ఒకటి రెండు ఎపిసోడ్ లు టీ వీ లొ చూసాక, సరే నాన్న ఇంట్లో లేని టైం లొ తల్లీ కూతురు ఇద్దరూ నవ్వు కుంటూ చూస్తున్నారు కదా అని నేను టాం అండ్ జెర్రీ ఎపిసోడ్ లను రికార్డు చెయ్యడం మొదలెట్టా. అక్కడే ఒచ్చింది తంటా. ఎక్కువ చూసేస్తోంది అని వాళ్ళ అమ్మ, నేను చూస్తే కానీ ముద్ద తినను అని కూతురు తరచుగా యుద్ధాలు మొదలెట్టారు. దానికి తోడు అందులో చూపించిన చేష్టలన్నీ అనుకరిస్తోందని మా ఆవిడ ఒకటే గోల. పోనీ ఇంకేదన్నా చూపించమంటే టాం అండ్ జెర్రీ తప్పు ఇంకేదీ చూడనని నా కూతురు పంతం పట్టింది. నేను ఆఫీసు లొ ఏదో పనిలో వుంటే నాకు ఇంటి నించి ఫోను "ఇది చూడు ఎలా చేస్తోందో?" అని తల్లి కంప్లైంట్. "అమ్మ చూడు, నన్ను చూడ నివ్వట్లేదు" అని కూతురు ఏడుపు. టాం అండ్ జెర్రీ మధ్యలో ఒచ్చిన మూడో జంతువుకి అటూ ఇటూ కూడా దెబ్బలు పడే ఎపిసోడ్ ఆఫీసు లొ వున్న నాకు. వీకెండ్ ఇంటి కెళ్తే "నీ కూతురు ఇలా దూకింది, అలా కరిచింది, గట్టిగా అరిచింది, జబ్బ చరిచింది, వెక్కిరించింది" లాంటి పెద్ద లిస్టు మనకోసం సిద్దం. అప్పటికీ మా నాయనమ్మ గుర్తుకొచ్చి, నేనొక చండ శాసన మున్దావాడినని ఇలాంటివి సహించేది లేదు అని ఇద్దరికీ టైం అవుట్ అని చీకటి గదిలో పెడితో, అక్కడ ఇద్దరూ ఇక-ఇకలు పక-పకలు. పోనే విభజించి పాలించాలని వేరే వేరేగా పెడితే రెండు నిమిషాలలో "మేము తప్పు తెలుసుకున్నాం . ఇక మళ్ళీ చెయ్యం." అని హామీ ఇచ్చేస్తారు. మళ్ళీ రిపీట్ చెయ్యద్దని చెప్పి టాం అండ్ జెర్రీ లేకుండా వారాంతం గడిచిపోతుంది.
మళ్ళీ సోమవారం ఆఫీసు పనిలో వుండగా ఫోన్ రింగవుతుంది. ఇంటి నించి ఫోను అని ఎత్తితే "ఇది చూడు ఎలా చేస్తోందో?" అని తల్లి కంప్లైంట్. "అమ్మ చూడు, నన్ను చూడ నివ్వట్లేదు" అని కూతురు ఏడుపు.
ఇంట్లో టాం అండ్ జెర్రీ - ఫోన్ లొ మాం అండ్ సిరి ఎపిసోడ్లు. ఈ రెంటి మధ్యలో నా బాధలు యేమని చెప్పను.
బాబోయ్.. చీకటిగదులు, విభజించటాలు, పాలించటాలు... మీరు మీఇంట్లో ఈడీ అమీనా? :)(డిక్టేటరా అని కవి హృదయం).
రిప్లయితొలగించండిippati cinemalu chudatam kanna pillalu tom and jerry chudatame better anukunta. okasari alochinchandi.
రిప్లయితొలగించండిఅంత లేదండీ బాబూ. అప్పుడప్పుడు నేనే బిగ్ బాస్ అని మా అమ్మాయికి తెలిసేలా, మా ఆవిడ తో చేసుకున్న రహస్య ఒప్పందం ప్రకారం, అలాంటి సందర్భాలలో మా ఆవిడ తిరగబడకూడదు. మీరు మరీను. భద్రం బే కేర్ ఫుల్ పాట లో లాగా, ఇడీ అమీన్ ఐనా ఇంట్లో వేరే డిక్టేటర్ లు ఉంటారు.
రిప్లయితొలగించండిగీత_యశస్వి,
రిప్లయితొలగించండిNijamee. Kaanee maa ammayiki inkaa anni cinemaalu choopinchamu.