నీ కమ్మని ఒడిలో
నా కన్నుల కిటికీలు మూసి
కరిగిపోవాలని ఉంది ..
సాయంకాలం సూర్యున్ని పంపేసి
వెలుతురుని వెళ్ళ గొట్టేసి
మిణుగురులని కూడా తరిమేసి
మబ్బుల్లాంటి మెత్తటి పరుపు మీద
చక్కటి దుప్పటి కప్పుకుని
దిండు మీద తల పెట్టి
నా గుండె సడి వినపడే నిశ్శబ్దంలో
నీ రాక కొరకు వేచి వున్న నాకు
నీ దర్శన భాగ్యం కలగదేమి?
వయసులో వున్నప్పుడు
నిన్ను నిర్లక్ష్యం చేసానని
నా మీద కక్ష కట్టావా?
నన్ను మన్నించు
నీ కౌగిట కరిగించు
ఇది ఎందుకంటే:
రాత్రంతా మెలకువగా ఉండే అలవాటు నాకు..
చిన్నప్పుడు అమ్మ పదే పదే పడుకోమని చెప్పినా పట్టించుకునే వాడిని కాదు..
ఇప్పుడు నిద్ర కావాలన్నాపట్టట్లేదు
"అందుకే చిన్నప్పటి నించి తొందరగా నిద్ర పోరా అని చెప్పా" అని అమ్మ అంటుంటే
ఇలా నిద్రా దేవికి విన్నపం రాసాను..
Image Source: http://blacklifecoaches.wordpress.com/
baavundi mi vinnapam chandu gaaru
రిప్లయితొలగించండిnice
రిప్లయితొలగించండిHaha! Baagundi mee vinnapam :) Naku nidradevi best friend kadaa! Ala piliste ila vachestundi.Ivala tanu vachinappudu kaasta meemeda kooda kanikaram choopinchamani adugutaanulendi :) Vaake??
రిప్లయితొలగించండిచెప్పాలంటే.....,
రిప్లయితొలగించండిThank you...
kavitha,
రిప్లయితొలగించండిThanks.
ఇందు,
రిప్లయితొలగించండిప్లీజ్ పంపించండి.. మీ పేరు చెప్పి మీ వూరు దాకా వినిపించేలా గురకలు పెట్టి పడుకుంటాను.
Mauli,
రిప్లయితొలగించండిThanks.
Recently, I came across a colleague who can sleep whenever he wants (within 1-2 minutes) and wake up whenever he wants. He takes cat-naps or power-naps of 20-30 minutes as well:-)
రిప్లయితొలగించండిNalinikanth Josyabhatla,
రిప్లయితొలగించండిThat's kind of blessing I need. Lucky him.