జీవితంలో ఎన్నో పుట్టిన రోజులు ఒచ్చి వెళ్లి పోయాయి..
చిన్నప్పుడు నాకు అప్పుడప్పుడు పుట్టిన రోజు నాడు కొత్త బట్టలు కట్టుకుని చాక్లెట్స్ పంచిన గుర్తు మాత్రమే.. కొంచెం ఊహ ఒచ్చాక బర్త్ డే అంటే నలుగురికీ చెప్పడానికి సిగ్గు పడే వాడిని. స్పెషల్ గుర్తింపు ఇష్టం లేక అనుకుంటాను.అప్పటికి నాకు ఏర్పడిన మంచి స్నేహ బృందం వల్ల, పుట్టిన రోజు నాడు విషెస్ తో పాటు గ్రీటింగ్ కార్డ్స్ మరియు చిన్న చిన్న గిఫ్ట్స్ అందుకునే వాడిని. ఆ తరవాత పెళ్ళైన కొత్తలో ఒకటి రెండు పుట్టిన రోజులు SURPRISE గా మా ఆవిడా చేస్తే, ఇవన్నీ ఇంత అవసరమా అని సందేహిస్తూ అందరినీ నిరుత్సాహ పరచలేక జరుపుకునేవాడిని. ఈ పుట్టిన రోజు మాత్రం నాకు నేను జరుపుకోవాలని అనుకోకపోయినా , మంచి ఆనందాన్ని మిగిల్చింది.
అన్నిట్లోకి ముఖ్యంగా నా పుట్టిన రోజు నా కూతురు ఆనందంగా కొవ్వొత్తులు ఊదుతుంటే, నా చిట్టి తల్లి ఆనందం కోసం ఇంట్లో కేకు కట్ చేసినందుకు చాలా సంతోషం వేసింది. ఆ తరవాత అందరూ గుర్తు పెట్టుకుని ఇండియా నించి కాల్ చేస్తుంటే నా పుట్టిన రోజు కన్నా, వాళ్ళ అభిమానానికి నేను పుట్టినందుకు గర్వంగా అనిపించింది. దీనికి తోడు సోషల్ నెట్ వర్క్ సైట్ లో నా పుట్టిన రోజు చూసి అందరూ నాకు FACEBOOK మీద బర్త్ డే విషెస్ చెప్తుంటే, సంతోషంతో పాటు - ఈ ఇంటర్నెట్ యుగం లో ఎవ్వరికీ తెలియకుండా గుట్టుగా పుట్టిన రోజు గడిచిపోవడం అసాధ్యం అని తేలింది.
ముఖ్యంగా నేను నమ్మిన - నిన్ను నలుగురు ప్రేమించాలంటే నువ్వు వాళ్ళ నమ్మకాన్ని వాళ్ళ బాగు కోసం వుపయోగించాలనే సూత్రం ఇందరి అభిమానాన్ని నాకు తెచ్చిపెట్టినందుకు ఎంతో సంతోషం గా ఉంది.
అందుకే ఇంత మంది పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్తుంటే ఆ ATTENTION కి కొంచెం సిగ్గు పడినా..
కొత్తగా వున్న ఈ పుట్టిన రోజు .... నాకు చాలా నచ్చింది.
అందుకని ఈ పుట్టిన రోజు ఫర్ ఏ చేంజ్....
కొత్తగా రెక్కలొచ్చెనా గూటిలోన గువ్వ పిల్లకి...
మెత్తగా రేకు విచ్చెనా సిగ్గు చాటునున్న చందు గాడికి
అని పాడుకుంటూ.. ఈ పుట్టిన రోజు ఆఖరి క్షణాలు ఆస్వాదిస్తూ....ఇలా బ్లాగుతున్నాను...
ఇమేజ్ సోర్సు: http://www.pennyprintables.com/image-files/butterfly-card.gif
పుట్టిన రోజు శుభాకాంక్షలండీ. మీరు ఇంకా బోల్డన్ని మంచి మంచి పోస్టులు బ్లాగాలని ఆకాంక్షిస్తున్నాను.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిహ్యాపీ బర్త్ డే అండీ,
రిప్లయితొలగించండిహ్యపీ న్యూ ఇయర్ కూడా
మీ పాప గురించి మీరు రాసిన పోస్ట్స్ చదివాను.
ఆకాశమంత లో ప్రకాష్ రాజ్ గుర్తొచ్చారు.
చాలా బావున్నాయి.
SHANKY,
రిప్లయితొలగించండిథాంక్స్ ఆండీ.
లత,
రిప్లయితొలగించండిమీకు కూడా హ్యాపీ న్యూ యియర్. పోస్ట్స్ నచ్చినందుకు థాంక్స్.
belated wishes chandu.. meeru eppudu ilaage happy happygaa celebrate chesukondi
రిప్లయితొలగించండిSree,
రిప్లయితొలగించండిThank you//
happy b'day wishes to u, may god bless u n fullfill all ur wishes
రిప్లయితొలగించండిJyothi Nayak,
రిప్లయితొలగించండిThank you.
జన్మదిన శుభాకాంక్షలండి .
రిప్లయితొలగించండిhappy new year
జన్మదిన శుభాకాంక్షలు చందుగారూ....మీ టపా..సూపరు...చివర్లో పాట కేక హ్హహ్హహ్హా :))) మీరు చెప్పింది నిజమే.గుట్టుగా బర్త్ డే జరుపుకునే రోజులు కావివి :))
రిప్లయితొలగించండిమాలా కుమార్,
రిప్లయితొలగించండిథాంక్స్ ఆండీ. మీకు కూడా హ్యాపీ న్యూ యియర్.
ఇందు,
రిప్లయితొలగించండిథాంక్స్.