1, ఏప్రిల్ 2012, ఆదివారం

నేను నీకు నచ్చలేదు కదూ?


నన్ను సరిగ్గా చూడు  
నేను నీకు నచ్చలేదు కదూ?..

మరెందుకు నువ్వు నా వెంటే వున్నావు 
మరొక్క సారి ఆలోచించు 

నన్నొదిలే అవకాసం నీకెప్పుడూ నేనిచ్చా 
మరెందుకిలా నిత్యం నా వెంటే?

నీకు నచ్చినట్లు నేను లేనని 
నిరంతరం నన్ను నిలదీస్తావు 

నాకు నచ్చినట్లు నువ్వు లేవని 
నేనెప్పుడైనా నిన్ను నిందిచానా?

నీకు నచ్చేటట్లు నేను మారితే 
నాకు నేనే నచ్చను..

అప్పుడు నేను కూడా నీలాగే 
నిరంతరం నిట్టూరుస్తూ
నిప్పులు చెరుగుతూ వుంటాను 

అందుకే నేను నాలానే వుంటాను 
అప్పుడప్పుడు నీకు నచ్చకున్నా
నాకు నేను ఎప్పుడూ నచ్చుతాను ...

నీకోసం నువ్వు చెప్పినట్లు మారలేను 
నీకు అప్పుడప్పుడు నువ్వు నచ్చకపోయినా
నేను నాకు ఎప్పుడూ నచ్చుతాను

నాతో అప్పుడప్పుడు వుండే నీకోసం
నాతో ఎప్పుడూ వుండే నేను మారలేను

నేను నీకు నచ్చలేదు కదూ?
నిజానికి అది నా సమస్య కాదు..
నీదే?...ముమ్మాటికి... నీదే?......

12 కామెంట్‌లు:

  1. మీ కవిత మాత్రం నచ్చింది :)

    రిప్లయితొలగించండి
  2. మీ కవిత నాకు నచ్చింది.
    మానవ సంబంధాలలో వుండే ప్రధమ లోపాన్ని చక్కగా ఎత్తి చూపారు.

    రిప్లయితొలగించండి
  3. సత్యం పోతంశెట్టి,
    నచ్చినందుకు కృతజ్ఞతలు.

    రిప్లయితొలగించండి
  4. చాలా బాగా చెప్పారు! మనల్ని మనలా ఇష్టపడేవాళ్ళు మనతోనే ఉంటారు అందరి కోసం మారుతూ పోతే మనకే మనం నచ్చం.

    రిప్లయితొలగించండి