2, జూన్ 2011, గురువారం

Toy Story - Princess Camera

నాకు చిన్నప్పటి నించీ కెమెరా కొనుక్కోవాలని సరదా వుండేది. మనం తీర్చుకోలేని సరదాలన్నీ మన పిల్లలకు తీర్చే బలహీనత అందరి తండ్రుల్లాగే నాకు కూడా వుంది. అందుకే సిరి కి మూడేళ్ళ వయసప్పుడే ఈ కెమెరా కొన్నాను. దీనితో ఒక్కో సారి స్కూల్ కెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ పిక్చర్స్ తీస్తుంది. లాస్ట్ టైం ఇండియా వెళ్ళినప్పుడు కూడా బోలెడు పిక్చర్స్ తీసింది అందరికీ. ఇండియాలో ఇంత చిన్న వయసులో దానికి కెమెరా ఎందుకని అడిగిన వాళ్ళు లేక పోలేదు అనుకోండి. కెమెరా అంటే ఇష్టం తో పాటు, ఇది ప్రిన్సుస్స్ కెమెరా అవ్వడంతో సిరి కూడా ఈ గిఫ్ట్ బానే ఎంజాయ్ చేసింది. ధర కూడా అంత ఎక్కువేమి కాదు. అందరికీ "సే చీస్" అని మా అమ్మాయి ఫోటో తీస్తుంటే అబ్బో నా కూతురు పెద్ద సినిమాటోగ్రఫర్ ఐపోనట్లు నాకో చిన్న కల.

4 కామెంట్‌లు:

  1. హ్హహ్హహ్హ! 'ప్రిన్సెస్ కెమెరా' :) మీ అమ్మాయికి ఏదైనా ప్రిన్సెస్ అంటే చాలా ఇష్టం అనుకుంటా! ఇంతకుముందు టపాల్లో కూడా చెప్పేవారు... ప్రిన్సెస్ సినిమాలు ఇష్టంగా చూస్తుంది అని! ఈమధ్య పిల్లలకి కెమెరాలు అత్యవసారాలు అయిపోయాయి! ఇక్కడ మాకు పరిచయమైన మూడేళ్ళ కవలలకి వాళ్ళ నాన్న బొమ్మ కెమెరా కొనిపెడితే..అది కాదని నిజం కెమెరా కావాలని ఏడుపులు...పెడబొబ్బులు....పాపం వాళ్ళ నాన్న :))

    రిప్లయితొలగించండి
  2. ఇందు,
    ప్రిన్సెస్ అంటే ఇష్టం కాదు - పిచ్చి. నాకు ఎప్పుడూ అవే కధలు చెపుతుంది.

    రిప్లయితొలగించండి