2, జూన్ 2011, గురువారం

మీకు వెంకట్ రెడ్డి చిర్ర కనిపిస్తే గుండు మీద ఒకటి మొట్టండి.


మీకు వెంకట్ రెడ్డి చిర్ర కనిపిస్తే గుండు మీద ఒకటి మొట్టండి. ఎందుకని అడిగితే నా పేరు చెప్పండి. నా ఇ-మెయిల్ ఇవ్వండి. 

ఎందుకంటె వీడి ఆచూకీ కోసం నేను వెతుకుతూ .. ఎక్కడైనా దొరుకుతాడని అంతగా ఎదురు చూస్తున్నా.
పాత ప్రియురాలిని వెతుకుతున్న ప్రియుడు లాగా..
అప్పు ఎగ్గొట్టిన వాడిని వెతికే అప్పిచ్చిన వాడి లాగా ....
చిన్న నాటి స్నేహితుడిని వెతికినట్టు తెగ వెతుకుతున్నా.

అసలు ఎవడీ చిర్రా.. వీడు దొరక్కపోతే నీకెందుకు ఇంత చిర్రాకు అని అడిగితే అంత పెద్ద కారణాలేమి లేవు..
వీడు నేను కలిసి మహా అయితే ఒక సంవత్సరం స్నేహితులుగా వున్నాము.. వీడికీ నాకూ పెద్దగా కామన్ అలవాట్లు కానీ, అభిప్రాయాలు గానీ లేవు. కానీ చందు గాడికి నచ్చాడు. నాకు పక్క వాడిని దోచేసే మనుషుల మధ్యలో ఎవడన్న అమాయకుడు తగిలితే వాడికి ఫ్రెండ్ ఐపోయి వాడికి నేను ఫ్రెండ్ అని వాడిచేత అనిపించేసి.. వాడిని మబ్బులా కమ్మేయటం అలవాటు. పైగా నాకు ఒక్క సారి ఫ్రెండ్ అయితే వంద ఏళ్ళకు ఫ్రెండ్ అయినట్లే. నాకు ఫ్రెండ్ అయితే వాళ్ళు అన్యాయంగా లైఫ్ లాంగ్ లాక్ హో గయా. మనల్ని విడిపించుకోవడం కష్టమో, వదిలేస్తో నష్టమో, స్నేహం అంటే ఇష్టమో లేక వాళ్ళ ఖర్మమో.. అలా అయిపోతుంది అంతే..

వీడూ నేను కలిసి పెంటా ఫోర్  లో ఒక క్రాష్ కోర్సు చేసాము. ఆ తరవాత కలిసి ఉద్యోగ ప్రయత్నం, COMBINED  స్టడీ, ఆ ప్రయత్నంలో మా ఇంట్లో కొన్ని రోజులు వాడు, వాడింట్లో కొన్ని రోజులు నేను వున్నాము. వీడిది విజయవాడ. వీడో పెద్ద అజహరుద్దీన్ ఫ్యాన్. (ఇంకా అలాగే వుండుంటాడని నా అనుమానం) ఆ తరవాత ఇద్దరం అమెరికాలో చేరాము. నేను ఫస్ట్ కార్ కొన్నప్పుడు నా కార్ పక్కన ఫోటో తీయించుకుని అది వాడి కారే అని ఊర్లో అందరినీ నమ్మిన్చానని కూడా చెప్పాడు. అవును మరి నా గ్యాంగ్ లో ఫస్ట్ కార్ నేనే కొన్నాను. పైగా స్పోర్ట్స్ కార్ టూడోర్ తీసుకుంటుంటే, వెనక కూర్చునేది మేము కాబట్టి నాలుగు డోర్ లు వుంది తీరాల్సిందే అని పట్టు బట్టి మరీ కొనిపించారు.
ఆ కార్ చూసి అందరూ ఇంత చిన్న స్పోర్ట్స్ కార్ ఎవడైనా ఫౌర్ డోర్ కొంటాడా అని పిలిచి మరీ వెటకారం చేసేవారు.
అప్పుడు వీడు పోకప్సీ న్యూ యార్క్ దగ్గరలో పని చేసేవాడు (అది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో). ఆ తరవాత అసలు టచ్ లోనే లేడు. ఇప్పటికీ పెంటా ఫోర్ బాచ్ లో ఎవరితో మాట్లాడినా, "వీడు తగిలాడా?" అని అడుగుతూ ఉంటా.
ఇంత పెద్ద ప్రపంచంలో ఇంత చిన్న సాఫ్ట్వేర్ రంగం లో, అందునా అంతరజాలం లో జల్లెడ పట్టే అవకాసం వున్న ఈ రోజుల్లో వీడిని పట్టుకోలేక పోవడం నన్ను చాలా ఆశ్చర్యానికి గురిచేస్తుంది. వీడు ఎక్కుడున్నా సంతోషంగా ఉన్నాడని తెలిస్తే కొంచం నా మనసు కుదుటపడుతుంది.

వీడు మీకు తెలిస్తే నాకు ఆచూకి చెప్పగలరు..
కలిస్తే నెత్తి మీద గట్టిగా మొట్టగలరు ..

WOH AJANBEE THOO BHEE KABHEE AAWAAZ DE KAHEE SE ......

4 కామెంట్‌లు:

  1. అక్కడే నూయార్కు సమీపంలోనే ఉన్నాడుగా!
    Director of Application Development at J Knipper and Company, Inc.
    వీడు కాదా?

    రిప్లయితొలగించండి
  2. చందూ గారు , ఇలాంటి అర్టికాల్ ఒకటి మొన్న పేపర్ లో చదివాను
    అతను కూడా ఇలానే రాసాడు మీ గురించి
    ఎక్కడన్నా కనపడితే నెత్తిమీద మొట్టికాయ కొట్టి , తన పేరు చెప్పా మన్నాడు
    కాబట్టి మీరు ఉండే ది ఎక్కడో చెప్పగలరు :),

    రిప్లయితొలగించండి
  3. నాగేస్రావ్,
    వెతికానండీ, ఆ చిర్రా ఈ చిర్రా కాదు. ఇలా ఫేస్ బుక్ లో ఒక చిర్రా ని కదిపి చూశా, ఆయనా కాదు.

    రిప్లయితొలగించండి
  4. సంకలిని,
    ఆది నేనే ఇచ్చా. ఆది చూసి మీలాంటి వాళ్ళు నన్ను వెతుక్కుంటూ ఒస్తారని.
    మీ కామెంట్ బావుంది.

    రిప్లయితొలగించండి