4, సెప్టెంబర్ 2011, ఆదివారం

నువ్వొక జవాబు - నేనొక ప్రశ్న



నీ జీవిత పయనానికి గమ్యం నిర్దుష్టం
నాకు పయనమే జీవితమవ్వడం నా అదృష్టం

హద్దులలో సంచరించడం నీ గొప్పతనం
హద్దులు అధిగమించడమే నా అభిమతం

ఒడ్డించిన విస్తరి లాంటిది నీ జీవితం
విడదీయలేని చిక్కుముడి నా జీవితం

జీవితమనే ప్రశ్నకు నువ్వు జవాబైతే
జీవితానికే నేనొక ప్రశ్నను..


5 కామెంట్‌లు:

  1. అర్ధమయ్యీకానట్టుందండీ :) కానీ బాగుంది...చిన్నగా,చక్కగా :)

    రిప్లయితొలగించండి
  2. కొంత మంది గోల్స్ అనీ, లిమిట్స్ అనీ, ప్లాన్స్ అనీ చాలా జాగ్రత్తగా ఉంటారు. ఇంకొందరు ఏ మాత్రం డిసిప్లిన్ లేకుండా, కొంచెం అడ్వెంచర్, తక్కువ ఎఫర్ట్ తో, పెద్దగా ప్లానింగ్ లేకుండా ఎలాగోలా సక్సెస్ సాధిస్తారు.. ఈ రెండో రకం వాళ్ళు జీవితం జర్నీ లాగా బాగా ఎంజాయ్ చేస్తారు. వీళ్ళు చాలా మందికి క్వెస్చన్ మార్కు గాళ్ళు..

    రిప్లయితొలగించండి
  3. ఇందు,
    స్వేచ్ఛగా జీవిస్తూ జీవితాన్ని ఆస్వాదించే మనిషి.. ఎప్పుడూ గమ్యం, క్రమశిక్షణ పేరుతో పక్క మనిషి ఫీలింగ్స్ పట్టించుకొని మనిషికి రాసినది.నచ్చినందుకు థాంక్స్.

    రిప్లయితొలగించండి
  4. బాగుంది! కాని మనిషికి అటు ప్రణాళిక, క్రమశిక్షణ ఎంత ముఖ్యమో ఆటవిడుపు, సరదా కూడా అంతే ముఖ్యం. రెంటినీ బాలన్సు చేయగలిగితే అన్నీ మన సొంతం!

    రిప్లయితొలగించండి
  5. రసజ్ఞ,
    నిజమే.. థ్యాంక్ యూ.

    రిప్లయితొలగించండి