లేత బుగ్గల లేలేత ఆలోచనల ప్రాయం - బాల్యం
పారేసుకున్న పలక
దొరకలేదన్న ఉక్రోషం
బడికి వెళ్ళడానికి మనసొప్పక
కడుపు నొప్పని మారాం చేసే ప్రాయం - బాల్యం
కల్మష మైన ఆలోచనలు
వంచనల వలల ఆనవాళ్ళు
అస్సలు ఎరుగని ప్రాయం - బాల్యం
కమ్మనైన పాలు
అమ్మ గోరు ముద్దలు
ఎత్తుకుని చేసే గారాలు
ఏడుపుతో చేసే మారాలు - బాల్యం
అడుగులు ఎన్ని వేసినా
అందుబాటులో అమ్మ ఉందనే ధైర్యం - బాల్యం
పిడుగుపడిన అలజడికి
అమ్మ కౌగిలి అభయం - బాల్యం
28, సెప్టెంబర్ 2010, మంగళవారం
విలన్ - నాకు నచ్చాడు
మొన్న టీవీ లో వేసిన విలన్ రికార్డు చేసుకుని ఈ రోజు చూసా. చూసినంత సేపు ఒకటే బాధ. డబ్బింగు పరమ ఛండాలంగా ఉంది. ముఖ్యంగా ఆ తమిళ పైత్యం కి మన వాళ్ళు డబ్బింగ్ లో అస్సలు న్యాయం చెయ్యరు. ఈ సారి మణి రత్నాన్ని పట్టుకుని, బాబూ కావాలంటే నేనే ఏదో తంటాలు పడి రాయిస్తాను కానీ ఎలా పడితే అలా డబ్బింగ్ చేయించకు అని చెప్పాలని అనిపిస్తుంది. దొరికితే చెప్తా కూడా.
ఆ రోజుల్లో మౌన రాగం, నాయకుడు, ఘర్షణ లాంటివాటికి నడిచిపోయింది. ఎందుకంటే అప్పట్లో తెలుగు సినిమాలు అంత వైవిధ్యంగా ఉండేవి కావు, దానికి తోడు సాంకేతిక విలువల కోసం సినిమా ఎలా వున్నా సరే చూసే ఓపిక వుండేది. పైగా కొంత మైల్డ్ గా వుంటే తమిళ పైత్యం ఎలాగో నడిపించచ్చు. మరీ ఇలాంటి తమిళ ఆవేశమున్న సినిమా డబ్బింగ్ బాలేకపోతే సినిమా దొబ్బింగే. ఇక పోతీ గీతాంజలి మన తెలుగు సినిమా కాబట్టి దానికి డబ్బింగ్ జబ్బు లేదు. అంజలి మరీ స్లో సినిమా - పైగా పిల్లలు లొల్లి, climax మన వాళ్ళు విషాదాలు అసలు ఒప్పుకోరు కాబట్టి నడవేదు. దళపతి లో తమిళ ఆవేశం కొంచెం ఎక్కువున్నా ఇదీ విలన్ మాదిరి (ఈ మేటర్ మళ్ళీ చర్చిద్దాం) కాబట్టి ఆడలేదు. రోజా - రెహమాన్ సంగీతం మరియు అద్భుతమైన సినిమాటోగ్రఫీ తో ఆదరగోట్టింది కాబట్టి బంపర్ హిట్టు అయ్యింది. మధ్యలో దొంగా దొంగా మణి రత్నమే అంత సీరియస్ గా తీసుకోలేదు - కాబట్టి జనాలు కూడా పట్టించుకోలేదు. బొంబాయి సినిమా controversy మీద నెట్టుకొచ్చింది. అక్కడనించి మొదలు మణి రత్నం సినిమా డబ్బింగ్ కష్టాలు.
అప్పటికి మన తెలుగు సినిమాలు కూడా మంచి సాంకేతిక విలువలు, కధ, కధనం తో ఆకట్టుకోవడం మొదలుపెట్టాయి. అందుకని ఇద్దరు,ప్రేమతో,సఖి అంతగా ఆకట్టుకోలేదు. తెలుగు జనాలు రామ్ గోపాల్ వర్మ -శివ,క్షణం క్షణం లాంటి సినిమాలు. కృష్ణ వంశి -గులాబి, నిన్నే పెళ్ళాడుతా లాంటి సినిమాలు. పూరీ జగన్నాధ్ - బద్రి సినిమా చూసి కేవలం సాంకేతిక విలువలకోసం డబ్బింగ్ సినిమా భరించక్కర్లేదు అనే స్థితికి వొచ్చినట్లున్నారు. ఆ తరవాతనించి సాంకేతిక విలువలు బావున్న సినిమాలు మన తెలుగులో కూడా బోలెడు ఒచ్చి వున్నాయి. పైగా టాలెంట్ కూడా విపరీతం గా పెరిగింది, budget గురించి మన నిర్మాతలు కూడా ఆలోచించట్లేదు.
ఆ తర్వాత అమృత సినిమా ఒచ్చింది. ఇది అయితే అసలు సింహళీ గొడవ తెలుగోడికి తెలియనే తెలీదు, దానికి తోడు డబ్బింగ్ ఇబ్బంది డైలాగ్ వరకే తట్టుకోలేమంటే, ఇందులో కవిత్వం కూడాను. ఈ డోసుకి పూర్తిగా బోల్తా కొట్టింది సినిమా. ఏమైందో ఏమిటో మణికి, ఆ తరవాత పూర్తిగా బాలీవుడ్ సినిమాలు తీస్తూ సమాంతరంగా తమిళ్ లో అదే సినిమా లాగించేస్తున్నాడు. ఎలాగో చెత్త డబ్బింగ్ తక్కువ ఖర్చులో తెలుగులోకి తోసేసి యువ, గురు సినిమాలు మన నెత్తిన పడేసారు.
ఇంక లేటెస్ట్ గా విలన్. అసలు భారతం, రామాయణం లాంటి కధలు మళ్ళీ చెప్తున్నాను అని చెప్పి సినిమా చూపించడం పెద్ద తప్పు. ఎందుకంటే, అక్కడే సినిమా పట్ల ఒక రక మైన ఎలా తీస్తాడో అనే అనుమానం తో చూస్తారు, దానికి తోడు చూసినంత సేపు మనకి తెలిసున్నదాన్ని అవతల వాడు చెప్తే మనలోని మనిషి (అదే నండీ అంతరాత్మ) "ఒరేయ్! నువ్వు దీన్ని అంత తొందరగా ఒప్పుకోకూడదు" అని మనకి పదే పదే గుర్తు చేస్తూ వుంటుంది.
అప్పటికీ నాలాంటి సినిమా పిచ్చోడు, మణి రత్నం మీద మౌన రాగం నించి పెంచుకున్న అభిమానం, నాయకుడితో పెంచుకున్న ఆరాధన, గీతాంజలి తో పెంచుకున్న గౌరవం కొద్దీ సినిమా చూసి ఎలాగోలా బావుందని నలుగురికి చెప్పి నాలుగు ఆటలు ఆడిద్దామంటే- ఎక్కడా? అసలే మణి రత్నం సినిమా పాటల్లో సాహిత్యం బావుండదు, అరవ ఆవేశం - సాంబారు డైలాగ్ లు ఇంకేం చేస్తాం..
అలా అని అంత బాడ్ గా లేదు విలన్ సినిమా. climax నాకు నచ్చింది. ఐస్ అయితే "అబ్బో! ఎందుకు లెండి".
మొత్తానికి నాకు సినిమా మణి రత్నం రేంజ్ కాకపోయినా climax లో మాత్రం విలన్ - నాకు నచ్చాడు.
Image taken from http://3.bp.blogspot.com/

26, సెప్టెంబర్ 2010, ఆదివారం
బొమ్మ పడితే రెప్ప పడదు - సినిమా pause లో పెట్టు piss కొట్టి ఒస్తా
పొదిగిన గుడ్డు పిల్ల ఐనప్పుడు కోడికి, ఎదిగిన కొడుకు ప్రయోజకుడైనప్పుడు తండ్రికి కలిగే ఆనందం లాంటి
పుత్రోత్సాహం అని ఒకటి వుంటుంది కదా. ఇది ఎక్కడో విన్నట్లుంది కదూ! నిజమే, మీ బుర్ర ఇంకా తెలుగు సినిమాలు అంతగా మర్చిపోలేదు. ఇది "నువ్వు నాకు నచ్చావు" లో వెంకటేష్ డైలాగ్. అయితే ఇక్కడ చిన్న తేడా. నా విషయంలో అది పుత్రికోత్సాహం అని మార్చుకోవాలనుకోండి. అలాంటి సందర్భాలు కొన్ని మనకు పిల్లల చిన్నప్పుడు ఒస్తాయి కదా. అల్లాంటి ఒక సందర్భం గురించే ఈ బ్లాగు.
ఈ మధ్య నా కూతురు దానికిష్టమైన యానిమేషన్ సినిమా చూస్తుంటే, "నాన్నా! సినిమా pause లో పెట్టు, piss కొట్టి ఒస్తా" అంది. మా ఆవిడ ఒకటే నవ్వు. ఆ నవ్వు చివరలో నాకేసి ఒక రకమైన నాసిరకం చూపు. ఎలాంటి చూపు అంటే - మనం బోలెడు డబ్బులు కొనుక్కుని విమానం ఎక్కి కొంచెం స్టైల్ కొడుతుంటే, మన పక్కనే spicejet వాడి ఆఫర్ లో వందరూపాయలు పెట్టి (రూపాయి చిల్లర తిరిగి తీసుకుని మరీ) టికెట్ కొని వాడు మన పక్క సీట్ లో కాళ్ళు పైకి పెట్టి కూర్చుంటే ఎలా చూస్తాము. అలాంటి చూపు అన్న మాట. ఇంకా అర్ధం కాలేదు కదా, మన క్లాసు పక్కన ఈ మాస్ ఏంటి అనే ఫీలింగ్ తో చూసే చూపు అన్న మాట. ఇంతసేపు చూపు గురించి చెప్పావు, ఇంక మేటర్ లోకి వెళ్ళకపోతే నీ అంతు చూస్తా అని మీరు అనుకునే లోపు నేను కొంచం నా గురించి మరి కొంచెం మా ఆవిడ గురించి చెప్పాలి.
ఈవిడ నన్ను చేసుకునే (అంటే ఏమిటి నువ్వు చేసుకోలేదా ఈవిడని అని అడక్కుండా వినండి.. అదే చదవండి) రోజులకి ఈవిడకి తెలుగు సినిమాలు తెగ చూసే వాళ్ళమీద అంత మంచి అభిప్రాయం వున్నట్లు లేదు. నాకు పెళ్ళైన కొత్తలో ఒక సారి మా ఆవిడని సినిమాకి తీసుకేళ్తానంటే, "అబ్బ! నేను రెండో ఆటకి రాను, నిద్ర చెడిపోతుంది" అంది. నాకు అస్సలు అర్ధం కాలేదు. అసలు మనం శివ రాత్రి అయితే రాత్రి అంతా సినిమాలు వేస్తారు కదా అని చూసే బాపతు. అమెరికాలో సినిమాకి మొగుడు తీసుకు వెళ్ళట్లేదు అని బాధపడే భార్యలని చూసిన నాకు, ఇది అనుకోని షాకు. పైగా ఎన్నో చోట్ల సినిమా హాలులో తెలుగు సినిమా చూసే అవకాశం అరుదు ఈ అమెరికాలో. ఒక వేళ వున్నా, టికెట్ ధర మరియు దూర భారం లాంటి వంకలతో చాలా మంది చూడరు. ఇందులోంచి తేరుకుంటున్న రోజుల్లో, మా ఆవిడ ఒక సారి "అంత కక్కుర్తిగా తెలుగు సినిమా చూడడం ఎందుకు" అనే మాట ఎవరితోనో అంటూంటే విన్నాను. అంటే మా ఆవిడ కొంచం తెలుగు సినిమా అంటే తక్కువగా చూసే టైపు అని అర్ధం అయ్యింది.
నా గురించి చెప్పాలంటే, నేను చదువుకునే రోజుల్లో నోట్ బుక్ పట్టుకుని బయటకు వెళుతుంటే మా ఇంట్లో అందరూ "ఇవ్వాళ్ళ ఏ సినిమాకో?" అని కామెంట్ కొడితే, వాళ్ళు గుర్తు చేసినందుకు తప్పకుండా సినిమాకి వెళ్లే టైపు. అసలు రోజుకొక సినిమా చూస్తే గాని నిద్ర పట్టని కజిన్ ఒకడున్నాడు నాకు. వీడూ నేను కలిసి ఎంసెట్ కోచింగ్ జాయిన్ చేస్తే, అది నచ్చక - రోజుకు రెండు సినిమాలు చూసి ఇంటికి వోచ్చేవాళ్ళం. మాతోపాటు కోచింగ్ లో వున్న మిగిలిన కజిన్ గాడు అక్కడ క్లాసు లో, ఇక్కడ ఇంట్లో ఎలాగోలా మేనేజ్ చేసేవాడు, ఎందుకంటే వాడు బుద్ధిమంతుడు అని బ్రాండ్ వేయబడ్డ వాడు. మనం చదువుకునే రోజుల్లో అలా సినిమా చూసిన బేవార్స్ బాపతు అన్నమాట.
ఆ తర్వాత కాలం కలిసిరాక మనం సినిమాలు చూడడం తగ్గిపోయి, మెల్లగా రోజుకొక సినిమాతో సరిపెట్టుకుని ఏదో వుద్యోగం చేస్తూ గడిపేసేవాడిని. పెళ్లి ఐన తరవాత, సినిమా చూసేటప్పుడు మా ఆవిడ పక్క నించి వేసే కామెంట్ తట్టుకోలేక ఒక్కో సారి ఇద్దరి మధ్యా యుద్ధం అయిపోయేది. "వాడెవడి సినిమా మీదో మనం కామెంట్ చేస్తే వీడికేంటి మంట" అని మొదట్లో మా ఆవిడకి అర్ధం కాలేదు. మెల్లిగా తెలుసుకుంది, ఇదొక కుల పిచ్చి, మత పిచ్చి, పార్టీ పిచ్చి టైపు లో సినిమా పిచ్చి అని.
అల్లా కామెంట్ కొట్టేసే మనిషిని మార్చకుండా వుంటే మన జీవితం ఎలా? అందుకని మెల్లిగా మా ఆవిడ బుర్రలో సినిమా అంటే వెర్రి కాకపోయినా, కనీసం చూసేవాడు పిచ్చోడు కాదు అనే అభిప్రాయం కలిగించే ప్రయత్నం అప్పుడే మొదలెట్టేసా. కొద్ది కొద్ది గా సినిమాల పట్ల hype తీసుకురావడం, సినిమా ముచ్చట్లు, తీయడానికి పడే కష్టాలు లాంటి వాటి మీద TV9 వాడు రోజూ పొద్దున్న పెట్టే కార్యక్రమాల లాంటివి తరచూ పెట్టడం. నాలాంటి కొందరు సినిమా పిచ్చోలని పోగేసి వందల మైళ్ళు కారు వేసుకుని సినిమాకెళ్ళడం, వగైరాలు చేసి కొంచెం మా ఆవిడని సినిమా చూసే హాబీ లోకి తీసుకొచ్చాను. అప్పుడే సినిమాలో ట్విస్ట్ లాగ నా జీవితంలో ఒక ట్విస్ట్ - నా కూతురు పుట్టింది.
అక్కడి నించి చిన్న పిల్లను తీసుకుని సినిమా హాల్ కేంటి? అని రెండేళ్ళు సినిమా లేకుండా గడిచింది. ఆ తరవాత ధైర్యం చేసి నా కూతురితో సినిమా కెళ్తే నా కూతురు మొదటి సారి ఆ సౌండ్ కి ఒకటే ఏడుపు. ఐన మనం వదలుతామా, ఏంటి? ప్రతీ ఆరు నెలలకి ఒక trial వేసి చూసేవాడిని. మన పరిస్థితి, హాల్లో తక్కువ బయట ఎక్కువ. మరి కష్ట పడి సినిమా అలవాటు చేసి మనం చూడనివ్వక పోతే మా ఆవిడ ఊరుకుంటుందా, అందుకని మనం హాల్ బయట పిల్లని ఆడించడం. ఇదేదో బావుందని ఏడ్చే పిల్లల తల్లులు, వాళ్ళ పిల్లల్ని కూడా నాతో ఒదిలేయడం. బయట పాప్కార్న్అమ్మే వాడు నన్ను చూసి కిసుక్కున నవ్వడం. ఇలా, ఎన్నో సినిమాలకు వెళ్లి కనీసం అరగంట కూడా చూడకుండా వొచ్చిన రోజులున్నాయి. నా కూతురుకి సినిమా పడకపోతే నా జీవితం ఇలా ఉంటుందా అని నేను విపరీతమైన బాధపడి, "చచ్చీ- చెడీ మా ఆవిడని సినిమా దారిలోకి తెచ్చాను, ఇప్పుడు మళ్లి కధ మొదటికి వొచ్చింది కూతురితో" అని అనుకుంటున్న రోజుల్లో జరిగిందీ సంఘటన.
వీడికి బొమ్మ పడితే రెప్ప పడదు అని ముద్ర పడ్డ తండ్రికి - "నాన్నా! సినిమా pause లో పెట్టు piss కొట్టి ఒస్తా" అన్న నా కూతురి మాటలు (పక్కన మా ఆవిడ చూపుని కూడా పట్టించుకోకుండా) గొంతులో విస్కీ పోసినట్టు (సారీ చెవిలో సీసం పోసినట్టు) అనిపించి , నన్ను అంతులేని పుత్రికోత్సాహంతో పొంగిపోయేలా చేసాయి. నేను వెంటనే మళ్ళీ సగటు తండ్రిలా, మనం అవ్వలేక పోయినా దీన్నైనా ఒక రైటరో, డైరెక్టర్ఓ చెయ్యాలని డిసైడ్ అయ్యాను. ఇదేమి పోయేకాలం డాక్టరో, ఇంజనీరో అవ్వాలనుకోవాలి కానీ! అని బాక్గ్రౌండ్ లో మా ఆవిడ గొణుగుడు. కౌంటర్ వేద్దామని మా ఆవిడ వైపు తిరిగితే అవే చూపులు, అదేనండి! ముందే చెప్పానుగా మనది spicejet వాడి ఆఫర్ లో 99 రూపాయల టికెట్ అని.

22, సెప్టెంబర్ 2010, బుధవారం
రాముడు Gentleman హనుమంతుడు Superman
హమ్మయ్య! పైన టైటిల్ తో మీరు అనేకానేక ఆలోచనలతో ఈ బ్లాగ్గరుడు ఉద్దేశ్యం ఏమిటి? అనే ప్రశ్నార్ధకంతో చదవడం మొదలుపెట్టారా.
అసలు విషయం ఏమిటంటే. నా నాలుగేళ్ల కూతురికి రామాయణం లాంటివి చెప్పాలని చాలా సార్లు అనుకుంటూ, అలా చెప్పే ప్రయత్నం చెయ్యని నన్ను నేను నిందించుకుంటూ, బద్ధకం బూజు దులిపి ఒక సారి వుపక్రమించా. అప్పుడు గాని తెలియలేదు కధలు చెప్పడం ఎంత గొప్ప కళో అని. ఒక సారి కళ్ళ ముందు గుండ్రాలు చుట్టుకుని నా బాల్యం లో నాకు రామాయణం లాంటివి ఎవరు చెప్పినవి మెదడులో ముద్ర పడ్డాయి అని గతం లోకి వెళ్ళాను. అప్పుడు గుర్తుకొచ్చింది మా లంక మామ్మ.
ఇక్కడ లంక మామ్మ గురించి కొంత చెప్పి తీరాలి. తప్పదు! నాకు వున్న అభిమానం అలాంటిది. చిన్నప్పుడు పెళ్లి పేరంటం లాంటివి జరిగేటప్పుడు పిల్లలని అందరిని ఒక చోటి చేర్చి కధలు చెప్పే ఒక నాయనమ్మో, అమ్మమ్మో వుంటారు కదా. సరే! ఒక వేళ మీకు లేకపోతే మీకు తెలిసిన వాళ్లకు ఐనా సరే ఉండి వుంటారు. అలాంటి బామ్మ కోసం పిల్లలు అందరూ ఎంతో ఎదురు చూస్తూ వుంటారు. అలాంటి మామ్మే ఈ లంక మామ్మ. ఈ లంక మామ్మ బడికి వెళ్లి చదువుకోలేదు కానీ ఆ రోజుల్లో రామాయణం రాసింది. ఆ సంగతి నాకు పెద్దయాక తెలిసింది అనుకోండి. ఇంతకీ ఈవిడ కధ చెపుతుంటే ఏడ్చే పిల్లవాడు కూడా ఆపేసి, మనం ఏదో మిస్ ఐపోతున్నాము, ఈ ఏడుపు తరవాత ఏడవచ్చులే అని కళ్ళు పత్తి కాయల్లా తెరుచుకుని, చెవులు రిక్కించి మరీ వింటారు. అంత అద్భుతంగా వుండేది. మన చిత్ర పరిజ్ఞానం వుపయోగించి అంత బాగా చెప్పడంలో సూత్రం గురించి ఆలోచించడం మొదులు పెట్టా.
ఇంతకీ నీ కూతురు కి చెప్తున్న రామాయణం ఏమయ్యిందిరా? అనే ఒక చొప్పదంటు ప్రశ్న మీకు వొచ్చి ఉండవచ్చు. అంటే మరి మామూలుగా అంటే, అంటే మామూలుగా ఇలాంటి పరిస్థితిలో ఏ తండ్రైనా ఏమి చేస్తాడు. టీవీ, కంప్యూటర్ లాంటివి కూతురి చేతిలో పెట్టి పెళ్ళాం రాకుండా కవర్ చేయడమో, ఒస్తే ఏం చెప్పాలో ఆలోచించుకుని రెడీ గా వుంటారు. (ఇక్కడ కొందరు ఆడవాళ్ళు పళ్ళు నూరి, కుడి చేతి వేళ్ళు ఎడం చేతిలో - ఎడం చేతి వేళ్ళు కుడి చేతిలో విరిచి, సచ్చినోళ్ళు -మగాళ్ళందరూ ఇంతే అని అనుకునే అవకాశం ఉంది). మళ్ళీ నా ఆలోచన లంక మామ్మ కధల వైపు సాగింది. మొహమ్మీద చుట్టిన గుండ్రాలు ఫేడ్ అవుతుండగా - ఆవిడ చెప్పిన కధలలో రామాయణం, భారతం మరియు బాగవతం గుర్తు చేసుకుంటుంటే నాకు లంక మామ్మ కధలు ఏవీ సరిగ్గా గుర్తు రావట్లేదు, సరికదా చెప్పేటప్పుడు లంక మామ్మ చేసే హావ భావాలు, ముఖ కవళికలు మాత్రమె గుర్తుకొచ్చాయి. అప్పుడు అర్ధం అయ్యింది లంక మామ్మ కధ కంటే- కధ చెప్పే పద్ధతి బావుందని, అది మన దగ్గిర లేదు కాబట్టి మన కధలు కంచికి మన పిల్లలు టీవీ కి దగ్గిరవుతున్నారని.
ఐనా సరే పట్టు వదలని విక్రమార్కుడు, లంచం వదలని అక్రమార్కుడు లాగ ఏదో ఒక కధ చెప్పాలని రామాయణం మొదలు పెట్టాను. దశరధుడు గురించి మొదలు పెట్టి పెళ్ళాల లిస్టు, పిల్లలకోసం కష్టాలు చెపుతుంటే నాకే అంత ఆసక్తి అనిపించలా. ఇక రాముడు గురించి పొగుడుతుంటే నాకు ఎందుకో చిన్నప్పుడు నీతులు చెప్తే నిద్దరవొచ్చినట్లు వొచ్చేసింది. రాముడు ఎంత gentleman అని అనుకుని కధ మర్చిపోవచ్చు. ఇంతలో నా కూతురు "హనుమాన్ గురించి చెప్పు, హనుమాన్ గురించి చెప్పు" అని ఎగురుతుంటే మన బుర్రలో బల్బ్ వెలిగింది. లంక మామ్మ సుందర కాండ అద్భుతంగా చెప్పేది, హనుమంతుడి లా మూతి పెట్టి, ఒక చేతిలో గద పట్టుకున్నట్లు చిత్ర విచిత్రమైన హావ భావాలతో చెప్పేది. అది చాలా ఆకట్టుకునేది మమ్మల్ని. మేము అంతా మళ్ళీ మళ్ళీ అని అల్లరి చేస్తుంటే, అందరికీ ముద్దలు కలిపి పెట్టేసేది పనిలోపని. ఇంకా లోతుగా ఆలోచించాక తెలిసింది అసలు concept, రాముడు gentleman హనుమంతుడు superman అని. Gentleman సినిమాలు ఆడవు, అదే Superman సినిమాలైతే మళ్ళీ మళ్ళీ తీస్తారు, మనం మళ్ళీ మళ్ళీ చూస్తాము.
మనం కావాలంటే Gentlemen ని పొగుడుతాము కొంచెం పెద్దయ్యాక, కానీ Superman ని ఆరాధిస్తాము చిన్నప్పటినించి. పిల్లల దగ్గర చూడండి హనుమాన్, చోటా భీం లాంటి కధలు ఆకట్టుకుంటాయి. అంతే కాదు మనకి కష్టం వొస్తే మనం ఎవరికి మొక్కుకుంటాం? Superman కి!. పిల్లలకైనా సరే కధ చెప్పేటప్పుడు వాళ్లకి ఆసక్తి కలగాలంటే Gentleman తో మొదలు పెట్టినా Superman కధతో ఆకట్టుకోండి.
నేను మటుకు డిసైడ్ అయిపోయా! గో Superman - ఇక నించి ఇంట్లో మనం కధ చెప్పాల్సి వొస్తే కిష్కింద కాండే. వేరే వాళ్ళింట్లో అయితే లంకా దహనమే. మీ పిల్లలకి మీరు కధలు చెప్పలేక ఇబ్బంది పడితే నాకు చెప్పండి. మీ ఇంటికొస్తా, నా కూతుర్ని తీసుకొస్తా. మంచి interesting కధ చెప్తా. మీరు ఇంక పూరీ జగన్నాధ్ "పోకిరి" లో లాగ "దహనమే" అని పాడుకుంటూ గడిపేయచ్చు - నేను కధ చెపుతుంటే. మీకు నాకు గొడవయితే తరవాత నేను "జగడమే" అని పాడుకుంటూ నిష్క్రమిస్తా- మా వానర సేనతో.

21, సెప్టెంబర్ 2010, మంగళవారం
ఏం చేస్తున్నాం ?
ప్రభు పోస్టింగ్ ఈ లింక్ లో చదివాక స్పందిస్తూ
ఏం చేస్తున్నాం?
ఏమీ చెయ్యం.
ఎందుకంటే ఆది మన బాధ్యత కాదు అని అనుకుంటాము కాబట్టి
ఎవరో ఏదో చెయ్యాలని ఎదురు చూస్తాము
ఎవరూ ఏమీ చేయట్లేదని తిట్టుకుంటూ ఉంటాము
మన వరకూ ఒస్తే లంచం ఇచ్చేస్తాము
ఇంకా అవసరం ఐతే మనం కూడా తీసేసుకుంటాము
అలా చేయకపోతే బతకలేమని సరిపెట్టేసుకుంటాము
తప్పు చేసినోడు మన కులపు వాడైతే తప్పు కూడా ఒప్పు అంటాము
మన బంధువైతే రాబందులకు కూడా కొమ్ము కాస్థాము
ఎందుకంటే మనం స్వార్ధం తో పుచ్చిపోయాం
ఎలాగోలా బతకాలనే భయంతో ఎప్పుడో చచ్చిపోయాం
ఎవడైనా పొరపాటున పోరాడినా
వాడికి దూరంగా పారిపోతాం
మనం బతకడం నేర్చాము
సంఘంలో మన బాధ్యత ఎప్పుడో మరిచాము

దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)