సమాధానం తెలియని సమస్యలని లోతుగా పరిశీలించే ప్రయత్నంలో, ఎదగని నా ఆలోచన విధానం కొన్ని ప్రశ్నలని అర్ధంగా మిగిల్చేసిన తరుణంలో, ఒక సినిమా నా ఆలోచనలని ఆగిపోయిన చోట నుంచి సాగేలా చేసిందంటే దానికి కారణం కింద dialogues. అలాంటి సినిమా ఈ ప్రస్థానం. ఇటువంటి అద్భుతమైన సినిమా తీసినందుకు దేవే కట్టా గారికి అభినందనలు.
స్వార్ధమే మనిషి అసలు లక్షణం నిస్వార్ధం దాన్ని కాచే కవచం.
ఒక సారి ఆ పురాణాలు దాటి వొచ్చి చూడు, అవసరాల కోసం అడ్డదారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు, విలన్లు లేరీ నాటకంలో.
ఆశ ముసిరినప్పుడు ఆలోచన మసకబారుతుంది, నీతీ నిజాయితీలు కొలిమిలో కొవ్వోత్తులా కరిగిపోతాయి.
మనిషి ఏడవాల్సింది పోటీలో ఓడినప్పుడు కాదు, మనిషిగా ఓడినప్పుడు.
చీకట్లో ఆకాశాన్ని చూస్తే భయమేస్తోంది తాతా. ఎన్ని నక్షత్రాలు ఉన్నా ఆ చీకటే గెలిచిపోతుంది.
చీకటీ ఆరిపోయిన నిప్పే బాబయ్యా. మనిషి కూడా నేల మీద రాలిన దగ్గరనించి సచ్చేదాకా నిప్పులా మండుతూనే ఉంటాడు. ఆకలితో మండుతాడు, కోపంతో మండుతాడు, కోరికతో - ఈర్షతో మండుతూనే వెలుగుతాడు. ఆ మంటల్లో కొందరు ముట్టుకున్న వస్తువునల్లా తగలపెడుతూ మండే సుడిగుండాల్ల ఎదుగుతారు. ఇంకొందరు అదే మంటతో జ్ఞానాన్ని వెతుక్కుంటూ లోకానికి దారి చూపే దీపాల్లా ఎదుగుతారు.
yes...diologues superb..annitikanna last scene
రిప్లయితొలగించండిreally touching.. I agree with Hero...konni nijalu telusukovadam kanna abaddalugu migiletene nayam anipistundi..chusina rendu rojula varaku nannu ventadutune undi ee movie..!
Nenu monna tvlo vacchinappudu miss kottaa... but it is one of my to watch list movies... will surely check it out.
రిప్లయితొలగించండిSree garu,
రిప్లయితొలగించండిIdi thappaka choodalsina movie. Nenu yenno saarlu choosaanu. Chaala depth vunna movie.
Chandu