sangham baadhyatha poem లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
sangham baadhyatha poem లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

21, సెప్టెంబర్ 2010, మంగళవారం

ఏం చేస్తున్నాం ?

ప్రభు పోస్టింగ్ ఈ లింక్ లో చదివాక స్పందిస్తూ
ఏం చేస్తున్నాం?

ఏమీ చెయ్యం.

ఎందుకంటే ఆది మన బాధ్యత కాదు అని అనుకుంటాము కాబట్టి
ఎవరో ఏదో చెయ్యాలని ఎదురు చూస్తాము
ఎవరూ ఏమీ చేయట్లేదని తిట్టుకుంటూ ఉంటాము
మన వరకూ ఒస్తే లంచం ఇచ్చేస్తాము
ఇంకా అవసరం ఐతే మనం కూడా తీసేసుకుంటాము
అలా చేయకపోతే బతకలేమని సరిపెట్టేసుకుంటాము
తప్పు చేసినోడు మన కులపు వాడైతే తప్పు కూడా ఒప్పు అంటాము
మన బంధువైతే రాబందులకు కూడా కొమ్ము కాస్థాము
ఎందుకంటే మనం స్వార్ధం తో పుచ్చిపోయాం
ఎలాగోలా బతకాలనే భయంతో ఎప్పుడో చచ్చిపోయాం
ఎవడైనా పొరపాటున పోరాడినా
వాడికి దూరంగా పారిపోతాం
మనం బతకడం నేర్చాము
సంఘంలో మన బాధ్యత ఎప్పుడో మరిచాము