25, జనవరి 2011, మంగళవారం

నా పైన నీ కోపం నాకెరుక

అది నేను పీజీ  చదివే రోజులు. అప్పట్లో సోను నిగం పాటలంటే పడి చచ్చే రోజులు. అప్పుడు "పాపా కెహ్తే హై" అనే ఒక హిందీ సినిమాలో పాట బాగా నచ్చేది. కొంచెం స్లో సాంగ్. జావేద్ అఖ్తర్ పాటలు చాలా అద్భుతంగా వుంటాయి. ఈ పాటలో చాలా అర్ధం వుంటుంది.  సినేమా చూడలేదు "నా  మీద కోపంతో నిన్ను నువ్వు దూరం చేసుకోకు" అని ఒక తండ్రి ఆవేదన తెలియ చేసే సందర్భం అనుకుంట ఈ పాట. ఎందుకో ఈ పాట తెలుగులో రాయాలని అనిపించింది. ఈ పాట యదాతధంగా కాకుండా, నా పద్ధతిలో ఒక కవితలాగా రాసాను.

నా పైన నీ కోపం నాకెరుక
నీ పైన నీకెందుకు అలక
నా నుంచి నువ్వు దూరమైనా
నీకు నువ్వు దూరం కారాదని

నా పై నీ నమ్మకం సన్నగిల్లినా
నీ పై నీ నమ్మకం కరగకూడదని
నీ ఆశల తారలు నింగిలో లేకున్న
నేలపై నీ అడుగులు తడబడకూడదని
నన్ను నువ్వు నిందించినా
నిన్ను నువ్వు తప్పుపట్టవద్దని

మదిలో మాట ఒకటి చెప్పనా
నాలా నీకెవ్వరు చెప్పకున్నా
నిన్ను నువ్వే తెలుసుకో కొత్తగా
నీ తోడంటూ ఎవరూ లేకున్నా
నీతోటే నీ బ్రతుకంతా
ఎవరికోసం ఈ వెతుకులాట

నా పైన నీ కోపం నాకెరుక 
నీ పైన నీకెందుకు అలక 



ఈ పాట వినాలనుకుంటే ఈ లింక్ క్లిక్ చెయ్యండి.

హిందీ పాట కోసం చూసే వాళ్లకి.

ఈ పాట ఒరిజినల్ హిందీ లొ:
Hindi Lyrics:
(Mujhse Naaraaz Ho Toh Ho Jaao) - 2
Khud Se Lekin Khafa Khafa Na Raho
Mujhase Tum Dur Jaao Toh Jaao
Aap Apne Se Tum Juda Na Raho
Mujhse Naaraaz Ho Toh Ho Jaao
Khud Se Lekin Khafa Khafa Na Raho
Mujhse Naaraaz Ho Toh Ho Jaao

(Mujhape Chaahe Yakin Karo Na Karo) - 2
Tumko Khud Par Magar Yakin Rahe
Sar Pe Ho Aasmaan Ya Ke Na Ho
Pair Ke Niche Yeh Jamin Rahe
(Mujhko Tum Bewafa Kaho Toh Kaho) - 2
Tum Magar Khud Se Bewafa Na Raho
Mujhse Naaraaz Ho Toh Ho Jaao

(Aao Ek Baat Main Kahun Tumse) - 2
Jaane Phir Koi Yeh Kahe Na Kahe
Tumko Apni Talaash Karni Hai
Humsafar Koi Bhi Rahe Na Rahe
(Tumko Apne Sahaare Jina Hai) - 2
Dhudhati Koi Aasra Na Raho
Mujhse Naaraaz Ho Toh Ho Jaao
Khud Se Lekin Khafa Khafa Na Raho
Mujhase Tum Dur Jaao Toh Jaao
Aap Apne Se Tum Juda Na Raho

Hindi Song Lyrics courtesy http://www.hindilyrix.com
Hindi Song Lyrics courtesy http://www.esnips.com







22, జనవరి 2011, శనివారం

లోకం బావుంది నలువైపులా


నా చుట్టూ పరుచుకున్న చీకటిలో
కళ్ళు నులుముకుని కర్తైన్ తీసి చూస్తే


చందమామ వెన్నెల చల్లుతున్నాడు
మంచు పూలతో తడిసిన నేల
తెల్లని  తివాచి లా వెలిగిపోతుంది
మబ్బులు మేమేం తక్కువ  తిన్నామా అని
వెన్నెలకి తమ దూది మేనులతో మెరుపులు దిద్దాయి
మినుకు మినుకు మంటూ మధ్యలో చుక్కలు
మెరిసి మెరిసి మాయమవుతున్నాయి


ఎంత పిచ్చి వాడిని నేను
కళ్ళు మూసుకుని లోకమంతా
చీకటిలో వుందని చింతిస్తున్నాను
కళ్ళు వుండీ లాభంలేదని
నిరాశతో అందరినీ నిందిచాలనుకున్నాను

రెప్పలు తీసే ప్రయత్నం
కిటికే చేరే పయనం
కర్తైన్  తీసే ధైర్యం చేస్తే..


నా కోసం లోకంలో చీకటిని తరిమేయ్యడానికి
నా నేస్తాలు చేసిన సాయం కనిపించింది


లోకం బావుంది నలువైపులా
నన్ను అలుముకున్న సంతోషంలా


పొద్దున్నే మూడున్నరకి కిటికీ CURTAIN  తెరిస్తే కనిపించిన దృశ్యం స్ఫూర్తిగా....


21, జనవరి 2011, శుక్రవారం

నా కోసమే వేసిన "అనగనగా ఒక ధీరుడు" స్పెషల్ షో...


ఎప్పుడైనా మీ కోసం ఒక సినిమా స్పెషల్ షో వేసారా? నేను ఉద్యోగ రీత్యా వేరే వూరిలో ఉంటున్నా. ఈ రోజే లాస్ట్ షో "అనగనగా ఒక ధీరుడు" సినేమాకీ. మొన్నటి శుక్రవారం వెళ్దామని అనుకున్నా కుదరక వెళ్ళలేదు. ఇవాళ్ళ ఆఫీసు నించి ఆరింటికి బయటకు ఒచ్చేసా. లేదు లేదు రావాల్సోచ్చింది. మా ఆఫీసు లొ ఎస్కార్ట్ లేకుండా పని చేసే పర్మిషన్ నాకు ఇంకా లేదు.. ఎలాగో వంట వండే ఉద్దేస్సం లేదు కాబట్టి, సినిమా ఏడు గంటలకు కదా వెళదామా? అని అనిపించింది. సరే సినిమా హాల్ దాకా వెళ్దాం, ఒక వేల మొదలై పోతే వెనక్కి ఒచ్సెద్దామని ట్రాఫ్ఫిక్ లొ గడియారం చూసుకుంటూ అక్కడికి వెళ్ళేటప్పటికి ఏడుంపావు అయ్యింది. సరే పావు గంట సినిమాయే కదా అని కౌంటర్ లొ చూస్తే మనిషి లేడు. లోపలికి  వెళ్లి పాప్ కార్న్ అమ్మే దగ్గర టికెట్ల వాడిని, ఇక్కడ టికెట్ ఇస్తావా అంటే సరే అన్నాడు. టికెట్ ఇస్తూ వాకీ టాకీ లొ "సర్ ఒచ్చారు. సినేమా వెయ్యండి" అన్నట్టుగా.. ఏదో గొణిగాడు.. లోపలికి వెళ్లి చూస్తే నేను అడుగు పెట్టాక సినేమా మొదలు పెట్టారు.. హాలు అంతా ఫుల్ ఖాళీ. కేవలం నా ఒక్కడి కోసమే సినేమా వేసారు.. 
నాకోసం ఒక స్పెషల్ షో వేసినందుకు కొంచెం గర్వం అనిపించింది.. తరవాత ఇంకొంచం ఆలోచిస్తే.. నేనేమిటి.. రివ్యూ లలో బాలేదు అని చెప్పినా సరే ఇలా సినేమా చూసేస్తున్నాను.. అనిపించింది..నామీద నాకు జాలేసింది.. నా సినేమా పిచ్చికి కొంచెం బాధేసింది.. ఛ..నా లాంటి సినేమా పిచ్చోలు రివ్యూ లని పట్టించుకుంటే సినేమా ఆడేది ఎలా.. అన్న ఆలోచన ఒచ్చాక కొంచెం బానే అనిపించింది.. ఎలాగైనా ధైర్యంగా చివరిదాకా సినేమా చూడాలి అని డిసైడ్ అయ్యి ఎదుటి కుర్చీపై కాళ్ళు పెట్టి.. పక్క కుర్చీ లోకి వాలి.. దర్జాగా సినేమా చూసా. (మరి మామూలుగా అలాంటి అవకాశం రాదుగా)..

సినేమా విషయానికి ఒస్తే.. ముందుగా అద్భుత దృశ్యాలు, రెప్ప వేయనివ్వని గ్రాఫిక్స్, చూడ చక్కని లోకేషన్స్, అందమైన దుస్తులు, నటన బానే వున్న మంచు.. కుందనపు బొమ్మ లాంటి శృతి మరియు పరవాలేదు అనిపించే కధ..
ఇకపోతే సినేమా ఎందుకు ఆడట్లేదు అంటారా.. ఈ సినేమాకి పెద్ద డ్రా బ్యాక్ స్క్రీన్ ప్లే.. చాలా పేలవంగా ఉంది.. ఒక కధ చెప్పేటప్పుడు ఒక్కొక్క క్యారెక్టర్ ని ఎలా పరిచయం చేస్తాము అన్నదాన్ని బట్టి సినేమా ఫలితం వుంటుంది. ఈ సినేమా చాల సేపటి వరకు అతుకుల బొంతలా అసహజంగా అనిపిస్తుంది. పైగా మన ధీరుడు ఫైటింగ్ కి కండ తక్కువ రొమాన్సు కి రంగు ఎక్కువ... అసలు ఈ సినిమాలో హీరో కూడా హీరోయిన్ అనుకుని వెళ్ళాలి.. నిజమే సిద్దార్ద్ సినిమా హీరో సినేమా అని ఎవరైనా వెళ్తారా.
డిస్నీ వాడి చేత తెలుగులో బోణీ కొట్టించి మన వాళ్లు ఇలాంటి సినేమా తో కొంచెం నిరుత్సాహ పరిచారు. కానీ ఆ గ్రాఫిక్స్ అవీ ఒక సారి మొదలైతే ముందు ముందు మంచి సినేమాలోచ్చే అవకాశం వుంటుంది. ఈ సినేమా నాకోసం వేసినట్లుగా స్పెషల్ గా ఒక్కడికే షో వేస్తే చూడొచ్చు..లేదా పిల్లలకి చూపించడానికి పరవాలేదు.
అవండీ నా స్పెషల్ షో విశేషాలు. 

20, జనవరి 2011, గురువారం

నిద్రా దేవి కి విన్నపం

నీ కమ్మని ఒడిలో
నా కన్నుల కిటికీలు మూసి
కరిగిపోవాలని ఉంది ..
సాయంకాలం సూర్యున్ని పంపేసి
వెలుతురుని వెళ్ళ గొట్టేసి
మిణుగురులని కూడా తరిమేసి
మబ్బుల్లాంటి మెత్తటి పరుపు మీద
చక్కటి దుప్పటి కప్పుకుని
దిండు మీద తల పెట్టి 
నా గుండె సడి వినపడే నిశ్శబ్దంలో
నీ రాక కొరకు వేచి వున్న నాకు
నీ దర్శన భాగ్యం కలగదేమి?
వయసులో వున్నప్పుడు
నిన్ను నిర్లక్ష్యం చేసానని
నా మీద కక్ష కట్టావా?
నన్ను మన్నించు
నీ కౌగిట కరిగించు

ఇది ఎందుకంటే:
రాత్రంతా మెలకువగా ఉండే అలవాటు నాకు..
చిన్నప్పుడు అమ్మ పదే పదే పడుకోమని చెప్పినా పట్టించుకునే వాడిని కాదు..
ఇప్పుడు నిద్ర కావాలన్నాపట్టట్లేదు
"అందుకే చిన్నప్పటి నించి తొందరగా నిద్ర పోరా అని చెప్పా" అని అమ్మ అంటుంటే
ఇలా నిద్రా దేవికి విన్నపం రాసాను..

Image Source: http://blacklifecoaches.wordpress.com/

18, జనవరి 2011, మంగళవారం

కనపడుట లేదు

నవ మాసాలూ మోసి
నలుగు పెట్టి స్నానం చేయించి
నాలుగు ముద్దలు పెట్టి
నడక నేర్పించి బడికి పంపి
నచ్చిన పిల్లకిచ్చి పెళ్లి చేసి
నా బంగారు కొండ అని మురిసిన తల్లికి
నడుం పడిపోయి మంచం పట్టగా
చూసుకోడానికి రావాల్సిన కొడుకు - కనపడుట లేదు
చివరగా కట్టుకున్న పెళ్ళాం కౌగిలిలో
కళ్ళు మూసుకుని వుండగా చూసిన గురుతు
ఈ ఫోటో అబ్బాయి ఐదేళ్లప్పటిది
ఇప్పుడు ముప్పయ్ వుంటాయి
దొరికితే mailto:అమ్మ@నమ్మకం.com కి
మెయిల్ పంపి మేలు చేయగలరు

16, జనవరి 2011, ఆదివారం

ఆ దోసిలి నాదైనందుకు

చెక్కిలి మీంచి జారి పడే నీ కన్నీటి చుక్కలని
నేల బడకుండా నా దోసిలి పట్టి
అందులో నేను నీకు చూపించే
ముడుచుకున్న నీ ప్రతిబింబం లొ
నువ్వు మరిచిపోయిన
చిరునవ్వు ఆనవాలు లేదని చెప్పి
నవ్వుల  పువ్వులు నీ మోముపైన
పూయించిన ప్రతి సారీ...

నేనంటే నాకెంతో ఇష్టం
నీ కష్టం లొ నేనున్నందుకు
ఆ దోసిలి నాదైనందుకు...

మిరపకాయి - ఆంధ్ర అమితాబ్- హయిటు తక్కువ, ఘాటు ఎక్కువ

మాస్ రాజా నించి మాస్ మహారాజా గా మిరపకాయ్ సినిమాతో ప్రోమోట్ చెయ్యబడ్డ రవి తేజ ని ఆంధ్ర అమితాబ్ అని అంటే కొందరికి కోపం రావొచ్చు. కానీ, నాకెందుకు ఇలా అనిపించిందో చెప్తాను. అమితాబ్ రోజుల్లో మిగిలిన హీరో లందరూ తమ పాత సినిమాల ఆధారంగా వున్న గ్లామరు, క్రేజు, వారసత్వం ఉపయోగించుకుని సినిమా తరవాత సినిమా ఒచ్చినా జనాలని పెద్ద అలరించలేకపోయారు. ఒక్కొక్క హీరో ఒక్కొక్క వర్గం లేదా ఫాన్ లకి మాత్రమే నచ్చే విదంగా ఉండేవి సినిమాలు. ఇంట్లో అందరూ కలిసి వెళ్తే  అమితాబ్ ఐతే తన మార్కు డయలాగులు, స్టెప్పులు, కొంత కామెడీ తో అందరూ  నిరాశ పడకుండా చూసి ఒచ్చేయచ్చు అనే టైపు లొ ఉండేవి. ఉదాహరణకి  అమితాబ్ - రిషి కపూర్  ఒకే సారి సినిమాలు మొదలెట్టినా  ఆ తరవాత అదే మార్కు ముద్రతో రిషి కపూర్ విసిగించాడు. శశి కపూర్ కూడా అంతే. తన అందం నేట్టుకోచ్చేసాడు. ఇంక మనోజ్ కుమార్ సినిమాలు దేశ భక్తే కాని ENTERTAINMENT తక్కువ. ధర్మేంద్ర అయితే ఇప్పటికీ కుత్తే డైలాగ్ మించి ఎక్కువ చెప్పలేడు. రాజేష్ ఖన్నా మొదటి నించీ తల పక్కకి వాల్చి ఊపి ఊపి కెరీర్ అంతా  రొమాంటిక్ హీరో అని చెప్పి లాగేసాడు. దేవానంద్ నటన గురించి ఎంత తక్కువ చెప్తే అంత మంచింది. 
అదే ఈ రోజుల్లో చూసుకుంటే యువ తరాన్ని ఒదిలేస్తే, బాల కృష్ణని ఫాన్స్ తప్ప వేరే వాళ్ళు భరించలేరు. నాగార్జున మాస్ గా చేసినా అందరూ ఒప్పుకోలేరు. వెంకటేష్ సినిమా అయితే ఏదో చూడాలి అన్నట్లు వుంటాయి కానీ పెద్ద హైపే వుండదు. ఇంక పవన్ కళ్యాన్ సినిమాలు ఎప్పుడో ఒకటి ఒస్తుంది - అయితే తుస్సు లేదంటే సూపర్. వీళ్ళ అందరికీ ఫ్యాన్ following , కొంచెం ఒక వర్గం ప్రేక్షకులు మాత్రమే చూడడం లాంటివి వున్నాయి. వాటితో పాటు కొంత గత వైభవం మీద కాష్ చేసుకుని సాగిపోతున్నారు.     ఇంచుమించుగా డెబ్బై లలో అమితాబ్ సినిమాలు ఇచ్చిన ఫుల్ ఫ్యామిలీ ENTERTAINMENT  టాలీవుడ్ లొ రవి తేజ సినిమాలు అందిస్తాయి. పైగా సెపరేట్ ఫాన్ అనీ, వారసత్వం అనీ, కులం అనీ చూడకుండా రవి తేజ సినిమా ఒక సారి చూసేయ్యచ్చు అని అందరూ కలిసి సరదాగా సినేమాకీ వెళ్ళిపోతారు.
అలాంటి మరో సినిమా ఈ మిరపకాయ. కధ కొత్తగా లేకపోయినా చెత్తగా లేదు. సినిమా అంతా ఎక్కడా బోర్ కొట్టదు. పంచ్ డయలాగులు, ఆద్యంతం కామెడీ. అవసరానికి సరిపడా FIGHTS. అందంగా వున్న దీక్ష, కొంచెం మందంగా వున్న రిచా. మొదటి పాటలో ఢిల్లీ ని అందంగా చూపించారు. సినిమా మొదటి నించీ అన్ని FRAME లలోను మంచి కళ్ళకి ఇంపైన సినిమాటోగ్రఫీ. దుస్తులు కూడా తెర పైన అందంగా ఉండేలా వైబ్రంట్ రంగులు. పాటలు పరవాలేదు అనిపించాయి. "అంత లేదు.. అంత లేదు" అన్న పాట ముందు ముందు జనాలు బాగా వాడతారు అనిపించేలా ఉంది. డైరెక్టర్ కి ఏ హీరొయిన్ ని ఎలా చూపించోలో బాగా అర్ధం అయ్యింది. గ్లామర్ విషయంలో దీక్ష ముందు ముందు రాణించే అవకాశం బాగా వున్నా, రిచా కి మటుకు అంత మంచి భవిష్యత్తు ఉంటుందని నాకు అనిపించట్లేదు.
ఎన్నో సినిమాలు ఈ సంక్రాంతికి ఒచ్చినా అందరూ ముందుగానే మిరపకాయ్ మాత్రమే ఎలా వున్నా ఒక సారి చూస్తాము అనుకున్నారు. దానితో మినిమం గారంటీ ఉంది. చూసిన తరవాత కామెడీ పండి, కొంచెం రవి తేజ మార్క్ పంచ్ డయలాగులు వుంటే ఎలాగో మళ్ళీ చూసే వాళ్లు, కనీసం ఒక సారి చూసే వాళ్ళతో సినిమా లాభాల్లో పడిపోతుంది. అసలు నాకు తెలిసి ప్రస్తుతం తెలుగు ఫీల్డ్ లొ మినిమం గారంటీ ఉన్న కొంచెం పెద్ద హీరో  రవి తేజ. రవి తేజతో సినిమా తీసి, పెద్దగా ఎవరూ నష్టపోరు. చివరకి ప్రేక్షకులు కూడా.
అందుకే నేను అంటున్నా " రవి తేజ ఆంధ్ర అమితాబ్- హయిటు తక్కువ, ఘాటు ఎక్కువ".

14, జనవరి 2011, శుక్రవారం

కిక్కెక్కించే కిక్కు పాటలు

ఈ మధ్య పదే పదే కిక్కు పాటలు వింటున్నా. నా కారులో అదొక్కటే CD ఉంది మరి. వినే కొద్దీ అందులో పాటల సంగీతం మాత్రమే కాక వాటి అద్భుత సాహిత్యం నాకు మరీ కిక్కేక్కిస్తోంది. ఒక సినిమాలో పాత్ర స్వభావాలని బట్టి, దానిలోని కధ కి తగ్గట్టుగా సందర్భోచితంగా పాట రాస్తే ఎంత బాగా కుదురుతుందో చెప్పడానికి ఈ పాటలే గొప్ప ఉదాహరణ.

మొదటి పాట కన్నెత్తి చూడకే కన్యామని లో హీరో తనకి ఈజీగా ప్రేమలో పడితే మజా ఉండదని, కాబట్టి నా మీద నీకు ఆసక్తి వుందని నాకు తెలిసినా, నువ్వు నాతో అంత సులువుగా ప్రేమలో పడకు అని చెప్పే పాట.

కన్నెత్తి చూడకే కన్యామని
పన్నెత్తి చెప్పకే ఏ మాటని
నేనంటే కొద్దిగా నీకుందని 
నాక్కూడ తెలుసును గానీ 
ఛీ కొట్టి పొమ్మనే అమ్మాయిని
చేపట్ట గలిగే దమ్ముందని
నా పట్టుదలనే చూపెట్టి నిన్ను ఆకట్టు కుంటా రాణీ
అందుకే అందుకే అంత సులువుగ భామ
ఆటవో వేటవో అంతు తెలియని ప్రేమా ...
        ఐ డోంట్ వాంట్ లవ్... నా దిన దిన దో. యు డోంట్ గివ్వ్ నౌ .నా దిన దిన దో...
        బట్ ఐ డోంట్ లీవ్ నౌ .నా దిన దిన దో లెట్ మీ షో హౌ .||

రోజా పువ్వు ఓటన్దించి I L U అంటే
నాజుగ్గా నువ్ స్పందించి ఐ టూ అనవద్దె
దీనంగా దే దే అంటూ దానం ఇమ్మంటే
పోనిలే లే లే అంటూ దిల్ ఇస్తావుంటే
వలపు నైనా గెలుపు నైనా కోరుకుంటే చాలదె
ప్రాణమైనా పందేమేసి పోరకుంటే నచ్చదే
         ఐ డోంట్ వాంట్ లవ్... నా దిన దిన దో. యు డోంట్ గివ్వ్ నౌ .నా దిన దిన దో...

         బట్ ఐ డోంట్ లీవ్ నౌ .నా దిన దిన దో లెట్ మీ షో హౌ . ||

జుట్టంతా పీక్కునేంత పిచ్చేకిన్చందే
యిట్టే చేజిక్కావంటే ఏం బావుంటుందే
రిస్కంటూ ఏం లేకుంటే ఇష్కైనా చేదే
లక్కెల్లి లాక్కోచ్చేస్తే కిక్కేముంటుందే
నా దారికాదె  నా థీరీ కాదె
Take It Easy Policy...
నా తిక్క నాదే నా లెక్క నాదే
సాధిస్తా ఏదో ప్లానేసి
           ఐ డోంట్ వాంట్ లవ్... నా దిన దిన దో. యు డోంట్ గివ్వ్ నౌ .నా దిన దిన దో...

            బట్ ఐ డోంట్ లీవ్ నౌ .నా దిన దిన దో లెట్ మీ షో హౌ .||


ఇది హీరో గారి మనస్తత్వం. రవి తేజకి బాగా సూట్ అయ్యింది క్యారెక్టర్ కూడా.

ఇక హీరొయిన్ విషయానికొస్తే. వీడు నచ్చాడా-నచ్చలేదా అన్న మీమాంసలో "పోపో పొమ్మంటోందా, నన్ను రా రా రమ్మంటోందా"  అనే పాట ఆ అమ్మాయి పరిస్థితిని అద్భుతంగా చెపుతుంది.


గోరే గోరే గోగోరే గోరే గోరే గోరే గోగోరే   గోరేగోరే గోగోరే గో రే  గోరే గోగోరే గోగోరే  .... గో గో గో గో గో గో గో


పోపో పొమ్మంటోందా, నన్ను రా రా రమ్మంటోందా
నీ మనసేమంటుందో నీకైనా తెలిసిందా   |2|
చూస్తూ చూస్తూ సుడిగాలల్లె చుట్టేస్తుంటే నిలువెల్లా
ఉక్కిరి బిక్కిరి అయిపోతున్న ఊపిరి ఆడక నీ వల్ల
ఇదరా ఆదరా ఎద ఏమన్నా తెలిసే వీలుందా
              గోరే గోరే గోగోరే గోరే ||

తెగ వురుముతు కలకాలం తెర మరుగున తన భారం
మోసుకుంటూ తిరగదు మేఘం నీలా దాచుకోదుగా అనురాగం  |2|
ముల్లుగ నాటితే నీ వ్యవహారం తుళ్ళి పడదా నా సుకుమారం
మెల్లగ మీటితే నాలో మారాం పలికుండేదే మమకారం
అవునా .. అయినా.. నన్నే అంటావే నేరం నాదా
                గోరే గోరే గోగోరే గోరే ||
వెంట పడుతుంటే వెర్రి కోపం నువ్వు కంట పడకుంటే పిచ్చి తాపం
మండిపడుతుందే హృదయం మరిచే మంత్రమైన చెప్పదే సమయం  |2 |

నీతో నీకే నిత్యం యుద్ధం ఎందుకు చెప్పవె సత్యభామ
ఏం సాదిస్తుందే నీ పంతం ఒప్పుకుంటే తప్పులేదు వున్న ప్రేమ
 తగువా మగువా నా పోగరంటే నీకిష్టం కాదా
                     గోరే గోరే గోగోరే గోరే ||
మరో పాటలో హీరొయిన్ తనతో తాను..వీడిని  ప్రేమిస్తున్నానా-లేదా అనే ఆలోచనలో ఉన్నప్పుడు మనసుని ప్రశ్నిస్తూ "అటు చూడద్దన్నాన మాటాడొద్దన్నాన" అని పాడుకున్న సందర్భం లోనిది..



ధీం తన నహి రే ధీం ధీం తన నహి రే ధీం తన నహి రే ధీం ధీం తన నహి రే

అటు చూడద్దన్నాన మాటాడొద్దన్నాన
వొద్దొద్దూ అంటే విన్నావంటే  మనసా...
ఏం  పర్వాలేదనుకున్నావేమో బహుశా...

ఈ తలనొప్పెదైన నీ తప్పేంలేదన్న...
అయ్యయ్యో అంటరేమో గాని మనసా... వయసా ...
పడవలసిందేగా నాలా  నువ్విలా  హింస...
ధీం తన నహి రే ధీం ధీం తన నహి రే  ధీం తన నహి రే ధీం ధీం తన నహి రే



ప్రేమ ని కదిలించావే... తొచి తోచని తొలి వయసా
ఎందుకు బదులిచ్చావే తెలిసి తెలియని పసి మనసా
                                     అటు చూడద్దన్నాన మాటాడొద్దన్నాన ||

మునుపేనాడు ఏ కుర్రాడూ... పడలేదంటే నీ వెనకాల...
వందలు వేలు ఉండుంటారు... మతి చెడలేదే ఇలా వాళ్ళందరి వల్ల...
ఎందుకివాళ్ళ ఇంత మంటేక్కిందో చెపుతావా ....
ఏం జరిగుంటుందంటే అడిగిన వాళ్ళని తిడతావా
అందరి లాగా వాన్ని వీధుల్లో వదిలేసావ
గుండెల్లో గుమ్మం దాటి వస్తుంటే చూస్తున్నావా...
                                   అటు చూడద్దన్నాన మాటాడొద్దన్నాన ||
ఏ దారైన.. ఏ వేళైన.. ఎదురవుతుంటే నేరం తనదే...
ఇంట్లో ఉన్న... నిదరోతున్నా ... కనిపిస్తుంటే... ఆ చిత్రం నీలో ఉందే...
ఎవ్వరినని ఏం లాభం.... ఎందుకు ఎద లయ తప్పిందే..
ఎక్కడ ఉందో లోపం నీతో వయసెం చెప్పిందే...
అలకో ఉలుకో పాపం వొప్పుకునేందుకు ఇబ్బందే...
తనపై నాకే  కోపం కన్నెగ పుట్టిన నా  మీదే ...

ధీం తన నహి రే ధీం ధీం తన నహి రే ||

ఈ పాటల తో పాటు మెమరీ లాస్ గురించి హీరో పాడే పాట భలే వుంటుంది. ప్రతీ విషయాన్ని పాజిటివ్ ధోరణిలో చెప్పగలిగే సత్తా వున్న సిరివెన్నెల గారు. ఇది రోగం కాదు మహా రాజయోగం అని.. మెమరీ లాస్ మనకి లక్కీ ఛాన్స్ ... మస్త్ అని అదరగొట్టారు. సాహిత్యం బలే సింపుల్ పదాలతో నవ్వుకునేలా వుంటుంది. ఈ పాట సాహిత్యం అందుకని రాయట్లేదు గానీ.. వినాలంటే కింద క్లిక్ చెయ్యండి..



ఒక్క సారి వినండి మీకే అనిపిస్తుంది..ఇవి కిక్కెక్కించే కిక్కు పాటలు అని..

10, జనవరి 2011, సోమవారం

చూడ చక్కగున్నా లేకున్నా - ఏం పరవాలేదు

ఈ మధ్య ఒక్క సారి వినగానే ఇంత నచ్చిన పాట ఏదీ లేదు. సాహిత్యం బావున్న మంచి పాట వింటే, నేను గుర్తు కొచ్చి కాల్ చేసి చెప్పే మంచి స్నేహితులు ఉన్న అదృష్టానికి నోచుకున్న నాకు అలా పరిచయమైన పాట ఇది. (థాంక్స్ టు సూరి). "మామ! ఈ పాట బలే నచ్చింది మామ" అన్న వెంటనే అనుకున్నా, మనసుకి హత్తుకునే పాట అని. విన్నాక మనసారా మళ్ళీ మళ్ళీ వినాలని అనిపించిన మనసార చిత్రంలోని పాట. 
మంచితనం చూసి మనసుతో ప్రేమించిన అమ్మాయి.. నా ఊహల్లో నేను గీసుకున్న నా చిత్రాలకి సరిపోతావో లేదో నని మనసు అడుగుతోంది కాబట్టి నాకు ఒక సారి నీ మొహం చూపించమనే కొస మెరుపు అదిరింది.. గీతా మాధురి గాన మాధుర్యంలో 
"సరదాగా తరిమిందే మది నీపై మనసుపడి 
మురిపించే ఊహలతో ముఖ చిత్రం గీసుకుని
అది నువ్వో కాదో అని సందేహం ప్రతిసారి " అని రాసిన భాస్కరభట్ల గారికి .. హాట్స్ ఆఫ్...


పరవాలేదు పరవాలేదు
చూడ చక్కగున్నా లేకున్నా  - ఏం పరవాలేదు
నువ్వెలా వున్నా పర్లేదు  

పరవాలేదు పరవాలేదు
ఊరు పేరు వున్నా  లేకున్నా  -ఏం పరవాలేదు 
నువ్వు ఎవ్వరైనా పర్లేదు

ఓఓ.. నీకు నాకు స్నేహం లేదు
నువ్వంటే కోపం లేదు
ఎందుకీ దాగుడుమూతలు అర్ధమే లేదు
మచ్చేదో వున్నాదని మబ్బుల్లో జాబిల్లి దాగుండిపోదు
                                                       పరవాలేదు పరవాలేదు ||

ఉంగరాల జుట్టే లేదా - నాకు పర్లేదు

రంగు కాస్త తక్కువ అయినా - మరి పర్లేదు

మసి లాగ ఉంటుందని తిడతావ రాతిరిని
తనలోని కనలేమా  మెరిసేటి సొగసులని

అందంగా లేను అని నిన్నెవరూ చూడరని
నువ్వేవ్వరికి నచ్చవని నీకెవ్వరు చెప్పారు
ఎంత మంచి మనసో నీది  - దానికన్నా గొప్పది లేదు
అందగాళ్ళు నాకెవ్వరు   - ఇంత నచ్చలేదు
నల్లగా వున్నానని కోకిల కొమ్మలో దాగుండిపోదు
                                                     పరవాలేదు పరవాలేదు ||


అంత లేసి కళ్ళుండకున్నా - నాకు పర్లేదు
కోరమీసం లేకున్న గాని - మరి పర్లేదు  
పరదాలే ఎన్నాళ్ళిలా అని నిన్నేఅడగమని 
సరదాగా తరిమిందే మది నీపై మనసుపడి
మురిపించే ఊహలతో ముఖ చిత్రం గీసుకుని
అది నువ్వో కాదో అని సందేహం ప్రతిసారి
చేర దీసి లాలించలేదు
నన్నిలా ప్రేమించలేదు
అందుకే ఇంకెవ్వరు  - ఇంత నచ్చలేదు
ఎవ్వరేమన్నా సరే నా చెయ్యి నిన్నింక వదిలేది లేదు
                                                        పరవాలేదు పరవాలేదు ||


పాట లింక్ (వినాలంటే)

6, జనవరి 2011, గురువారం

నాకు తిక్క రేగిందంటే.. దుంపల వేపుడే....

మా ఇంట్లో నిత్యం జరిగే హక్కుల పోరాటంలో...
ఆధిపత్యపు పోరులో రేగిన మంటల సెగలలో
వేడి నిట్టూర్పుల బుసలు కొట్టుకుంటూ
ప్రత్యర్ధి వర్గం పైన కక్ష సాన్దిపు చర్యగా
నా పవరేమిటో చూపించాలని
సింకు కింద నున్న గూట్లోంచి
బంగాళా దుంపల్ని బయటకు తీసి
పీకల్లోతు గిన్ని నీట్లో ముంచి
ఒంకీ తిరిగిన పీలర్ తో
కసిగా వాటి తోలు ఒలచి పారేసి
పొడవాటి కత్తితో ముక్కలుగా నరికేసి
వేడి మూకుట్లో వెజిటేబుల్ నూని పోసి
ఎడా పెడా వేయిస్తూ వికటాట్ట హాసంతో
ఉప్పు కారం జల్లి అన్నంలో నంచుకుని
ఆవకాయతో పాటుగా తినేస్తాను..

నాకు గాని తిక్క రేగిందంటే..
మా ఇంట్లో దుంపల వేపుడే....

ఎందుకంటే మా ఆవిడకి అది అస్సలు పడదు మరి..
నాకు.. నా కూతురికి చాలా ఇష్టం..
నిజం చెప్పద్దూ...
అలాంటప్పుడు ఆలు FRY తింటే...
ఆ టేస్టే వేరు ... ఆ టేస్టే వేరు ...

ఇమేజ్ సోర్సు: http://www.dailyfreemovies.co.uk/
 

5, జనవరి 2011, బుధవారం

కొత్తగా రెక్కలొచ్చెనా.... ఈ పుట్టిన రోజు నాడు...

జీవితంలో ఎన్నో పుట్టిన రోజులు ఒచ్చి వెళ్లి పోయాయి..
చిన్నప్పుడు నాకు అప్పుడప్పుడు పుట్టిన రోజు నాడు కొత్త బట్టలు కట్టుకుని చాక్లెట్స్ పంచిన గుర్తు మాత్రమే.. కొంచెం ఊహ ఒచ్చాక బర్త్ డే అంటే నలుగురికీ చెప్పడానికి సిగ్గు పడే వాడిని. స్పెషల్ గుర్తింపు ఇష్టం లేక అనుకుంటాను.అప్పటికి నాకు ఏర్పడిన మంచి స్నేహ బృందం వల్ల, పుట్టిన రోజు నాడు విషెస్ తో పాటు గ్రీటింగ్ కార్డ్స్ మరియు చిన్న చిన్న గిఫ్ట్స్ అందుకునే వాడిని. ఆ తరవాత పెళ్ళైన కొత్తలో ఒకటి రెండు పుట్టిన రోజులు SURPRISE గా మా ఆవిడా చేస్తే, ఇవన్నీ ఇంత అవసరమా అని సందేహిస్తూ అందరినీ నిరుత్సాహ పరచలేక జరుపుకునేవాడిని. ఈ పుట్టిన రోజు మాత్రం నాకు నేను జరుపుకోవాలని అనుకోకపోయినా , మంచి ఆనందాన్ని మిగిల్చింది.
అన్నిట్లోకి ముఖ్యంగా నా పుట్టిన రోజు నా కూతురు ఆనందంగా కొవ్వొత్తులు ఊదుతుంటే, నా చిట్టి తల్లి ఆనందం కోసం ఇంట్లో కేకు కట్ చేసినందుకు చాలా సంతోషం వేసింది. ఆ తరవాత అందరూ గుర్తు పెట్టుకుని ఇండియా నించి కాల్ చేస్తుంటే నా పుట్టిన రోజు కన్నా, వాళ్ళ అభిమానానికి నేను పుట్టినందుకు గర్వంగా అనిపించింది. దీనికి తోడు సోషల్ నెట్ వర్క్ సైట్ లో నా పుట్టిన రోజు చూసి అందరూ నాకు FACEBOOK మీద బర్త్ డే విషెస్ చెప్తుంటే, సంతోషంతో పాటు - ఈ ఇంటర్నెట్ యుగం లో ఎవ్వరికీ తెలియకుండా గుట్టుగా పుట్టిన రోజు గడిచిపోవడం అసాధ్యం అని తేలింది.
ముఖ్యంగా నేను నమ్మిన - నిన్ను నలుగురు ప్రేమించాలంటే నువ్వు వాళ్ళ నమ్మకాన్ని వాళ్ళ బాగు కోసం వుపయోగించాలనే సూత్రం ఇందరి అభిమానాన్ని నాకు తెచ్చిపెట్టినందుకు ఎంతో సంతోషం గా ఉంది.
అందుకే ఇంత మంది పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్తుంటే ఆ ATTENTION కి కొంచెం సిగ్గు పడినా..
కొత్తగా వున్న ఈ పుట్టిన రోజు .... నాకు చాలా నచ్చింది.
అందుకని ఈ పుట్టిన రోజు ఫర్ ఏ చేంజ్....
కొత్తగా రెక్కలొచ్చెనా  గూటిలోన గువ్వ పిల్లకి...
మెత్తగా రేకు విచ్చెనా సిగ్గు చాటునున్న చందు గాడికి

అని పాడుకుంటూ.. ఈ పుట్టిన రోజు ఆఖరి క్షణాలు ఆస్వాదిస్తూ....ఇలా బ్లాగుతున్నాను...

ఇమేజ్ సోర్సు: http://www.pennyprintables.com/image-files/butterfly-card.gif

1, జనవరి 2011, శనివారం

అమ్మ గుండె.... - 1

అమ్మని ఎలాగైనా చంపెయ్యాలి... ఛ ఛ.. ఆలోచించడానికి కొంచెం భయంగా ఉంది... కానీ ఈ మధ్య జీవితం బాగా డిస్టర్బ్ అయ్యింది. మా ఆవిడకీ అమ్మకీ అస్సలు పడట్లేదు. పిల్లలు కూడా అమ్మ మీద బోలెడంత పితూరీలు చెప్తున్నారు. అమ్మకి అప్పటికీ ఒకటి రెండు సార్లు చెప్దామని ట్రై చేశా. కానీ చాదస్తం కదా.. పోనీలే అని సరిపెట్టుకున్దామంటే .. మా ఆవిడ చెప్పినట్లు మా వెనకాల అందరిలో మా గురించి చెడ్డగా చెప్తోందట.. నేను ఎలా నిలదీసి అడగను... దీనికి తోడు అమ్మ అనారోగ్యం.. చుట్టు పక్కల అందరూ ఆరా తీయడం.. అసలే మధ్య తరగతి జీవితం.. అపార్ట్మెంట్ బతుకులు.. అమ్మ మందుల ఖర్చు కోసం నా భార్యా పిల్లలు ఎన్నో త్యాగాలు చేస్తున్నారు.. ఎంత చేసినా చుట్టు పక్కల వాళ్లు మేమేదో ఆవిడని రాచి రంపాన పెడుతూ మందు మాకూ లేకుండా చేస్తున్నామని గుస గుసలు.. రాత్రుళ్ళు ఒకటే దగ్గు.. పిల్లలకి..మాకూ నిద్ర లేకుండా.. దీనికి తోడు ఎక్కడికన్నా సరదాగా ఫ్యామిలీ తో వెళదామంటే తీసుకెళ్తే మాకు కష్టం.. ఒదిలేస్తే అందరిలోనూ మాట. నలుగురులోకి ఒచ్చే పరిస్థితి కూడా కాదు. ఒంటి మీద మచ్చలు.. కుష్టి రోగి ఏమోనని అందరూ మనల్ని చూసి దూరంగా జరుగుతున్నారు అంటుంది  మా ఆవిడ..

అప్పటికీ నేను ఎంత కష్టపడి అందరికీ న్యాయం చెయ్యాలని చూసినా అమ్మ పద్ధతి మూలంగా నేను కూడా సహనం కోల్పోతున్నాను.. పోనీ ఏమైనా జాగ్రత్త పడుతుందా అంటే.. వున్న ఒక్క బంగారం గొలుసు ఎవరికో ఇచ్చేసింది.. నాన్న పోయాక నాలుగు గాజులు ఏమయ్యాయో ఇప్పటికీ తెలియలేదు.. ఎంత అడిగినా చెప్పట్లేదని మా ఆవిడ చాలా బాధ పడుతూంటుంది. అసలు అమ్మ ఎందుకిలా మారిపోయింది... ఎంత బావుండేది చిన్నప్పుడు.. నా ఆలోచనలు నా భయంకర బాల్యం లోకి లాక్కెల్లాయి.

  మేము మొత్తం ముగ్గురు సంతానం. నాకు ఊహ తెలిసిన సమయానికి  రోజూ తప్ప తాగి ఒచ్చి అమ్మని బాదే నాన్న తెలుసు. ఇల్లు ఎలా గడిచేదో నాకు అసలు తెలియదు. అందరి పిల్లల లాంటి జీవితం మాది కాదని అర్ధం అయ్యేది. నాన్న కోరల నించి మమ్మలిని రక్షించడానికి అమ్మ పడే కష్టం కనిపించేది. మీ నాన్న ఎవ్వరినో ఉంచుకున్నాడని అందరూ గేలి చేస్తుంటే వాళ్ళని ఒక తుపాకీతో కాల్చేయ్యలని వుండేది. దీపావళి కి బొమ్మ తుపాకి దిక్కు లేని నాకు ఒక తుపాకీ కావాలని, అదీ నిజం తుపాకీ.. నాన్నను గేలి చేసే వాళ్ళని కాల్చి పారెయ్యడానికి... అమ్మ అప్పుడప్పుడు చుట్టాల కి సాయం చేసి వాళ్లు జాలితో ఇచ్చిన పప్పులు, ఉప్పులు, బియ్యం మాకోసం దాచి పెట్టి మాకు పెట్టేది. మధ్య రాత్రిలో అమ్మ లేచి బాగా నీళ్ళు తాగేది. మొదట్లో అర్ధం అయ్యేది కాదు..కానీ గమనిస్తే తెలిసింది. మాకే చాలని తిండి.. అమ్మ రోజూ పస్తులుండేది. కడుపులో ఆకలికి నిద్ర పట్టకపోతే లేచి మంచి నీళ్ళు తాగి పడుక్కునేది.. చుట్టు పక్కల ఇళ్ళలో అందరికీ బట్టలు కుట్టడం, అప్పడాలు లాంటివి చేసి అమ్మడం, స్వీట్లు అవీ చేసి పార్టీ లకి ఆర్డర్లు సప్లయ్ చెయ్యడం లాంటివి చేసి ఒచ్చిన డబ్బులు నాన్నకి తెలియకుండా దాచి నా స్కూల్ ఫీసు కట్టేది.. ఇంటికి పలకరించడానికి ఒచ్చిన వాళ్లు మీ అమ్మ ఎంతో కష్టపడుతోంది నిన్ను చదివించడానికి, నువ్వు బాగా చదువుకోవాలని చెప్పేవారు. కష్టం-చదువు రెండే అర్ధం అయ్యేవి. నాకు చదువు అంటే ఎంతో ఇష్టం. బహుశా జీవితంలో ఆడుకోడానికి ఏ ఆట వస్తువూ లేకేమో. లేదా ఎప్పుడు చదువు ఆగిపోతుందో తెలియకేమో.. చదువులో ఎప్పుడూ ఫస్ట్ లోనే వుండే వాడిని. అమ్మ - ఆకలి, బడి-చదువు, నాన్న -భయం అని మాత్రమే తెలిసిన బాల్యం. ఒక్కో సారి ఆ భయం భాగా పెరిగిపోయేది.


 రోజు అమ్మ దేవుడికి దణ్ణం పెట్టి ప్రార్ధన చేసుకోమన్నప్పుడు.. దేవుడిని యేమని అడగాలో పెద్ద లిస్టు వుండేది.. అన్ని ప్రార్ధనల లిస్టుల్లోనూ ఒక్క కోరిక మాత్రం తప్పక వుండేది. అది ఎవ్వరికీ చెప్పే వాడిని కాదు. నాన్నని నువ్వు తీసుకేల్లిపో అని. అన్ని వేల సార్లు అడిగితే దేవుడు ఎందుకు కాదంటాడు. ఆ రోజు నాకు దేవుడి మీదా, ప్రార్ధన మీదా బాగా నమ్మకం కుదిరిన రోజు... ఆ రోజు నించీ ఏది మానినా నేను ప్రార్ధన మటుకు మానలేదు.. ఆ రోజు నాన్నని దేవుడు తీసుకెళ్ళిన రోజు. ఆ రోజు అదేమిటో చిత్రం గా.. అమ్మ రొజూలాగానే ఏడిచింది, కాకపోతే అందరిలో ఏడిచింది. ఎప్పుడు ఒక్కత్తే తనలో తను ఒంటరిగా ఏడిచేది. నాకు మాత్రం అసలు ఏడుపు రాలేదు. అసలు నవ్వితే బావుండదని తెలుసు, కాబట్టి నవ్వలేదు. ఈ రోజుతో దెబ్బల కష్టాలు తీరిపోయాయని చాలా ఆనంద పడ్డాను, కాని డబ్బుల కష్టాలు అలాగే వున్నాయి.

ఆ రోజు నించీ అమ్మ ఇంకా ఎక్కువ కష్టపడడం మొదలెట్టింది, మొగుడు పెట్టే బాధలు లేనందుకు అనుకుంటా... ఎక్కువ సమయం, ఓపిక వున్నందుకేమో? నేను మటుకు అమ్మ చెప్పినట్లు బుద్ధిగా చదివే వాడిని, తమ్ముళ్ళు మాత్రం అసలు మాట వినేవాళ్ళు కాదు. వాళ్లకి చదువు ఒంటబట్టలేదు. అమ్మ మంచితనాన్ని, చదువు లేని అమాయకత్వాని ఆసరాగా తీసుకుని చదువు నిర్లక్ష్యం చేసి చెడు తిరుగుళ్ళు తిరిగేవాళ్ళు. నేను అమ్మకి చెప్పినా- నాన్న భయం లేనందుకు అనుకుంటాను, వాళ్లు సరైన దారిలో పడలేదు. కానీ నేను మాత్రం అమ్మ ఆశించినట్టు గానే బాగా చదివి పదో తరగతి  ఫస్ట్ రాంకు తో పాసు అయ్యాను. 

ఆ రొజూ అమ్మ కళ్ళల్లో ఆనందం నేను ఎప్పటికీ మరిచిపోను. అందరికీ గర్వంగా చెప్పింది. ఆ రోజు అమ్మ కళ్ళల్లో మళ్ళీ నీళ్ళు చూసాను. మొట్ట మొదటి సారి అవి ఆనందంతో వర్షించాయి.. అమ్మ కష్టంతో పాటూ నేను కూడా టైపు, షార్ట్ హండు నేర్చుకుని చిన్న చిన్న మొత్తాలు సంపాదించి నా చదువుకు, ఫీసుకు లోటు లేకుండా డిగ్రీ కానిచ్చాను. పూర్తిగా చెడిపోయిన తమ్ముళ్ళు ఇల్లు వదిలి పోయేవాళ్ళు. ఎప్పుడో ఒక సారి అక్కడ, ఇక్కడ కనిపించారని చుట్టాల్లు చెప్పేవారు. ఎప్పుడో ఆరోగ్యం బాలేనప్పుడో, డబ్బులు ఐపోయినప్పుడో ఒచ్చి అమ్మ పెట్టింది తిని, పదో పరకో పట్టుకుని మళ్ళీ మాయమయ్యే వాళ్లు. జీవితం బాగానే గడిచినట్లుండేది, నాకు పెళ్లి కాకపోతే... 
                                                                      

                                                                     (సశేషం... కధ మళ్ళీ ఎప్పుడైనా కంటిన్యూ చేస్తా)

నూతన సంవత్సర శుభాకాంక్షలు...

ఈ సంవత్సరం కొత్తగా..
ఈ బ్లాగ్గు ద్వారా అందరికీ..
ఇవే నా

నూతన సంవత్సర శుభాకాంక్షలు...