చంటి పిల్లలని పెంచడం మొగాళ్ళ తరం కాదు. ఏ మగాడైనా కష్టపడి వండి పెట్టచ్చు, తిండి పెట్టచ్చు, జడ వెయ్యచ్చు, జో కొట్టచ్చు, పాట పాడచ్చు, ఎత్తుకుని మోయ్యచ్చు, చందమామని చూపించచ్చు. ఇన్ని చేసినా కాని, "అమ్మ లేకపోయినా పరవాలేదు నువ్వు వున్నావుగా..." అని ఏ నాన్ననీ అనుకోలేము. ఎందుకంటె "అమ్మ అంటే అమ్మే!". ఈ విషయంలో నాకు నా స్నేహితులకీ మధ్య ఎప్పుడూ ముష్టి యుద్దలయ్యే రేంజ్ గొడవలు జరుగుతూ వుంటాయి.. భార్య భర్తల మధ్య మనస్పర్ధల్లో తల్లిని కోల్పోయిన పిల్లల్ని పెంచే తండ్రులని .. తల్లిని దూరం చేసి పిల్లల్ని పెంచాలనుకునే తండ్రుల్ని.. నేనెప్పుడూ ఈ విషయంలో ప్రశ్నిస్తూ వుంటాను.
ఎందుకంటె నాకే చాలా సార్లు తెలుస్తూ వుంటుంది నా పిల్లలని పెంచేటప్పుడు. లాస్ట్ మంత్ నా రెండో కూతురుని ఆసుపత్రికి తీసుకెళ్ళడానికి నేను రాకపోతే కుదరదని మా ఆవిడ పట్టు పట్టింది. సిరి పుట్టే ముందు అన్ని డాక్టర్ విసిట్స్ కీ ఒచ్చేవాడివి, సాహితి (మా రెండో కూతురు) ని కనే ముందు ఒక్క విసిట్ కి కూడా రాలేదు... అని చెప్పి ఆఫీసు పనిలో వున్నా సరే కుదరదని చెప్పి నన్ను బయలుదేర తీసింది. అప్పటికి సాహితి పుట్టి నాలుగు రోజులే అయ్యింది. అప్పటికి సాహితీ పెంపకంలో నా పాత్ర - దూరం నించి ఈల వేసి పలకరించడం .. మహా అయితే వేళ్ళతో బుగ్గలు నిమరడం మించి పెద్దగా సాహితిని ఎత్తుకున్నది లేదు. ఆసుపత్రినించి ఇంటికి ఒచ్చేముందు కార్ సీట్ లో పెట్టడానికి మాత్రం రెండు చేతులతో పట్టుకుని సీట్ లో పెట్టి ఇంటికి తెచ్చానంతే.
తీరా మేము ఆసుపత్రి దగ్గరికి ఒచ్చేక నాకు కూడా అదే టైం కి అప్పాయింట్మెంట్ వుందని పిల్లని నాకు ఒదిలేసి మధ్యలో తన డాక్టర్ ఆఫీసు దగ్గర దిగిపోయింది. పక్కన మా ఆవిడ ఉంటుందనే ధైర్యంతో బయలుదేరిన నేను, ఒక్కడినీ తీసుకెళ్ళడానికి మానసికంగా తయ్యరయి.. "ఆ! ఏముంది.. మహా అయితే కార్ సీట్ తో సాహితిని మోసుకేల్తే సరిపోతుంది, మిగిలింది వాళ్ళే చూసుకుంటారు" అనుకున్నా. తీరా లోపలికి వెళ్ళాక నరసమ్మ (దాని ఎంకమ్మ) పిల్లని తీసి బల్ల మీద పెట్టమంది. అదీ మామూలుగా కాదు, DIAPER తీసి. అప్పటిదాకా సరిగా ఎత్తుకోని నాకు రోజుల పిల్లని ఎత్తుతుంటే ఒకటే టెన్షన్. దానికి తోడు ముద్దుగా సాహితీ నిద్రపోతోంది. అసలే మూడు నెలలు ఒస్తే గాని మెడ నిలవదు అని సిరి చిన్నపిల్ల అప్పుడు మా అమ్మ చెప్పిన విషయం గుర్తు. LION KING సినిమాలో SIMBA ని RAFIKI Nపట్టుకున్నట్లు రెండు చేతులతో పట్టుకుని పైకి ఎత్తితే.. అసలు చేతులో బరువు అనిపించలా..
జాగ్రత్తగా ఎత్తి పడుక్కోపెట్టి జారి పడిపోతున్దోమని నేను టెన్షన్ పడుతుంటే.. నా నిద్ర పాడు చేస్తావా అన్నట్లు కేర్ కేర్ మని ఏడుపు.. ఎలా ఊరుకోబెట్టాలో తెలియక కంగారు పడుతుంటే .. తొందరగా డ్రెస్సు
ఇంక చూసుకో మన కష్టాలు.. పాలు పడదామా అంటే - సీసా DIAPER బాగ్ లో వుంది.. మన దగ్గర DIAPER బాగ్ లేదు.. ఎందుకు ఏడుస్తుందో తెలియదు.. సరిగ్గా ఎత్తుకుంటున్నానో లేదో అని అనుమానం. పోనీ మనకి తెలిసిన జోల పాడాలంటే - అది క్లినిక్ అయ్యె.. మనకి తెలిసిన విద్య ఈల ఒకటే... అది వేస్తే ఏడుపు ఇంకా పెరిగింది ... ఆ టెన్షన్ కి ఈల రావడం మానేసి ఉత్తి గాలి బయటికొచ్చింది.. దాని ఏడుపు ఆపడం సంగతి అటుంచి నాకు ఏడుపొచ్చింది..
ఇంతలో నా కోసమే పంప బడ్డ దేవ కన్యలా, మా ఆవిడ తలుపు తీసుకుని ప్రత్యక్షం అయ్యింది. పాపం బుడ్డి గాడికి ఆకలనుకుంటా అని ఒల్లో పెట్టుకుని పాలు తాగించేటప్పటికి ఏడుపు టక్కున మాయమయ్యింది.. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుని.. ఎంతైనా అమ్మ అమ్మే.. ఎన్ని కబుర్లు చెప్పినా.. ఏ మగాడూ అమ్మ కాలేడు..అని మరోసారి అనుకున్నా.. అప్పుడు మటుకు మా ఆవిడ కూడా అమ్మతనంతో అమృత మూర్తిలా అనిపించింది...
అందుకే అమ్మ లేని లోటు లేకుండా చూసుకుంటా అనే నా స్నేహితులతో.. అలా చూసుకో గలరు అనే బరోసా ఇచ్చే వాళ్ళతో నేను ఎప్పుడూ బల్ల గుద్దేసి మరీ చెప్తూంటా "అతడు.. అమ్మ కాలేడు" అని...
నిజం ఒప్పుకున్నారు .
రిప్లయితొలగించండికామన్ సెన్స్ పాయింట్. అలాగే ఆమే నాన్న కాలేదు
రిప్లయితొలగించండిchala baga rasaru sir artical... nijaniki ammaki sati ga vere edi ee bhumi meeda ledani na opinion.... kani meeru rasina artical chala saradaga rasi andulo feel touch ayyela rasaru... its nice story....
రిప్లయితొలగించండిvery nice... adavalla importance gurtinchagalige magavallu ee lokam lo inka unnara? unna bold ga accept chese guts undavu..i appreciate ur boldness...thanks and congrats for ur new little one Sahiti :)
రిప్లయితొలగించండిNijam!
రిప్లయితొలగించండిలలిత,
రిప్లయితొలగించండిఒప్పుకోక తప్పలేదండీ..
కుమార్ దత్తా,
రిప్లయితొలగించండినిజమే!
రాజీవ్ రాఘవ్,
రిప్లయితొలగించండిఅమ్మ గురించి కరెక్ట్ గా చెప్పారు
Sirisha,
రిప్లయితొలగించండిThanks.
sunita,
రిప్లయితొలగించండిThank you.
కొత్త పాళీ,
థాంక్స్.
Good :) mottaniki oppesukunnaru annamaata :))
రిప్లయితొలగించండివిరిబోణి,
రిప్లయితొలగించండిఒప్పుకోక తప్పుతుందా.
భేష్! అని మిమ్మల్ని అనకా తప్పట్లేదు. నిజం నిర్భయంగా ఒప్పుకోవాలంటే ఎంత తెగువ ఉండాలి. భేష్!
రిప్లయితొలగించండి:).. good one again, write more often I understand it is tough with another kid in life... a few more days and you are back to doing your favorite activity, singing lullabies for Sahiti :).. I think that is how we both met, searching for those on the blog!!! Happy parenting Chandu.
రిప్లయితొలగించండికొత్తావకాయ,
రిప్లయితొలగించండిథాంక్స్ అండీ.
Sree,
రిప్లయితొలగించండిI would love to. Thank you.
ఓ రెండురోజుల క్రితం అనుకుంటా, పోస్టు హెడ్డింగ్ చూసి ఏదో లింగ మార్పిడి కేసు గురుంచి అయ్యుంటుందని చదవలేదు. ఇప్పుడే, హారం లో ఎక్కువగా చదివిన టపాల సెక్షన్ లో ఇది కనపడగానే తెరిస్తే, ఇది మీ బ్లాగు :)).
రిప్లయితొలగించండిచాలా బాగా రాసారు, ఎవరి పాత్ర వారిదేనండీ, పిల్లల పెంపకంలో. Happy parenting!!!!
నిజమే. అతడు... అమ్మ కాలేడు.. ఆమె నాన్న కాలేదు. ఎవరి పాత్ర వారిదే ఈ జీవిత రంగస్థలంలో. బాగుందండి.
రిప్లయితొలగించండిరిషి,
రిప్లయితొలగించండినిజమే నండీ.. థ్యాంక్ యూ.
శిశిర,
రిప్లయితొలగించండిథ్యాంక్ యూ.