ఈ మధ్య కాలంలో ఒచ్చిన డిస్నీ ప్రిన్సెస్ సినిమాలు అంతగా పిల్లలని ఆకట్టుకోలేదు. ఇంతకు ముందు ఒచ్చిన "ప్రిన్సెస్ అండ్ ది ఫ్రొగ్" చిత్రం కేవలం ఒక వర్గం ప్రేక్షకులను (అది కూడా ఒక రంగు అనచ్చేమో) కొంత ఆకట్టుకున్నా, ఆశించినంత గుర్తింపు గానీ, రెవిన్యూ గానీ తేలేదు. చిన్న పిల్లల్లో ముఖ్యంగా ఆడ పిల్లల్లో వుండే ప్రిన్సెస్ క్రేజ్ ని డిస్నీ సంపూర్ణంగా కాష్ చేసుకోవట్లేదని అందరికీ అనిపిస్తోంది. టింకర్ బెల్ పిల్లలని కొంచెం ఆకర్షించినా అవి ఫైరీలే గనుక ప్రిన్సెస్ కుమ్మరించినంత లాభాలు తేవడం కొంచెం కష్టం. ఎందుకంటె ప్రిన్సెస్ తో IDENTIFY చేసుకున్నంతగా ఆడపిల్లలు ఫైరీ లతో IDENTIFY చేసుకోలేరు. నిజానికి పిక్సార్ తో పాటుగా డిస్నీ నిర్మిస్తున్న చిత్రాలు మంచి గుర్తింపుతో పాటు ఆర్ధికంగా మంచి లాభాలు తెప్పిస్తున్నపటికీ, డిస్నీ సొంతంగా నిర్మించే చిత్రాలు ఎక్కువ శాతం నష్టాలనే మిగులుస్తున్నాయి.డిస్నీ లో CREATIVITY తగ్గిందని అందరికీ అనిపిస్తున్న తరుణంలో TANGLED చిత్రం రిలీజ్ అయ్యింది. పైగా ఇదే తమ చివరి ప్రిన్సెస్ చిత్రమని, ఇంతకు ముందు అనుకున్నమరో రెండు ప్రిన్సెస్ చిత్రాల నిర్మాణం రద్దు చేసామని డిస్నీ వెల్లడించిందని L A TIMES లో ఆర్టికల్ కూడా రాశారు. అసలే మా లిటిల్ ప్రిన్సెస్ ప్రతీ దానికీ నేను స్లీపింగ్ బ్యూటీ అని ప్రిన్సెస్ డాన్సు చేస్తూ వుంటుంది. ఎప్పుడూ డిస్నీ తీసుకెళ్ళమని అంటూ వుంటుంది. నా కూతురు రాత్రి పడుకోబోయే ముందు చదివే కధల్లో ఒకటి ఈ TANGLED కధ. ఇది బావుందన్న రివ్యూ లని చదివి, సరే మా సిరికి చూపిద్దామని ఒక రోజు నడుం కట్టాను.
పొడవైన జుట్టు అన్నది కధకి అసలైన ఆకర్షణ. ఇది చూపించి రోజూ పాలు తాగితే నీకు కూడా అంత జుట్టు ఒస్తుందని మా అమ్మాయిని నమ్మించి పాలు తాగించేయ్యచ్చు అనే కుళ్ళు ఐడియా కూడా ఉందనుకోండి.
ఇక కధ విషయానికొస్తే:
అనగనగా ఒక రాజు-రాణి. కడుపుతో వున్న రాణి గారికి విపరీతమైన అనారోగ్యం చేస్తే రాజ్యంలో అందరూ ఒక ప్రత్యేకమైన పువ్వు కోసం గాలిస్తుంటారు. ఆ పువ్వు గోతల్ అనే ఒక అనాకారి ముసల్ది తను నిత్య యవ్వన వతిగా కనిపించాలని, తన కోసమే దాచిపెట్టుకుని వుంటుంది. ఆ పువ్వు రాణి గారి అనారోగ్యం నయం చేస్తుందని నమ్మకం. ఆ రాజు సైన్యం ముసల్ది దాచిన పువ్వుని వెతికి పట్టుకోస్తారు.అది తిని ఆరోగ్యంగా పండంటి పాపని కంటుంది రాణి. ఆ పాపే రఫున్జల్. ఆ పాప జుత్తు కు రోగాలను నివారించే, యవ్వనంగా కనిపించే మహిమ/శక్తి వుంటుంది.
ఆ జుట్టు కోసం రాజమందిరంలోకి దొంగతనంగా ఒచ్చిన అనాకారి ముసల్ది (గోతెల్) , జుట్టు కత్తిరించి చూస్తుంది. కత్తిరించిన జుట్టుకి మహిమ లేదని గ్రహించి, పాపని ఎత్తుకేల్లిపోతుంది. అలా ఎత్తుకెళ్ళిన రఫున్జల్ ని ఒక నిర్జన ప్రదేశంలో వున్న పొడవైన భవనం లో దాచి పెడుతుంది. తనే తల్లినని రఫున్జల్ ని నమ్మించి, ఆ భవనం నించి కిందకి దిగకుండా కట్టడి చేస్తుంది గోతల్. రఫున్జల్ పెంపుడు జంతువు పాస్కాల్ అనబడే ఒక ఊసరవెల్లి.
తప్పిపోయిన యువరాణి కోసం ప్రతీ పుట్టిన రోజు నాడు రాజు-రాణి లతో పాటు రాజ్యంలో అందరూ వెలిగే లాంతర్లను ఒదులుతుంటారు.
ఆ రాజ్యంలో దొంగతనాలు చేసే FLYNN యువరాణి కిరీటం దొంగిలించి పారిపోతూ ఆ భవనం చేరుకుంటాడు. అతన్ని కట్టి పడేసి, అతని దొంగ సొమ్ముని దాచేసి, నాకు ఆ లాంతర్లు ఎగరేసే స్థలం చూపించి మా అమ్మ ఒచ్చే లోపు తిరిగి తీసుకొస్తే నీవి నీకిస్తానని ఒప్పందం కుదుర్చుకుని అతనితో మొదటి సారిగా బయటకు అడుగు పెడుతుంది రఫున్జల్. FLYNN మీద పగబట్టి MAXIMUS అనే ఒక గుర్రం వెతుకుతూ వుంటుంది. ఈ గుర్రం తన హావ భావాలతో అందరినీ బాగా ఆకట్టుకుంటుంది. రఫున్జల్ ని బయపెట్టడానికి ఒక భారీ కాయులున్న దొంగలున్న బార్ లాంటి చోటుకి తీసుకెళతాడు FLYNN. MAXIMUS , సైనికులు, దొంగ సొమ్ము వాటా కోసం FLYNN సహచరులు తరుముతుంటే అక్కడి నించి తప్పించుకుని రాజకోట దగ్గరకి వెళ్తారు.
ఇంతలో రఫున్జల్ మీద అనుమానం ఒచ్చి గోతల్ భవనం వద్దకి తిరిగి ఒచ్చేస్తుంది. రఫున్జల్ లేదని తెలుసుకుని వెతుక్కుంటూ వెళ్తుంది. FLYNN రఫున్జల్ కి లాంతర్లు వొదిలే ప్రదేశం చూపిస్తాడు (ఇది చాలా అద్బుతంగా ఉంది. యానిమేషన్ ఎంత అభివృద్ది చెందిందో ఇలాంటి సీన్లు చూస్తే తెలుస్తుంది). వీళ్ళ ఇద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. FLYNN ని దొంగగా, మోసగాడిగా నమ్మించి, వీళ్ళ మధ్య అపోహలు సృష్టించి గోతెల్ రఫున్జల్ ని తిరిగి తీసుకెళ్తుంది. FLYNN ని కట్టేసి రాజ సైనికుల దగ్గర చేరేలా ఒక పడవలో ఒదిలేస్తుంది.స్పృహ ఒచ్చిన FLYNN - MAXIMUS మరియు బార్ లోని భారీ కాయుల సాయంతో తప్పించుకుని రఫున్జల్ కోసం భవనం దగ్గరకి ఒస్తూ ఉంటాడు. ఇంటికి ఒచ్చిన రఫున్జల్ ఆ లాంతర్లు తన కోసమే ప్రతీ ఏడు ఒదులుతున్నారని తెలుసుకుని గోతల్ ని నిలదీస్తుంది. నిజం తెలిసిపోయిందని రఫున్జల్ పారిపోకుండా బంధిస్తుంది గోతల్.
మామూలుగా అయితే తరవాత కధ ఊహించంచ్చు. కానీ ఇక్కడే డిస్నీ వాళ్ళు కధని కొంచెం మార్చారు. అందరినీ ఆకట్టుకునే climax చెప్పాలని ఉంది, కానీ ఇక్కడ చదివే వాళ్లకి సినిమా చూస్తే థ్రిల్ వుండాలి కాబట్టి నాకు బాగా నచ్చిన CLIMAX ఇక్కడ చెప్పట్లేదు. చూసి మీరే తెలుసుకోండి.నచ్చిందో-లేదో కామెంట్లో కొట్టండి.
ఈ సినిమా ఆడపిల్లలకి బాగా నచ్చుతుంది. వాళ్ళతో పాటు అబ్బాయిలకే కాదు పెద్ద వాళ్లకు కూడా బావుంటుంది. నాలుగేళ్ళు పైనున్న వాళ్ళు చూడవచ్చు. పాటలు కూడా బావున్నాయి. యానిమేషన్, కధ, పాటలు, CLIMAX ఈ సినిమా హై లైట్. మంచి సందేశం కూడా ఉంది ఈ చిత్రంలో. ఇంట్లో ఆడ పిల్లలుంటే ఈ సినిమా తప్పకుండా చూపించండి. మళ్ళీ డిస్నీ వాళ్ళు ఇలాంటి సినిమా ఇంకోటి తీస్తారో, లేదో?
అర్రె! క్లైమాక్స్ చెప్పకుండా ఈ సస్పెన్స్ ఎంటండీ? హ్మ్! నాకెందుకో ఈ సినిమా నచ్చలేదు.అందుకే చూడడానికి వెళ్ళలేదు.మెగా మైండ్...నార్నియా చూసాను కానీ....ఈ సినిమా చూడాలనిపించలేదు. మీ కథ చదువుతుంటే చూడాలనిపిస్తోంది..కాని ఇప్పటికే క్రిస్మస్ కి గలివర్ అండ్ ట్రావ్లెస్ కి ఫిక్స్ అయిపోయా! హ్మ్! చూడాలి...వీలవుతుందో..లేదో!
రిప్లయితొలగించండిఇందు,
రిప్లయితొలగించండినాకు ఐతె బాగా నచ్చింది.