ఒంటరి మనసు ప్రశ్నిస్తోంది...
అన్ని వేల పరిచయాలు ఏర్పడినా...
ఎందుకిలా మిగిలిపోయావని...
నీ స్వార్ధం నిన్నందరికీ దూరం చేసిందా అని అడిగింది...
నిస్వార్ధం తో ఏమి కూడబెట్టలేదు కదా.. అన్నాను...
నీ అవసరాలు అందరినీ పారిపోయేలా చేశాయేమో అంది.
ఏ అవసరం తీర్చుకున్నాను గనక అన్నాను
ఆశతో అందలాలు ఎక్కడానికి అందర్నీ తొక్కేసి ఉంటావు అంది
అందరికంటే కిందే వున్నానుగా అన్నాను
పక్కవాడి కష్టాల్లో పాలు పంచుకుని వుండవు అంది
కష్టాలు తీర్చిన తరవాత వాళ్ళే దూరం అయ్యారన్నాను
ప్రేమని పంచలేక పోయుంటావేమో అని అడిగింది
అప్పుడు తెలిసింది నాలో ఇంకా చాలా ప్రేమ మిగిలుందని
అందరికీ ప్రేమ, డబ్బు ఏదో ఒకటి ఇస్తానన్నా..
అందరూ డబ్బే కావాలన్నారు ...
నా దగ్గర ప్రేమ మిగిలిపోయింది
పరిచయమైన వాళ్లు అవసరం తీరి
ముఖం చెల్లక దూరం అయిపోయారు
ఇప్పుడు చేతిలో చిల్లి గవ్వ లేదు
అందుకే ఎవరూ దగ్గరికి రావట్లేదు
కానీ నా దగ్గర బోలెడంత ప్రేమ ఉంది
పంచడానికి తెలిసున్నోలు లేరు
విశాలమైన ప్రపంచం ఉంది
మనసుకి సమాధానం దొరికింది
నా విలువ నాకు తెలిసింది
Image source: http://fsb.zedge.net/content/6/1/2/4/1-2007746-6124-t.jpg
చాలా చాలా బాగుంది .. సాధారణంగా నా కంటికి కవిత కనపడితే, నా చెయ్యి ఆటోమాటిక్ గా విండోని క్లోజ్ చేసేస్తుంది. కానీ మీ కవిత మాత్రం నా చేతిని కదలకుండా కట్టేసింది. :-)
రిప్లయితొలగించండిడబ్బు పాపిష్టిది, ప్రేమ ఎంతో గొప్పది. అందుకే నేను గొప్పదైన ప్రేమని అందరికీ పంచి, పాపిష్టి డబ్బుని నాతోనే ఉంచేసుకుంటున్నాను. :-)))))
chala baga rasaru...:)
రిప్లయితొలగించండిRajesh T,
రిప్లయితొలగించండిథ్యాంక్ యూ.
Jyothi Nayak,
రిప్లయితొలగించండిథ్యాంక్ యూ.
ఇది కవితలా లేదు.జీవిత సత్యాన్ని అక్షరాల్లో పెట్టినట్టు ఉంది.డబ్బుకి మాత్రమే విలువిచ్చే ఈ లోకంలో ప్రేమకి విలువ లేదండీ...ప్రేమ మాత్రమే ఉన్నోడు పేదవాడు...డబ్బు మాత్రమే ఉన్నోడు నిజమైన ప్రేమికుడు.లోకం తీరు అంతే!
రిప్లయితొలగించండిఇందు,
రిప్లయితొలగించండిథ్యాంక్ యూ.
ఒంటరి మనసు ప్రశ్నిస్తోంది...
రిప్లయితొలగించండిఅన్ని వేల పరిచయాలు ఏర్పడినా...
ఎందుకిలా మిగిలిపోయావని...
చాల బాగా చెప్పారు.
kallurisailabala,
రిప్లయితొలగించండిథ్యాంక్ యూ.
బాగా రాసారండీ చందు గారూ
రిప్లయితొలగించండి