కంటి మీద కునుకు రావట్లేదు
ఆఫీసు పని మీద మనసు పోవట్లేదు
ఎవడు తిట్టినా కోపం రావట్లేదు
పక్క వాడు ఎదిగినా అసూయ కలగట్లేదు
డబ్బులు తక్కువైనా గాభరా పడట్లేదు
అనారోగ్యాలెక్కువైనా అసలు మూలగట్లేదు
వొత్తైన జుట్టు కత్తిరించట్లేదు
మాసిన గడ్డం గీకేయ్యట్లేదు
బాకీ ఎగ్గొడితే తిట్టట్లేదు
మోసం చేసినోని కొట్టట్లేదు
విజయమొస్తే పొంగిపోవట్లేదు
పరాజయాలతో కున్గిపోవట్లేదు
అసలు నాకేమయ్యింది
కొంప దీసి స్థితప్రజ్ఞున్ని అయిపోలేదు కదా?