10, మే 2011, మంగళవారం

స్థితప్రజ్ఞున్ని అయిపోలేదు కదా?


కంటి మీద కునుకు రావట్లేదు
ఆఫీసు పని మీద మనసు పోవట్లేదు

ఎవడు తిట్టినా కోపం రావట్లేదు
పక్క వాడు ఎదిగినా అసూయ కలగట్లేదు

డబ్బులు తక్కువైనా గాభరా పడట్లేదు
అనారోగ్యాలెక్కువైనా అసలు మూలగట్లేదు

వొత్తైన జుట్టు కత్తిరించట్లేదు
మాసిన గడ్డం గీకేయ్యట్లేదు

బాకీ ఎగ్గొడితే తిట్టట్లేదు
మోసం చేసినోని కొట్టట్లేదు

విజయమొస్తే పొంగిపోవట్లేదు
పరాజయాలతో కున్గిపోవట్లేదు

అసలు నాకేమయ్యింది
కొంప దీసి స్థితప్రజ్ఞున్ని అయిపోలేదు కదా?

11 కామెంట్‌లు:

  1. విజయమొస్తే పొంగిపోవట్లేదు
    పరాజయాలతో కున్గిపోవట్లేదు
    ఇదొక్కటే స్థితప్రజ్ఞుడి లక్షణం..

    కంటి మీద కునుకు రావట్లేదు
    ఆఫీసు పని మీద మనసు పోవట్లేదు
    consult a doctor :)

    ఎవడు తిట్టినా కోపం రావట్లేదు
    పక్క వాడు ఎదిగినా అసూయ కలగట్లేదు

    బాకీ ఎగ్గొడితే తిట్టట్లేదు
    మోసం చేసినోని కొట్టట్లేదు
    ఉప్పు కారం బాగ తినాలి మిత్రమా.. :)

    వొత్తైన జుట్టు కత్తిరించట్లేదు
    మాసిన గడ్డం గీకేయ్యట్లేదు
    అంత సోమరైతే ఎలా.. :)

    పోస్టు బాగుంది.. :)
    సరదాగ వ్రాశా, dont take otherwise.

    రిప్లయితొలగించండి
  2. ఒక్కోసారి ఎండకో, పని వొత్తిడికో అలా దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ (block) అవుతుంది. వెకేషన్ కి అర్జంటు గా వెళ్ళండి. :D

    రిప్లయితొలగించండి
  3. :))అయిపోయినట్టే అనిపిస్తూందండీ.

    రిప్లయితొలగించండి
  4. "కంటి మీద కునుకు రావట్లేదు
    ఆఫీసు పని మీద మనసు పోవట్లేదు"-----ఋషిగా మరతారేమో?
    "Rest all"----జీవితాన్ని ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తున్నారేమో ?
    carry onnnn...

    రిప్లయితొలగించండి
  5. గిరీష్,
    బావున్నాయి మీ కామెంట్స్. థ్యాంక్ యూ.

    రిప్లయితొలగించండి
  6. Sujata,
    ఆహా! నిజమే అప్పుడప్పుడు అలా సెలవలు పెట్టి ఇండియా కెల్తే మళ్ళీ మామూలైపోవచ్చు. ఆ భాగ్యం ఎప్పుడో?

    రిప్లయితొలగించండి
  7. Chaalaa baagundi :) meeku vachchinatte naaku sthotapragnata vaste entha bagundu???

    రిప్లయితొలగించండి
  8. ఇందు,
    Thank you. Yeppudo oka saari life lo ilaa anipisthundi lendi andarikee.

    రిప్లయితొలగించండి