10, జనవరి 2011, సోమవారం

చూడ చక్కగున్నా లేకున్నా - ఏం పరవాలేదు

ఈ మధ్య ఒక్క సారి వినగానే ఇంత నచ్చిన పాట ఏదీ లేదు. సాహిత్యం బావున్న మంచి పాట వింటే, నేను గుర్తు కొచ్చి కాల్ చేసి చెప్పే మంచి స్నేహితులు ఉన్న అదృష్టానికి నోచుకున్న నాకు అలా పరిచయమైన పాట ఇది. (థాంక్స్ టు సూరి). "మామ! ఈ పాట బలే నచ్చింది మామ" అన్న వెంటనే అనుకున్నా, మనసుకి హత్తుకునే పాట అని. విన్నాక మనసారా మళ్ళీ మళ్ళీ వినాలని అనిపించిన మనసార చిత్రంలోని పాట. 
మంచితనం చూసి మనసుతో ప్రేమించిన అమ్మాయి.. నా ఊహల్లో నేను గీసుకున్న నా చిత్రాలకి సరిపోతావో లేదో నని మనసు అడుగుతోంది కాబట్టి నాకు ఒక సారి నీ మొహం చూపించమనే కొస మెరుపు అదిరింది.. గీతా మాధురి గాన మాధుర్యంలో 
"సరదాగా తరిమిందే మది నీపై మనసుపడి 
మురిపించే ఊహలతో ముఖ చిత్రం గీసుకుని
అది నువ్వో కాదో అని సందేహం ప్రతిసారి " అని రాసిన భాస్కరభట్ల గారికి .. హాట్స్ ఆఫ్...


పరవాలేదు పరవాలేదు
చూడ చక్కగున్నా లేకున్నా  - ఏం పరవాలేదు
నువ్వెలా వున్నా పర్లేదు  

పరవాలేదు పరవాలేదు
ఊరు పేరు వున్నా  లేకున్నా  -ఏం పరవాలేదు 
నువ్వు ఎవ్వరైనా పర్లేదు

ఓఓ.. నీకు నాకు స్నేహం లేదు
నువ్వంటే కోపం లేదు
ఎందుకీ దాగుడుమూతలు అర్ధమే లేదు
మచ్చేదో వున్నాదని మబ్బుల్లో జాబిల్లి దాగుండిపోదు
                                                       పరవాలేదు పరవాలేదు ||

ఉంగరాల జుట్టే లేదా - నాకు పర్లేదు

రంగు కాస్త తక్కువ అయినా - మరి పర్లేదు

మసి లాగ ఉంటుందని తిడతావ రాతిరిని
తనలోని కనలేమా  మెరిసేటి సొగసులని

అందంగా లేను అని నిన్నెవరూ చూడరని
నువ్వేవ్వరికి నచ్చవని నీకెవ్వరు చెప్పారు
ఎంత మంచి మనసో నీది  - దానికన్నా గొప్పది లేదు
అందగాళ్ళు నాకెవ్వరు   - ఇంత నచ్చలేదు
నల్లగా వున్నానని కోకిల కొమ్మలో దాగుండిపోదు
                                                     పరవాలేదు పరవాలేదు ||


అంత లేసి కళ్ళుండకున్నా - నాకు పర్లేదు
కోరమీసం లేకున్న గాని - మరి పర్లేదు  
పరదాలే ఎన్నాళ్ళిలా అని నిన్నేఅడగమని 
సరదాగా తరిమిందే మది నీపై మనసుపడి
మురిపించే ఊహలతో ముఖ చిత్రం గీసుకుని
అది నువ్వో కాదో అని సందేహం ప్రతిసారి
చేర దీసి లాలించలేదు
నన్నిలా ప్రేమించలేదు
అందుకే ఇంకెవ్వరు  - ఇంత నచ్చలేదు
ఎవ్వరేమన్నా సరే నా చెయ్యి నిన్నింక వదిలేది లేదు
                                                        పరవాలేదు పరవాలేదు ||


పాట లింక్ (వినాలంటే)

6 కామెంట్‌లు: