3, అక్టోబర్ 2010, ఆదివారం

చతికిల పడుతున్న హిందీ రోబో


ఆసియా లో కెల్లా అతి పెద్ద బడ్జెట్, సుమారు నూట అరవై కోట్ల రూపాయలతో రూపొందించ బడిన చిత్రం ఎంతిరాన్/రోబో. దీని హిందీ హక్కులు యాభై కోట్ల రూపాయలకు అమ్ముడు అయ్యాయి. ఇది ప్రపంచ వ్యాప్తంగా రెండు వేల theatres లో విడుదల అయ్యింది.
రెండు సంవత్సరాలు పైగా షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం విడుదలయ్యాక మంచి రివ్యూలు ఒచ్చాయ్.  సరే కదా అని సకుటుంబ సపరివార సమేతంగా బయలుదేరుదామని టికెట్ల గురించి వాకబు చేస్తే న్యూ జెర్సీ లో తెలుగు మరియు తమిళ చిత్రాల టికెట్ ల ధరలు మూడింతలు. అయినా పరవాలేదు మనం సినిమా పిచ్చి కోసం చూద్దామని డిసైడ్ అయ్యాము. అంత ఖర్చు పెట్టారు కదా మనం ఆ మాత్రం టికెట్ కోసం ఆలోచిస్తే తీసిన వాడు ఎమైపోతాడు అని ఒక చెత్త సానుభూతి.  చివరకు ఎంత ట్రై చేసినా హౌస్ ఫుల్ అని తెలిసింది. నాకు తెలిసి నేను ఇప్పటి వరకు ఇలా హౌస్ ఫుల్ shows అన్న విషయం గత పన్నెండు సంవత్సరాలుగా ఏ తెలుగు సినిమాకీ వినలేదు. అయితే సినిమా ఎలాగైనా చూడాలని అనుకుని దగ్గరలో వున్నా హిందీ సినిమా ఆడే theatre ఒకటి పట్టుకుని సినిమాకి వెళ్తే, పట్టుమని 10 మంది కూడా లేరు.
దీనిని బట్టి హిందీ లో హక్కులు తీసుకున్న వాడు ఫుల్ బుక్కు అయ్యాడన్న మాట.
సరే జనాలు లేకపోతే నేమి నాకు అయితే బానే నచ్చింది. మా అమ్మాయిని తీసుకుని వెళ్ళడం వల్ల కొన్ని దాని వయసుకు అనవసరం అనిపించాయి. అప్పుడప్పుడు అది కొంచెం భయపడింది కూడా. మరీ చిన్నపిల్లలు కొంచెం భయపడతారు కాబట్టి వాళ్లకి అనవసరం. కానీ పెద్ద వాళ్ళకు సినిమా బావుంటుంది. ఎంత స్పెషల్ ఎఫ్ఫెక్ట్స్ ఐనా సరే climax సీన్ లో మన తమిళ వాసన fights లో చూపించాడు. కొంచం పాటలు మాత్రం నాకు ఏ ఆర్ రహమాన్ అంత న్యాయం చెయ్యలేదని అనిపించింది. సినిమాకి రజని, ఎఫ్ఫెక్ట్స్, ఐషు ముగ్గురూ assets . శంకర్ ఎలాంటి స్టొరీ అయినా మాస్ elements మరచిపోనని మరో సారి నిరూపించాడు.
మనకి బానే ఉంది కానీ హిందీ లో హక్కులు తీసుకున్న వాడి గురించి ఆలోచిస్తేనే, పాపం బాదేసింది. కనీసం టికెట్ ధర కూడా పెంచలేదు, మామూలు 10 డాలర్లకే చూపించాడు.
Picture Source : http://www.moviebog.com

2 కామెంట్‌లు:

  1. neninkaa choodaledu.. Given the choice between Khaleja and Robo, I opted the first one, to see in the theater that is..

    Rajniki undi chaala committed following, and like you mentioned inta pedda cinema anta budget aadakapote aaripotaaru chaala mandi ani choodatam and reviews raayadam kooda ani naa opinion.. maree band vaayinchakundaa so so reviews to keep it floating anipistundi.. anyways ee week elago intlo maa ammani maskaa kotti baby sitting cheyyamani nenu vellali anukuntunna:).

    రిప్లయితొలగించండి