మనిషిని మంచి మార్గంలో నడిపించేది
మూఢ నమ్మకమైతేనేమి
మనిషి మనసుని మంచి పనిలో
లగ్నం చేసేది ఎలాటి భక్తి అయితే నేమి
మనిషి మనిషికి సాయపడేలా చేసేది
ఎలాంటి మతం అయితే నేమి
మనిషిని మనిషిగా బ్రతకనిచ్చేది
ఏ నాగరికత అయితే నేమి
మనసు లోతుల్ని తట్టేది
ఏ సంబంధం అయితే నేమి
మమతతో మనసుని కట్టి పడేసేది
ఏ అనుభందం అయితే నేమి
మకర జ్యోతి మనిషి వెలిగించిందే
నమ్మకంతో నడిపించడానికి
చుట్టూ వున్న చీకటిని లెక్క చెయ్యకుండా
మనిషి ముందడుగు వెయ్యడానికి
మనమందరం వెలిగించాలి
మన చేత్తో మకర జ్యోతులని
మన మీద వున్న నమ్మకంతో
ముందడుగు వేసే మనుషుల కోసం
వెలిగించే మనిషిని దేవుడే పంపాడు
మనందరినీ వెలుగుతో పంపినట్లే
కానీ
నడిపించే నమ్మకాన్ని పెంచలేకపోతున్నాము
వెలుగుని మన స్వార్ధం కోసం దాచుకుని
వెలుగు కొండేక్కే వృద్ధాప్యంలో నైనా తెలుస్తుందా
స్వార్ధం తో మనం పంచని ఆ వెలుగు
మంటలా మనల్ని దహించేసిందని
గమనిక: మకరజ్యోతి మానవ సృష్టే అని ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు వెల్లడి చేసిన సాక్షి లొవార్త కి స్పందిస్తూ ..
చక్కగా చెప్పారు.
రిప్లయితొలగించండిI agree & support.
రిప్లయితొలగించండిచిలమకూరు విజయమోహన్,
రిప్లయితొలగించండిథ్యాంక్ యూ.
Snkr,
రిప్లయితొలగించండిThank you.