ఈ రోజు టీవీ లో భద్రి సినిమా వొచ్చింది. ఈ సినిమాలో నాకు నచ్చిన అద్భుతమైన పాట కోసం చూస్తూ కూర్చున్నాను. తీరా లాస్ట్ లో ఆ సాంగ్ ఒచ్చినప్పుడు చూస్తే ఆ పాట మొత్తం రాలేదు. కొన్ని సినిమాలలో స్టొరీ మొత్తం చెప్పే పాట ఒకటి వుంటుంది. సినిమా చూడక ముందు ఈ పాట వింటే మనకి స్టొరీ అర్ధం అవుతుంది. ఇలాంటి పాటలు మచ్చుకి కొన్ని "చిలకా ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక",
"జాలిగా జాబిలమ్మ, రే రేయంత రెప్పవేయనే లేదు ఎందుచేత", "మంచు తాకిన ఈ వనం పూలు తొడిగేనా", "కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు". ఇలా ఎన్నో సాంగ్స్, వాటి కోవలోకి వొచ్చే పాట ఈ సినిమాలో "వరమంటి మనసే పొంది".
తీరా సినిమాలో ఆ పాట వోచ్చేటప్పటికి చూద్దును కదా, పల్లవి ఒక్కటే వొచ్చింది. చరణాలు మన పూరీ ఎడిటింగ్ రూం లో నిడివి తగ్గించడానికి కట్ చేసాడో, లేక పోతే అసలు తీయనే లేదో కానీ, జనం మాత్రం మంచి సాహిత్యం వున్న పాట మిస్ అయ్యారు.
అందుకని, ఆ పాట పూర్తిగా వినని వాళ్ళ కోసం, ఇదిగో ఇక్కడ పూర్తి పాట రాస్తున్నాను.
వర మంటి మనసే పొంది విసిరేసు కుంటానంటే పరిహాస మవదా జీవితం
ఉదయాలు ఎదురుగ ఉండి కనుమూసి అడుగేస్తుంటే పడదోసి పోదా జీవితం
పూవంటి మనసుని కోసి
ఆపైన జాలిగ చూసి
ఓదార్పు కోరే నేస్తమా
దేహాన్ని జ్వాలగ చేసి
జీవితాన్ని చితిలో తోసి
తలరాత అంటే న్యాయమా
ఎడారెంట పరిగెడతావ
దరీ దారి లేదంటావ
తడి లేక అలసే ప్రాణమా
పాదాలు నీవంటావ
పయనాలు మాత్రం కావా
పై వాడి పైనా భారమా
కాలాన్ని కవ్వించేలా
పనిలేని పంతాలేల
అటు పైన విధిపై నిందలా
పాటకి లింక్ : Play Song
(Links to Raaga.com)