16, జనవరి 2011, ఆదివారం

మిరపకాయి - ఆంధ్ర అమితాబ్- హయిటు తక్కువ, ఘాటు ఎక్కువ

మాస్ రాజా నించి మాస్ మహారాజా గా మిరపకాయ్ సినిమాతో ప్రోమోట్ చెయ్యబడ్డ రవి తేజ ని ఆంధ్ర అమితాబ్ అని అంటే కొందరికి కోపం రావొచ్చు. కానీ, నాకెందుకు ఇలా అనిపించిందో చెప్తాను. అమితాబ్ రోజుల్లో మిగిలిన హీరో లందరూ తమ పాత సినిమాల ఆధారంగా వున్న గ్లామరు, క్రేజు, వారసత్వం ఉపయోగించుకుని సినిమా తరవాత సినిమా ఒచ్చినా జనాలని పెద్ద అలరించలేకపోయారు. ఒక్కొక్క హీరో ఒక్కొక్క వర్గం లేదా ఫాన్ లకి మాత్రమే నచ్చే విదంగా ఉండేవి సినిమాలు. ఇంట్లో అందరూ కలిసి వెళ్తే  అమితాబ్ ఐతే తన మార్కు డయలాగులు, స్టెప్పులు, కొంత కామెడీ తో అందరూ  నిరాశ పడకుండా చూసి ఒచ్చేయచ్చు అనే టైపు లొ ఉండేవి. ఉదాహరణకి  అమితాబ్ - రిషి కపూర్  ఒకే సారి సినిమాలు మొదలెట్టినా  ఆ తరవాత అదే మార్కు ముద్రతో రిషి కపూర్ విసిగించాడు. శశి కపూర్ కూడా అంతే. తన అందం నేట్టుకోచ్చేసాడు. ఇంక మనోజ్ కుమార్ సినిమాలు దేశ భక్తే కాని ENTERTAINMENT తక్కువ. ధర్మేంద్ర అయితే ఇప్పటికీ కుత్తే డైలాగ్ మించి ఎక్కువ చెప్పలేడు. రాజేష్ ఖన్నా మొదటి నించీ తల పక్కకి వాల్చి ఊపి ఊపి కెరీర్ అంతా  రొమాంటిక్ హీరో అని చెప్పి లాగేసాడు. దేవానంద్ నటన గురించి ఎంత తక్కువ చెప్తే అంత మంచింది. 
అదే ఈ రోజుల్లో చూసుకుంటే యువ తరాన్ని ఒదిలేస్తే, బాల కృష్ణని ఫాన్స్ తప్ప వేరే వాళ్ళు భరించలేరు. నాగార్జున మాస్ గా చేసినా అందరూ ఒప్పుకోలేరు. వెంకటేష్ సినిమా అయితే ఏదో చూడాలి అన్నట్లు వుంటాయి కానీ పెద్ద హైపే వుండదు. ఇంక పవన్ కళ్యాన్ సినిమాలు ఎప్పుడో ఒకటి ఒస్తుంది - అయితే తుస్సు లేదంటే సూపర్. వీళ్ళ అందరికీ ఫ్యాన్ following , కొంచెం ఒక వర్గం ప్రేక్షకులు మాత్రమే చూడడం లాంటివి వున్నాయి. వాటితో పాటు కొంత గత వైభవం మీద కాష్ చేసుకుని సాగిపోతున్నారు.     ఇంచుమించుగా డెబ్బై లలో అమితాబ్ సినిమాలు ఇచ్చిన ఫుల్ ఫ్యామిలీ ENTERTAINMENT  టాలీవుడ్ లొ రవి తేజ సినిమాలు అందిస్తాయి. పైగా సెపరేట్ ఫాన్ అనీ, వారసత్వం అనీ, కులం అనీ చూడకుండా రవి తేజ సినిమా ఒక సారి చూసేయ్యచ్చు అని అందరూ కలిసి సరదాగా సినేమాకీ వెళ్ళిపోతారు.
అలాంటి మరో సినిమా ఈ మిరపకాయ. కధ కొత్తగా లేకపోయినా చెత్తగా లేదు. సినిమా అంతా ఎక్కడా బోర్ కొట్టదు. పంచ్ డయలాగులు, ఆద్యంతం కామెడీ. అవసరానికి సరిపడా FIGHTS. అందంగా వున్న దీక్ష, కొంచెం మందంగా వున్న రిచా. మొదటి పాటలో ఢిల్లీ ని అందంగా చూపించారు. సినిమా మొదటి నించీ అన్ని FRAME లలోను మంచి కళ్ళకి ఇంపైన సినిమాటోగ్రఫీ. దుస్తులు కూడా తెర పైన అందంగా ఉండేలా వైబ్రంట్ రంగులు. పాటలు పరవాలేదు అనిపించాయి. "అంత లేదు.. అంత లేదు" అన్న పాట ముందు ముందు జనాలు బాగా వాడతారు అనిపించేలా ఉంది. డైరెక్టర్ కి ఏ హీరొయిన్ ని ఎలా చూపించోలో బాగా అర్ధం అయ్యింది. గ్లామర్ విషయంలో దీక్ష ముందు ముందు రాణించే అవకాశం బాగా వున్నా, రిచా కి మటుకు అంత మంచి భవిష్యత్తు ఉంటుందని నాకు అనిపించట్లేదు.
ఎన్నో సినిమాలు ఈ సంక్రాంతికి ఒచ్చినా అందరూ ముందుగానే మిరపకాయ్ మాత్రమే ఎలా వున్నా ఒక సారి చూస్తాము అనుకున్నారు. దానితో మినిమం గారంటీ ఉంది. చూసిన తరవాత కామెడీ పండి, కొంచెం రవి తేజ మార్క్ పంచ్ డయలాగులు వుంటే ఎలాగో మళ్ళీ చూసే వాళ్లు, కనీసం ఒక సారి చూసే వాళ్ళతో సినిమా లాభాల్లో పడిపోతుంది. అసలు నాకు తెలిసి ప్రస్తుతం తెలుగు ఫీల్డ్ లొ మినిమం గారంటీ ఉన్న కొంచెం పెద్ద హీరో  రవి తేజ. రవి తేజతో సినిమా తీసి, పెద్దగా ఎవరూ నష్టపోరు. చివరకి ప్రేక్షకులు కూడా.
అందుకే నేను అంటున్నా " రవి తేజ ఆంధ్ర అమితాబ్- హయిటు తక్కువ, ఘాటు ఎక్కువ".

14 కామెంట్‌లు:

  1. నిజమే. రవి తేజ సినిమాలకు మినిమం గ్యారెంటి ఉంటుంది. దాదాపుగా రవితేజ సినిమాలు అన్నీ బాగా ఎంజాయ్ చేస్తూ చూసేయ్యోచ్చు.దుబాయ్ శీను ఎన్ని సార్లు చూసినా ఆ కామెడికి ఇప్పటికీ భలే నవ్వొచ్చేస్తుంది. రవితేజ, బ్రహ్మానందం ఇద్దరూ సినిమాలో ఉంటే, సినిమా గురించి ఎవర్నీ అడక్కుండా చక్కగా సినిమా చూసి వచ్చేయ్యోచ్చు. ఇంకే ఏ హీరో సినిమాకి మనం అంత ధైర్యం చెయ్యలేం.

    రిప్లయితొలగించండి
  2. టి వి సీరియళ్ళు చూసి చూసి, జనాలు రవితేజ ఓవర్ ఏక్షన్ కి అలవాటుపడిపోయారనుకుంటా.

    రిప్లయితొలగించండి
  3. కొంచం over action ఉన్నా సినిమాలు బాగానే వస్తున్నై ... హిందీ లో ఇప్పుడు అక్షయ్ కుమార లాగ కామెడీ main stream గా హిట్స్ కొట్టేది రవి తేజ ఒక్కడే ...

    రిప్లయితొలగించండి
  4. Rajesh T,
    మీరు కరెక్ట్. ఈ సంక్రాంతికి ఏ సినిమా చూస్తావు అని అడిగితే చాలా మంది ఇదే మాట చెప్పారు. థాంక్స్.

    రిప్లయితొలగించండి
  5. bonagiri,
    ఆ సంగతేమో గానీ. జనాలకి ఆశించిందే దొరుకుతుంది అన్ని సినెమాలలో. అందుకని అనుకుంటా అంత సూపర్ హిట్ అవ్వవు, అలాగని మినిమమ్ గారంటీ ఉంటాయి.

    రిప్లయితొలగించండి
  6. Pradeep,
    రవి తేజ నటన లో కొంచెం బెటర్ అక్షయ్ కన్నా. ఎనర్జీ తో సినేమా లాగేస్తాడు.

    రిప్లయితొలగించండి
  7. అమితాబ్ - రిషి కపూర్ కాదు అమితాబ్ - శశి కపూర్.రిషి కపూర్ తర్వాత వచ్చారు.

    రిప్లయితొలగించండి
  8. చిలమకూరు విజయమోహన్,
    Thanks. నిజమే శశి కపూర్ ముందు. నేను ఆర్డర్ లోకాకుండా ఆ రోజుల్లో కంపేర్ చేశాను.

    రిప్లయితొలగించండి
  9. nenu theaterlo almost anni cinemalu choosina hero raviteja... anjaneyulu miss aipoyindi.. ippudu mirapakay choodali chance vaste..

    రిప్లయితొలగించండి
  10. Sree,
    Aithe meeku ee cinemaa kooda thappaka nachchuthundi. Choodadi.

    రిప్లయితొలగించండి