మా అమ్మాయి లంచ్ బాక్స్ మాకో పెద్ద సమస్యగా తయ్యారయ్యింది. రోజూ పట్టుకెల్లింది పట్టుకెల్లినట్లు వెనక్కి ఒచ్చేస్తుంది. ఒక్కో రోజు అది తినలేదని తెలిసినా మేము ఇంట్లో పెట్టినట్లుగా, వెనకబడి తినిపించమని అంటామేమో అన్న అనుమానంతో కాబోలు వాళ్ళు డబ్బా కడిగేసి పంపుతున్నారు.
పోనీ అది మామూలుగా ఇంటి దగ్గర తినే అన్నము, కూరలతోనో, పప్పుతోనో పెట్టి పంపిందామని అనుకుంటాము. రేపు నీకు నచ్చిన కూర పెట్టనా? అని దాన్ని అడిగితే ఆలోచించకుండానే ఒద్దంటుంది. ఇంతా చేస్తే దీని వయసు నాలుగున్నరే. నేను అయితే తొమ్మిదో తరగతిలో కూడా ఎండి పోయిన పప్పన్నం పెట్టినా సరే, మనసులో తిట్టుకుంటూ తినేసేవాడిని. ఒక్కో సారి అయితే మా అమ్మ తరవాణి అని చెప్పి రాత్రి అన్నంలో పాలు వేసి రెండు ఉల్లిపాయ ముక్కలు వేసి డబ్బాలో తోడు పెట్టి ఇస్తే, పక్కన ఆవకాయ నంచుకుని లంచ్ లో తినేసిన సందర్భాలు నా ఇంటర్మీడియట్ దాకా వున్నాయి. పోనీ నీకు నచ్చినవేంటి అని అడిగితే అది పెద్ద ఆరిందాలా "మీట్ బాల్స్ అనీ, హాట్ డాగ్ అనీ, చికెన్ అనీ" చెప్తూంటుంది. నేనేమో మాంసాహారం వీలైనంత మటుకూ తినకూదడనే నియమం వున్న వాడిని, దానికి అయితే కనీసం గుడ్డు కూడా పడదు. అప్పటికీ దానికోసం మంచురియా ని మీట్ బాల్స్ గానూ, మీల్ మేకర్ ని చికెన్ గానూ, మాంసం లేని హాట్ డాగ్ లనీ ట్రై చేసాము. అవేవీ దానికి రుచించలేదు.
ఇదే విషయం చాలా మంది తల్లులు ప్రస్తావించడం పార్టీ లలో చూసాను. భారత దేశం లో అయితే పరవాలేదు, కానీ విదేశాలలో అయితే, తోటి పిల్లలు వెక్కిరిస్తారని పిల్లలు లంచ్ లో అన్నం పెడితే తినకుండా తెచ్చేస్తారు. పిల్లల దాకా ఎందుకు, చాలా మంది పెద్ద వాళ్ళు వేడి చేసేటప్పుడు మైక్రో-వేవు దగ్గర, డబ్బా డెస్క్ దగ్గర తీసి తినేటప్పుడూ పక్క వాళ్ళు కంపు అంటారని మన కూరలు ఆఫీసు కి పట్టుకెల్లరు. ఎవడో నాలాంటి వాడు అయితే గానీ. నేను అయితే ఆఫీసు లో రెండు పచ్చడులు, రెండు పొడులు పెట్టుకుని మరీ లంచ్ లాగించేవాడిని. ఎవడైనా వెక్కిరిస్తే దీనికోసమేరా ఆ కొలంబస్ గాడు మీ దేశాన్ని కనిపెట్టాడు అని SPICE ల గురించి నైస్ గా క్లాసు పీకేస్తాను. అంత కంటే ఎక్కువ మాట్లాడితే నువ్వు తిన్న SALMON కంపు కన్నా ఇది బెటర్ అని కూడా అంటాను. వీడి నోట్లో నోరు ఎందుకు మనకసలే SPICY పడదు అని ఊరుకుంటారు.
నాకైతే ఒకటి అర్ధం అయ్యింది నా చిన్నప్పటి అలవాటుని బట్టి - ఏదైనా పొడిగా వున్న ఐటెం అయితే బావుంటుంది. మా అమ్మాయికి దోశ అంటే బాగా ఇష్టం- దాన్ని వారానికి రెండు సార్లు పెట్టచ్చు. దాని మధ్యలో ఒక సారి మకరోని పాస్తా (మకారోని) ఇంకోసారి సేమ్య ఉప్మా పెట్టి నడిపిస్తాము. శుక్ర వారం ఎలాగో వాళ్ళు పిజ్జా పెడతారు, మనం డబ్బులు కడితే.
ఇలాంటి సమస్య చాలా మందికి ఒచ్చి వుంటుంది కాబట్టి, మీకు తెలిసిన పొడి ఐటెం లంచ్ కి పంపగలిగేలా వున్నది సలహా ఇస్తే మీ బ్లాగ్గులో కామెంట్ కొట్టి ఋణం తీర్చుకుంటా. మా అమ్మాయి ఉప్మా,ఇడ్లి లు పెద్దగా తినదు. ముఖ్యంగా శాఖాహారం అయ్యుండాలి - లేకపోతే వాళ్ళ నాన్న ఒప్పుకోడు.
9, అక్టోబర్ 2010, శనివారం
8, అక్టోబర్ 2010, శుక్రవారం
క్లిక్ అవ్వని Kaleidoscope
ఎంతో కష్టపడి, విపరీతమైన Inquiry చేసి మా అమ్మాయి నాలుగో పుట్టిన రోజు కోసం Kaleidoscope అమజాన్ లో ఆర్డర్ ఇచ్చా. పైగా దానికి హైప్ సృష్టించి (మా అమ్మాయికి ఇంట్రెస్ట్ కలగడానికి) , అందమైన ప్యాకింగ్ చేయించి మరీ ఇంటికి తెప్పించాను. దీని కోసం నేను చిన్నప్పుడు ఎన్ని పాట్లు పడే వాడినో!. అట్ట ముక్కలు కత్తిరించి, ఎక్కడినించో ఒక గొట్టం సంపాదించి, గాజు ముక్కలు, పూసలు లాంటివి అన్నీ ఏరుకొచ్చి, ఒక వైపు మైదాతో అతికించి.. చచ్చీ చెడీ తయారు చేసుకునేవాళ్ళం. దానిలోంచి ఒక కన్ను మూసి చూసుకుని మరీ మరీ మురిసిపోయి గడిపేసేవాళ్ళం . దానికి పైన అందంగా కనిపించడానికి రంగు రంగుల కాయితాలు అతికించి. దానిని ఒక నావికుడు telescope లాగ మోసుకుని తిరుగుతూ ఉండేవాడిని.
ఇంత కష్టపడి తెప్పించిన kaleidoscope మా అమ్మాయి బాగా ఎంజాయ్ చేస్తుందని అనుకున్నాను. దాని చేతే గిఫ్ట్ wrap చింపించి, Kaleidoscope బయటకు తీయించాను. దానికి పెద్దగా అర్ధం కాలేదు. అందులో చూడమని చెప్పా, అది రెండో కన్ను కూడా తెరిచే చూసింది. ఇలా కాదు అని చెప్పి, ఒక కన్ను నా చేత్తో అడ్డు పెట్టి చూడమని చెప్పా. దానికి పెద్దగా నచ్చినట్లు లేదు. కాసేపు ఆడింది అంతే, ఆ తరవాత పక్కన పడేసింది. నా ప్రాణం ఉస్సూరు మంది. దానికి తోడు అందులో వున్న beads కావాలని పట్టుబట్టి కూర్చుంది. ఇంక ఇది పగలగోట్టేస్తుందని అర్ధమయ్యి, దాని చేతిలోంచి లాగేసుకుని నేను ఆడుకోడం మొదలెట్టా.
ఇదంతా చూసిన మా ఆవిడ "దాని పేరుతో నీ మోజు ఇలా తీర్చుకుంటూ వున్నావు కదూ? నిజం చెప్పు?" అని నిలదీసేటప్పటికి, ఏం చెప్పాలో తెలియని నా మొహం లో Kaleidoscope లో లేని రంగులు కనిపించాయి. ఏం చేస్తాము? ఎలాగో దొరికిపొయాము కదా అని ఒక కన్ను మూసుకుని Kaleidoscope లోకి చూస్తూ మైమరిచిపోయా. నిజం చెప్పద్దూ! పిల్లల ముచ్చట తీర్చే ప్రయత్నంలో అప్పుడప్పుడు మన మోజు కూడా తీరుతుంటే మనకీ బావుంటుంది.
గిఫ్ట్ గా క్లిక్ అవ్వకపోతేనేం, kaleidoscope నాకు వర్క్ అవుట్ అయ్యింది.
7, అక్టోబర్ 2010, గురువారం
నేనింతే అంటే - అంత పొగరా?
నా బ్లాగ్గుకి ఈ టైటిల్ పెట్టాక, నన్ను రక రకాల ప్రశ్నలు వేసారు - టైటిల్ గురించి. అందులో కొన్ని
"నేనింతే" అని రక రకాల expression లతో చెప్పవచ్చు. నా ఉద్దేశం మటుకు నేను నన్ను నేను తెలుసుకునే ప్రయత్నం లో రాసే ఆలోచనలు, కవితలు, అనుభవాలు అన్న మాట.
మనము పుట్టి, బుద్ధి ఎరిగాక మనకు ఎన్నో రకాల సందేహాలు వుంటాయి. చిన్నప్పుడు అన్నీ మనం అర్ధం చేసుకోకపోయినా అమ్మ చెప్పిందనో, నాన్న తిడతాడు అనో, టీచర్ కొడతాడు అనో చేస్తాము. కేవలం భయము, భక్తి లాంటి వాటి వల్ల అన్న మాట. కానీ మన మనసులో దేవుడి గురించి, దెయ్యం గురించి, పూజ గురించి, ఆచారాల గురించి, అలవాట్ల గురించి, సంప్రదాయం గురించీ, అంటరాని తనం గురించీ, చీకటీ గురించీ ఎన్నో అనుమానాలు- భయాలు వుంటాయి. ఆ తరవాత బడి లో చదువుల ప్రవాహం, స్నేహితుల ప్రభావం, పరీక్షలు - ఇవన్నీ పోటీ ప్రపంచంలో మనకి తెలియకుండా గడిచిపోతాయి. మనం ఏమి చేస్తున్నాము, ఎందుకు చేస్తున్నాము అని ఆలోచించం. ఆలోచించినా ఎందుకు చెయ్యాలి అని ఎవ్వరినీ ప్రశ్నించం.
తరవాత వయసు, శారీరక మార్పులు, ఆకర్షణలు, ప్రేమలు, అలవాట్లు, మత్తులు ఇలాంటి కొన్ని అనుభవాల తో యవ్వనం గట్తెకిస్తాము. మనం మనకి గీయబడిన హద్దుల గీతలని మన శక్తి, తెగింపు, అవకాశం బట్టి మనకొచ్చే థ్రిల్ కోసం దాటాలని ప్రయత్నిస్తాం. అప్పుడు మనకు కొన్ని చెడు అనుభవాలు, చెప్పుకోలేని చరిత్రలు, చెడు మిగిల్చిన జ్ఞాపకాలు కొన్ని తీపి గుర్తులతో పాటూ మనసులో ఉండిపోతాయి. తరవాత మన కాళ్ళ మీద మనం నిలబడే ప్రయత్నం జరుగుతుంది. అక్కడ నించీ అప్పటిదాకా ఇంటికి, బడికి పరిమితమైన ప్రపంచం ఒక్క సారిగా విస్తరిస్తుంది. ఇంక గుర్తింపు కోసం తపన నిరంతరంగా సాగుతూ వుంటుంది. ఉద్యోగాలు, ప్రమోషన్, పెళ్లి, ఇల్లు, పిల్లలు, కారు ఇవన్నీ కూడా మనం కోరుకునే వృత్తాలలో ( CIRCLES) ఒకడిగా గుర్తింప బడడానికి చేసే కృషే.
ఆ విధంగా కొన్నేళ్ళు గడిచాక మెదడు తొలుస్తూ వుంటుంది. తిండికి లోటు లేదు, డబ్బుకు లోటు లేదు, వుద్యోగం ఉంది, పెళ్ళాం పిల్లలు వున్నారు అయినా ఏదో అసంతృప్తి అనిపిస్తుంది. మన చుట్టూ వున్న అన్నిట్లోనూ వెలితి అనిపిస్తుంది, అందర్లోనూ సమస్యలే కనిపిస్తాయి. సర్డుకుపోవాలని అర్ధం అవుతుంది. జీవితం ఇంతేనా! అని నిర్లిప్తత.
అలాంటప్పుడు కొంత మంది తనలో తాను చూసుకుంటారు. అసలు నేను ఏమిటి? అనే ప్రశ్న మొదలవుతుంది. అప్పుడు తనని తాను నిజాయితీగా తెలుసుకోవాలి. అంటే తన బలాలు ఏమిటి? బలహీనతలు ఏమిటి? ఏది ముఖ్యం? ఏది ఆనందాన్నిస్తుంది? తన లక్షణాలు ఏమిటి? తను దేనినించి పారిపోతున్నాడు? ఇలా ఆలోచించి "నేనింతే!" అని సంతృప్తి పడాలి.
అంటే తనతో తాను నిజాయితీగా ఉండగలగడం. అలాంటి సంతృప్తి మనిషికి కలిగితే, మనం మనకి ముసుగు వేసుకోడం మానేస్తాము. అంటే మనం తప్పు చేస్తే సమర్ధించం (మన మనసులో) , లోకం కోసం ముసుగు వేసుకున్నా- మన నించి మనం తప్పించుకోము అన్న మాట. ఈ స్టేజి కి రాకపోతే కొంత అలవాట్లకు బానిస అవుతాము.
అల్లాంటి సంతృప్తి తో మొదలు పెట్టాను కాబట్టి "నేనింతే" అని టైటిల్ పెట్టుకున్నాను. మనం మనకి బాగా అర్ధం అయ్యాక, మనకి ప్రపంచం మీద కోపం తగ్గుతుంది. మనకి పక్క మనుషులు కూడా అర్ధం అవుతారు. అదన్న మాట "నేనింతే" అన్న టైటిల్ వెనక కధ.
- పూరీ సినిమా టైటిల్ అని పెట్టావా?
- నువ్వు రవి తేజ అని ఫీలింగా?
- నేనింతే ఏం పీక్కుంటారు అనా?
- పోకిరి టైపు "నేనింతే ఒక్క సారి కమిట్ అయితే నా మాట నేనే వినననా?
- నా ఇష్టం అని చెప్పడానికా?

6, అక్టోబర్ 2010, బుధవారం
నాకు బాగా నచ్చిన పటం
ఎలా ఉంది ఈ పటం. ఇది నేను ఒక సారి భుబనేశ్వర్ వెళ్లి నప్పుడు అక్కడ ఒక exhibition లో కొన్నాను. చూసిన వెంటనే నాకు చాలా బాగా నచ్చింది. ధర కూడా పెద్ద ఎక్కువ కాదు. ఐదు వందలకు మించి పెట్టినట్లు లేను. నేను సాధారణంగా వేలకు వేలు పెట్టి ఆర్ట్ పీసులు కొనే టైపు కాదు. అంటే నాకు కళల పట్ల అభిమానం లేదని కాదు, కొనే కెపాసిటీ లేదనుకోండి. కానీ ఏదైనా అందంగా అనిపించి అందుబాటు ధరలో వుంటే అందుకోడానికి ఆలోచించను. అప్పుడప్పుడు అలా కొన్నవి చాలా ఆనందాన్ని ఇస్తాయి. ఈ ఆర్ట్ పీసు అలాంటిదే. అందుకని నాకు చాలా ఇష్టం.
అనుకోకుండా నాకు అగుపించి - అందుబాటు ధరలో నాకు కొనాలనిపించి నేను కొన్న ఈ పటం బావుంది కదూ?
అనుకోకుండా నాకు అగుపించి - అందుబాటు ధరలో నాకు కొనాలనిపించి నేను కొన్న ఈ పటం బావుంది కదూ?
5, అక్టోబర్ 2010, మంగళవారం
సచ్చినోడు కొట్టకపోతే నేటి. మన నచ్చనా గాడు కంగారూలకి గిట్టెటేసాడు
ఓలమ్మో! ఓల్ నానో! ఏటైపోనాది - ఏటైపోనాది. సచ్చినోడు కంగారూలని ఇరగ బాదీసీగలడని బేగ ఎలిపోచ్చేసినాను. టీవీ పెట్టి చూయీసాను. సచ్చినోడు అంటే అబ్బోఓఒ ... ఒల్లమాలిన పేమ కదేటి మనకి. ఆ గుంటడు కర్రట్టుకు బాదేస్తుంటే, నాకేటి - దేసమే వూగిపోతాది కందా!. మన కిర్కీట్లో సచ్చినోడు రేముడు లాటోడు, ఆడి కాడ ఎన్ని అస్త్రాలు ఉంటె ఏటి లాభం? కావోల్సినప్పుడు బాణం ఒమ్ముల పొదిలో ఇరికట్టీసినట్టు ఆడి అవుటయ్యిపోనాడు. ఎన్ని సేపనార్ధాలు పెట్టి ఏటి నాభం - ఆడు మటుకు ఏటి సేస్తడు.
రేముడు సేయ్యలని పని నచ్చనా గాడు సేసినాడు గదేటి. ఏటంటే! నానేటి సెప్పేది. కర్రట్టుకుని నాను టెట్టు మాచీలో కోచ్చీనానంటే ఇజయం మనదే అని కంగారూలకి గిట్టెటేసాడు. అప్పుడప్పుడు
సచ్చినోడు కొట్టకపోతే నేటి. మన నచ్చనా గాడు కంగారూలని మట్టీసినాడు కదేటి! మన నచ్చన గాడు ఒవులునుకున్తన్నారు - మనోడే. నా కాడనే గూటీ బిళ్ళ నేర్సుకున్నాడు. ఆడు ఆడీసినప్పుడు సూసినార, కిర్కీటు కూడా కర్ర-బిల్లా లాగుంతది కదేటి? మరి ఒంగుని కర్ర -బిల్లా ఆడుతుంటే నడాలు పట్టీవేటి? పట్టీసినాయని కూకున్నాడేటి, కర్ర-బిల్లా కుమ్మీసెనాడు. పాంటింగ్ గాడి ఏటి సేస్తాడు - జానాబెత్తుల కొలిసీస్స్తాడు.
Image taken from http://cricket.rediff.com/
Notice: Written just for fun after watching Laxman. When he gets going, he makes it look like he is playing gilli-danda..not cricket.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)