సుకుమార్ దర్శకత్వంలో రాబోతున్న చిత్రం 100 % లవ్. ఆర్య-2 పాటలు ఎంత సూపర్ హిట్టో మనకు తెల్సిందే. దానికి కూడా మ్యూజిక్ దేవి శ్రీ ప్రసాదే. వీళ్ళిద్దరి కలయికలో ఒస్తున్న ఈ సినిమా పాటలు హైప్ కి తగ్గట్టే బాగా అనిపించాయి. అందులో బాగా ఇంప్రెస్స్ చేసిన పాట Infatuation . చంద్ర బోస్ రాసిన ఈ పాట అద్నాన్ సామీ పాడారు. ఈ పాట కాలేజీ పిల్లలని అద్భుతంగా ఆకట్టుకుంటుంది. అందులోనూ చిన్నప్పుడు తెలుగు మీడియం లో చదువుకున్ననాలాంటి వాళ్లకి మరీ మరీ నచ్చుతుంది. మీరేమీ "నువ్వేంటి ?కాలేజీ కుర్రాడితో కంపారిజన్ ఏంటి రా?", అని మనసులో అనుకో అక్కరలే. నేనూ ఒక సినిమా హీరో అయ్యుంటే బాలయ్య లాగ, వెంకి బాబు లాగ, నాగ బాబు లాగ పుస్తకం పట్టుకుని కాలేజీ కి వెళ్ళిన scenelo నటించే వాడిని, మీరు కూడా వేరే దారిలేక సినిమా చూసేవారు.
సరే నా గురించి పక్కన పెట్టి పాట విషయానికొద్దాము. బహుసా ఈ పాట రాసిన చంద్ర బోస్, మ్యూజిక్ కొట్టిన దేవి శ్రీ, దర్శకుడు సుకుమార్ అందరూ ఇంజనీర్ లనుకుంట. ఈ సినిమా పాటలలో ఆ చాయలు కనిపిస్తాయి. కొత్త బంగారు లోకం స్కూల్(ఇంటర్ ఏమో) ప్రేమ అయితే అందులో కళాశాలలో పాట ఎంత బావుందో దానికి ఒక మెట్టు ఎక్కువ ఇది. కాలేజీ ప్రేమ కాబట్టి ఈ పాటలో చంద్ర బోస్ లెవెల్ పెంచాడు.
ఇదిగో మీ కోసం కింద సాహిత్యం మరియు ఆ పాటకు లింకు.
Infatuation:
కళ్ళు కళ్ళు ప్లస్సు వాళ్ళు వీళ్ళు మైనస్
ఒళ్ళు ఒళ్ళు ఇంటూ చేసేటీ ఈక్వేషన్
ఇలా ఇలా ఉంటే ఈక్వల్ టు ఇన్‌ఫాచుయేషన్ |2|
ఎడమ బుజము కుడి బుజము కలిసి ఇక కుదిరె కొత్త త్రిబుజం
పడుచు చదువులకు గణిత సూత్రమిది ఎంతో సహజం
సరళలేఖ లిక మెలిక తిరిగి పెనవేసుకున్న చిత్రం
చర్య జరిగి ప్రతి చర్య పెరిగి పుడుతున్దోయ్ ఉష్ణం
కళ్ళు కళ్ళు ప్లస్సు ||
దూరాలకు మీటెర్ లంట భారాలకు కేజీ లంటా
కోరికలకి కొలమానం ఈ జంట
సెంటిగ్రేడ్ సరిపోదంట farenheit పనిచెయ్య దంట
వయసు వేడి కొలవాలంటే తంటా
లేత లేత ప్రాయాలలోన అంతే లేని ఆకర్షణ అర్ధం కాదు ఏ సైన్సు కైనా
పైకి విసిరినది కింద పడును అని తెలిపే గ్ర్యావిటేషన్
పైన కింద తల కిందులవుతది ఇన్‌ఫాచుయేషన్
కళ్ళు కళ్ళు ప్లస్సు ||
సౌత్ పోల్ అబ్బాయంట నార్త్ పోలు అమ్మాయంట రెండు జంట కట్టే తీరాలంట
ధనావేశం అబ్బాయంట రుణావేశం అమ్మాయంట కలిస్తే కరంటే పుట్టే నంట
ప్రతీ స్పర్శ ప్రశ్నే నంట మరో ప్రశ్న జవాబట ప్రాయానికే పరీక్షలంట -ఓ
పుస్తకాల పురుగులు రెండంట ఈడు కొచ్చె నంట
అది అక్షరాల చెక్కెర తింటూ మైమరచే నంట
కళ్ళు కళ్ళు ప్లస్సు ||
Song లింక్:
Song Source: http://www.raaga.com/
Special Thanks to SURI for telling me to listen to this movie songs.
Lyrics copy chesukunTe meeku abhyamtarama ?
రిప్లయితొలగించండిa2zdreams,
రిప్లయితొలగించండిNo problem. Feel free.
ఎడమ బుజము కుడి బుజము కలిసి ఇక కుదిరె కొత్త త్రిబుజం :)
రిప్లయితొలగించండిపైకి విసిరినది కింద పడును అని తెలిపే గ్ర్యావిటేషన్
పైన కింద తల కిందులవుతది ఇన్‌ఫాచుయేషన్
Sooparuuu
naaku music antaa bhale bhale nacchindi :).. kaakapote konni songs lyrics uhhhuuu uuhhuu kani :).. good one.
రిప్లయితొలగించండిగిరీష్,
రిప్లయితొలగించండిThank you.
Sree,
రిప్లయితొలగించండిI know.It must be that item song.