22, జనవరి 2011, శనివారం

లోకం బావుంది నలువైపులా


నా చుట్టూ పరుచుకున్న చీకటిలో
కళ్ళు నులుముకుని కర్తైన్ తీసి చూస్తే


చందమామ వెన్నెల చల్లుతున్నాడు
మంచు పూలతో తడిసిన నేల
తెల్లని  తివాచి లా వెలిగిపోతుంది
మబ్బులు మేమేం తక్కువ  తిన్నామా అని
వెన్నెలకి తమ దూది మేనులతో మెరుపులు దిద్దాయి
మినుకు మినుకు మంటూ మధ్యలో చుక్కలు
మెరిసి మెరిసి మాయమవుతున్నాయి


ఎంత పిచ్చి వాడిని నేను
కళ్ళు మూసుకుని లోకమంతా
చీకటిలో వుందని చింతిస్తున్నాను
కళ్ళు వుండీ లాభంలేదని
నిరాశతో అందరినీ నిందిచాలనుకున్నాను

రెప్పలు తీసే ప్రయత్నం
కిటికే చేరే పయనం
కర్తైన్  తీసే ధైర్యం చేస్తే..


నా కోసం లోకంలో చీకటిని తరిమేయ్యడానికి
నా నేస్తాలు చేసిన సాయం కనిపించింది


లోకం బావుంది నలువైపులా
నన్ను అలుముకున్న సంతోషంలా


పొద్దున్నే మూడున్నరకి కిటికీ CURTAIN  తెరిస్తే కనిపించిన దృశ్యం స్ఫూర్తిగా....


4 కామెంట్‌లు: