మనుగడ కోసం పోరాటంలో
మనీ కోసం ఆరాటంలో
విలువలకు వలువలు విప్పేసి
ఆంధ్ర మాతని అర్ధ నగ్నంగా నిలబెట్టేసారు
డబ్బు జబ్బు పట్టిన చీడ పురుగులు
దేశ ప్రగతిని కుంటు పరుస్తూంటే -
కొమ్ము కాసే రాజకీయ రాబందులు
దేశ సహజ సంపదల్ని పీక్కు తింటూ
డొక్కల్లో నక్కి బొక్కల దాకా తినేసే
గుంట నక్కల బందువర్గాన్నికాంట్రాక్టు లతో కాస్తున్నాయి
అక్కడక్కడా ఎవడో ఈగ లాగా
సామాజిక న్యాయం అని చెవిలో హోరు పెట్టి
చీము-రక్తం కారుతున్న పుండు మీద పడి
చడీ చప్పుడూ లేకుండా చప్పరించి పోతాడు
రక్తం జుర్రేసిన దోమ
రాబందుని చూపించి భయపెట్టి
నాకో అవకాశం ఇస్తే
రాబందు నించి రక్షిస్తానని
మన ముందు వాపోతుంటుంది
చిటికిన వేలు నేనని
బొటన వేలు నువ్వని
ఐదు వేళ్ళలో అన్యాయం
అనాదిగా నాకే జరుగుతోందని
ఉంగరం వేలుతో సహా
పీక్కు పోతానని బెదిరించి
ఊదర గొట్టి ఉంగరం మీద
ఒక్కో రాయినీ తీసుకుపోతాడొకడు
నిజాల నిగ్గు తేలుస్తానని
కాగడాతో కళ్ళు తెరిపిస్తానని
చీకట్లోనైనా సరే చుక్కలు చూపిస్తానని
పగలంతా ప్రగల్బాలు పల్కి
పత్రికలు పెట్టి పతాక శీర్షికలు కొట్టి
ఛానల్ పెట్టి చడా-మడా తిట్టి
రాత్రిళ్ళు పక్కలేసి పడుపు వృత్తి చేసి
పొద్దున్నే తప్పుడు దారిలో
తీసుకెళ్ళి పోతాడు మరొకడు
గమనిక: ఇది ఎవ్వరినీ ఉద్దేశించినది కాదు... ఒక సామాన్యుడి ఆవేదనకి అక్షర రూపం మాత్రమే...
5, అక్టోబర్ 2010, మంగళవారం
4, అక్టోబర్ 2010, సోమవారం
తాడూ-బొంగరం లేదని ఎవడన్నాడు?
చాలా మంది తాడూ-బొంగరం లేని ఎదవ అని వెక్కిరిస్తూ వుంటారు కదా! తాడూ-బొంగరం లేదని చాలా తక్కువగా కూడా చూస్తారు. కొంత మంది అయితే తాడూ-బొంగరం లేని వాడు కదా అని పిల్లని కూడా ఇవ్వట్లేదట. అలాంటి మనుషులకు అవకాశం ఇవ్వకూడదని ఈ తాడూ-బొంగరం ఒకటి మొన్న భారత దేశం నించి తెప్పించా.( అడగ్గానే ఈ బొంగరం పంపిన నా బాల్య మిత్రుడుకి ధన్యవాదాలు ఈ బ్లాగ్గు ద్వారా). నాకు పెళ్లి ఐపోయింది కాబట్టి అందరికీ అదే పనిగా నా దగ్గర తాడు-బొంగరం వుందని చెప్పట్లేదు అనుకోండి.
కామెడీ పాయింట్ పక్కన పెడితే, ఈ బొమ్మలో వున్న అందమైన బొంగరం- దానికి కట్టి వున్నతాడు ఎలా వున్నాయి? నేను చిన్నప్పుడు వీధుల్లో బొంగరాల ఆట ఆడేవాడిని. అదేమీ ఆషా-మాషీ ఎవ్వారం కాదు. ఆ బొంగరాలు దీనికంటే బరువు ఉండేవి, పైగా కొంచెం పెద్దగా ఉండేవి. వాటికి ఇంచుమించు మేకు లాంటి AXIS వుండేది. ఆ బొంగరానికి తాడు చుట్టడంలో చాలా జాగ్రత్త వహించాలి. AXIS పైన భాగం దగ్గర తాడు ఒక కొసతో మొదలు పెట్టి పై వరకూ ఏ మాత్రం గ్యాప్ లేకుండా బిగుతుగా కట్టి, చిటికిన వేలు మరియు ఉంగరం వేలు మధ్యలో రెండో కొస పట్టుకుని వదలాలి. వదిలే టప్పుడు చాలా ఒడుపుగా దాని AXIS కింద వైపు పడేలా తాడుని విసిరి లాగేసినట్టు ఒదలాలి. అప్పుడు బొంగరం గిర్రు- గిర్రున తిరుగుతూ వుంటుంది చాలా సేపు.
అలా తిరిగే బొంగరాన్ని ఎవరి అభిరుచికి తగ్గట్టుగా వాళ్ళు ప్రదేశాన్ని ఎంచుకుని తిప్పుతూ ఆనందించవచ్చు. మన దర్శకుడు రాఘవేంద్ర రావు గారు అయితే సినిమా హీరోయిన్ బొడ్డు మీద, పిల్లలు అయితే పుస్తకాల మీద, అర చేతిలోనూ - వాళ్ళ ఇష్టం అన్న మాట.
మనిషి కనిపెట్టిన ఆట వొస్తువులలో అతి పురాతనమైన ఆట వొస్తువుగా ఈ బొంగరాన్ని గుర్తించారు. మీ పిల్లలని ఇలాంటి వాటితో ఆడించాలంటే మీరే ఒకటి తయారు చేసుకోవొచ్చు. మేము చిన్నప్పుడు చేసుకునే వాళ్ళం. మన ఇన్జక్షన్ సీసా రబ్బర్ మూత వుంటుంది కదా, అది ఒకటి వుంటే చాలు. దానికి మధ్యలో ఒక సన్న మేకు తోటి గుచ్చి కన్నం పెట్టి అందులోంచి ఒక అగ్గిపుల్ల దూరిస్తే చాలు. ఏ మాత్రం ఖర్చు లేకుండా మీరు బొంగరం తయారు చేసారన్నమాట. మీకు రాఘవేంద్ర రావు టైపు కోరికలు వుంటే ఒక అందమైన అమ్మాయిని అడిగి ఒప్పుకుంటే బొడ్డు మీద తిప్పి ఫోటో తీసి నాకు పంపండి. గూబ పగిలితే నాకు చెప్పకండి, కానీ మీరు రాఘవేంద్ర రావు అంత గొప్ప డైరెక్టర్ అవ్వాలంటే ఇలాంటివి తప్పవని adjust అయిపోయి, ఇంకొకళ్ళని వెతుక్కోండి.
అన్నట్లు చెప్పండం మరిచా, ఈ బొంగరం పిచ్చి చాలా చోట్లే ఉంది ప్రపంచంలో. ఇలాంటి వాటికి పోటీలు కూడా జరుగుతూ వుంటాయి. బొంగరాన్ని హిందీ లో లట్టు, స్పానిష్ లో త్రోమ్పో, లాటిన్ లో turbo , ఇటాలియన్ లో trottola , ఫ్రెంచ్ లో la toupie , జర్మన్ లో kriesel , గ్రీక్ లో strombos మరియు ఇంగ్లీష్ లో టాప్ అని అంటారు.
ఇంత చెప్పాక, ఫోటో తీసి బ్లాగ్గు రాసి మరీ జత చేసాక, నన్ను "తాడు-బొంగరం లేని ఎదవ." అనే దమ్ము ఎవరికుంటుంది చెప్పండి. ఒక వేళ అన్నా, మీరు మటుకు ఎందుకు నమ్ముతారు. ఇంకా కాదంటే మనం ఊరుకుంటామా? అన్న వాళ్ళ బొడ్డు మీద బొంగరం తిప్పెయ్యమూ?
గమనిక: కామెడీ కోసం మాత్రమే రాసాను. నేనేమీ రాఘవేంద్ర రావు టైపు కలలు కనలేదు, ఎవ్వరిని అడగలేదు, నన్నెవ్వరూ గూబ పగలకొట్టలేదు. ఏదో నా బొంగరం నేను తిప్పుకున్నానంతే.
3, అక్టోబర్ 2010, ఆదివారం
చతికిల పడుతున్న హిందీ రోబో
ఆసియా లో కెల్లా అతి పెద్ద బడ్జెట్, సుమారు నూట అరవై కోట్ల రూపాయలతో రూపొందించ బడిన చిత్రం ఎంతిరాన్/రోబో. దీని హిందీ హక్కులు యాభై కోట్ల రూపాయలకు అమ్ముడు అయ్యాయి. ఇది ప్రపంచ వ్యాప్తంగా రెండు వేల theatres లో విడుదల అయ్యింది.
రెండు సంవత్సరాలు పైగా షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం విడుదలయ్యాక మంచి రివ్యూలు ఒచ్చాయ్. సరే కదా అని సకుటుంబ సపరివార సమేతంగా బయలుదేరుదామని టికెట్ల గురించి వాకబు చేస్తే న్యూ జెర్సీ లో తెలుగు మరియు తమిళ చిత్రాల టికెట్ ల ధరలు మూడింతలు. అయినా పరవాలేదు మనం సినిమా పిచ్చి కోసం చూద్దామని డిసైడ్ అయ్యాము. అంత ఖర్చు పెట్టారు కదా మనం ఆ మాత్రం టికెట్ కోసం ఆలోచిస్తే తీసిన వాడు ఎమైపోతాడు అని ఒక చెత్త సానుభూతి. చివరకు ఎంత ట్రై చేసినా హౌస్ ఫుల్ అని తెలిసింది. నాకు తెలిసి నేను ఇప్పటి వరకు ఇలా హౌస్ ఫుల్ shows అన్న విషయం గత పన్నెండు సంవత్సరాలుగా ఏ తెలుగు సినిమాకీ వినలేదు. అయితే సినిమా ఎలాగైనా చూడాలని అనుకుని దగ్గరలో వున్నా హిందీ సినిమా ఆడే theatre ఒకటి పట్టుకుని సినిమాకి వెళ్తే, పట్టుమని 10 మంది కూడా లేరు.
దీనిని బట్టి హిందీ లో హక్కులు తీసుకున్న వాడు ఫుల్ బుక్కు అయ్యాడన్న మాట.
సరే జనాలు లేకపోతే నేమి నాకు అయితే బానే నచ్చింది. మా అమ్మాయిని తీసుకుని వెళ్ళడం వల్ల కొన్ని దాని వయసుకు అనవసరం అనిపించాయి. అప్పుడప్పుడు అది కొంచెం భయపడింది కూడా. మరీ చిన్నపిల్లలు కొంచెం భయపడతారు కాబట్టి వాళ్లకి అనవసరం. కానీ పెద్ద వాళ్ళకు సినిమా బావుంటుంది. ఎంత స్పెషల్ ఎఫ్ఫెక్ట్స్ ఐనా సరే climax సీన్ లో మన తమిళ వాసన fights లో చూపించాడు. కొంచం పాటలు మాత్రం నాకు ఏ ఆర్ రహమాన్ అంత న్యాయం చెయ్యలేదని అనిపించింది. సినిమాకి రజని, ఎఫ్ఫెక్ట్స్, ఐషు ముగ్గురూ assets . శంకర్ ఎలాంటి స్టొరీ అయినా మాస్ elements మరచిపోనని మరో సారి నిరూపించాడు.
మనకి బానే ఉంది కానీ హిందీ లో హక్కులు తీసుకున్న వాడి గురించి ఆలోచిస్తేనే, పాపం బాదేసింది. కనీసం టికెట్ ధర కూడా పెంచలేదు, మామూలు 10 డాలర్లకే చూపించాడు.
Picture Source : http://www.moviebog.com
2, అక్టోబర్ 2010, శనివారం
పిల్లలకు జంతువుల గురించి చెప్పే యానిమేషన్ లఘు చిత్రాలు
మీ ఇంట్లో చిన్న పిల్లలకు కంప్యూటర్ లో ఏమి చూపించాలో తెలియట్లేదా? ఈ రోజుల్లో చాలా మంది హై టెక్ తల్లులే. పిల్లలకి అన్నం తినిపించాలంటే టీవీ, లేదా కంప్యూటర్ లో ఏదో ఒకటి చూపించాలి. ఇందులో తల్లుల తప్పేమీ లేదు, ఈ రోజుల్లో ఎత్తుకుని చంద మామని చూపించి తినిపించే వాళ్ళు ఎవరున్నారు. అంతా ఫాస్ట్ గా జరగాలి, పైగా తొందరగా పని అయిపోవాలి.
ఈ సోదంతా ఎందుకంటే, సరిగ్గా ఇలాంటి సమయంలోనే నేను ఎలాంటివి చూపిస్తే మంచిందని ఆలోచించి చివరకు ఈ కింది వాటితో పని కానిచ్చేవాడిని. ఇవి జంతువుల గురించి పాట మరియు యానిమేషన్ జత కలిపి కొన్ని మాత్రం చెయ్యగలిగారు.

green anackonda link:

Archaeopteryx

Rhino Link:

Iguana Link:

Umbrella Bird Link:

Toucan Link:
పిల్లల వయసుని బట్టి బాగా చిన్న పిల్లలకి RHINO మరియు UMBRELLA BIRD లాంటివి. కొంచం పెద్ద పిల్లలకి DINOSAUR మరియు GREEN ANACONDA లాంటివి నచ్చుతాయి.
Links and videos are taken from youtube but are developed by http://www.biggreenrabbit.com/

1, అక్టోబర్ 2010, శుక్రవారం
నా రోబో విన్యాసాలు
మీరు ఏవేవో అనుకునేరు. నేను రోబో సినిమాకి పనీ చెయ్యలేదు, నాకు శంకర్ అవకాశం ఇవ్వలేదు. ఇదంతా మా ఇంట్లో హడావిడే. ఇండియా నించి family ఒచ్చే టప్పుడు కొత్త పాటల సీడీలు తెప్పించా. అందులో రోబో పాటలు రెండు మా అమ్మాయికి నచ్చాయి. ఒకటేమో "ఓహ్ మర మనిషి", ఇంకోటేమో "కిలి మాన్జారో". డబ్బింగ్ సినిమా సాహిత్యం కదా, నాకు సహజంగానే నచ్చలేదు. కానీ ఈ మధ్య మా అమ్మాయి అన్నిటికీ అర్ధాలు అడుగుతూ వుంటుంది కదా, డబ్బింగ్ సినిమా పాటలు అర్ధం చెప్పడం మరీ చిరాకు. కిలి మాన్జారో అంటే ఏమిటని చెప్తాము.
ఇక సినిమా పాటలతో రోబో కొంచం అంటుకుంది కదా, టీవీ లో ట్రైలర్ చూసి మా అమ్మాయికి తను చూసే కార్టూన్ (యూమి జూమి అని నిక్ లో ఒస్తుంది) రోబో లా నచ్చేసింది. రోజూ పొద్దునే నిద్ర లేవడానికి బాగా ఏడుస్తుంటే ఏదో ఒకటి దానికి ఆసక్తి కలిగేలా చెయ్యడమో, ఆశ చూపించడమో చేస్తే కానీ లేవదు. మనకి సడన్ గా బుర్రకి తట్టక ఒక సారి రోబో చూపిస్తానన్నా, అంతే నిద్ర లేచి తయారయ్యింది. ఒకటి రెండు సార్లు గట్టిగా చూపించు అంటే ఇక తప్పదని రూం దాటి బయటికి వెళ్లి రోబో లా నడుచుంటూ ఒచ్చా.
అక్కడతో మన రోబో కష్టాలు మొదలు. ఇక ఐనదానికి, కానిదానికి మా ఆవిడా ఇదే సందని ఇదిగో రోబో అని, అదిగో రోబో అని అన్నం దగ్గర, స్నానం దగ్గర, పాల దగ్గర, చివరకి హోం వర్క్ దగ్గర కూడా మొదలు పెడితే ఈ రోబో ఎక్కడ చచ్చేది. అప్పటికే ఆఫీసు, ఇంటి చాకిరి తో ఈ రోబో ఒక విన్యాస భంగిమలో నడుం పట్టేసింది. ఇక చూసుకో అసలే రోబో నడక అందులో నడుము పట్టేస్తే ఎలా వుంటుంది. ఈ కింద యానిమేషన్ లో చివరలో రోబో నడకలా ఉంది ఇంచుమించు.

లింక్:
ఇవండీ నా రోబో విన్యాసాలు. అందులో రోబో మీద కలిగినట్లే నా మీద కూడా మీకు జాలి కలుగుతోందా?
అది రోబో కాబట్టి జాలి, నన్ను చూస్తే నవ్వు ఒస్తుంది లెండి.
ఎందుకంటే నేను రోబో కాదుగా, నడుం పట్టేసిన రోబో కదా.
ఇంక లాభం లేదని రోబో సినిమా చూపిస్తానని ఆశ పెట్టడం మొదలెట్టా. కనీసం సినిమా చూపిస్తే నైనా నా రోబో కష్టాలు తగ్గుతాయేమో.

దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)