మా అమ్మాయిని పియానో పాటాలకు పంపడం మొదలుపెట్టి ఇంచుమించు సంవత్సరం అవుతుంది. అయితే పేరుకు పియానో లెస్సన్ అయినా, దాని మనసు అంతా DRUMS మీదే. క్లాసు ఇంకా మొదలు పెట్టక ముందే అది దాని టీచర్ తో బేరం మొదలు పెడుతుంది, "నేను DRUMS వాయిస్తాను" అని. చివ్వర్లో వాయిద్దువు గాని అని సర్ది చెప్పి వాళ్ళ టీచర్ పియానో పాటం మొదలు పెడుతుంది. అసలు అదేదో నేర్చుకున్నట్లుగా కాకుండా, నా కూతుర్ని ఆ టీచర్తో ఆడుకోడానికి తీసుకోచ్చినట్లుంది ఆ అరగంట మ్యూజిక్ క్లాస్. పైగా అరగంటకి పద్దెనిమిది డాలర్స్ తీసుకుంటుంది. అరగంట సేపు ఏదో పుస్తకంలో రాతలు గీతలు, కాసేపు మా అమ్మాయి యక్ష ప్రశ్నలు, ఇంకాస్సేపు మాట వినని నా కూతుర్ని బుజ్జగించడం. అప్పటికి ఒక ఇరవై నిమిషాలు అయిపోతాయి. చివరి పది నిమిషాలు ఏదో భంగిమ టైపు లో చేతులు ఏ పోసిషన్ లో పెట్టాలో (చేతుల్లో బుడగలు వున్నట్లు అవి పగలకుండా పటుకున్నట్లు),
పియానో ముందు ఎలా కూర్చోవాలో లాంటి వాటితో మొదలెట్టి ఒక ఐదు నిముషాలు తూతూ మంత్రం కింద పియానో
టప టపా బాది, (నాకేమో క్షణం క్షణం లో సీన్ గుర్తొస్తూ వుంటుంది) ఐపోయిన్దనిపిస్తారు. పోనీ నేనేమైనా ఆ టీచర్ ని కొంచెం గట్టిగా పియానో నేర్పించమని అడుగుదామంటే అసలే పెద్ద అంద గత్తె, మనకేమో ఆడపిల్లని చూస్తే మాట రాదు, అందులో అందమైన ఆడపిల్లలని అసలు ఏమి అనలేము. దానికి తోడు నేను కూడా ఈవిడ దగ్గర నాలుగైదు పియానో పాటాలు నేర్చుకున్నాను లెండి. నా కూతుర్ని ఇంటి దగ్గర ప్రాక్టీసు చేయించాలంటే మనకి సంగీతంలో ఇంగిత జ్ఞానం కూడా లేదు కదా అని.
అలా క్లాసు ఐపోయే టైం కి నా కూతురు మోహంలో వెలుగు, ఇంక తీన్ మార్ డప్పు కొట్టొచ్చు అన్న ఆనందం. ఇదిగో ఈ కింద వీడియో చూస్తే మీకే తెలుస్తుంది మా అమ్మాయి తీన్ మార్ టాలెంట్.

good.. why dont you get her trained in what she loves the most.. she is awesome by the way :).
రిప్లయితొలగించండిit is a joy to see the glee in her face
రిప్లయితొలగించండిhttp://sreeszone.blogspot.com/2011/04/evening-hour-readers-guild-reading.html
రిప్లయితొలగించండిChandu.. Though I dont know much about you in person, I think you like reading with the recent read/watched link in the side bar... try and do it.
Sree,
రిప్లయితొలగించండిThank you.
Her teacher says she needs to learn piano to learn music basics and later can pick any instruement.
If she is still interested after basics I will get her into Drums.
కొత్త పాళీ,
రిప్లయితొలగించండిThank you.
Sree,
రిప్లయితొలగించండిNot sure how it works? I am not in India. Right now juggling between too many things. Sorry. I will see if I can post reviews on couple of books that inspired me.