మా ఇంట్లో నిత్యం జరిగే హక్కుల పోరాటంలో...
ఆధిపత్యపు పోరులో రేగిన మంటల సెగలలో
వేడి నిట్టూర్పుల బుసలు కొట్టుకుంటూ
ప్రత్యర్ధి వర్గం పైన కక్ష సాన్దిపు చర్యగా
నా పవరేమిటో చూపించాలని
సింకు కింద నున్న గూట్లోంచి
బంగాళా దుంపల్ని బయటకు తీసి
పీకల్లోతు గిన్ని నీట్లో ముంచి
ఒంకీ తిరిగిన పీలర్ తో
కసిగా వాటి తోలు ఒలచి పారేసి
పొడవాటి కత్తితో ముక్కలుగా నరికేసి
వేడి మూకుట్లో వెజిటేబుల్ నూని పోసి
ఎడా పెడా వేయిస్తూ వికటాట్ట హాసంతో
ఉప్పు కారం జల్లి అన్నంలో నంచుకుని
ఆవకాయతో పాటుగా తినేస్తాను..
నాకు గాని తిక్క రేగిందంటే..
మా ఇంట్లో దుంపల వేపుడే....
ఎందుకంటే మా ఆవిడకి అది అస్సలు పడదు మరి..
నాకు.. నా కూతురికి చాలా ఇష్టం..
నిజం చెప్పద్దూ...
అలాంటప్పుడు ఆలు FRY తింటే...
ఆ టేస్టే వేరు ... ఆ టేస్టే వేరు ...
ఇమేజ్ సోర్సు: http://www.dailyfreemovies.co.uk/