగా ఫోన్ చేసి....
"ఇలా కాదు గానీ నువ్వు రాత్రి మా ఇంటికి ఒచ్చెయి.., ఎంత లేట్ అయినా సరే" , అన్నాను..
"మీరసలే ఫ్యామిలీ, ఇంట్లో ఇద్దరు పిల్లలు..ఇబ్బందేమో?", అన్నాడు నసుగుతూ...
"ఏం పర్లేదు... వాళ్ళని పడుకోపెట్టిన తర్వాత కావాలంటే రాత్రంతా కూర్చుని కంప్లీట్ చేద్దాము", అని భరోసా ఇచ్చా..
నిజం చెప్పాలంటే, మనోడు ఆ పాట విషయంలో ఇంకా ఇంట్రెస్ట్ చూపించడం నాకు బాగా నచ్చింది. మనోడికి నా వొంతు సాయం చెయ్యడానికి నేను కూడా కంకణం కట్టేసా..

మనవాడు రాత్రి ఇంటికొస్తే ఒక పక్క చంక దిగని చంటింది, మరో పక్క ప్రశ్నలతో వేదించే పెద్దది. వీళ్ళిద్దరినీ మా ఆవిడకి అప్ప చెప్పి రూం లో గడీ వేసి మొదలెట్టామో లేదో, మనోడికి ఇండియా నించి కాల్..  పెళ్ళికి ముందు వేక్ అప్ కాలు, కాఫీ కప్పు కాలు, గుడ్ నైట్ కాలు, మిడ్ నైట్ కాలు ఇలా వుంటాయి కదా. అదయ్యాక రూమ్లో తాగి కొట్టుకుంటున్న కుర్రాళ్ళ కాల్. వీటన్నిటి మధ్య మనోడు ప్రేమలో వున్నాడు కదా! తన లోకంలో తానున్నాడు..

"సర్! ఇలాగ టైం వేస్ట్ అయిపోతుంది.. మీరు చెప్పిన పాటలు, వాటితో పాటు ఇంకొన్ని ప్రేమ పాటలు విన్నాకా, మంచి ఫీల్ వున్న పాటే రాయాలని డిసైడ్ అయ్యా.. ఇదివరకు ఈ పాటలు అంతగా ఎక్కలేదు కానీ, ఇప్పుడు వినే కొద్దీ బావున్నాయి, ఇంకా వినాలని అనిపిస్తూ వున్నాయి", అన్నాడు.
"అవే ఫీల్ వున్న పాటలంటే... అయితే ఇప్పుడు నువ్వు వున్న పరిస్థితి వివరించేలా ఒక పాట రాస్తే బావుంటుంది".
అన్నాను.. అసలు మొదలే పెట్టలేదు ఎప్పుడో ముగిస్తామో అన్న వర్రీలో..

"అయితే మీరే చెప్పండి ఎలా మొదలెట్టాలో", అన్నాడు..
"పగలో రేయో తెలియని హాయా .....
కలయో నిజమో వైష్ణవి మాయా .. ఎలా వుంది ఈ పల్లవి", అని నేను చెప్పింది పల్లవో-చరణమో  నాకే తెలియక పోయినా,  మన వాడికి అస్సలు తెలీదన్న నమ్మకంతో.  అమ్మాయి పేరు తో బాగా కనెక్ట్ అవుతాడని..వైష్ణవ మాయని వైష్ణవి మాయ చేసి... ఆ తరవాత కావాలంటే మిగిలిన పాటకి ఇంకేదన్నా మాయ చేద్దామని అనుకుంటూ..

"బావుంది సర్!  కానీ మనకి పల్లవేదో, చరణమేదో తెలియదు కదా?", అన్నాడు..తన గురించి అనుకున్నట్టుగా..
మనక్కూడా సరిగ్గా తెలీదని మనసులో అనుకుని, పైకి మాత్రం కాంఫిదేంట్ గా...
"పల్లవి అంటే మొదలు-చివర ఒచ్చేది, మధ్యలో మనం రెండు చరణాలు రాసేస్తే పాట అయిపోతుంది", అన్నా సింపుల్ గా.
అది విస్కీ, ఇది సోడా .. రెండు కలిపి రెండు రౌండ్లు కొడితే... చేస్తుంది మనకు తేడా... అన్నంత ఈజీ  గా..

"అయితే ఇంకేం.. ఇలా మిగిలినవి కూడా రాసేస్తే పోలా", అన్నాడు...
"నలుగురిలో వున్నా నీ ఊహల్లో ఉన్నా.. నాతో నేనున్నా నీ జాడలు వెతికానా ", అని ఇంకో లైన్ లాగేసా...
"ఇది కరెక్ట్ గా నా స్టేట్ అఫ్ మైండ్ ని ఉన్నదున్నట్లు చెప్తోంది", అన్నాడు ఉత్సాహంగా...

హమ్మయ్యా! మనోడు బానే ఇంప్రెస్స్ అయ్యాడని.. అలాంటివి మనోడి కవితలని కలిపేసి ఏదో రెండు చరణాలు నింపేసి, పాట సాహిత్యం రెడీ అనిపించాము ఆ రోజుకి ... అప్పటికే పగలు అయ్యిందని తెలుసుకుని...

నెక్స్ట్ డే మనోడు మళ్ళీ కాల్ చేశాడు..
"సర్! సాహిత్యం సరే.. కానీ దీనికి ట్యూన్ ఎలా కడతారో వాళ్లు... మనం ఏదైనా ఒక ట్యూన్ అనుకుని శాంపిల్ గా పాడి పంపిస్తే?", అని...

"అయితే ఒక పని చేద్దాం, ఇండియా నా ఫ్రెండ్ విశాల్ అని ఒక మ్యూజిక్ టీచర్ వున్నాడు.. అతనికి కాల్ చేసి ఒక సారి పల్లవి వినిపించి, రెండు మూడు ట్యూన్స్ కట్టమని చెప్దాము.. ఏది నచ్చితే, అది పాడించి రికార్డు చేసి పంపిద్దాం". అని విశాల్ కి కాల్ కనెక్ట్ చేసా ...
విశాల్ అంటే నా ఇంటర్ క్లాసు మేట్.. మాంచి గాయకుడు.. మ్యూజిక్ టీచర్.. రేపటి కల్లా రెండు మూడు ట్యూన్స్ కట్టమని పల్లవి చెప్పాను...

నెక్స్ట్ డే మన వాడు పంపిన ట్యూన్స్ విని ఇద్దరం చాలా క్లాసిక్ గా ఉన్నాయి ... అని అనుకున్నాము.. అవును మరి మనవాడు మంగళంపల్లి బాల మురళి కృష్ణ చేతుల మీదుగా ప్రైజ్ తీసుకున్న ఫోటో కూడా పంపాడు స్కాన్ చేసి ట్యూన్ తో పాటు.. మనకి ఆ రాగాలు తెలియవు కానీ, మనకిది చాలా ఎక్కువ అనిపించింది.. పైగా అంత క్లాసిక్ అయితే మన కుర్రోడు రేపు పాడుకోవాలంటే మరీ కష్టం ...
ఇద్దరం కలిసి ఎలాగైనా విశాల్ కి ఈ విషయం మెత్తగా నొచ్చుకోకుండా చెప్పాలని అనుకున్నాము..
విశాల్ - ఈశూ కన్నా సున్నితం, పైగా చాలా తొందరపాటు మనిషి . .. మన మాట వినడు..విన్నా పూర్తిగా వినడు..  ఏదైనా చెపితే నొచ్చుకుంటా డని నేను చాలా విషయాలు చెప్పను. ఈ విషయంలో కూడా ట్యూన్ కట్టమని .. ఆ తర్వాత అవసరం అయితే నెక్స్ట్ స్టెప్ రికార్డు చెయ్యాలని చూచాయగా చెపితే.. మనోడు వుద్యోగం సెలవపెట్టి పాట రికార్డు చెయ్యడానికి హైదరాబాద్ బస్సుకి  రెడీ అయిపోతున్నాడు...

ఇక్కడ చూస్తే ఈశూ ట్యూన్ మాత్రమే విశాల్ తో కట్టించి , సాహిత్యం తో సహా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ కి ఇద్దామని అనుకుంటున్నాడు.. అక్కడ చూస్తే విశాల్ ఇంకా ఈశూ కి నచ్చక  పోయినా రికార్డింగ్ చేయడానికి రెడీ అయిపోతున్నాడు.. రికార్డింగ్ ఎంత ఖర్చు అవుతుందో తెలియదు...   అమ్మో! ఈ సున్నిత మనస్కులకి మనం ఎలా నొప్పించకుండా అర్ధం చేయించాలో తెలియక జుట్టు పీక్కున్నా..

ఎలాగోలా ఇద్దరికీ సర్ది చెప్పి.. ట్యూన్ నచ్చితే తక్కువ ఖర్చులో విశాల్ ద్వారా రికార్డింగ్ చేసేలా.. ఒక ఒప్పందం కుదిరించి.... ఒకటి రెండు డిస్క షన్స్ లో ట్యూన్ పూర్తి చేసాం.... అయితే ఈ సారి పల్లవి మాత్రం మొదట అనుకున్నది కాకుండా... చరణం లో వున్న
"నలుగురిలో వున్నా నీ ఊహల్లో ఉన్నా.. నాతో నేనున్నా నీ జాడలు వెతికానా ", కి ఫిక్స్ అయ్యాం...

అప్పుడు మనవాడు మళ్ళీ సాహిత్యం లో చిన్న మార్పులు అంటే,  అర్ధ రాత్రి పిల్లల్ని పడుకోపెట్టి ...  షాపింగ్ చేస్తూ మన వాడికి కాల్ చేసి ... ఆ పాటలో  చిన్న మార్పులు చేసి, పనిలో పని గా  మన వాడి వై వై వై...  పాట కూడా రాసేసాము...  అసలే మన వాడు మొదలెట్టిందేమో?, పూర్తి చేస్తే కానీ మన వాడికి మనసోప్పేలా లేదని,  ఆ రాత్రి కూని రాగాలు తీస్తూ పెద్దగా మాట్లాడుతూ షాపింగ్ చేస్తున్న నన్ను వాల్మార్ట్ లో ఒకరిద్దరు వింతగా చూస్తున్నా అస్సలు పట్టించుకోకుండా రెండోది కూడా పూర్తి చేసాము..

ఇప్పుడు రెండు పాటలు సాహిత్యం మరియు ట్యూన్ తో రెడీ.. ఇక మిగిలిందల్లా పాటలు రికార్డింగ్ మాత్రమే...

ఆ పాటల సాహిత్యం  .....
మొదటి పాట ......

నలుగురిలో ఉన్నా  నీ ఊహల్లొ ఉన్నా..
నాతో నేనున్నా నీ జాడలు వెతికానా ...

ఎవరికి ఎవరెవరూ ఎపుడో రాసున్నా...
ఇన్నాళ్ళూ తెలుసున్నా..ఈనాడే కనుగొన్నా.. బంగారమా ... 

తలగడపై తల ఉన్నా...నీ తలపులు తడుతుంటే  ...
నా రెప్పలు మూసున్నా నే నిద్దుర పొగలనా 
నా కలలో నువ్వొచ్చి నను కలవర  పెడుతుంటే 
ఆ వేకువ తడుతుంటే  నే ముసుగులో దాగున్నా
పని పని పని అంటూ నే పరుగులు పెడుతుంటే 
నా అడుగులో అడుగేసి నువు నను పడ దోసావే 
తికమక పడిపోతూ  నే దిక్కులు చూస్తుంటే 
చిలిపిగ నను చూసి నువు పక పక నవ్వావే 

గిలి గిలి పెడుతున్నా నీ కమ్మని కబురులకి
నా ఊహలు వేడెక్కి మబ్బుల చాటున చేరానే 
చక్కని నన్నొదిలి చుక్కల మధ్యన ఏమిటని 
నా మాటే వినకుండా నువ్వు నాపై అలిగావే 


                                  నలుగురిలో వున్నా ॥


రెండవ పాట:

వై వై వై వై  వై వై నువ్వే  నాలో సగమై..
వై వై వై వై  వై వై మనసే తాకే స్వర్గమై ...

వై వై వై వై వై వై  నువ్వే ఇంతగా చేరువై...
వై వై వై వై  వై వై   నాకై అందిన వరమై...


వైష్ణవీ వైజాగు  అమ్మా
యివైష్ణవీ చిలుకూరి గడుగ్గాయి
 వైష్ణవీ నా గుండెలో లడాయీ    వైష్ణవీ
                                        వై వై వై వై  | |


పిల్ల పేరు బంగారు   తీరు చూస్తీ కంగారు  
నవ్వారో  అమ్మాయిగారు  రత్నాలే రాలుస్తారు
ఎత్తు చూస్తే చార్మినారు  పిల్ల ముందు బలాదూరు
లంచ్ కి మస్ట్ కోడి గుడ్డు  అందుకే బుడ్డీ   వెరీ గుడ్డూ 
                                     వై వై వై వై  | |

దొరికారు బావగారు   నెమ్మదైన పని తీరు
మేడ్ ఇన్  గుంటూరు   నీ రాక తో అంతా తారుమారు


వైష్ణవీ నా కంటి పాపాయీ  వైష్ణవీ నా ప్రేమ పావురాయీ
వైష్ణవీ చలో మోగిద్ధాం సన్నాయి
                                            వై వై వై వై  | |

                                                               

22, ఫిబ్రవరి 2013, శుక్రవారం

వైశూ ప్రేమలో ఈశూ - మాంచి రొమాంటిక్ లవ్ స్టొరీ - 1

ఒక గురువారం మధ్యాహ్నం అమెరికా ఆఫీసు లో ఆంధ్రా  కొలీగ్ తో అచ్చ తెలుగులో రాజకీయాలు చర్చిస్తుంటే (సొల్లు కొడుతుంటే అని చెప్పొచ్చుగా అనకండి)...  మోగింది నా  సెల్  ఫోను. ఎవరా అని చూస్తే నా పాత రూం మేట్ ఈశ్వర్.

"సర్ ! నేను ఈశ్వర్. రేపు మధ్యాహ్నం లంచ్ కి మన రూం కి ఒచ్చేయండి" అన్నాడు ఫోన్ తీయగానే. సరే రేపు ఫ్రైడే - ఆఫీసు లో అస్సలు పని చెయ్యకుండా.. పదకొండింటి మీటింగ్ అటెండ్ అయ్యి - రెండు గంటలు మంచి రెస్టారెంట్ లో లంచ్ చేసి- కుదిరితే కునుకి తీసి - టైం షీట్ వేసి గంట ముందరే బయటకు జారుకోడం మా అందరికీ అలవాటు. అలాంటి ఫ్రైడే లంచ్ సాధారణంగా నేను రాను మీరు వెళ్ళండి అని మా టీం కి చెప్పాలంటే నాకు మనసొప్పదు, నాకేమిటి టీం లో ఎవ్వరికీ మనసొప్పదు. కానీ మనోడు చెప్పిన పద్ధతి చూస్తే ఏదో ముఖ్యమైన విషయం లాగానే వుంది.
"ఏమిటి విషయం?" అన్నాను.. మేటర్ ని బట్టి పోస్ట్ పోన్ చేసే అవకాశం ఉందేమో కనుక్కుందామని.
 "రేపు ఒస్తారుగా ? అప్పుడు చెప్తా!", అన్నాడు గొంతులో మాంచి ఉత్సాహం వినిపించింది.
"సరే, రేపు బయలుదేరే ముందు రింగ్ ఇస్తాలే.." అని పెట్టేసి ఆలోచనలో పడ్డా..

మనోడు కొంచెం మొహమాటస్తుడు, ఏదైనా అడగాలంటే ఒక్కో సారి ఇలా లంచ్ కి పిలిచి అప్పుడు మెల్లిగా విషయంలోకి వెళ్తాడు. మళ్ళీ ఎవరికో సాయం చేస్తున్నాడు కామోసు, మన అవసరం పడుంటుంది అనుకున్నా.  నెక్స్ట్ డే లంచ్ టైం లో వెళ్తే మనోడు రెగ్యులర్ గా చేసే బిర్యానీ, బంగాళా దుంప కర్రీ విత్ జీడిపప్పు.. రెడీ గా వడ్డించాడు.. విషయం కనుక్కోవాలని కుతూహలంగా వున్నా, మనోడు ప్రోటోకాల్ అయితే గాని మేటర్ లోకి రాడని.. లంచ్ మొదలెట్టి
 "ఏంటి మేటర్". అన్నాను.. కుతూహలం ఆపుకోలేక..
"చెప్పిన తరవాత మీరు నవ్వకూడదు" అన్నాడు..
"నవ్వనులే... చెప్పు", అన్నాను.. మనోడు ఇంకా సస్పెన్స్ విప్పలేదని కొంచెం విసుగ్గా...
"మీకు తెలుసుగా.. నాకు మ్యారేజ్ ఫిక్స్ అయ్యిందని?"..
"ఎందుకు తెలీదు, మొన్నే స్వీట్ ప్యాకెట్ తెచ్చావుగా, ఇంటికి పెళ్లి వార్తకి చెప్పడానికోచ్చి".. అని ముందుకు జరిగాను... అనవసరమైన డీటెయిల్స్ లో టైం ఎక్కడ వేస్ట్ చేస్తాడో అని.
"మీరు మరి నవ్వకూడదు, నేను చెప్పింది విని" అన్నాడు..
"ముందు నువ్వు ఏడిపించక విషయం చెప్పు..." అన్నాను కడుపుబ్బరం తట్టుకోలేక...
"నేను కొన్ని కవితలు రాసాను. మీరు అవి ఎలా వున్నాయో చెప్పాలి?" అన్నాడు.
ఇందులో పెద్ద విషయం ఏముంది- అనుకుని మనసులో.
"నేనెందుకు మళ్ళీ సర్టిఫై చెయ్యడం.. నీ కాబోయే భార్య మీదేగా, ఆ అమ్మాయికి వినిపిస్తే పోలా? ఎలాగో రోజంతా మాట్లాడుతూనే ఉంటావుగా", ఈ పాటికి వినిపించే ఉంటాడేమో అన్న అనుమానంతో..
"లేదు సార్. నేను అంత బాగా రాసానో లేదో అని!"  కొంచెం నీళ్ళు నమిలాడు...
"ఈ స్టేజి లో ఎలా రాసినా బానే వుంటుంది, వినిపిస్తే ఆ అమ్మాయికి కూడా తప్పకుండా నచ్చుతుంది" అన్నాను.. ఇందులో మన ప్రమేయం ఎందుకు అనుకుంటూ..
"నేను రాసింది నాకు బానే వుంటుంది, కానీ వేరే వాళ్ళకే..." అని కొంచెం గ్యాప్ ఇచ్చి,
"కొంచెం బాగా ఒస్తే ఒక పాట కట్టి ఆ అమ్మాయి ని  SURPRISE  చేద్దామని" అని పూర్తి చేసాడు ..
"అబ్బో! బావుంది.. పాట రాసి, పాడి ఇంప్రెస్ చెయ్యడం"... అన్నాను.
"సార్! నా గొంతు ఎంత భయంకరమో మీకు తెలుసుగా ..నేను కాదు పాడేది, మనకు తెలిసిన మ్యూజిక్ డైరెక్టర్ ద్వారా వాళ్ళ టీం లో మనిషితో పాట పాడిస్తా"...
"అబ్బో! మరింకేం", అన్నాను కొంచెం ఆశ్చర్యంగా. మనోడు చాలా ఆలోన్చించే నన్ను పిలిచాడు అన్న నిర్ధారణకి ఒచ్చి.

మనోడు లో నాకు చాలా నచ్చే అంశం అదే.. మనిషి మాంచి నిజాయితీ పరుడు.. మొహమాటానికి కూడా గొప్పలు పోడు.. పైగా మాంచి మర్యాదస్తుడు.. అసలు మా పరిచయమే వెరైటీ గా అయ్యింది....ఆ కధ  మళ్ళీ ఎప్పుడో చెప్తా కానీ, అసలు విషయంలో కొస్తే ...

ఈశ్వర్ చాలా సెన్సిటివ్ కుర్రాడు, చాలా ఏళ్ళుగా సంబంధాలు వెతుకుతున్నాడు..ఇప్పుడు కుదిరిన సంబంధం కూడా అప్పుడెప్పుడో పరిచయం వున్న అమ్మాయే..ఈ మధ్య మాట్లాడుతూ వుండగా మ్యాచ్ సెట్ అయ్యిందని చెప్పాడు..
"సరే ఇంతకీ ఏం రాసావో చెప్పు .." అన్నాను నా ఆలోచనలకు కళ్ళెం వేస్తూ......


"నేను ఇంగ్లీష్ లో రాశాను.. చదివినా మీకు అర్ధం కాకపోవచ్చు. కాబట్టి నేనే చదువుతా.." అన్నాడు.. లాప్ టాప్ ఒళ్లో  పెట్టుకుని గొంతు సవరించుకుంటూ...

"చదవడం ఏమిటి? ఏకంగా పాడి చూపించు...." అన్నాను..కొంచెం ఆట పట్టిస్తూ ...

"అమ్మో! పాడడమే.హ హ హ హ ...." అని నవ్వాడు... మన వాడికి సిగ్గు ఎక్కువ అయితే  అలా నవ్వుతూంటాడు...
"సర్! ఇది ఎలా ఒస్తుందంటే ... వై వై వై... వై వై వై ... అని.. మొదలవ్తుంది"....
"వై థిస్ కోలావేరి పాటలా అన్నమాట ", అనేసాను .. అనాలోచితంగా ... ఆ తరవాత మన వాడి ఫ్లో కట్ చేసినందుకు నాలిక కరుచుకుని ... అసలే ప్రేమలో వున్న కుర్రాడు సిగ్గుపడుతుంటే ...  పూర్తిగా చెప్పనియ్యరా వెధవా! అని నాలో నేను తిట్టుకుని... నువ్వు కానీయి అన్నట్లు తల పక్కకి ఊపాను...
"అదే  INSPIRATION అనుకోండి... కాకపోతే వై వై వై .. నువ్వే నాలో సగమై.. వై వై వై నాకే ఇంత చేరువై..అలా వొస్తుందన్న మాట.." అని రాగం తీస్తూ చెప్పాడు....
"బానే వుంది, ఇంకా ఏమి రాశావు", అన్నాను..
 "పిల్ల పేరు బంగారు... పిల్ల కేమో కంగారు..లంచ్ కేమో కోడిగుడ్డు .. పిల్ల ఏమో వెరీ  గుడ్డు..." లాంటి కొన్ని పదాలతో   ఒక పది పన్నెండు లైన్ లు కవిత లాంటి పాట వినిపించాడు. నేను మళ్ళీ రిలేట్ చేసుకోలేనేమో అని.. అమ్మాయిని ముద్దుగా బంగారు అని పిలుచుకుంటాడని, అమ్మాయికి గుడ్డు అంటే ఇష్టమని, అందరి దృష్టిలో గుడ్ గర్ల్ లా ఉంటుందని చెప్పుకుంటూ వెళ్తున్నాడు...
మనవాడు మాట్లాడుతూ వున్నా నేను మళ్ళీ ఆలోచనల్లో పడ్డాను...మా రోజుల్లో పెళ్ళికి ముందర కుర్రాళ్ళు పడ్డ కష్టాలు ప్లేట్ లో ఎన్నో గుండ్రాలు తిరిగి పన్నెండేళ్ళ వెనక్కి తీసుకెళ్ళాయి..

తనకి నచ్చిన పాటలన్నీ రికార్డు చేసి  CD ప్రెసెంట్ చెయ్యడం అయితే అందరూ చేసేవాళ్ళు..
కొందరు ముందుకెళ్ళి  SURPRISE గిఫ్ట్ లు ప్రెసెంట్ చేసేవాళ్ళు...
సొంత కష్టంతో ఏదో ఒకటి ఇవ్వాలనే మొగవాళ్ళు ఆ కాలంలో కూడా తక్కువే...
కొంచెం మాంచి ప్రేమికులు -- దానికి తోడు భావుకులు ఐన మగాళ్ళు అయితే ఒకటో రెండో కవితలు జొప్పించడం.
అందరిలో హై లైట్ -అప్పట్లో నా రూం మేట్  వెంకీ అయితే ఒక కవితల పుస్తకమే స్వదస్తూరి తో రాసి ప్రెసెంట్ చేసాడు...
మనం మాత్రం తక్కువ తిన్నామా.. కొన్ని కవితలు అలవోకగా అలా చెప్పి.. మరి కొన్ని ఈ -మెయిల్స్ లో నింపి...
ఇంత కన్నా గొప్ప గా చెయ్యాలని... ఒక చిన్న ఫిలిం తియ్యడానికి కూడా తయ్యారయ్యా...
పైగా నాకున్న ఒక్కగానొక్క ఫ్రెండ్..(మాట వినే వాడు..సీక్రెట్ గా ఉంచే వాడు) రామ్ గాడికి ఒక డొక్కు కాం-కార్డర్ ఇచ్చా... రక రకాల డ్రెస్సులు... రక రకాల ఫోజులు ... ఒకటి రెండు పాటలకు స్టెప్పులు.... ఇవన్నీ చేసినా...పెద్దగా REACTION చూపించని రామ్ గాడు ... వాడి ఫోటోగ్రఫీ.... నేను చేసేది అతి ఏమో అని అనుమానం ఒచ్చేది.
షూట్ చేసినవి ప్లే చేసి చూస్తుంటే "ఇవన్నీ అవసరమా?" అన్న రామ్ గాడి డైలాగ్ కి..నాకు తిక్కరేగి
కాబోయే పెళ్ళాన్ని ఇంప్రెస్స్ చెయ్యకపోయినా .. వీడిని తప్పకుండా ఇంప్రెస్స్ చెయ్యాలని చెప్పి..ఆఫీసు లో ఇద్దరు ఫ్రెండ్స్ ని పిలిచి.. కొంచెం మందు పోసి.. ఎక్కడా చెప్పకండి అని ఒట్టు పెట్టించుకుని నేను చెయ్యబోయే స్టంట్ .. డీటెయిల్ గా చెప్పాను.. ఇంతకీ స్టంట్ ఏమిటంటే నేను రెండు కార్ల మీద కాలు పెట్టి నించుంటే వాళ్ళు ఆ కార్లని స్లో గా డ్రైవ్ చెయ్యాలి .. సమాంతరంగా... (మీకు గీతాంజలి గుర్తుకొచ్చిందా..అదే INSPIRATION ) ఇలాగే...టెన్నిస్ ఆడుతూ..కొన్ని షాట్స్ తీసి... గ్రీకు వీరుడు పాటకి మిక్స్ చేసి ఒక చిన్న షో రీల్ తీద్దామని ఐడియా అనుకోండి...
కానీ చివరకి ఎన్ని తీసినా రామ్ గాడి EXPRESSION మార్చలేక పోయినందుకు,,, ఏ మాత్రం ఇంప్రెస్స్ చెయ్యలేకపోయినందుకు.. నా షో రీల్ ఆ పాత డొక్కు కాం-కార్డర్ లో మూత పెట్టేసా...ఫ్లాష్ బ్యాక్ లో నా విషాద గాధకి ముగింపు కార్డ్ వేసి.. మన వాడికి హిత బోధ మొదలెట్టా...

"చూడు ఈశూ! ఆలోచన చాలా బావుంది... కానీ ఇవన్నీ సక్సెస్ ఫుల్ గా చేసేవాళ్ళు తక్కువే వుంటారు...నీ ప్రయత్నం నువ్వు చెయ్యి.. సాహిత్యం లో హెల్ప్ కావాలంటే నన్ను పింగ్ చెయ్యి ".. అన్నాను...
"తెలుసు సర్! మీకు తెలుగు మీద బానే పట్టు వుంది కదా! మీరు హెల్ప్ చేస్తారని..మీకు మాత్రమే చెప్తున్నా..అయ్యే వరకు ఎవరికీ తెలియకూడదు.." అన్నాడు..
"అవునులే..అందరూ ఆట పట్టిస్తారు..సరే మనం మళ్ళీ సిట్టింగ్ వేసుకుందాం.. ", అని సెల్ లో టైం చూసుకుని బై  చెప్పి ఆఫీసుకి బయలుదేరా... మనకొచ్చిన మోస్తరు తెలుగు కే మనోడికి అలా అనిపించి నందుకు..మనసులో మురిసిపోతూ..

ఆఫీసు కి డ్రైవ్ చేస్తూ ఈశూ  ఇంత భావుకత తో ఇలా ఉంటాడని ఇంతకు ముందు ఎప్పుడూ అనిపించలే. అయినా ప్రేమ లో వున్న ప్రతీ వాడు కాళిదాసే కదా.. అలాగని సాహిత్యం గురించి నేను మొదలెట్టి ఏమైనా సజెస్ట్ చేస్తే ఎలా తీసుకుంటాడు...కొంచెం "కుక్క పిల్లా,,, అగ్గి పుల్లా .. సబ్బు బిల్లా.." టైపు లో వుంది అంటే హర్ట్ అవుతాడేమో.... అయినా అప్పుడెప్పుడో చూసిన అమ్మాయి గురించి ఇప్పుడు ఎలా వర్ణిస్తాడు. మనోడు మళ్ళీ మేటర్ డిస్కస్ చేస్తే అప్పుడు ఆలోచిద్దాము ఏం చెప్పాలో అని అక్కడితో ఆ విషయం మర్చిపోయాను ...
                                                                                                                           (ఇంకా వుంది ఈ లవ్ స్టొరీ )
12, ఫిబ్రవరి 2013, మంగళవారం

మా సాహితీ - భాష


పిల్లలు చిన్నప్పుడు మాట్లాడే ముద్దు మాటలు బాగా ముద్దొస్తాయి. మా పెద్ద అమ్మాయి సిరి ముద్దు మాటలు కొన్ని ఇప్పుడు మాకు అసలు గుర్తు లేవు...

అందుకని మా చిన్న పిల్ల సాహితి ముద్దు మాటల లిస్టు ఇక్కడిలా పొందు పరుస్తున్నా ....

మిక్కమ్మ - మిక్కీ మౌస్
మిమ్మి - మిన్నీ మౌస్
బింక - బింకీ (పాల తిత్తి)
బాలా - బంతి
ఈగ ఈగ ఈగా  - ఈగ లేదా ఏ పురుగైనా సరే
కూక - కుక్క, పిల్లి, వుడుత- చివరకి పులి అయినా సరే
నీకా - నాకు కావాలి
పోనా - ఫోన్
బై - టాటా
హాయ్ - పలకరింపు
ఆలో - హలో
కాతీ - లక్డి కి కాటి (గుర్రం)
పీకా - పీక్-అ-బూ (దాగుడు మూతలు)
శు - చెప్పులు లేదా బూట్లు
పాత - పాట
పంజబా - స్పాంజ్ బాబ్ స్క్వేర్ పాంట్స్
బూక్ - పుస్తకం
గిమ్మీ -  GIVE ME
లుక్  -  చూడు
దూరా - డోరా
నాన - అమ్మైనా.. నాన్నైనా
నో -  యూనివర్సల్ ఆన్సర్ ... అన్నిటికీ అదే సమాధానం

సాహి విత్ కాతీ (లక్డి కి కాఠి)
మా సాహిత్యం


సాహితి - మా రెండో అమ్మాయి... దీనికి ఇప్పుడు 19 నెలలు.  ముద్దుగా అప్పుడప్పుడు సాహిత్యం అని పిలుస్తాము..


ఇంట్రో లోనే ఇలా వుంటే ఇంక మా ఇంట్లో ఎలా వుంటుందో ఊహించండి  రొటీన్ కి బిన్నంగా అప్పుడప్పుడు ప్రపంచాన్ని ఇలా చూస్తుంది 

 
మొదటి సారి స్టూడియో లో తీయించింది 

గోడలు దూకే తెలివి ఉగ్గు పాలతోనే 

అక్క మీద స్వారీ - నాన్న గుర్రం  అలిసిపోతే 

హెలికాప్టర్ రైడ్ ఎవ్వరూ పక్కన లేకుండా 

బొమ్మల కొలువులో బొమ్మల తీసేసి.. చక్కవి పగలగొట్టి..గాజువి  విరగ్గొట్టి ..

ఉన్నత శిఖరాలకు ఎదగాలని చిన్నప్పుడే బల్లలు, కుర్చీలు ఎక్కి ప్రాక్టీసు చేస్తూంటుంది  

హాలోవీన్ రోజు మాల్ లో మా ఏనుగు పిల్ల 
 క్లోజ్-అప్ లో మా ఏనుగమ్మా ఏనుగు...

అన్నిట్లో అక్కని అనుకరిస్తూ.. అప్పుడప్పుడు విసిగిస్తూ..
పుస్తకాలు తిరగేస్తూ