4, అక్టోబర్ 2010, సోమవారం

తాడూ-బొంగరం లేదని ఎవడన్నాడు?





 చాలా మంది తాడూ-బొంగరం లేని ఎదవ అని వెక్కిరిస్తూ వుంటారు కదా! తాడూ-బొంగరం లేదని చాలా తక్కువగా కూడా చూస్తారు. కొంత మంది అయితే తాడూ-బొంగరం లేని వాడు కదా అని పిల్లని కూడా ఇవ్వట్లేదట. అలాంటి మనుషులకు అవకాశం ఇవ్వకూడదని ఈ తాడూ-బొంగరం ఒకటి మొన్న భారత దేశం నించి తెప్పించా.( అడగ్గానే ఈ బొంగరం పంపిన నా బాల్య మిత్రుడుకి ధన్యవాదాలు ఈ బ్లాగ్గు ద్వారా). నాకు పెళ్లి ఐపోయింది కాబట్టి అందరికీ అదే పనిగా నా దగ్గర తాడు-బొంగరం వుందని చెప్పట్లేదు అనుకోండి.


కామెడీ పాయింట్ పక్కన పెడితే, ఈ బొమ్మలో వున్న అందమైన బొంగరం- దానికి కట్టి వున్నతాడు ఎలా వున్నాయి? నేను చిన్నప్పుడు వీధుల్లో బొంగరాల ఆట ఆడేవాడిని. అదేమీ ఆషా-మాషీ ఎవ్వారం కాదు. ఆ బొంగరాలు దీనికంటే బరువు ఉండేవి, పైగా కొంచెం పెద్దగా ఉండేవి.  వాటికి ఇంచుమించు మేకు లాంటి AXIS వుండేది. ఆ బొంగరానికి తాడు చుట్టడంలో చాలా జాగ్రత్త వహించాలి. AXIS పైన భాగం దగ్గర తాడు ఒక కొసతో మొదలు పెట్టి పై వరకూ ఏ మాత్రం గ్యాప్ లేకుండా బిగుతుగా కట్టి, చిటికిన వేలు మరియు ఉంగరం వేలు మధ్యలో రెండో కొస పట్టుకుని వదలాలి. వదిలే టప్పుడు చాలా ఒడుపుగా దాని AXIS కింద వైపు పడేలా తాడుని విసిరి లాగేసినట్టు ఒదలాలి. అప్పుడు బొంగరం గిర్రు- గిర్రున తిరుగుతూ వుంటుంది చాలా సేపు.
 అలా తిరిగే బొంగరాన్ని ఎవరి అభిరుచికి తగ్గట్టుగా వాళ్ళు ప్రదేశాన్ని ఎంచుకుని తిప్పుతూ ఆనందించవచ్చు. మన దర్శకుడు రాఘవేంద్ర రావు గారు అయితే సినిమా హీరోయిన్ బొడ్డు మీద, పిల్లలు అయితే  పుస్తకాల మీద, అర చేతిలోనూ - వాళ్ళ ఇష్టం అన్న మాట.  
మనిషి కనిపెట్టిన ఆట వొస్తువులలో అతి పురాతనమైన ఆట వొస్తువుగా ఈ బొంగరాన్ని గుర్తించారు.  మీ పిల్లలని ఇలాంటి వాటితో ఆడించాలంటే మీరే ఒకటి తయారు చేసుకోవొచ్చు. మేము చిన్నప్పుడు చేసుకునే వాళ్ళం. మన ఇన్జక్షన్  సీసా రబ్బర్ మూత వుంటుంది కదా, అది ఒకటి వుంటే చాలు. దానికి మధ్యలో ఒక సన్న మేకు తోటి గుచ్చి కన్నం పెట్టి అందులోంచి ఒక అగ్గిపుల్ల దూరిస్తే చాలు. ఏ మాత్రం ఖర్చు లేకుండా మీరు బొంగరం తయారు చేసారన్నమాట. మీకు రాఘవేంద్ర రావు టైపు కోరికలు వుంటే ఒక అందమైన అమ్మాయిని అడిగి ఒప్పుకుంటే బొడ్డు మీద తిప్పి ఫోటో తీసి నాకు పంపండి. గూబ పగిలితే నాకు చెప్పకండి, కానీ మీరు రాఘవేంద్ర రావు అంత గొప్ప డైరెక్టర్ అవ్వాలంటే ఇలాంటివి తప్పవని adjust అయిపోయి, ఇంకొకళ్ళని వెతుక్కోండి.
అన్నట్లు చెప్పండం మరిచా, ఈ బొంగరం పిచ్చి చాలా చోట్లే ఉంది ప్రపంచంలో. ఇలాంటి వాటికి పోటీలు కూడా జరుగుతూ వుంటాయి. బొంగరాన్ని హిందీ లో లట్టు, స్పానిష్ లో త్రోమ్పో, లాటిన్ లో turbo , ఇటాలియన్ లో trottola , ఫ్రెంచ్ లో la toupie , జర్మన్ లో kriesel , గ్రీక్ లో strombos మరియు ఇంగ్లీష్ లో టాప్ అని అంటారు.
ఇంత చెప్పాక, ఫోటో తీసి బ్లాగ్గు రాసి మరీ జత చేసాక, నన్ను "తాడు-బొంగరం లేని ఎదవ." అనే దమ్ము ఎవరికుంటుంది చెప్పండి. ఒక వేళ అన్నా, మీరు మటుకు ఎందుకు నమ్ముతారు.  ఇంకా కాదంటే మనం ఊరుకుంటామా? అన్న వాళ్ళ బొడ్డు మీద బొంగరం తిప్పెయ్యమూ?  

గమనిక: కామెడీ కోసం మాత్రమే రాసాను. నేనేమీ రాఘవేంద్ర రావు టైపు కలలు కనలేదు, ఎవ్వరిని అడగలేదు, నన్నెవ్వరూ  గూబ పగలకొట్టలేదు.  ఏదో నా బొంగరం నేను తిప్పుకున్నానంతే.   

10 కామెంట్‌లు:

  1. not hannah,
    Yes. This is a top Made in India. The first picture is taken on my Kitchen Island while it is spinning. The blog is about an old saying "No thread -No top means you have not saved enough and not worth alliance for marriage". Started with this saying for fun and went on to explain how I used to play this most popular sport on the streets for kids. How to make cheapest TOP from rubber lid of small injection bottle and how to spin? Concluded with what a top is called in different langauges. Worth mentioning that in movies made in my langauge the lead actor spins the top on the leading ladies belly button. Hope this helps..

    రిప్లయితొలగించండి
  2. sree,
    Yekkado chadivaa, archeologist say it is the oldest toy man made. Had it's origins in most places.

    రిప్లయితొలగించండి
  3. sree,
    Bongaram leka pothey kashtam kaanee. Thaadudemundi. Yedainaa pani chesthundi.. kaani saadharanamgaa laagoo bondu laantivi aithe easy. Purukosa, twine daaaram, sanna daaram mariyu chanthaadulu paniki raavu.

    రిప్లయితొలగించండి
  4. మీరన్నట్టు బొంగరం తిప్పడం ఆషా మాషీ యవ్వారం కాదు. చిన్నప్పుడు నేను అడుకున్నవి అన్ని స్ప్రింగ్ తో తిరిగే ప్లాస్టిక్ బొంగారాలే. నేను హై స్కూల్ లో ఉన్నప్పుడు మా నాన్న ఒక పల్లెటూరు వెళ్ళినప్పుడు ఇలాంటి చెక్క బొంగరాలు తెచ్చారు. అది తిప్పడం నా వల్లైతే కాలేదు. నాన్న మాత్రం సింపుల్ గా తిప్పేసారు చిన్నప్పటి అనుభవంతో. :)
    నా బ్లాగు మీకు నచ్చినందుకు చాలా సంతోషం.

    రిప్లయితొలగించండి
  5. sai praveen,
    నేను కూడా అలాంటి బొంగరం తెప్పించి తిప్పాలని చేసిన ప్రయత్నంలో ఈ బొంగరం దొరికింది.

    రిప్లయితొలగించండి