14, ఆగస్టు 2012, మంగళవారం

వీరుని మరణం


తమ  అవసరాల కోసమో
లేక  ఆత్మ రక్షణ కోసమో

నీ అభిమానాన్ని పణంగా పెట్టే

అభినవ  అభిమన్యుల ఆర్తనాదాలు విని
కురుక్షేత్రం లో అడుగిడిన వీరుడిని

శస్త్ర  చికిశ్త   చేసే నెపంతో
నీచే అస్త్ర సన్యాసం చేయిస్తే

కదన రంగంలో కాలు మోపిన పిదప
 వెన్ను చూపే విద్య తెలియని నీకు

నీ సైన్యం  కన్నాశత్రువే మిన్న గా కనిపించి

రక్త సిక్త  మైన  కాయం కన్నా
 అశ్రుపూరిత  నయనాలే

అత్యంత వేదన కలిగించి
శత్రువు శరములు నిన్ను

నిలువునా కూల్చి  నేల  రాల్చినప్పుడు

నమ్మించి వంచిచే నేస్తాల కన్న
సాటి వీరుడి పోరాటానికి
శత్రువు అర్పించే జొహారే  మిన్న అనిపించి

తనది కాని కురుక్షేత్రంలో
సుయోధనుదనుకొని సిఖండుల కోసం
యుద్ధం చేసి నేల రాలిన కర్ణుడి కధనం   

ఈ వీరుని మరణం 

 అంకితం : అభాగ్యులకోసం అలుపెరగక పోరాడి మోసపోయిన యోదులందరికీ

2 కామెంట్‌లు:

  1. తనది కాని కురుక్షేత్రంలో
    సుయోధనుదనుకొని సిఖండుల కోసం
    యుద్ధం చేసి నేల రాలిన కర్ణుడి కధనం
    good.nice comparison.

    రిప్లయితొలగించండి