25, అక్టోబర్ 2011, మంగళవారం

నేను ఒక్క సారి కమిట్ అయితే....తీర్ధానికే కాదు .. కిస్స్మిస్సులకీ లొంగను తెలుసా...

"అసలు అందరూ గుడికి ఎందుకు వెళ్తారు?" 
"ఇంకెందుకు, దైవ దర్సనం కోసము" అని అందరూ అనుకుంటారు కదూ.. అక్కడే మనకో చిక్కు ఒచ్చి పడింది. "చిన్నప్పుడు అమ్మతో పాటు విద్యా నగర్లో రామాలయానికి ఎందుకెళ్లాను?"
"అక్కడ చెప్పే హరి కధ నచ్చి" .. అని చెప్పాలని తెలుసు.. కానీ మనం వెళ్ళింది సెనగల కోసం కదా.. 
"కుర్ర వయసులో బిర్లా మందిర్ కి ఎందుకు వెళ్లానంటే యేమని చెప్పను.. ఆ పాల రాతి మందిరంలో దేవుడిని దర్సిన్చుకున్దామని".. అనవచ్చు.. కానీ అక్కడకి ఒచ్చే జన్తలబలకిషల (అందమైన అమ్మాయిల) కోసం కదా..
ఇలా నిజాయితీగా అంటే ఎవరూరుకుంటారు..ఇదంతా ఎందుకంటారా...
చెప్తాను...
నేను కొత్త గా పని చేస్తున్న (కొత్తగా అంటే ఒక సంవత్సరం అయ్యుంటుంది) ఆఫీసు పక్కనే, శివ-విష్ణు టెంపుల్ అని ఒక మంచి గుడి వుంది. పక్కనే గుడి అంటే మనకు ప్రసాదం ఆకలేస్తుంది కదా. అప్పుడప్పుడు అలా గుడి కెళ్ళి కాంటీన్ లో పులిహోర, దోస, ఇడ్లి లాంటివి కుమ్మేయచ్చు అన్న ఐడియా బుర్రలో తట్టినా, కేవలం ప్రసాదం కోసమే గుడికి వెళ్తామని ఎవరికైనా తెలిసిపోతే, ఎంత అప్రదిష్ట.. అనుకుని.. సరే ఒకటి రెండు సార్లు పండగ పేరు చెప్పి గుడికి వెళ్ళినట్లు కలర్ ఇచ్చి, గుడికి వెళ్ళా. మన FATE కి కష్టపడి గుడికెల్లిన భాగ్యానికి,  మనకి భక్తులు వొండుకుని తలో స్పూను అన్నట్లు పెట్టిన రవ్వ కేసరి లాంటి రెండు చంచాల ప్రసాదం దక్కింది గానీ, గుడి DINING హాల్ లో కుమ్మేసే అవకాసం కరుణించలేదు. ఏమి చేస్తాము? దైవానుగ్రహం లేదని మిగిలిన భక్తుల గుంపులో కలిసి కొంత తీర్దం మరియు కిస్స్మిస్స్ (అదే నండి మరి సటగోపం పెట్టాక ఇచ్చేది అదేగా) తిని అర్ధాకలితో బయట కొచ్చి  పిజ్జాలో బర్గారో తినాల్సి ఒచ్చింది. మన మేమో ఇక్కడ వుండేది సోమ నించి గురువారం దాకానే. గుళ్ళో DINING హాల్ పండగ పూటే ఓపెన్ అట. మన అదృష్టం కొద్దీ పండగ ఒచ్చినా అది శుక్ర, శని, ఆది వారాల్లో రావడం.. ఒక వేళ మిగిలిన రోజుల్లో ఒచ్చినా, అప్పుడు ఆఫీసు నించి బయటకు ఒచ్చే టైం కి లేట్ ఐపోడం.. వెరసి మనకి ఆ ప్రసాద భాగ్యం కలగలేదు. 
మన అదృష్టం పండి, మొన్న దసరాకి నా పంట కూడా పండి గుళ్ళో DINING హాల్ తెరిచుంది.. ఇదే సందు అని ఒక పులిహోర, ఒక లెమన్ రైస్, ఒక పెరుగన్నం, ఒక చక్ర పొంగలి ప్లస్ రెండు MIXTURE పొట్లాలు తీసుకుని.. పనిలో పని ఒక నమస్కారం పెట్టేసి అట్నుంచి అటే కార్ లో మెక్కేసి.. "ఊసరవెల్లి... హిట్ సినిమా" అనుకుంటూ చెక్కేసా.. ఆ ఊసరవెల్లి MIXED టాక్ తో అంత హిట్టు కాకపోయినా.. మనం అన్నీ తినగా మిగిలిన  MIXTURE పొట్లాలు ఇంట్లోను, ఆఫీసు లో ను సూపర్ హిట్ అయ్యి కూర్చున్నాయి. అక్కడే మొదలియ్యింది చిక్కు. ఊసరవెల్లి లాంటి రివ్యూ దీనికి కూడా ఒచ్చుంటే, నాకీ పరిస్థితి ఒచ్చేది కాదు. MIXED రివ్యూ ఒచ్చిన MIXTURE మళ్ళీ తేవాల్సిన అవసరం వుండేది కాదు. కుదిరినప్పుడల్లా ఆ MIXTURE మళ్ళీ తీసుకురమ్మని రీమైన్డర్లు...

 మళ్ళీ పండగ  రోజుల్లో తెరిచే DINING హాల్ కోసం ఎదురు చూసి చూసి, ఒక రోజు టైం చేసుకుని గుడికి వెళ్ళా.. మరీ గుళ్ళో ఎంట్రన్సు లోనే వుండే DINING హాలులోకి వెళితే, అసలే ఖాళీగా వున్నప్పుడు జనాలు వీడు భక్తికి కాదు భుక్తికి ఒచ్చాడని పసి గట్టేస్తారని..ఆ పైన భుక్తులకు మార్గము అని DINING  హాలు ముందు బోర్డు పెడతారని బయమేసి.. ఆ హాలు వైపు ఒక కన్నేసి, పరమ భక్తుడిలా దర్సనానికి వెళ్లాను. అదే టైం లో ఒక నలుగురికి సటగోపం పెడుతున్న పూజారి ని చూసి ముందు తల, దాని వెనక చేతులు చాపాను.. సటగోపం మరియు ప్రసాదం అని అర్ధం అయ్యేలా...మొహంలో లేని భక్తీ రసాన్ని కొంచెం తెప్పించి మరీ.. మన సంగతి తెలిసినట్లు ఆయన కూడా కొంచెం వెయిట్ చెయ్యి వీళ్ళ తర్వాత నీ టర్న్ అని కళ్ళతోటే కమ్యునికేట్ చేసి అభిషేకానికి లోపలికేళ్లారు. పది కిస్స్మిస్సులకి పావుగంట అభిషేకం అయ్యే వరకు వేచి వుండే ఓపిక వుంటే మనం ఇలా ఎందుకు ఉంటాము అని అక్కడినించి తప్పించుకుని, DINING హాలు ముందుకి ఒచ్చా.. అక్కడ చూస్తే మన కొరకు ద్వారము తెరవకనే వున్నది... హత విధీ.. విధి ఎంత బలీయమైనది.. అనుకుని..  సరే కాసేపు ప్రదక్షిణం చేసినట్లు నటించి ... ఆ మార్గమున యెవరేని  అరుదెంచినచో.. క్రీగంట గమనించి ..సాగెదమని.. ప్రదక్షిణాలు మొదలు పెట్టా....ఒక వేళ ఎవరూ రాకున్నచో..  అక్కడ VOLUNTEER ని మాటల్లో పెట్టి DINING హాలు కధా-కమామీషు కనుక్కుని  పోదామని తిరుగుతున్నాను.

అప్పుడే జరిగింది అనుకోని సంఘటన.. భక్తి పారవశ్యం నటిస్తూ ప్రదక్షిణం చేస్తున్న నన్ను ఒక ముసలావిడ ఆపి.. "బాబూ! ఏం చేస్తున్నావు?" అని బిగ్గరగా ప్రశ్నించింది.
ఇది కూడా తెలియదా? అన్నట్లు భక్తితో సగం మూసుకుపోయిన (నటనలో) కన్నులతో "ప్రదక్షిణం" అన్నాను.. "ఇటునుంచి కాదు బాబూ. అటు నుంచి చెయ్యాలి ప్రదక్షిణం" అని ఆవిడ అరచిన అరుపుకి గుడిలో చెదురు ముదురుగా వున్న జనాలంతా... రోడ్డు మీద ఆక్సిడెంట్ అయితే బండి ఆపేసి చూసే డ్రైవర్ లలా, తమ తమ పనులు ఆపేసి గుళ్ళో ప్రదక్షిణము ఎలా చెయ్యాలో తెలియని ఈ భుక్తి రామదాసు ని చూడడానికి నా వైపు రావడం మొదలెట్టారు..
ఆ దెబ్బకి గుళ్ళో ప్రసాదం మాట దేవుడెరుగు... ఆ రౌండ్ తో ప్రదక్షిణం ఆపేసి బయటకు పరుగు పెట్టాను..
బుద్ధి ఒచ్చింది... ప్రసాదం కోసం గుడి కెళ్ళినోడు ప్రదక్షిణాలు చేస్తే ఇలాగే వుంటుంది అని.. ఆ ఆవేశంలో ఒక నిర్ణయం తీసుకున్నాను..ఈ సారి గుడి కెళ్ళినా ధైర్యంగా.. తిన్నగా DINING హాలుకే వెళ్ళాలని... నేను ఒక్క సారి కమిట్ అయితే... తీర్ధానికే కాదు .. కిస్స్మిస్సులకీ లొంగను తెలుసా...
గమనిక: భక్తులు నా మీద కారాలు మిరియాలు నూరవద్దని మనవి....

7 కామెంట్‌లు:

  1. శ్రీఘ్రమే ప్రసాదం ప్రాప్తి రస్తు!!!

    రిప్లయితొలగించండి
  2. శ్రీఘ్రమే ప్రసాదం ప్రాప్తి రస్తు!!!

    రిప్లయితొలగించండి
  3. హ హ హ. మీ పొస్టు అదిరిపోయింది మాస్టారూ.
    అందుకే నేను ఆ గుడికి ఎప్పుడు వెళ్ళినా గ్రౌండ్ ఫ్లొర్ ఎంట్రన్స్ మాత్రమే వాడతాను. ;)
    నేను ఒకసారి ఆ గుడి లోనే లేడీస్ డాన్స్ ప్రోగ్రాం గ్రౌండ్ ఫ్లొర్ లో చూసి అక్కడే లోపల ఒక మూల బఫే చూసి, అందరికీ ఫ్రీ అనుకుని బాటింగ్ చెయ్యడం మొదలు పెట్టా. నా దగ్గరికి ఒక ముసలాడు వచ్చి "ఈ భోజనం నీకు కాదు బాబూ, ఇది ప్రోగ్రాం ఆర్గనైజర్లకు మాత్రమే" అని మరీ బిగ్గరగా అరిచే సరికి అందరూ తింటం ఆపి నా వైపు ఒక చూపు చూసారు. హా హతవిధీ...;(

    రిప్లయితొలగించండి
  4. భుక్తి రామదాసు :)

    బాగుంది బాగుంది.

    @ చాతకం,

    LOL.

    రిప్లయితొలగించండి
  5. కృష్ణప్రియ,
    థ్యాంక్ యూ.

    రిప్లయితొలగించండి