8, అక్టోబర్ 2010, శుక్రవారం

క్లిక్ అవ్వని Kaleidoscope


ఎంతో కష్టపడి, విపరీతమైన Inquiry  చేసి మా అమ్మాయి నాలుగో పుట్టిన రోజు కోసం  Kaleidoscope అమజాన్ లో ఆర్డర్ ఇచ్చా. పైగా దానికి హైప్ సృష్టించి (మా అమ్మాయికి ఇంట్రెస్ట్ కలగడానికి) , అందమైన ప్యాకింగ్ చేయించి మరీ ఇంటికి తెప్పించాను. దీని కోసం నేను చిన్నప్పుడు ఎన్ని పాట్లు పడే  వాడినో!. అట్ట ముక్కలు కత్తిరించి, ఎక్కడినించో ఒక గొట్టం సంపాదించి, గాజు ముక్కలు, పూసలు లాంటివి అన్నీ ఏరుకొచ్చి, ఒక వైపు మైదాతో అతికించి.. చచ్చీ చెడీ తయారు చేసుకునేవాళ్ళం. దానిలోంచి ఒక కన్ను మూసి చూసుకుని మరీ మరీ మురిసిపోయి గడిపేసేవాళ్ళం . దానికి పైన అందంగా కనిపించడానికి రంగు రంగుల కాయితాలు అతికించి. దానిని ఒక నావికుడు telescope లాగ మోసుకుని తిరుగుతూ ఉండేవాడిని.
ఇంత కష్టపడి తెప్పించిన kaleidoscope మా అమ్మాయి బాగా ఎంజాయ్ చేస్తుందని అనుకున్నాను. దాని చేతే గిఫ్ట్ wrap చింపించి, Kaleidoscope బయటకు తీయించాను. దానికి పెద్దగా అర్ధం కాలేదు. అందులో చూడమని చెప్పా, అది రెండో కన్ను కూడా తెరిచే చూసింది. ఇలా కాదు అని చెప్పి, ఒక కన్ను నా చేత్తో అడ్డు పెట్టి చూడమని చెప్పా. దానికి పెద్దగా నచ్చినట్లు లేదు. కాసేపు ఆడింది అంతే, ఆ తరవాత పక్కన పడేసింది. నా ప్రాణం ఉస్సూరు మంది. దానికి తోడు అందులో వున్న beads కావాలని పట్టుబట్టి కూర్చుంది. ఇంక ఇది పగలగోట్టేస్తుందని అర్ధమయ్యి, దాని చేతిలోంచి లాగేసుకుని నేను ఆడుకోడం మొదలెట్టా.
ఇదంతా చూసిన మా ఆవిడ "దాని పేరుతో నీ మోజు ఇలా తీర్చుకుంటూ వున్నావు కదూ? నిజం చెప్పు?" అని నిలదీసేటప్పటికి, ఏం చెప్పాలో తెలియని నా మొహం లో Kaleidoscope లో లేని రంగులు కనిపించాయి. ఏం చేస్తాము? ఎలాగో దొరికిపొయాము కదా అని ఒక కన్ను మూసుకుని Kaleidoscope లోకి చూస్తూ మైమరిచిపోయా. నిజం చెప్పద్దూ! పిల్లల ముచ్చట తీర్చే ప్రయత్నంలో అప్పుడప్పుడు మన మోజు కూడా తీరుతుంటే మనకీ బావుంటుంది.

 గిఫ్ట్ గా క్లిక్ అవ్వకపోతేనేం, kaleidoscope నాకు వర్క్ అవుట్ అయ్యింది.

6 కామెంట్‌లు:

  1. naaku chaala korika okati konukkovaalani.. ippati daaka padaledu.. nijam kada naakeppatinincho aadukovaalanukunna enno bommalu pandu gaadi peruto nenu konesukuntunna kada :).

    రిప్లయితొలగించండి
  2. sree,
    Very good. My daughter is not much interested in Aeroplanes, Helicopters and cars. Kaani daani perutho nenu pandaga chesukuntaa, appudappud konukkuni.

    రిప్లయితొలగించండి
  3. సారీ! నేను ఈ పోస్ట్ ఇప్పుడే చదివాను. మీరు సరె...మీ అమ్మయికోసం కొని అయినా మీ మోజు తీర్చుకుంటున్నారు....నేను చందు కి గిఫ్ట్ అని చెప్పి టెడ్డీలు,చిన్న చిన్న బొమ్మలు...ఆడుకునేవి కొనేస్తూ ఉంటా...చందుకీ తెలుసు నా సంగతి....అందుకే నవ్వి ఊరుకుంటాడు :) ఇక రేపు మాకు పాపో,బాబో పుడితే...అప్పుడూ వాళ్ళకి కొన్నట్టే కొని నేను ఆడేసుకుంటా :))

    రిప్లయితొలగించండి
  4. ఇందు,
    ఇది బావుంది. పిల్లల పేరు చెప్పి మీరు మీ చిన్నప్పటి కోరికలన్నీ తీర్చేస్కోవచ్చు ఎంచక్కా. నా లాగా.

    రిప్లయితొలగించండి