11, ఏప్రిల్ 2012, బుధవారం

నాన్న ఉత్తరం

మై డార్లింగ్ సిరి,

                     
  ఇప్పుడు నీకు ఆరేళ్ళు. మొదటి ఐదేళ్ళు కంటే చాలా డిఫరెంట్ గా ఈ ఇయర్ అనిపించావు. దానికి ఒక కారణం చెల్లెలు సాహితి అయితే, ఇంకో కారణం నువ్వు బడికి వెళ్ళడం. నువ్వు పెద్ద అయ్యాక ఎప్పుడైనా చిన్నప్పటి విషయాలు అడిగితే అన్నీ నాకు గుర్తులేకపోవచ్చునని  నీకు ఇలా నాన్న ఉత్తరం రాస్తున్నాడు.

ఈ సంవత్సరం నేను దూరంగా పని చెయ్యడం వల్ల నేను ఆఫీసు కి వెళ్ళే ప్రతీ మంగళ వారం నువ్వు వుండిపో మని అడుగుతుంటే నిన్ను బుజ్జగించి ఆఫీసు కెళ్ళడం నాకు కష్టంగా వుండేది. నీకు కావలసినవి అన్నీ కొని పెట్టడానికి డబ్బులు కావాలని నేను దూరంగా పని చేస్తున్నానని చెప్పినప్పుడు మనం కూడా ఐస్ క్రీం షాప్ పెడితే అందరూ మనకి బోలెడు డబ్బులు ఇస్తారని నువ్వు చెప్పినప్పుడు నవ్వు ఒచ్చింది. "నాన్నా! నా దగ్గర డబ్బులు వున్నాయని", నువ్వు పిగ్గీ బ్యాంకు లో డాలర్స్ తీసి నా పర్సు లో  పెట్టి.. 'నువ్వింక ఆఫీసు కి వెళ్ళకర్లేదు" అని చెప్పినప్పుడల్లా ఎంతో ముద్దొచ్చావు.  

నీతో కలిసి చేసిన కాగితపు పడవలు, ఎగరెయ్యలేక పోయిన గాలి పటాలు, ఇంటి నిండా మనం గాల్లోకి విసిరేస్తే కింద పడిన కాగితపు ఏరో ప్లేనులు, వీటన్నిటికి మధ్యలో కాయితాలు తగలేస్తున్నామని మీ అమ్మ కేకలు నాకు చిన్నతనం మళ్ళీ ఒచ్చినట్లు అనిపించాయి.

రాత్రి  పడుకున్నే ముందు నువ్వు అడిగే త్రిమూర్తుల కధలు, ముఖ్యంగా పదే పదే చెప్పమనే  దశావతారాలు నీ పక్కనే పెట్టుకునే "The Little Book of Hindu Deities" పుస్తకం నాకు కూడా హిందూ దేవతలు గురించి తెలుసుకునే అవకాసం కలిపించింది.

నాన్నలాగా నేను కూడా మేజిక్ చేస్తానని చెప్పి ENO టాబ్లెట్ ని గాల్లో అడ్డంగా, నిలువుగా ఊపి, చెయ్యి రౌండ్ తిప్పి, నేల మీద కొట్టి, ఉస్సు.. బుస్సు.. అని శబ్దాలు చేసి, అబ్రకదబ్ర అని మంత్రాలు చదివి గ్లాసు నీళ్ళలో టాబ్లెట్  వేసి పొంగే తెల్లటి బుడగలని చూసి గంతులేసి నాకు కూడా మేజిక్ ఒచ్చిందని అమాయకం గా ఆనందించే నిన్ను చూసి ఎంత మురిసిపోయానో..

మొదటి రోజు స్కూల్ కోసం నువ్వు పడిన ఉత్సాహం ... మొదటి సారి స్కూల్ కెళ్ళి నప్పుడు నీ మొహంలో సంతోషం.. నువ్వు స్కూల్ లో ఎలా అడ్జుస్ట్ అవుతావో అనే నా భయ్యాన్ని మాయం చేసేసాయి.


పడుక్కునే ముందు దుప్పటి రెండు చేతులతో పట్టుకుని మంచం మీద  దూకి పడిపోయాక కప్పేసుకోడం,  కత్తెర తో కాయితాలని పోగులు పోగులుగా కట్ చెయ్యడం, గోడల మీదా రంగు పెన్సిళ్ళతో గీతలు గీయడం, ప్లేట్ చేత్తో పట్టుకుని గరిట తో బాదుతూ మ్యూజిక్ అని చెప్పడం, తెలుగు పాటలు ముద్దు ముద్దు గా పాడడం.. అల్లరి చేస్తున్నావని కోపగించుకుంటే భయం నటించి కళ్ళు ఆర్పి కోపం కరిగేలా చెయ్యడం.

అన్నిటికన్నా ముఖ్యంగా చెల్లిని నువ్వు జాగ్రత్త గా చూసుకునే పద్ధతి (కింద పడుతుందని నిలబడ్డ చోట చుట్టు పక్కల  దిండ్లు పరచడం, నోట్లో ఏది పెట్టుకున్న తీసెయ్యడం, పక్క మీంచి పడిపోకుండా నువ్వు అడ్డుగా వుండడం,  చెల్లిని నవ్వించడానికి నువ్వు చేసే ప్రయత్నాలు చూసి నువ్వు ఎంత పెద్ద పిల్ల ఐపోయావో అని ఆశ్చర్యపోతుంటాను.


అమ్మా నాన్నకి సాయం చేస్తానని ఉల్లి పాయలు వొలవడం, అంట్లు తోముతానని సింక్ లో సబ్బు నీళ్ళ ఆట ఆడుకోవడం,  ఇంటి కొచ్చిన ప్యాకెట్ లని ఓపెన్ చేస్తానని కత్తి పట్టుకుని తిరగడం, మనమంతా ఒక టీం అని గెలుస్తున్నప్పుడు పదే పదే గుర్తు చెయ్యడం నాకు ఎంత సరదా అనిపిస్తాయో..


నీతో కలిసి చూసిన RIO , KUNG FU PANDA , CARS 2 ఎప్పటికీ నాకు గుర్తుంటాయి..


MANY HAPPY RETURNS OF THE DAY ...........
సిరి నవ్వు తో కలకాలం ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని దీవిస్తూ...


నీ నాన్న...

11 కామెంట్‌లు:

  1. నిజ్జంగా ఎంత బాగుందో! మీ అమ్మాయి పెద్దయ్యకా మీకు బొలెడు థాంక్సులు చెప్తుంది ఇంత అందమైన ఉత్తరం తనకోసం రాసినందుకు. బహుశా... ఇదే తను అందుకునే బెస్ట్ లెటర్ అనుకుంటున్నా!! మీ ఇద్దరి ప్రేమ,ఆప్యాయతలు కలకాలం ఇలాగ ఉండాలని కోరుకుంటున్నా....

    హాప్పి హాప్పి బర్త్ డే.... సిరి డియర్!

    రిప్లయితొలగించండి
  2. చాలా బాగుంది. కొన్ని ఉత్తరాల పరిమళం తాజాగా ఉన్నప్పుడు తెలియదు . కాలం గడిచాక తెలుస్తుంది

    రిప్లయితొలగించండి
  3. buddha murali,
    చాలా బాగా చెప్పారు. థాంక్స్.

    రిప్లయితొలగించండి
  4. Chandu,

    I really really understand the love gone into writing it.. it takes us to a different world iisnt it...

    Siri peddayyaaka chadukuni definitegaa murisipotundi.. ippudu matuku naaku kadupu nindipoyindi.

    రిప్లయితొలగించండి
  5. Sree,
    Thank you.. ఇది వరకు ఉత్తరాలు, డైరీ లు రాసేవాళ్ళు, ఇప్పుడు అవేవీ లేవు. చిన్నప్పటి సంగతులు అడిగితే చెప్పడానికి, చూపించ డానికి ఇది ఏమన్నా పనికొస్తుందేమో అని ఆశ.

    రిప్లయితొలగించండి