మాస్ మసాల సినిమా డైరెక్టర్ బోయపాటి శీను, మాస్ లో మంచి ఫాలోయింగ్ వున్న జూనియర్ NTR తో తీసిన సినిమా దమ్ము. అసలు సినిమా మొదలు ఒక తల నరకడం తో స్టార్ట్ అవుతుంది.. అక్కడి నించీ చివర వరకు ఇంక చూసుకోండి కొడితే కనీసం ఒ పది అడుగులు ఎత్తు యెగిరి నేల మీద పడి బంతిలా పైకి ఎగిరే ఫైట్స్. అక్కడక్కడా విరివిగా రక్తపు జల్లులు, నరికితే చెట్లతో పాటు యెగిరి పడే తలలు, ఇంట్లో పిల్లలు విసిరేసినట్లు విసిరేయబడ్డ కార్లు. కావలసినన్ని మాస్ డయలాగులు, తొడ కొట్టడాలు, అక్కడక్కడా మనం ఊహించే ట్విస్టులు. ఇవి కాక ద్వంద అర్దాల మాటల హీరోయిన్లు, కాలేజీ లో కుర్రాళ్ళ బూతులకు కొంచెం డోసు తక్కువ ఐన పాటలు. వెరసి జూనియర్ NTR ఫాన్స్ కి అన్నీ సమ పాళ్ళలో వున్న సినిమా. ఇలాంటి సినిమా స్టొరీ గురించి పెద్దగా మనం చెప్పుకో నక్కర్లేదు, ఎందుకంటె ఇలాంటి పగ ప్రతీకారం సినిమాలు తెలుగు లో ఎన్నో వున్నాయి.. ఇంకా చెప్పాలంటే ఈ డైరెక్టర్ తీసిన అన్ని సినిమాల లాంటిదే ఇది. కాబట్టి సినిమాలో హై లైట్స్ - డ్రా బాక్స్ చెప్తాను..
హై లైట్స్:
- ఫోటోగ్రఫి
- మాస్ డయలాగులు
- మాస్ పాటలు
- స్క్రీన్ ప్లే
- ఎఫ్ఫెక్ట్స్ అండ్ గ్రాఫిక్స్
- అందాలు విచ్చల విడిగా ఆరబోసిన హీరోఇన్లు
డ్రా బాక్స్:
- హీరో పక్కన సూట్ అవ్వని హీరొయిన్ లు
- మోతాదు ఎక్కువైన హింస
- సెన్సార్ అయ్యిన చాలా డయలాగులు
- పిల్లలతో సహా చూడలేకపోవడం
సినిమాలో జూనియర్ NTR రాజకీయాలలోకి ఒచ్చే ఉద్దేశ్యం వున్నట్లు ఇంట్రో సీన్ లో ఒక డైలాగ్. దానికి తోడు కాంగ్రెస్ మీద కొన్ని పంచులు. ఇలాంటివి కొన్ని అందరికీ రుచించక పోవచ్చు.. త్రిషా వయసు బాగా క్లోజ్ షాట్ లో కనిపిస్తోంది. కార్తిక అంత పెద్ద గ్లామర్ గా అనిపించదు, పైగా బాగా పొడుగు కాబట్టి హీరో పక్కన కొంచెం ఎబ్బెట్టుగా వుంది. ఆద్యంతం కట్టి పడేసిన స్క్రీన్ ప్లే తో అక్కడక్కడా కామెడీ కలిసి, మాస్ డయలాగులు మరియు ఫైట్ ల తో సినిమా బానే అనిపిస్తుంది.
చివరగా ఒక్క ముక్కలో చెప్పాలంటే జూనియర్ NTR ఫాన్స్ కి సరిపడా మాస్ సినిమా.
దమ్ము- మీరు జూనియర్ NTR ఫాన్స్ అయితే దుమ్ము రేపుతుంది.