అభ్యుదయం అని పేరు చెప్పి
అమ్మ నాన్నల కళ్ళు గప్పి
ప్రణయాల పేరు చెప్పి
కట్టుబాట్లని కప్పి పెట్టి
చదువుల పేరు చెప్పి
చాలా దూరం వెళ్లి
పరిణయమనే వల వేసి
పాశ్చాత్య దేశాల్లో పాగా వేసి
ఆడంబరాలకి పోయి
అపహాస్యం అయిపోయి
అహంకారానికి పోయి
అధిపత్యానికి పోరి
అబద్దాలతో నమ్మించి
అందరినీ వంచించి
కాపురాలు కూల్చుకుని
కన్నీరు మిగిల్చి
స్వేచ్చ నిచ్చిన కన్నవాళ్లకు
సంఘం లో పరువు దీసి
కలతల కాపురాల్లో
ఆధిపత్యపు పోరు
దిగిరాని జోరు
నెగ్గుతారు మీరు
జీవిత పయనంలో
ఒంటరిగా మిగుల్తారు
కన్న వాళ్ళ పెంపకంలో
ప్రేమ ఇచ్చిన స్వేచ్చ కన్నా
కట్టుబాట్ల నమ్మకంతో
సాంప్రదాయపు పెళ్లి మిన్న
అని నిరూపిస్తూ --
అంకితం: చదువుల పేరుతో ఇల్లు ఒదిలి ఒచ్చి. మనుగడ కోసం పెళ్ళిళ్ళు చేసుకుని, హక్కులే గాని బాధ్యత లెరుగక, అహంకారంతో కాపురాలు కూల్చుకుంటున్నఆడపిల్లలకి. ఆ విషయం తెలియక వెనకేసుకు ఒస్తున్నతల్లి తండ్రులకు.