4, నవంబర్ 2010, గురువారం

గాల్లో తేలినట్లుంది గుండె పేలినట్లుంది - మొదటి భాగం

"గాల్లో తేలినట్లుందే గుండె పేలినట్లుందే  తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్లుందే" అని పదే పదే పాడుకుంటూ వుండేవాన్ని, జల్సా చూసిన తరవాత. అబ్బో ఏమి పోలిక అని జనాలు పొలికేక పెట్టేలా రాశారు మా గురువు గారు. అంతటితో ఆగకుండా
"ఒళ్ళు తూలినట్లుందే దమ్ము లాగినట్లుందే  ఫుళ్ళు బాటిలేత్తి దించకుండా తాగినట్లుందే" అనేసరికి,
అబ్బో! మా దమ్ము భాయీలు మరియు మందు భాయీలు అయితే చిందులేసి తీన్ మార్ డాన్సు చేసి కేక పెట్టారు.
మరి అలా క్లిక్ అయ్యింది మా గురువుగారి పాట.


అయితే ఈ ఫీలింగ్ ప్రేమలో కాకుండా ఇంకో రకంగా నాకు ఈ మధ్య అనుభవంలోకి ఒచ్చింది.
ఈ మధ్య మా బాబాయి కొడుకు ఒచ్చాడు మొదటి సారి అమెరికాకి.  అదే మా చేపలు కొన్న కజిన్. వాడికి ఏదో ఒకటి గుర్తు ఉండేలా చెయ్యాలని అనుకున్నాను. మెల్లిగా ఒక సారి మా ఆవిడని, కూతురిని తప్పించుకుని పొద్దున్నే వాడిని తీసుకుని మా ఇంటి దగ్గర ఎత్తైన పర్వత శ్రేణులు వున్న పోకేనోస్ అనే ప్రాంతానికి తీసుకెల్లా. అక్కడ చెయ్య బోయే విషయం చాలా సీక్రెట్ అనీ వాడికి ముందు నించీ చెప్తూ ఒచ్చా. దాని గురించి ఎవ్వరికీ ఏ మాత్రం అనుమానం రాకుడదని వాడికి గాట్టి హెచ్చరికలు జారీ చేశా. చెయ్యబోయే పని గురించి వాడికి విపరీతమైన ఉత్కంట కలిగేలా వాడికి దాని గురించి ఎన్నో విషయాలు గొప్పగా చెప్పా. ఇలాంటి అవకాశం చాలా తక్కువ మందికి ఒస్తుందని. ఒచ్చిన ఆ అవకాశం తీసుకుని చేసే ధైర్యం, తెగింపు చాలా అరుదని. నీకు తెలిసిన వాళ్ళలో బహుశా ఎవరూ ఇలాటివి చేసి ఉండరని చెప్పి వాడిని మానసికంగా ఎలాగైనా ఇది చెయ్యాలనే స్థితికి తీసుకొచ్చా. నేను పక్కనున్న ధైర్యం వల్ల ముందుకు ఒచ్చాడు గాని, వాడిలో ఇది చెయ్యలా-వొద్దా? అనే సందిగ్దం, దానితో పాటు ఎన్నో భయాలు, అనుమానాలు వాడి మొహంలో నాకు బాగా కనిపించాయి.


నాకు చెయ్యాలని ధైర్యం అయితే ఉంది గాని, అనుకోకుండా ఏదైనా జరిగితే? అమ్మో! అసలే పెద్ద వాడిని, వాడిని చేస్తుంటే వారిన్చాల్సింది పోయి, ఉసికోల్పినందుకు నన్ను అందరూ ఏమంటారని తలచుకుంటే నాకు ఒక్క సారి ఒళ్ళు గగ్గుర్పోడిచింది. అమ్మో! ఇలాంటి ఆలోచనలు మన మనసులోకి రానియ్యకూడదు. ఐనా ఒక్క సారి కమిట్ అయితే నా మాట నేనే వినకూడదు, వింటే పూరీ-మహేష్ కలిసి, నువ్వు పోకిరీ కాదురా ఎందుకీ ఫోజులు అని నన్ను చపాతీ చేసేస్తారు అని అనుకుని ఆ ఆలోచనలని తోవ మళ్ళించాను. అయితే, దీనికి వాడు నా బలవంతం మీద రావట్లేదని రేపు రుజువు కోసం, "ఒరేయ్! నీకు భయం వేస్తే నువ్వు చెయ్యకు. నేను చేస్తున్నానని, చెప్తున్నానని నువ్వు కమిట్ అవ్వకు" అన్నాను. వాడు కొంచెం బెరుగ్గానే "లేదన్నయ్యా. నేను చేస్తాను" అన్నాడు.


 మాటలలో మేము చుట్టూ వున్న ప్రకృతిని, దాని అందాలని సరిగ్గా చూడలేదు. నిజం చెప్పాలంటే మేము చెయ్యబోయే సాహసానికి కళ్ళ ముందు ఎంత సౌందర్యం అయినా మేము ఆస్వాదించ లేకపోదుము. ఆ సమయంలో సినిమా నటి తమన్నా ఒచ్చినా - తప్పుకోవమ్మా అని తల తిప్పుకుని వెళ్ళిపోయే పరిస్థితి. అంతటి టెన్షన్ ఉంది మాలో.

అప్పుడప్పుడూ ఆలోచనల ముసురులో మా ఇద్దరి మధ్య నిశబ్ధం అలా ఒచ్చి వెళ్తోంది. ఇద్దరిలోని బెరుకునీ బయటకి కనిపించనీయకుండా (ముఖ్యంగా నేను) కేవలం మేము చెయ్యబోయే సాహసం గురించి మాత్రమే అప్పుడప్పుడు మేము క్లుప్తంగా మాట్లాడుతున్నాము. అది కూడా మేము చేసిన తర్వాత అది ఎంత గొప్పో అని మేము ప్రపంచానికి ఎలా చెప్పబోతామో అన్న టాపిక్ మీదే. నిజానికి మా భయాన్ని వెనక్కి నెట్టే ప్రయత్నం మా చేత అలా మాట్లాడేలా చేస్తోంది. మేము సాహసం చెయ్యబోయే పర్వతాల దగ్గరికి ఒచ్చాము. మా టెన్షన్ కనపడనీయకుండా రెండు దమ్ములు లాగి, ఒకటికి రెండు సార్లు బాత్రూం కెళ్ళి, వున్న మంచి నీళ్ళ బాటిల్స్  తాగేసాము.


 చివరికి వెళ్లి ధైర్యంగా డబ్బులు కట్టి ఎంత త్వరగా సాహసం చెయ్యచ్చో కనుక్కున్నాము. ఒక గంట కనీసం పడుతుందని చెప్పింది, ఇంతలో మీకు ముందుగా కొంత వర్క్ చెయ్యాలని మా ముందు కాయితాలు పెట్టింది. ఏదైనా జరిగితే వాళ్ళ భాద్యత లేదని, కోర్ట్ లో వాళ్ళని మేము సు చెయ్యకుండా పత్రాలు. సంతకం చెయ్యబోతే చెయ్య వొణికింది. మేము చెయ్యబోయే సాహసం ఎంత ప్రమాదకరమో మరో సారి అంతరాత్మ గట్టిగా వద్దని వారిన్చబోయింది. మళ్ళీ పోకిరీ గుర్తొచ్చి - జగడమే టైపు లో కేక పెట్టి అంత రాత్మ పీక నొక్కాను. తరవాత మీకు కొంచెం ట్రైనింగ్ఇవ్వాలని మమ్మల్ని ఇంకొంత మంది కుర్రాళ్ళతో ఒక గదిలోకి పంపింది.
                                                                                                                (సాహసం - తరవాత టపాలో)

11 కామెంట్‌లు:

  1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  2. అయ్యబాబోయ్!! ఏం ఇంట్రడక్షన్ అండీ...అదేదో సస్పెన్స్ థ్రిల్లర్లా...Waiting for next post eagerly :D

    BTW..మీకు 'పొకోనొస్ ' మౌంటైన్స్ దగ్గరా?? మేము వాటికి వెళ్ళాలని ట్రిప్ వేసుకున్నాం..కాని అక్కడ బాగ వర్షాలు ఒక 10 రొజులవరకు అని వెదర్.కాం లో చూసి కాన్సిల్ చేసుకున్నాం....ఆ ప్రాంతం ఎలా ఉంటుంది? నెట్ లొ వాడు వర్ణించినంత అందగా ఉంటుందా?? ఇంకా అక్కడ అంతా అడవులు అట కదా! మరి సేఫ్ యె నా?

    మరీ ఎక్కువ క్వషన్స్ వేసి విసిగిస్తే సారీ! :(

    రిప్లయితొలగించండి
  3. స్కై డైవింగ్ చేసారా ఏమిటి? అలా అయితే దాని వీడియో కూడా పెట్టండి మరి :)

    రిప్లయితొలగించండి
  4. యమా సస్పెన్సుగా??
    ఎవరా అద్భుతమైన మానసికోద్రేకాలకి అక్షరరూపమిచ్చిన సదరు గురువుగారు??

    రిప్లయితొలగించండి
  5. ఇందు,
    మా ఇంటికి బాగా దగ్గిర. చాలా అందంగా, అద్భుతంగా ఉంటాయి లొకేషన్స్. అక్కడో ఆశ్రమం లాంటిది కూడా ఉంది. అక్కడ బస ఫ్రీ అని విన్నాను, నేను ఎప్పుడూ వెళ్లలేదు. ఈ మధ్య ఐతే దగ్గరలో కసీనొ కూడా ఒచ్చింది. చాలా మంది సెలవలకు వెళ్తారు. సేఫ్ కాదని ఇప్పటి వరకూ ఎవరు అనలేదు. రక రకాల ఆక్టివిటీస్ కి వెళ్తారు జనాలు అక్కడకి. ప్రశ్నలకేమీ పరవాలేదు, సంధించండి.

    రిప్లయితొలగించండి
  6. రిషి,
    త్వరలోనే తెలుస్తుంది, తరువాయి బ్లాగంలో.

    రిప్లయితొలగించండి
  7. కొత్త పాళీ,
    మా గురువు గారు అంటే సిరివెన్నెల సీతారామా శాస్త్రి గారు. ఆయన్ని అభిమానంగా అలా సంభోదిస్తాను. ఆయనకీ, నాకూ పరిచయమూ లేదు, ఎప్పుడూ ఒకరికొకరు తారస పడలేదు కూడా.

    రిప్లయితొలగించండి
  8. ఇందు,
    You are very welcome... Depending on where from you are coming.. winter lo konchem snow bayapettachchu.

    రిప్లయితొలగించండి