29, మార్చి 2012, గురువారం

నత్త పారిపోయి నాలుగు నెలలు అయ్యింది


మీరు పైన చూసే చిత్రం, మా నత్తది. మా Aquarium లో ఏడు చేపలు కధ మీరు చదివే వుంటారు. చదవకపోతే ఇక్కడ చదవండి. అందులో మిగిలిన బాలన్సు జీవి ఈ నత్త. అసలు ఎవడైనా నత్తని పెంచుకుంటాడా? అని చెత్త ప్రశ్న చాలా మందికి ఉద్భవిస్తుంది. అది సహజం. విధి ఆడిన వింత నాటకంలో- చేపలు పెంచే ప్రయత్నంలో - విశాలమైన AQUARIUM లో ఒంటరిగా మిగిలిన ఈ నత్త మా అమ్మాయి ఏకైక పెట్ అయ్యింది. మరి ఇంక ఏం చేస్తాము. ఎప్పుడో పెట్టి పుట్టింది కాబట్టి ఇప్పుడు ఇదో ఏకైక పెట్ అయ్యి మా AQUARIUM లో రాజ భోగాలు అనుభవిస్తోంది.
అసలు దీనిని ఎందుకు పెట్టుకుంటారంటే, పేరుకు పోయినా నాచు గట్రా తింటుందని.
చేపలు పోయాక .. అదే వాల్మార్ట్ కి వెళ్లి పోయాక ఇది మాత్రమే మిగిలిందని మా అమ్మాయి దీనికి GARY అని పేరు పెట్టింది. మా అమ్మాయి చూసే SPONGEBOB SQUARE PANTS లో SPONGEBOB పెట్ నత్త, దాని పేరు దీనికి పెట్టింది. దీన్ని రోజూ పలకిరించేది. దానికి  ఎక్కువ ఫుడ్ వేసేది, దాని AQUARIUM క్లీన్ చెయ్యమని నాకు పదే పదే గుర్తు చేసేది.  అది ఒక్కతే వుంది అని, ఇంకా కొన్ని కొని AQUARIUM లో చేపలూ,నత్తలు వెయ్యమని అడుగుతూ వుండేది.  మేము ఎక్కడికైనా బయటకు వెళితే అది ఒక్కత్తే ఇంట్లో వుందని మధ్యలో దానిని గుర్తు చేసుకునేది..

  ఒక రోజూ నేను చూస్తే AQUARIUM బాగా ఆకు పచ్చగా కనిపించింది. అప్పటికి నా కూతురు చాలా సార్లు నన్ను క్లీన్ చెయ్యమని చెప్పినా, నేను చెయ్యలేదని నాకు బాగా గుర్తు చేసేది.. నేను ఎక్కడో దూరంగా వుద్యోగం చెయ్యడం మూలంగా,  ఇంటి దగ్గర వుండేది మూడు రోజులే. ఆ మూడు రోజుల్లో అన్ని పనుల హడావిడిలో దాని సంగతి పట్టించుకునే తీరిక లేదు. ఒక రోజు నా కూతురు బడి కెళ్ళి ఒచ్చే లోపు AQUARIUM క్లీన్ చేస్తూ నత్తను బయటకు తీస్తే దానిలో చలనం లేదు. దాని గుల్లలో లొల్లి పెట్టకుండా పడుకుందేమో అని తట్టి చూసాను.. అసలు నత్త ఉంటేగా.. ఆ చెత్త మధ్యలో చూసుకోలేదు గానీ, నత్త ఎప్పుడో చచ్చి పోయింది. డొల్లగా వున్న గుల్ల మాత్రమే మిగిలింది. ఇంక మళ్ళీ చచ్చి పోయిన చేపలను తిరిగి తీసుకు ఒచ్చినట్లు నత్తలను తేవడానికి నేను రోజూ ఇంట్లో ఉండను కదా?  అందుకని ఈ నత్త మా డ్రైవ్ వే లో తిరుగుతూ వుంటే అప్పుడు ఒక ఐడియా తట్టి ఈ ఫోటో తీసాను.


 ఆ నత్త మా అమ్మాయికి గుర్తుకు ఒచ్చినప్పుడు ఈ ఫోటో చూపించి నీ నత్త పారిపోయింది అని చెప్తాను. అప్పటి నించి,  మా ఖాళీ AQUARIUM చూసి ఎవరు అడిగినా, "మా చేపలు వాల్మార్ట్ కి వెళ్ళాయి, మా నత్త పారిపోయింది", అని చెప్పడం అలవాటు అయ్యింది. కావాలంటే మా అమ్మాయిని అడగండి.. ఇది నిజం మా నత్త పారిపోయి నాలుగు నెలలు అయ్యింది.

9 కామెంట్‌లు:

  1. నాలుగు నెలల నుంచీ చిన్న పిల్లని మోసం చేస్తున్నారా? ఎలాగోలా కష్టపడి... పారిపోయిన నత్తని వెతికి (!) ఇంటికి తెండి. :(

    రిప్లయితొలగించండి
  2. హ్హహ్హహ్హా!! నేనెప్పుడు ఎక్వేరియం చూసినా మీ అమ్మాయె గుర్తుకొస్తుందండి :)) వాల్మార్ట్కి వెళ్ళి రెస్ట్ తీసుకుంటున్న చేపలు కూడా ;) ఇప్పుడు నత్త ఆచ్చికి వెళ్ళిందన్నమాట :) మీ చేపల పోస్టు చూసక నేను గూగుల్ చేసానండి. అవేవెఓ జాతి చేపలు బాగా కొట్టేసుకుని చచ్చిపొతాయంట. కాని కొన్ని చేపలు బానే గోల హ్చేయకుండా యూజర్ ఫ్రెండ్లీ గా ఉంటాయట. మీరు ఈ సారి అవి ట్రై చేయండి :) పాపం మీ అమ్మాయి ముచ్చటా తీరుతుంది :)

    రిప్లయితొలగించండి
  3. puranapandaphani,
    ఇంకా వెతుకుతూనే ఉన్నానండీ

    రిప్లయితొలగించండి
  4. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  5. ఇందు,
    మా అమ్మాయి కొంచెం పెద్ద అయ్యాక మళ్లీ ట్రై చేస్తా. థ్యాంక్ యూ.

    రిప్లయితొలగించండి