11, ఆగస్టు 2011, గురువారం

ప్రేక్షకులని హాలు నుంచి బయటకు పరుగెత్తించిన దడ

నాలాంటి ఒక సినిమా పిచ్చోడు ఆఫీసు లో ఆలస్యంగా పని చేసి... మళ్ళీ పొద్దున్నే ఆఫీసు పని పెట్టుకుని కూడా...  యాభై మైళ్ళు వెళ్లి చెప్పిన టైం కంటే గంట ఆలస్యంగా సినిమా వేసినా, సరి పెట్టుకుని ఆశగా సినిమా చూస్తే... అరగంట కి హాలు లో పదో వంతు జనాలు జంపు. నా జీవితంలో హాలులో నేను పూర్తిగా చూడకుండా బయటకు ఒచ్చిన సినిమాలు ఒకటో రెండో.. అలాంటి నేను గంట తరవాత పాటకి ఇంటికి వెళ్ళిపోతున్న మూడొంతుల మంది జనాలతో పాటూ .. బయటకి పరిగెత్తా.. అది ఈ సినిమా పరిస్థితి..ఈ సినిమా రివ్యూ రాయడం అనవసరం.. కేవలం ఈ సినిమా కి జనాలు బలి కాకూడదని నేను చూసిన గంట సినిమాలో నా OBSERVATIONS.
 • సినిమాలో అసలు సహజత్వం లేదు 
 • కాజల్ ని అస్సలు చూడలేము.. MAKEUP చాలా బాడ్. కళ్ళు ఉబ్బినట్లు- మొహం మీద జాలీ పేస్ పౌడర్ రెండు అంగుళాలు మన్దమ్ కొట్టినట్లు ఉంది.. కాజల్ కనిపిస్తే జనాలు తల కొట్టుకున్నారు సినిమా మొదలైన పది నిమిషాలకు.
 • కామెడీ ఆర్టిస్ట్ లని పెట్టి మనం చదివిన కుళ్ళు జోకులని సినిమాలో జొప్పించే ప్రయత్నం చాలా పేలవంగా వుంది 
 • చైతన్య ఆక్షన్ సీన్ లకి అస్సలు పనికి రాడు అని సినిమా మొదట్లోనే నిరూపించేస్తాడు
 • సినిమా అమెరికాలో మొదలవుతుంది.. ఎందుకో మనకి అర్ధం కాదు.. 
 • సీన్ లన్నీ అతుకుల బొంతలా కలిపి కుట్టినట్లు వుంటాయి
 • చైతన్య డాన్సు అయితే అసలు నేటి హీరోల తో చూస్తే వేస్ట్ . ఇంకా చెప్పాలంటే నిన్నటి తరం కన్నా కూడా వేస్ట్ 
నాకు అనిపించిన ఒకే ఒక పాజిటివ్ - సినిమాటోగ్రఫీ. అది కూడా సినిమా మొదట్లో అనిపించింది.. కానీ ఎందుకో క్లోజ్ షాట్స్ లో ఎక్కడో తేడా జరిగిందని తర్వాత తెలిసిపోతుంది..

నాతో పాటు తిట్టుకుంటూ బయటకు ఒచ్చిన జనాల్ని చూస్తే అనిపించింది దీనికి కరెక్ట్ ట్యాగ్ లైన్..

దడ... ప్రేక్షకులకు టికెట్ కొన్నందుకు..  తప్పకుండా హాలు నుంచి బయటకు పరిగెత్తించే...

ఇమేజ్ సోర్సు: wallpapers.oneindia.in

6 వ్యాఖ్యలు:

 1. హ్హహ్హహా! నేను చైతు హ్యట్రిక్ కొడతాదనుకున్నా! ప్చ్! లాభలేదన్నమాట! మేమింకా చూడలేదు...చూడబోవడలేదు :))

  ప్రత్యుత్తరంతొలగించు
 2. phew, i wanted/want to watch it so badly.. ippudu konchem jankaanu mee review choosi, choosta gunde dhairyam chestaaa nidaanamgaa... Gudiwada elli choodatam dandaga, maa oorocchinappudu choostaa :).

  ప్రత్యుత్తరంతొలగించు