మనుగడ కోసం పోరాటంలో
మనీ కోసం ఆరాటంలో
విలువలకు వలువలు విప్పేసి
ఆంధ్ర మాతని అర్ధ నగ్నంగా నిలబెట్టేసారు
డబ్బు జబ్బు పట్టిన చీడ పురుగులు
దేశ ప్రగతిని కుంటు పరుస్తూంటే -
కొమ్ము కాసే రాజకీయ రాబందులు
దేశ సహజ సంపదల్ని పీక్కు తింటూ
డొక్కల్లో నక్కి బొక్కల దాకా తినేసే
గుంట నక్కల బందువర్గాన్నికాంట్రాక్టు లతో కాస్తున్నాయి
అక్కడక్కడా ఎవడో ఈగ లాగా
సామాజిక న్యాయం అని చెవిలో హోరు పెట్టి
చీము-రక్తం కారుతున్న పుండు మీద పడి
చడీ చప్పుడూ లేకుండా చప్పరించి పోతాడు
రక్తం జుర్రేసిన దోమ
రాబందుని చూపించి భయపెట్టి
నాకో అవకాశం ఇస్తే
రాబందు నించి రక్షిస్తానని
మన ముందు వాపోతుంటుంది
చిటికిన వేలు నేనని
బొటన వేలు నువ్వని
ఐదు వేళ్ళలో అన్యాయం
అనాదిగా నాకే జరుగుతోందని
ఉంగరం వేలుతో సహా
పీక్కు పోతానని బెదిరించి
ఊదర గొట్టి ఉంగరం మీద
ఒక్కో రాయినీ తీసుకుపోతాడొకడు
నిజాల నిగ్గు తేలుస్తానని
కాగడాతో కళ్ళు తెరిపిస్తానని
చీకట్లోనైనా సరే చుక్కలు చూపిస్తానని
పగలంతా ప్రగల్బాలు పల్కి
పత్రికలు పెట్టి పతాక శీర్షికలు కొట్టి
ఛానల్ పెట్టి చడా-మడా తిట్టి
రాత్రిళ్ళు పక్కలేసి పడుపు వృత్తి చేసి
పొద్దున్నే తప్పుడు దారిలో
తీసుకెళ్ళి పోతాడు మరొకడు
గమనిక: ఇది ఎవ్వరినీ ఉద్దేశించినది కాదు... ఒక సామాన్యుడి ఆవేదనకి అక్షర రూపం మాత్రమే...
super
రిప్లయితొలగించండివాస్తవానికి చక్కటి అక్షరరూపమిచ్చారు.
రిప్లయితొలగించండిJyothi Nayak,
రిప్లయితొలగించండిThank you.
చిలమకూరు విజయమోహన్,
రిప్లయితొలగించండిథ్యాంక్ యూ.
good one.
రిప్లయితొలగించండిsree,
రిప్లయితొలగించండిThanks.
పేర్లు కూడా చెప్పివుంటే మరింత బాగుంటుంది.నాకు కొన్ని పేర్లు తగిలాయి.చెప్పమంటారా?
రిప్లయితొలగించండిChanukya,
రిప్లయితొలగించండిమీరు అనుకున్నవే కరెక్ట్.