10, సెప్టెంబర్ 2010, శుక్రవారం
వెలిగే దీపం నేనైతే... వెలిగించే చమురువి నువ్వు
వెలిగే దీపం నేనైతే
వెలిగించే చమురువి నువ్వు
నా ఆశలు గాలిలో ఆరిపోకుండా
ఆపే అరచేతులు నీవి
నాలో వెలుగుందని చెప్పి
ఆలోచనల అగ్గిపుల్లతో అంటించింది నువ్వు
నిరాశలు నన్ను కన్నీటితో తడిపేస్తుంటే
ఆశల ఉషోదయాలని ముంగిటికి తీసుకొచ్చింది నువ్వు
నా చుట్టూ పరుచుకున్న నిశ్శబ్దంలో
నా గుండె సంగీతాన్ని గుర్తు చేసింది నువ్వు
అంకితం: తనని నమ్ముకున్న వాళ్ళన్ని నిస్వార్ధంగా నడిపించే ప్రతీ మనిషికీ
Picture taken from http://blastmagazine.com/
9, సెప్టెంబర్ 2010, గురువారం
నీతోపాటు మరో బాల్యం
నా చిన్నారి తల్లికి,
నీతోపాటు మరో బాల్యం గడిపే అవకాశం కల్పించినందుకు ఆ దేవుడికి ఎన్నోకృతజ్ఞతలు. నిజానికి నిన్ను మోసింది తొమ్మిది నెలల పాటు మీ అమ్మే ఐనా, మరి మీ అమ్మని మోస్తూ (అంటే భరిస్తూ, మరి భరించేవాడే భర్త అని అన్నారు కదా? అందుకే అలా రాసేసానన్న మాట) వున్నది నేను కాబట్టి పరోక్షంగా నేను కూడా నిన్ను మోసినట్టే. నీ కోసం ఆసుపత్రిలో మీ అమ్మ డెలివరీ కి నేను షార్ట్ లెగ్ లో ఫీల్డింగ్ చేసే extra ప్లేయర్ అంత ఉత్సాహంగా ఎదురు చూసాను. మీ అమ్మకి ధైర్యం చెప్తూ మా అమ్మ వొచ్చిన దేవుడి శ్లోకాలన్నీ చదివేస్తూ వుంటే, అయోమయంగా నేను చూస్తుంటే, నరసమ్మ (మంత్రసాని అంటే అమెరికాలో తంతారేమో) నిన్ను పట్టుకొచ్చి నా చేతిలో పెట్టింది. అక్కడినించి గేమ్ స్టార్ట్.
నిన్ను చూసిన వాళ్ళు అందరూ నా పోలిక అని చెప్తుంటే, విపరీతంగా కుళ్లుకునే మీ అమ్మని చూసి-- నా విజయదరహాసాన్ని ఆపుకోలేక చాలాసార్లు మీ అమ్మకి దొరికి పోయి దెబ్బలు తినేసాను. అప్పట్నుంచి మొదలు నా కష్టాలు, నిన్ను ఎలా పెంచాలో అని కంగారు. నిన్ను ఎవరి చేతిలో పెట్టినా, ఎక్కడ వాళ్ళు సరిగ్గా పట్టుకోలేదో అని వాళ్ళ చేతులకిందే చేతులు పెడితే.. "పోవయ్యా బడాయి.. ఇంతోటి గొప్పలు" అని తిడుతున్నట్టు వాళ్ళు చూసే చూపులకి అప్పుడప్పుడు నాకే ఎక్కువ చేస్తున్నానా అని అనిపించేది. నువ్వు ఇంటికి వొచ్చిన మొదటి రోజు మేడమీదకి నిన్ను కార్ సీట్ లోనే తీసుకెళ్తానని అమ్మకి చెప్తుంటే.. అమ్మ ఒకటే నవ్వడం. తాతకి దగ్గులు నేర్పించినట్లు, పెళ్లి కూతురికి సిగ్గులు నేర్పించినట్లు, నీ కూతురు పుణ్యమా అని నేను ఇప్పుడు నీ దగ్గర పిల్లల్ని ఎత్తుకోడం నేర్చుకోవాలా? అని అమ్మ విసుక్కోడం.
నువ్వు తుమ్మినా, దగ్గినా డాక్టర్ దగ్గరికి పరిగెత్తడం. అక్కడేమో నన్నూ, నా కంగారుని చూసి డాక్టర్లు కోపం వొచ్చినా, co pay వొస్తోంది కదా అని భరించడం. ఇంకా నువ్వు దూకేటప్పుడు కింద పడేలోపు నేను దిండ్లు వేసే ప్రహసనం చూసి మీ అమ్మ నన్ను వుడికించడం. నువ్వు పాకడం మొదలు పెట్టాక ఇంట్లో అన్నీ అటక ఎక్కించడం. నడక ఒచ్చాక అన్నింటికీ తాళాలు వెయ్యడం. నీతో పాటు Curious George, చిన్నారి చిట్టి గీతాలు, DORA లు చూడడం. నువ్వెక్కడ నోట్లో పెట్టుకుంటావో అని కార్పెట్ మీద పాకుతూ అన్నీ ఏరడం. నీ కోసం లాలి పాటలు, జోల పాటలు నేర్చుకోవడం.
అసలు ఎలా గడిచిపోయిందో కాలం.. నీకిప్పుడు నాలుగేళ్ళు అంటే నాకే ఆశ్చర్యంగా వుంటుంది. ఈ నాలుగేళ్ళలో నీతో పాటు నేను అమెరికాలో బాల్యాన్ని చూసాను. చిన్నప్పుడు నాకసలు బొమ్మలు వున్నట్లు గుర్తు లేవు, కానీ ఇప్పుడు మనకి ఎన్ని బొమ్మలో. నా మొదటి బాల్యం నాకు అస్సలు గుర్తు లేదు, నా ఈ రెండో బాల్యం లో మీ అమ్మకి నీ మీద వున్న ప్రేమ, మా అమ్మకి నా మీద వున్న ప్రేమ (అదే నీ మీద ప్రేమ చూపించినప్పుడు) రెండూ కళ్ళారా చూసి ఎంత పొంగిపోయానో.
అమెరికాలో నీతో పాటు మరో బాల్యం ఎంత బాగుందో.

8, సెప్టెంబర్ 2010, బుధవారం
అబే ఓ ఇంగ్లిష్ మీడియం
నిన్న నా తమ్ముడు కాని తమ్ముడు (వీడు మన జూనియర్ ఎన్ టి ఆర్ ఇంటర్వ్యూ లలో చెప్పినట్టు "ఒక తల్లి కి పుట్టక పోయినా, తమ్ముడే టైపు అనుబంధం అన్నమాట) గాడితో మాట్లాడుతూ "అయితే నువ్వొక పాతిక వేలు పెట్టి కొను" అని ఏదో సందర్భంలో సలహా పారేసాను. వాడు వెంటనే "అన్నయ్యా! పాతిక అంటే ఎంత?" అని ఒక దిక్కుమాలిన ప్రశ్నవేసాడు. వెంటనే నా నోట్లోంచి "అబే ఓ ఇంగ్లిష్ మీడియం" అనే డైలాగ్ ముందు ఒచ్చి, ఆ తరవాత ఇండియా లో పుట్టి అమెరికా కి ఉద్యోగానికి ఒచ్చిన వీడి పరిస్థితి ఇలా వుంటే ఇంక నా కూతురి తెలుగు పరిస్థితి ఏమిటి భగవంతుడా అని ఆలోచించేలా చేసి నన్ను బ్లాగ్గేలా చేసింది.
ఏడిసావులే, ఈ మాత్రం దానికి ఎందుకురా ఇంత బాధపడతావు, అడప్పా పావి అని మా ఆవిడ టైపు లో మీరు నన్ను తిట్టకుండా వుండాలంటే, నేను మీకు ఎన్ టి ఆర్ వారసుల సినిమాలలో డప్పు కొట్టినట్లు మా వంశం డప్పు కొట్టాలి. తప్పదు మరి. మరీ మీరు అనుకున్నట్లు ఏ "నేను కొడితే చస్తూ బతుకుతావు, మా నాన్నని తలుచుకుని కొడితే చస్తావు, మా తాతని తలుచుంటే కొట్టకముందే చస్తావు" అన్న టైపు లో లేకుండా చెప్పడానికి ప్రయత్నిస్తా.
మా అమ్మ - ఒక తెలుగు టీచర్. ఏ సబ్జెక్టు లో ఫెయిల్ అయినా క్షమించేస్తుంది కానీ, ఒక వేళ మనకి తెలుగు లో క్లాసు ఫస్ట్ రాంకు రాలేదో మన పని అయిపోయేది ఇంట్లో. దీనికి తోడు నా క్లాసు కి మా అమ్మ తెలుగు టీచర్ అయితే మన పేపర్ లో చిన్న తప్పులకి పెద్ద శిక్ష వేసి నట్లుగా ఎక్కువ మార్కులు తీసేసి నన్ను ఎలాగైనా టాప్ చెయ్యనీకుండా విశ్వ ప్రయత్నం చేసేది.
మా తాత - అంటే మా అమ్మ వాళ్ళ నాన్న. ఈయనో తెలుగు పండిట్, తెలుగు వ్యాకరణం లో ఈయన పుస్తకాలు రాసారు. పదమూడేళ్ళకే మా అమ్మని తెలుగు టీచర్ చేసిన ఘనత ఈయనది. ఆ లెవెల్ లో నూరి పోశారు తెలుగు.
మా అమ్మని మా నాన్నకి ఇచ్చి చేయడానికి కారణం మా నాన్నది కవుల వంశం అని మా అమ్మమ్మ చెప్తూ వుండేది. మా ముత్తాత ఆ రోజుల్లో ఒక పెద్ద కవి. ఆహా! ఇంతకు మించి వివరాలు ఎందుకు లెండి. కవుల వంశంలో మన అమ్మాయిని ఇస్తున్నామని సంబరం తో మా అమ్మని మా నాన్నకి ఇచ్చి చేసేసారట. ఈ కవిత్వం తరవాతి తరాలలో కొంచెం కొంచెం గా తరిగిపోయి, ఇప్పుడు పూర్తిగా ఇగిరిపోతోంది. అయితే ఈ తరంలో నాలాంటి వాళ్ళు తుంటరి సమాధానం చెప్తే పెద్ద వాళ్ళు కవిత్వాలు పోయాయి ఈ కపిత్వాలు మిగిలాయి అని మా వంశం వాళ్ళని దేప్పిపొడవడం ఎక్కువగా జరుగుతుంటూంది నలుగురూ కలిసినప్పుడు.
సరే ఈ బాధ అంతా ఎందుకంటే, నేనో అయోమయం ఆంధ్రుడు (Confused దేశి లాగ), నా కూతురు అయితే పుట్టిన తరవాత భారత దేశానికి మూడు సార్లు చుట్టపు చూపుగా ఒచ్చింది(దాని వయసు నాలుగు). దేశం లో వుంటే ముక్కలు విరగ కొట్టినట్లు ముద్దుగా తెలుగు మాట్లాడుతుంది. దేశంలో వున్నప్పుడు ముద్దుగా తెలుగు మాట్లాడినా, ఇక్కడకి ఒచ్చాక మళ్ళీ ఎంగిలిపీచే. కానీ దానికి మన భాష ఎలా నేర్పాలో అన్నది నాకు ఒక చిక్కు ప్రశ్నే? అప్పటికీ కుదిరినప్పుడల్లా దీనిని తెలుగులో ఏమంటారు అని అడగడం అలవాటు చేసి పక్షులు, చెట్లు, ఏనుగు లాంటి తేలికైనవి చెప్పేసి మురిసిపోయేలోపు మా గడుగ్గాయి "కారు అంటే తెలుగు లో ఏమిటి" లాంటి ప్రశ్నలు విసిరేసి నాన్నని ఇరుకు లో పెడుతుంది. దీనికి ఇప్పుడు తెలుగు లో ఇలాంటివి ఎలా చెప్పాలి అని సమాధానం కోసం తడుముకునే లోపు పక్కన నా ఇంగ్లిష్ మీడియం పెళ్ళాం కిసుక్కున నవ్వుతుంది. "మొగుడు కొట్టిన మంట కాదు, తోటికోడలు నవ్విందన్నబాధలా" కడుపు మండి, దానికి కౌంటర్ మా ఆవిడ రాసిన కూరగాయల లిస్టు లో "కొత మీర, పోటా కాయ" లను మా ఆవిడకి గుర్తు చేసి నీకన్న నేనే బెటర్ అని మొగుడు జులుం (ఇది అందరు మొగుళ్ళకి పెళ్ళయిన తరవాత ఒచ్చే జులుం) చూపిస్తాను. దానికి నేర్పించే తీరిక నాకు లేదు, మా ఆవిడకి రాదు. పోనీ విడిగా ఎక్కడైనా క్లాసు పెట్టించాలంటే ఇంగ్లీష్, లెక్కలు, ఈత, సంగీతం మరియు ఆటలు ఇవన్నీ వారంలో ఐదు రోజులు సరిపోతే, వారాంతాలు తిరుగుడుతో గడిపాక ఇంక చదివించే సమయం ఎక్కడది, నా కూతురికి తెలుగు సాహిత్యం గురించి తెలుసుకునే అవకాశం ఏది?
నా కూతురు నా ముత్తాత టైపు లో కంద పద్యం రాయడం కల్ల, కనీసం నాలా సీస పద్యం రాయాలనే కల కనడం కూడా కష్టమే, పోనీ నా భార్యామణి రేంజ్ లో "కొత మీర, పోటా కాయ" లిస్టు లెవెల్ కి ఎదిగినా సరిపెట్టుకుంటా. ఇప్పటి పరిస్థితి చూస్తే అది తెలుగులో మాట్లాడితే చాలు అని అనిపిస్తోంది. ఇంక నన్ను, మా వంశం ప్రతిష్టను, నా తెలుగు ఆత్మాభి మానాన్ని పరదేశం లో నిలబెట్టే ప్రయత్నాలని ఆ తెలుగు తల్లే కాపాడాలి. గట్టిగా అంటే నీ సాహిత్యంతో నువ్వు ఏం పీకావు అంటారు. అదే కదా! మన బాధ, మనకు తెలిసేటప్పటికి వయసు ఐపోయింది, పైగా మన అభిప్రాయాన్ని పిల్లల మీద రుద్దుతున్నామా అనే ఆలోచన.
అమెరికా కూతురు, ఇంగ్లిష్ మీడియం పెళ్ళాం తో పరదేశం లో ఈ తెలుగోడి గోడు ఎవడు పట్టించుకుంటాడు లెండి!!!.

2, సెప్టెంబర్ 2010, గురువారం
వర మంటి మనసే పొంది విసిరేసు కుంటానంటే పరిహాస మవదా జీవితం
ఈ రోజు టీవీ లో భద్రి సినిమా వొచ్చింది. ఈ సినిమాలో నాకు నచ్చిన అద్భుతమైన పాట కోసం చూస్తూ కూర్చున్నాను. తీరా లాస్ట్ లో ఆ సాంగ్ ఒచ్చినప్పుడు చూస్తే ఆ పాట మొత్తం రాలేదు. కొన్ని సినిమాలలో స్టొరీ మొత్తం చెప్పే పాట ఒకటి వుంటుంది. సినిమా చూడక ముందు ఈ పాట వింటే మనకి స్టొరీ అర్ధం అవుతుంది. ఇలాంటి పాటలు మచ్చుకి కొన్ని "చిలకా ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక",
"జాలిగా జాబిలమ్మ, రే రేయంత రెప్పవేయనే లేదు ఎందుచేత", "మంచు తాకిన ఈ వనం పూలు తొడిగేనా", "కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు". ఇలా ఎన్నో సాంగ్స్, వాటి కోవలోకి వొచ్చే పాట ఈ సినిమాలో "వరమంటి మనసే పొంది".
తీరా సినిమాలో ఆ పాట వోచ్చేటప్పటికి చూద్దును కదా, పల్లవి ఒక్కటే వొచ్చింది. చరణాలు మన పూరీ ఎడిటింగ్ రూం లో నిడివి తగ్గించడానికి కట్ చేసాడో, లేక పోతే అసలు తీయనే లేదో కానీ, జనం మాత్రం మంచి సాహిత్యం వున్న పాట మిస్ అయ్యారు.
అందుకని, ఆ పాట పూర్తిగా వినని వాళ్ళ కోసం, ఇదిగో ఇక్కడ పూర్తి పాట రాస్తున్నాను.
వర మంటి మనసే పొంది విసిరేసు కుంటానంటే పరిహాస మవదా జీవితం
ఉదయాలు ఎదురుగ ఉండి కనుమూసి అడుగేస్తుంటే పడదోసి పోదా జీవితం
పూవంటి మనసుని కోసి
ఆపైన జాలిగ చూసి
ఓదార్పు కోరే నేస్తమా
దేహాన్ని జ్వాలగ చేసి
జీవితాన్ని చితిలో తోసి
తలరాత అంటే న్యాయమా
ఎడారెంట పరిగెడతావ
దరీ దారి లేదంటావ
తడి లేక అలసే ప్రాణమా
పాదాలు నీవంటావ
పయనాలు మాత్రం కావా
పై వాడి పైనా భారమా
కాలాన్ని కవ్వించేలా
పనిలేని పంతాలేల
అటు పైన విధిపై నిందలా
పాటకి లింక్ : Play Song
(Links to Raaga.com)

జల్సా - హైప్ లేకపోయుంటే పవర్ ఫుల్ మూవీ అయ్యేది పవన్ కి
హైప్ లేకపోయుంటే జల్సా పవన్ కి పవర్ ఫుల్ మూవీ అయ్యేది. ఇదేంటిరా అని అనుకుంటున్నారా. నిజమే, లేకపోతే మొదటి సారి చూసినప్పటికీ రెండో సారి చూసినప్పటికీ సినిమా మనకి తేడా కనిపిస్తుంది. నేను ఈ సినిమా మ్యూజిక్ రిలీజ్ ఐనప్పుడు టీవీ లో ప్రోమోస్ చూసాను. దేవిశ్రీ సంగీతం అదిరింది, దానికి తోడు ఇక మా గురువు సిరివెన్నెల గారు రాసిన టైటిల్ సాంగ్ అయితే కేక. అప్పుడే జనాల మెమరీ లో ఫ్రెష్ గా వున్న సునామీ లాంటి పదాలు ప్రయోగించడంతో, జల్సా టైటిల్ సాంగ్ జనాలలో విపరీతమైన క్రేజ్ తీసుకొచ్చింది. ఇంకో పాటలో "గాల్లో తేలినట్టుందే, గుండె పేలినట్టుందే ఫుల్ బాటిలెత్తి దించకుండా తాగినట్టుందే" విని ప్రతి మగాడూ "ఆహా! ఎంత బాగా రాసారు ఫీలింగ్ అని ఫీల్ అయ్యారు".
సినిమా రిలీజ్ ఐనప్పుడు హైదరాబాద్ లో వున్నాను. వందలాది హళ్ళలో ఒకే సారి రిలీజ్ చేస్తున్నారని, అంటే సినిమా అంత బాలేదని టాక్. దానికి తోడు సినిమా చూసినప్పుడు హాల్లో హడావిడి. సాంగ్స్ అనుకున్నంత బాగా షూట్ చెయ్యలేదని, సినిమాలో కంటే బయటే బావున్నాయని అనిపించింది. మళ్ళీ మన పవర్ స్టార్ పవన్ పుట్టిన రోజు నాడు మరో సారి చూస్తుంటే, "అరె! ఇది మనం అనుకున్నంత బ్యాడ్ గా లేదు అనిపించింది." ముఖ్యంగా కామెడీ తో పాటు కొన్ని పవర్ ఫుల్ డైలాగులు- త్రివిక్రమ్ మార్క్ కామెడీ లోనే కాదు, సీరియస్ డైలాగులు కూడా బావుంటాయి అనిపించింది.
నిజ్జంగా నిజం, కావాలంటే ఈ కింద డైలాగ్ చదవండి.
"కష్టాలా! ఖరీదైన బైక్ లో తిరుగుతూ, ఏసీ రూముల్లో ఉంటూ, వేలకు వేలు ఖరీదు చేసే డిజైనర్ గుడ్డలు వేసుకు తిరిగుతూ రోజుకు వెయ్యి రూపాయలు ఖర్చు చేసే నీకు, కష్టాల గురించి మాట్లేడే హక్కు లేదు.
స్కూల్ కి వెళ్ళాలంటే పోను నాలుగు కిలోమీటర్లు, రాను నాలుగు కిలోమీటర్లు రోజుకు ఎనిమిది కిలోమీటర్లు నడవాలని సంగతి నీకు తెలుసా?
అన్నం అంటే జొన్న అన్నం తినాలని , వరి అన్నం ఆర్నేల్లకోసారే వండుకుంటారని, పరమాన్నం వండినప్పుడే పండగ అంటారని నీకు తెలుసా?
ఆడుకోవలసిన పసి వయసులో సరైన వైద్యం అందక బిడ్డలు చనిపోతారనే విషయం నీకు తెలుసా?
ఆకలేస్తే నేల వైపు, దాహమేస్తే ఆకాశం వైపు చూసే మనుషులు ఇంకా బతికే వున్నారని- నువ్వు బతికే ఈ సమాజంలో బతుకుతున్నారని నీకు తెలుసా?
తండ్రి చచ్చిపోయిన ఆరు గంటలకు తల్లి చచ్చిపోతే ఆ భాద ఎలా వుంటుందో, నువ్వు ఎప్పుడైనా అనుభవించావా?
కంటికి కనిపించని ఏదో ఒక శక్తి మనల్ని కొన్ని టన్నులు బరువుతో భూమిలోకి తొక్కుతున్నట్లు నీకు ఎప్పుడైనా అనిపించిందా?
వయసులో ఉండగానే బాధతో భుజాలు కుంగిపోవడం నువ్వెప్పుడన్నా అనుభవించావా?
ఈ సమాజంలో బతకడానికి మనకున్న పేరు, మనకున్న అధికారం, మన శక్తి- ఏదీ సరిపోదు. ఈ జనం మధ్య బతకలేక దూరంగా పారిపోవాలని నీకు ఎప్పుడైనా అనిపించిందా.
అడవి నీకు ఎప్పుడైనా అమ్మలా అనిపించిందా.
తుపాకీ పట్టుకుంటే ధైర్యం గా ఉంటుందని నీకు ఎప్పుడైనా అనిపించిందా
బతకాలంటే ఇంకొకడిని చంపడం తప్ప మనం బ్రతకలేమని నీకు ఎప్పుడైనా అనిపించిందా. నాకు అనిపించింది.
ఇక్కడ కష్టం గురించి మాట్లాడే హక్కు నాకు మాత్రమే ఉంది, నీకు లేదు, కచ్చితంగా నీకు లేదు"
ఇది కాక ఒక మంచి డైలాగ్. హీరోయిన్ తో హీరో ఒక సీన్ లో.
"అందంగా వుండడం అంటే మనకి నచ్చేలా వుండడం, ఎదుటి వాళ్లకు నచ్చేలా వుండటం కాదు."
బావుంది కదా?. అందుకనే అన్నాను హైపు లేకపోయుంటే జల్సా పవర్ ఫుల్ మూవీ అయ్యేది పవన్ కి.
ఈ సారి మా టీవీ (అంటే మీ టీవీ లో వొచ్చే MAA ఛానల్ లో) లో మళ్ళీ వేస్తే సరిగ్గా "జల్సా" చూసుకుని జల్సా చేసుకోండి.

దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)