6, జనవరి 2011, గురువారం

నాకు తిక్క రేగిందంటే.. దుంపల వేపుడే....

మా ఇంట్లో నిత్యం జరిగే హక్కుల పోరాటంలో...
ఆధిపత్యపు పోరులో రేగిన మంటల సెగలలో
వేడి నిట్టూర్పుల బుసలు కొట్టుకుంటూ
ప్రత్యర్ధి వర్గం పైన కక్ష సాన్దిపు చర్యగా
నా పవరేమిటో చూపించాలని
సింకు కింద నున్న గూట్లోంచి
బంగాళా దుంపల్ని బయటకు తీసి
పీకల్లోతు గిన్ని నీట్లో ముంచి
ఒంకీ తిరిగిన పీలర్ తో
కసిగా వాటి తోలు ఒలచి పారేసి
పొడవాటి కత్తితో ముక్కలుగా నరికేసి
వేడి మూకుట్లో వెజిటేబుల్ నూని పోసి
ఎడా పెడా వేయిస్తూ వికటాట్ట హాసంతో
ఉప్పు కారం జల్లి అన్నంలో నంచుకుని
ఆవకాయతో పాటుగా తినేస్తాను..

నాకు గాని తిక్క రేగిందంటే..
మా ఇంట్లో దుంపల వేపుడే....

ఎందుకంటే మా ఆవిడకి అది అస్సలు పడదు మరి..
నాకు.. నా కూతురికి చాలా ఇష్టం..
నిజం చెప్పద్దూ...
అలాంటప్పుడు ఆలు FRY తింటే...
ఆ టేస్టే వేరు ... ఆ టేస్టే వేరు ...

ఇమేజ్ సోర్సు: http://www.dailyfreemovies.co.uk/
 

25 కామెంట్‌లు:

  1. :-) బాగుంది. మీ భాషలో పలుయాసలు కలగలిసి ఉన్నాయి. మూకుడు అనేపదం తెలంగాణ యాస అనుకున్నానిన్నాళ్ళు.

    రిప్లయితొలగించండి
  2. మీరూ, మీ కూతురూ కలిసి ఆవిడని ఇలా ఏడిపిస్తారా? :)

    రిప్లయితొలగించండి
  3. అంటే నెలకు ఎన్నిసార్లు దుంపలవేపుడు మీ ఇంట్లో.. మికిష్టమైనవి మీరు చేసేసుకుంటే మీ ఆవిడ తనకిష్టమైనవి చేసేసుకుంటుంది కదా...

    రిప్లయితొలగించండి
  4. budugoy,
    థాంక్స్. మూకుడు ఐతే తెలంగాణా యాస కాదు.

    రిప్లయితొలగించండి
  5. జ్యోతి,
    హ్హ హ్హ హ్హ.. అంత రెగ్యులర్ గా కాదు లెండి.అందుకనే కోపం ఒచ్చినప్పుడు అలా.

    రిప్లయితొలగించండి
  6. meeku telusO lEdO... దుంపలు ఎక్కువ వాడే వాళ్ళ్కి కేన్సర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ...వీలయినంత వరకూ లాగించేయండి..

    రిప్లయితొలగించండి
  7. kvsv,
    Thanks. మంచి విషయం చెప్పారు.

    రిప్లయితొలగించండి
  8. దుంప తెంచడమే కాక బాణలి లో వేయించి తినేశారు కూడా! అహో..ఇది కదా సంపూర్ణ విప్లవం అంటే. మీకు నా లాల్ సలాం, విప్లవ జోహార్లు. :) ఫోటో మరీ వూరిస్తోంది, మీరు చేసిన దుంపలవేపుడేనా?!

    రిప్లయితొలగించండి
  9. మూకుడు అంటే ముష్టోళ్ళ బిక్షపాత్ర అనుకున్నా! :)) దాన్ని ఇలా కూడా వాడతారా?! :P

    రిప్లయితొలగించండి
  10. Snkr,
    థ్యాంక్ యూ. ఫోటో ఇంటెర్నెట్ లోది. అవునండీ.. వేయించడానికి ఉపయోగించే పాత్రనే మూకుడు అని అంటారు.

    రిప్లయితొలగించండి
  11. మా ఇంట్లో కూడా అంతే ... అందుకే దుంపల కూర స్వయం గా చెయ్యను అస్సలు :)

    రిప్లయితొలగించండి