ఒంటరి మనసు ప్రశ్నిస్తోంది...
అన్ని వేల పరిచయాలు ఏర్పడినా...
ఎందుకిలా మిగిలిపోయావని...
నీ స్వార్ధం నిన్నందరికీ దూరం చేసిందా అని అడిగింది...
నిస్వార్ధం తో ఏమి కూడబెట్టలేదు కదా.. అన్నాను...
నీ అవసరాలు అందరినీ పారిపోయేలా చేశాయేమో అంది.
ఏ అవసరం తీర్చుకున్నాను గనక అన్నాను
ఆశతో అందలాలు ఎక్కడానికి అందర్నీ తొక్కేసి ఉంటావు అంది
అందరికంటే కిందే వున్నానుగా అన్నాను
పక్కవాడి కష్టాల్లో పాలు పంచుకుని వుండవు అంది
కష్టాలు తీర్చిన తరవాత వాళ్ళే దూరం అయ్యారన్నాను
ప్రేమని పంచలేక పోయుంటావేమో అని అడిగింది
అప్పుడు తెలిసింది నాలో ఇంకా చాలా ప్రేమ మిగిలుందని
అందరికీ ప్రేమ, డబ్బు ఏదో ఒకటి ఇస్తానన్నా..
అందరూ డబ్బే కావాలన్నారు ...
నా దగ్గర ప్రేమ మిగిలిపోయింది
పరిచయమైన వాళ్లు అవసరం తీరి
ముఖం చెల్లక దూరం అయిపోయారు
ఇప్పుడు చేతిలో చిల్లి గవ్వ లేదు
అందుకే ఎవరూ దగ్గరికి రావట్లేదు
కానీ నా దగ్గర బోలెడంత ప్రేమ ఉంది
పంచడానికి తెలిసున్నోలు లేరు
విశాలమైన ప్రపంచం ఉంది
మనసుకి సమాధానం దొరికింది
నా విలువ నాకు తెలిసింది
Image source: http://fsb.zedge.net/content/6/1/2/4/1-2007746-6124-t.jpg
24, డిసెంబర్ 2010, శుక్రవారం
Tangled - చివరి డిస్నీయానిమేషన్ ప్రిన్సెస్ చిత్రమా?
ఈ మధ్య కాలంలో ఒచ్చిన డిస్నీ ప్రిన్సెస్ సినిమాలు అంతగా పిల్లలని ఆకట్టుకోలేదు. ఇంతకు ముందు ఒచ్చిన "ప్రిన్సెస్ అండ్ ది ఫ్రొగ్" చిత్రం కేవలం ఒక వర్గం ప్రేక్షకులను (అది కూడా ఒక రంగు అనచ్చేమో) కొంత ఆకట్టుకున్నా, ఆశించినంత గుర్తింపు గానీ, రెవిన్యూ గానీ తేలేదు. చిన్న పిల్లల్లో ముఖ్యంగా ఆడ పిల్లల్లో వుండే ప్రిన్సెస్ క్రేజ్ ని డిస్నీ సంపూర్ణంగా కాష్ చేసుకోవట్లేదని అందరికీ అనిపిస్తోంది. టింకర్ బెల్ పిల్లలని కొంచెం ఆకర్షించినా అవి ఫైరీలే గనుక ప్రిన్సెస్ కుమ్మరించినంత లాభాలు తేవడం కొంచెం కష్టం. ఎందుకంటె ప్రిన్సెస్ తో IDENTIFY చేసుకున్నంతగా ఆడపిల్లలు ఫైరీ లతో IDENTIFY చేసుకోలేరు. నిజానికి పిక్సార్ తో పాటుగా డిస్నీ నిర్మిస్తున్న చిత్రాలు మంచి గుర్తింపుతో పాటు ఆర్ధికంగా మంచి లాభాలు తెప్పిస్తున్నపటికీ, డిస్నీ సొంతంగా నిర్మించే చిత్రాలు ఎక్కువ శాతం నష్టాలనే మిగులుస్తున్నాయి.డిస్నీ లో CREATIVITY తగ్గిందని అందరికీ అనిపిస్తున్న తరుణంలో TANGLED చిత్రం రిలీజ్ అయ్యింది. పైగా ఇదే తమ చివరి ప్రిన్సెస్ చిత్రమని, ఇంతకు ముందు అనుకున్నమరో రెండు ప్రిన్సెస్ చిత్రాల నిర్మాణం రద్దు చేసామని డిస్నీ వెల్లడించిందని L A TIMES లో ఆర్టికల్ కూడా రాశారు. అసలే మా లిటిల్ ప్రిన్సెస్ ప్రతీ దానికీ నేను స్లీపింగ్ బ్యూటీ అని ప్రిన్సెస్ డాన్సు చేస్తూ వుంటుంది. ఎప్పుడూ డిస్నీ తీసుకెళ్ళమని అంటూ వుంటుంది. నా కూతురు రాత్రి పడుకోబోయే ముందు చదివే కధల్లో ఒకటి ఈ TANGLED కధ. ఇది బావుందన్న రివ్యూ లని చదివి, సరే మా సిరికి చూపిద్దామని ఒక రోజు నడుం కట్టాను.
పొడవైన జుట్టు అన్నది కధకి అసలైన ఆకర్షణ. ఇది చూపించి రోజూ పాలు తాగితే నీకు కూడా అంత జుట్టు ఒస్తుందని మా అమ్మాయిని నమ్మించి పాలు తాగించేయ్యచ్చు అనే కుళ్ళు ఐడియా కూడా ఉందనుకోండి.
ఇక కధ విషయానికొస్తే:
అనగనగా ఒక రాజు-రాణి. కడుపుతో వున్న రాణి గారికి విపరీతమైన అనారోగ్యం చేస్తే రాజ్యంలో అందరూ ఒక ప్రత్యేకమైన పువ్వు కోసం గాలిస్తుంటారు. ఆ పువ్వు గోతల్ అనే ఒక అనాకారి ముసల్ది తను నిత్య యవ్వన వతిగా కనిపించాలని, తన కోసమే దాచిపెట్టుకుని వుంటుంది. ఆ పువ్వు రాణి గారి అనారోగ్యం నయం చేస్తుందని నమ్మకం. ఆ రాజు సైన్యం ముసల్ది దాచిన పువ్వుని వెతికి పట్టుకోస్తారు.అది తిని ఆరోగ్యంగా పండంటి పాపని కంటుంది రాణి. ఆ పాపే రఫున్జల్. ఆ పాప జుత్తు కు రోగాలను నివారించే, యవ్వనంగా కనిపించే మహిమ/శక్తి వుంటుంది.
ఆ జుట్టు కోసం రాజమందిరంలోకి దొంగతనంగా ఒచ్చిన అనాకారి ముసల్ది (గోతెల్) , జుట్టు కత్తిరించి చూస్తుంది. కత్తిరించిన జుట్టుకి మహిమ లేదని గ్రహించి, పాపని ఎత్తుకేల్లిపోతుంది. అలా ఎత్తుకెళ్ళిన రఫున్జల్ ని ఒక నిర్జన ప్రదేశంలో వున్న పొడవైన భవనం లో దాచి పెడుతుంది. తనే తల్లినని రఫున్జల్ ని నమ్మించి, ఆ భవనం నించి కిందకి దిగకుండా కట్టడి చేస్తుంది గోతల్. రఫున్జల్ పెంపుడు జంతువు పాస్కాల్ అనబడే ఒక ఊసరవెల్లి.
తప్పిపోయిన యువరాణి కోసం ప్రతీ పుట్టిన రోజు నాడు రాజు-రాణి లతో పాటు రాజ్యంలో అందరూ వెలిగే లాంతర్లను ఒదులుతుంటారు.
ఆ రాజ్యంలో దొంగతనాలు చేసే FLYNN యువరాణి కిరీటం దొంగిలించి పారిపోతూ ఆ భవనం చేరుకుంటాడు. అతన్ని కట్టి పడేసి, అతని దొంగ సొమ్ముని దాచేసి, నాకు ఆ లాంతర్లు ఎగరేసే స్థలం చూపించి మా అమ్మ ఒచ్చే లోపు తిరిగి తీసుకొస్తే నీవి నీకిస్తానని ఒప్పందం కుదుర్చుకుని అతనితో మొదటి సారిగా బయటకు అడుగు పెడుతుంది రఫున్జల్. FLYNN మీద పగబట్టి MAXIMUS అనే ఒక గుర్రం వెతుకుతూ వుంటుంది. ఈ గుర్రం తన హావ భావాలతో అందరినీ బాగా ఆకట్టుకుంటుంది. రఫున్జల్ ని బయపెట్టడానికి ఒక భారీ కాయులున్న దొంగలున్న బార్ లాంటి చోటుకి తీసుకెళతాడు FLYNN. MAXIMUS , సైనికులు, దొంగ సొమ్ము వాటా కోసం FLYNN సహచరులు తరుముతుంటే అక్కడి నించి తప్పించుకుని రాజకోట దగ్గరకి వెళ్తారు.
ఇంతలో రఫున్జల్ మీద అనుమానం ఒచ్చి గోతల్ భవనం వద్దకి తిరిగి ఒచ్చేస్తుంది. రఫున్జల్ లేదని తెలుసుకుని వెతుక్కుంటూ వెళ్తుంది. FLYNN రఫున్జల్ కి లాంతర్లు వొదిలే ప్రదేశం చూపిస్తాడు (ఇది చాలా అద్బుతంగా ఉంది. యానిమేషన్ ఎంత అభివృద్ది చెందిందో ఇలాంటి సీన్లు చూస్తే తెలుస్తుంది). వీళ్ళ ఇద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. FLYNN ని దొంగగా, మోసగాడిగా నమ్మించి, వీళ్ళ మధ్య అపోహలు సృష్టించి గోతెల్ రఫున్జల్ ని తిరిగి తీసుకెళ్తుంది. FLYNN ని కట్టేసి రాజ సైనికుల దగ్గర చేరేలా ఒక పడవలో ఒదిలేస్తుంది.స్పృహ ఒచ్చిన FLYNN - MAXIMUS మరియు బార్ లోని భారీ కాయుల సాయంతో తప్పించుకుని రఫున్జల్ కోసం భవనం దగ్గరకి ఒస్తూ ఉంటాడు. ఇంటికి ఒచ్చిన రఫున్జల్ ఆ లాంతర్లు తన కోసమే ప్రతీ ఏడు ఒదులుతున్నారని తెలుసుకుని గోతల్ ని నిలదీస్తుంది. నిజం తెలిసిపోయిందని రఫున్జల్ పారిపోకుండా బంధిస్తుంది గోతల్.
మామూలుగా అయితే తరవాత కధ ఊహించంచ్చు. కానీ ఇక్కడే డిస్నీ వాళ్ళు కధని కొంచెం మార్చారు. అందరినీ ఆకట్టుకునే climax చెప్పాలని ఉంది, కానీ ఇక్కడ చదివే వాళ్లకి సినిమా చూస్తే థ్రిల్ వుండాలి కాబట్టి నాకు బాగా నచ్చిన CLIMAX ఇక్కడ చెప్పట్లేదు. చూసి మీరే తెలుసుకోండి.నచ్చిందో-లేదో కామెంట్లో కొట్టండి.
ఈ సినిమా ఆడపిల్లలకి బాగా నచ్చుతుంది. వాళ్ళతో పాటు అబ్బాయిలకే కాదు పెద్ద వాళ్లకు కూడా బావుంటుంది. నాలుగేళ్ళు పైనున్న వాళ్ళు చూడవచ్చు. పాటలు కూడా బావున్నాయి. యానిమేషన్, కధ, పాటలు, CLIMAX ఈ సినిమా హై లైట్. మంచి సందేశం కూడా ఉంది ఈ చిత్రంలో. ఇంట్లో ఆడ పిల్లలుంటే ఈ సినిమా తప్పకుండా చూపించండి. మళ్ళీ డిస్నీ వాళ్ళు ఇలాంటి సినిమా ఇంకోటి తీస్తారో, లేదో?

15, డిసెంబర్ 2010, బుధవారం
కూతురి చావుని కోరుకున్న మా అమ్మమ్మ - ఒక గుజారిష్ తల్లి
చాలా మందికి గుజారిష్ నచ్చలేదు అని రాశారు. ఎన్నో రివ్యూ లు చదివి, అందులో చాలా మంది చూడక్కర్లేదు అని రాసినా, డబ్బులు వేస్ట్ అని చెప్పినా, ఇంటర్ర్నేట్ లో ఈ సినిమా వుందని లింకులు పంపినా నేను ఆగలేదు. అంతకు ముందు సంజయ్ సినిమాలు కొంచెం నన్ను నిరుత్సాహ పరిచాయి, ఐనా సరే ఈ సినిమాకి వెళ్ళాను. చూసినప్పటి నించీ దీని గురించి రివ్యూ రాద్దామని ప్రయత్నం. ఈ సినిమా నన్ను చాలా బాధ పెట్టింది. అంటే చూడలేనంత చెత్త సినిమా అని కాదు. మరో విధంగా ఆలోచనల్లో వెంటాడి. ఈ సినిమాలో హ్రితిక్ తల్లిని కోర్ట్ లో ఒక ప్రశ్న వేస్తారు, "చావు కోసం నీ కొడుకు పెట్టుకున్న అర్జీని మీరు సమర్ధిస్తారా?" అని. ఈ ప్రశ్న నన్ను అప్పటినించి వెంటాడుతూ ఉంది. చచ్చిపోయిన మా అమ్మమ్మ లాగ హ్రితిక్ తల్లి "అవును" అంటుంది. ఎంత నిర్దాక్షిణ్యం, ఒక తల్లి ఇలా అనచ్చా? అనిపిస్తుంది. కానీ ఇలా అనే తల్లులు వున్నారు. ఆ తల్లి బాధ మనకి అర్ధం కాదు.
చిన్నప్పుడు నాకూ అర్ధం కాలేదు, ఎలా అంటే నాకో అమ్మమ్మ వుండేది. ఎంతటి సహనశీలి అంటే నాకు తెలిసి ఆవిడ ఎవ్వరినీ తిట్టి ఎరగదు, ఈవిడకి కోపం ఒస్తే ఎప్పుడైనా చూడాలని అనుకునేవాడిని. ఎంత ట్రై చేసి కోపం తెప్పించినా కేవలం "కక్క గట్ట" అన్న తిట్టుతో సరిపెట్టేసేది. నేను, మా ఆన్నయ్య అమ్మ ఇంట్లో లేని టైములో ఇల్లు కిష్కింద చేసి, రక్తాలు ఒచ్చేల కొట్టుకున్నా కూడా ఏమీ అనేది కాదు. గయ్యాళి గంపల్లాంటి కోడళ్ళు, పెళ్ళాల నోరుకి జడిసి బతికే కొడుకులు, ముగ్గురు ఆడపిల్లల పెళ్లి చేయకుండా పోయిన భర్త, భర్త పోయే నాటికి బడికెళ్లే చిన్న కొడుకు, ఉద్యమాలలో జైలుకెళ్ళిన పెద్ద కొడుకు, చిల్లి గవ్వ లేని ఆస్తి. ఇవన్నీ కూడా నెట్టుకుని ఎవ్వరినీ నొప్పించకుండా చివరి దాకా బతుకు లాగించిన మా అమ్మమ్మకి మిగిలిన బెంగ ఏమిటయ్యా? అంటే అది తన పెద్ద కూతురి చావు. బతికినంత కాలం ఎవరి మీద ఒక్క పితూరీ చెప్పడం గానీ, తిట్టు గానీ తిట్టి ఎరగదు. మాటకి ముందు ఒక "అయ్యో పాపం" అని చేర్చి మాట్లాడేది. అంతటి సహనశీలి ఒక విషయంలో నాకు నచ్చేది కాదు. అదేమిటంటే తన పెద్ద కూతురు తనకంటే ముందే చచ్చిపోవాలని భగవంతుని కోరేది. అలా అన్నప్పుడల్లా నేను "అదేంటి అమ్మమ్మ? ఏ తల్లైనా అలా కోరుకుంటుందా? తప్పు కదా!" అని అనేవాడిని. నేనే కాదు, అమ్మ, అక్క అందరూ ఇలాగే అనేవాళ్ళం. "మీకు తెలీదర్రా? దాని అమాయకత్వానికి, పరాధీన బతుక్కి. నేను ఉండగానే నా కళ్ళ ముందు పోతే నేను ప్రశాంతంగా కన్నుమూస్తాను" అనేది. మానసికంగా ఎదగని పెద్ద కూతురు తన కంటే ముందే పోవాలని ఎంతగానో ప్రార్ధించిన అమ్మమ్మ ముందే చచ్చిపోయింది. ఇప్పుడు ఆ పెద్ద కూతురి కష్టాలు చూస్తుంటే నాకు అమ్మమ్మ లోని అమ్మ మనసు అర్ధం అవుతుంది. "చావు కోసం నీ కొడుకు పెట్టుకున్న అర్జీని మీరు సమర్ధిస్తారా?" అన్న సినిమాలో ప్రశ్నకి, శాంత మూర్తి ఐన మా అమ్మమ్మ "అవును..అవును...ను...ను....ను.... " అని అరిచి బిగ్గరగా సమాధానం చెప్పినట్లు వుంటుంది - ఆ సమాధానం నా చెవుల్లో ప్రతిధ్వనిస్తూ.
నిజానికి ఈ సినిమా చాలా బాగా తీసాడు. అయితే ఇది సగటు ప్రేక్షకుడికి అస్సలు నచ్చదు. చాల మంది హ్రితిక్ నో, ఐస్ నో చూసి డాన్సుల కోసం సినిమా కెళ్తే చాలా నిరుత్సాహ పడతారు. అలాగే చాలా మంది రివ్యూ లలో రాసినట్టు సంజయ్ లీల బన్సాలి కధలు ఇంగ్లీషు సినిమాలు చూసి చాలా మటుకు కాపీ కొట్టినవే. నేను ఈ సబ్జెక్టు మీద ఒచ్చిన "ది సీ ఇన్ సైడ్" లాంటివి చూడలేదు. అదీ గాక కొంచెం సినిమా విషయంలో కొందరు బావుందని అన్నారు. EUTHENASIA లేదా MERCY KILLING లాంటి టాపిక్ మన జనాలకు ఎక్కదు. ముఖ్యంగా మన దేశంలో జనాలకి సినిమా అంటే ఒక ENTERTAINMENT , డబ్బులు పెట్టి ఏడిపిస్తే ఒప్పుకునేది లేదు అంటారు ప్రేక్షకులు. కాబట్టి ఈ సినిమా ఎలా చూసినా జనాలకి నచ్చదు. అంత మాత్రాన నాలాంటి సినిమా పిచ్చోడు ఒదిలేస్తాడా? సినిమా బాలేక పోతే, బన్సాలి అంతటి ఘనుడు ఎక్కడ పప్పులో కాలేసాడో మనం చూసి, ఎవడూ అడగకపోయినా మన అభిప్రాయాన్ని చెప్పెయ్యమూ? అదే మరి సినిమా పిచ్చి అంటే .....
ఇక సినిమాలో కొస్తే, చాలా POSITIVES వున్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా హ్రితిక్ రోషన్. ఆ తరవాత సినిమాటోగ్రఫీ. ముఖ్యంగా అన్ని పాత్రలూ పరిమితికి మించకుండా చేసారు. మేజిక్ అయితే హ్రితిక్ చాలా అద్భుతంగా ఒక డాన్సు చేసినట్టు, భలే పండించాడు. ఈ పాత్రకి హ్రితిక్ తప్ప ఇంకొకళ్ళు న్యాయం చెయ్యలేరు అన్న విధంగా నటించాడు. ఐసు పరవాలేదు అనిపించింది, నాకైతే కొంచెం వయసు ముదిరిన ఛాయలు కనిపించాయి. ఆ పాత్ర ఐసు మాత్రమే చెయ్యగలదు అనిపించే పాత్ర కాదు. సినిమాలో కొన్ని సీన్లు గుండెలు పిండేస్తాయి. పెద్ద హైలైట్ ఏంటంటే నాకు బాగా నచ్చిన పాట "WHAT A WONDREFUL WORLD " సినిమాలో వాళ్ళ అమ్మ దహన కాండ దగ్గర హ్రితిక్ పాడతాడు. ఈ పాట నేను అంతకు ముందు చాలా సార్లు విన్నాను. దీనిని LOUIS ARMSTRONG చివరి దశలో రాసిన పాట. మడగాస్కార్ అనే యానిమేషన్ సినిమాలో కూడా ఈ పాట చిన్న బిట్టు ఒస్తుంది. ఇది చాలా అద్భుతమైన పాట. ఈ పాట 1969 లోది అయినా, ఆ తరవాత ఎంతో మంది ఆర్టిస్టులు ఈ పాటని మళ్ళీ మళ్ళీ చాలా చోట్ల వాడారు. ఈ సినిమాలో ఆ సందర్భానికి ఈ పాట మనకి కన్నీళ్ళు తెప్పిస్తుంది. తన మొదటి మేజిక్ ట్రిక్ గురించి హ్రితిక్ చెప్తుంటే అతని శిష్యుడు "అయితే కురిసే నాణెములు అన్న మాట మీ మొదటి ట్రిక్" అని అంటే...... "కాదు, అమ్మ చిరునవ్వు" అన్న సెంటిమెంటు బాగా పండింది.
చివర్లో హ్రితిక్ స్పీచ్ ఒక అద్బుతం, మిగిలిన పాత్రలను గురించి హ్రితిక్ చెప్పినదానికి తన కవిత్వం జోడించి దీన్ని అమోఘంగా తెలుగులో రాసిన నరేష్ నున్నాగారి నవతరంగం బ్లాగు పోస్ట్ చదవండి.
అయితే సినిమా లో స్టొరీ చెప్పిన పద్ధతి కొంచెం మారిస్తే ఇంకా క్లిక్ అయ్యేదేమో. సినిమాలో హ్రితిక్ బాధ మనకి అర్ధం అయ్యేటప్పటికి మనకి సినిమా మూడు ఒంతులు అయిపోయినట్లు వుంటుంది. సినిమాలో ఒకటి రెండు పాత్రలు తొందరగా హ్రితిక్ నిర్ణయంతో ఏకీభవిస్తాయి, కానీ మిగిలిన పాత్రల లాగ మనము కూడా తేల్చుకోలేకపోతాము. అయితే మొదటి నించీ మనకి హ్రితిక్ తరపునుంచి సినిమాని చూపిస్తే, చివరకి మనమే పాపం చచ్చిపోనివ్వచ్చు కదా! అనుకుంటాము. పక్క వాడు పడిపోతే నవ్విన వాళ్లకి వాళ్ళు పడిపోయాక గానీ తెలియదు ఆ బాధ ఎలా వుంటుందో. ఇలా బాధ పడే వాళ్ళు మనకి ఒకళ్ళు కూడా తారసపడక పోతే మనకి ఇది అర్ధం అవ్వడం కష్టం. ఇందులో హ్రితిక్ కి శరీరం మెదడు మినహా చచ్చుబడి పోతుంది, కిడ్నీలు చెడిపోయి, గుండె బలహీనమై, ఊపిరి తిత్తులు క్షీణించి ఏనాటికైనా నయం అవచ్చు అన్న ఆశ చచ్చిపోతుంది. అలాంటి మనిషి చచ్చిపోవాలని అర్జీ పెట్టుకుంటాడు. వృద్ధాప్యంలో అనారోగ్యాలు వున్నా, కొంచెం కాళ్ళూ చేతులూ ఆడుతూ, ఆర్ధికంగా పిల్లల మీద ఆధారపడే పరిస్థితుల్లో , వాళ్ళు సరిగ్గా పట్టించుకోక, పలకరించే దిక్కులేక ఎప్పుడు చస్తానురా అని ఎదురు చూసే మనుషులు మన చుట్టూ వున్నారు. వాళ్ళని మనం పలకరించి చూస్తే తెలుస్తుంది. విదేశాలకి వెళ్లి పది ఏళ్ళు ఐనా ఒక్క సారి ఇండియా ఒచ్చి తల్లి తండ్రులని చూడని పిల్లలు, ఒకే ఊరులో వున్నా పట్టించుకోని పిల్లలు, పెళ్లి అయ్యాక పెళ్ళాం బెల్లం అయ్యి - తల్లి తండ్రులు శత్రువులు అనుకుని పలకరించని పట్టించుకోని పిల్లలు వాళ్ళ అమ్మ-నాన్నల మనసుల్లోకి తొంగి చూస్తే తెలుస్తుంది... మనకి విలువ లేని మన మనుషులే మనల్ని పట్టించుకోని వాళ్ళు ఒక్క సారైనా అలా ఆలోచిస్తారని.
ఒక మనిషి చావుని కోరుకోడం మనం సమర్ధించం. ఎందుకో మనకి పూర్తి అవగాహన లేకపోయినా, అది అంతే అనుకుంటాము. చాల మంది దృష్టిలో అది భగవంతుడి పని. కానీ ఒక మనిషి జీవితానికి ఒక్కో సారి బతుకే శిక్ష అయితే? నేను ఈ సినిమా ఒక పదిహేను , ఇరవై ఏళ్ళ క్రితం చూస్తే నేను కూడా తప్పు అనుకునేవాడినేమో. కానీ కొన్ని జీవితాలు చూసాక ఒక్కో సారి నాకు కొందరి విషయంలో అది తప్పు కాదేమో అనే ఆలోచన ఒస్త్తుంది. ముఖ్యంగా మా పెద్దమ్మ జీవితం చూసి. బతికినంత కాలం తన రెక్కల మాటున మానసికంగా యదగని కూతుర్ని లోకులనించి, మాటలతో తూట్లు పొడిచే రాబందుల్లాంటి తన కోడల్లనించి అరవై ఏళ్ళు రక్షించిన మా అమ్మమ్మ తల్లి మనసు తొమ్మిదేళ్ళ క్రితం తన ప్రాణం పోయేటప్పుడు దీని గతి ఏంటా? అని ఆలోచిస్తూ ఎంత వేదనకి గురి అయ్యుంటుందో! తమ అధీనంలో వున్న మా పెద్దమ్మని హీనంగా చూస్తూ చెల్లెళ్ళ ఇంటికి కూడా పంపకుండా చూసే మా అత్తల రాక్షసత్వాలు అర్ధం కాని ఆరేళ్ళ పసి మనసుతో అరవై తొమ్మిదేళ్ళ మా పెద్దమ్మ పెట్టే కన్నీటి జీవితానికి మృత్యువు ముగింపు కోసం మా అమ్మమ్మ ఆత్మ ఈ లోకంలోనే ఎదురుచూస్తోందేమో?

1, డిసెంబర్ 2010, బుధవారం
ఆరంజ్ అందరికీ నచ్చదు - కానీ కొందరిని ఆలోచించేలా చేస్తుంది
చిన్నప్పుడు మా అమ్మమ్మ చెప్పినట్లు నీరు పల్లమెరుగు , అలాగే ప్రేమ కూడా అంతే. స్వచ్చమైన ప్రేమ ఎప్పుడూ మనకి తల్లి తండ్రుల నించి దొరుకుతుంది. అలాగే మనం కూడా మన పిల్లలకి ఇచ్చినంత ప్రేమ మనకి జన్మ ఇచ్చిన తల్లి తల్లి తండ్రులకు కూడా ఇవ్వం. ఎందుకంటే ఆశించకుండా ఇచ్చే ప్రేమే గొప్పది. ఇదంతా ఎందుకు చెపుతున్నానంటే ఈ సినిమా సబ్జెక్టు జీవిన్తాంతం ప్రేమించడం సాధ్యం కాదు అన్న హీరో స్టొరీ. అయితే అది చేదు నిజం. ప్రేమని అందమైన రంగులలో ప్యాక్ చేసి అమ్మే సినిమా అనే ఒక వస్తువుని నిజం చెప్తానంటే కొనుక్కోడానికి ఎవడూ రాడు. అందుకనే ఆరంజ్ అందరికీ నచ్చదు. పరుగు కూడా ఇలాంటి నిజం చెప్పే ప్రయత్నం. అదీ ఆడలేదు.
సినిమా లో కొన్ని మంచి పాయింట్స్ ఏంటంటే - అందరూ ప్రేమ వుందని అబద్ధం చెప్పి తన భాగస్వామిని నమ్మిస్తారు.
నిజం చెప్పి ప్రేమించడం కష్టమే. అలాగే కొన్ని ఏళ్ళ తరవాత ప్రేమ కరిగిపోతున్దన్నది కూడా వాస్తవమే. విడిపోయే అవకాశాలు చాలా మందికి ఒచ్చినా వాటిని ఎవ్వరూ (చాలా మంది) వుపయోగించుకోరు. చివర్లో ఇంకొంచం ప్రేమించే ప్రయత్నం చేస్తా అన్న కాన్సెప్ట్ బావుంది.మన ప్రేమ మన కార్ హెడ్ లైట్ లాంటింది - దాన్ని నమ్ముకుని ముందుకు వెళ్ళాలి కానీ, అవతలి వాళ్ళ ప్రేమ ని నమ్ముకుని ముందుకు వెళ్ళడం అనేది ఎదుటి బండి హెడ్ లైట్ లో చీకట్లో డ్రైవ్ చెయ్యడం అన్నది మంచి ఉదాహరణ. భాస్కర్ ఆలోచనలు బావున్నా, దానికి మంచి పాయింట్స్ తయారు చేసుకున్నా, సబ్జెక్టు చెప్పే పద్ధతి మార్చాలి.
ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ కొంచెం డ్రా బ్యాక్. ముఖ్యంగా జేనేలియా హెయిర్ స్టైల్ చాలా చండాలంగా ఉంది. ఆ హెయిర్ స్టైల్ మూలంగా కొంచెం ముదురుగా కనిపించింది. చరణ్ నవ్వు, DIALOGUE డెలివరీ అస్సలు బాలేదు. ఈ నాటి తెలుగు హీరో లెవ్వరూ పెళ్లి అనే పదాన్ని సరిగ్గా పలకలేరు. ఎవడైనా పెళ్లి అని సరిగ్గా అంటే వాడికి ఉత్తమ నటుడు అవార్డు ఇచ్చేయచ్చు. దానికి తోడు సినిమాలో సగం వరకు మనం హీరో కాన్సెప్ట్ తో ఏకీభవించం.తరవాత మనకి హీరో కాన్సెప్ట్ ఎక్కే టైం కి CLIMAX ఒచ్చేస్తుంది. చివరకి హీరో కాన్సెప్ట్ మార్చేస్తాడు. సినిమా మొదటి నించి మనం ప్రేక్షకుడిని మనతో తీసుకెళ్ళకపోతే ఆ సినిమా చివరకి నచ్చడం చాలా కష్టం. దానికి తోడు పాటలు సినిమాలో అంత IMPACT అనిపించలేదు. బయటే బావుండి వుంటాయి. FIGHTS అసలు సినిమాకి నప్పలేదు. ఫస్ట్ హాఫ్ లో అయితే కొంచెం లిప్ సింక్ కూడా సరిగ్గా లేనట్లు అనిపించింది. సినిమాలో అన్ని పాత్రలు -చివరకి హీరో తో సహా తన అభిప్రాయాన్ని మార్చుకుంటారు. దానితో ప్రేక్షకుడు అస్సలు ఒప్పుకోడు. సినిమా అంతా అందులో పాత్రల లాగే CONFUSE ఐన ప్రేక్షకుడు సినిమా బాలేదు అన్న క్లారిటీ తో హాలు నించి బయటకు ఒస్తాడు.
అసలు మనం కోరుకునే ప్రేమ, గుర్తింపు కోసం మనం పడే తపన మాత్రమే. అలా ప్రేమించబడాలంటే మనలో ప్రేమించ దగ్గ లక్షణాలు వుండాలి. ప్రేమించుకునే ఇద్దరి మధ్య మొదట్లో వుండేది ఆకర్షణ మాత్రమే. అది కరిగిపోయే నాటికి వాళ్ళ మధ్య అవగాహన కుదిరితే ఆ బంధం నిలుస్తుంది. ఆ అవగాహనకి పునాది నమ్మకం. మనం అవతల మనిషి మంచి కోసం మన స్వార్ధం లేకుండా కృషి చేసినప్పుడే అవతల మనిషి మనల్ని తన కోసం ప్రేమిస్తాడు. అవన్నీ ఒదిలేసి ప్రేమ అనే గుర్తింపు కోసం నిత్యం డిమాండ్ చేస్తూ అవతల మనిషిని సతాయిస్తుంటే, ప్రేమ సంగతి దేవుడు ఎరుగు - భరించడమే కష్టం అయిపోతుంది.
సినిమాలో పీసులు పీసులు గా చెప్పిన కాన్సెప్ట్స్ బావున్నాయి. మహిళా ప్రేక్షకులకు అస్సలు నచ్చదు. కానీ కొంచెం పరిపక్వత వున్న వాళ్ళని ఆలోచించేలా చేసే కాన్సెప్ట్స్ వున్నాయి. ఆలోచించేలా చేసినా కూడా సినిమా నచ్చుతుందని లేదు.
అందుకే ఈ సినిమా మీద నా రివ్యూ, "ఆరంజ్ అందరికీ నచ్చదు - కానీ కొందరిని ఆలోచించేలా చేస్తుంది".

23, నవంబర్ 2010, మంగళవారం
గుజారిష్ కవిత రూపం
బ్రతుకే బరువైతే
ఆశే కరువైతే
మృత్యువు రానంటే
జాలితో చంపెయ్యమంటే
వైద్యుడు వద్దన్నా
లోకం కాదన్నా
చట్టం ఒప్పుకోకున్నా
నీ భాద నాకు తెలుసని
చెలిమి చేసిన
చల్లని సాయం
చెలిగా మారి
చంపేసిన కధే
ఈ గుజారిష్
( గుజారిష్ సినిమా చూసి ఒచ్చాక ఇలా రాయాలనిపించి)

15, నవంబర్ 2010, సోమవారం
అదే మా రోజుల్లో ఐతేనా .. కాలిపోయిన కాకర పువ్వోత్తులు - పేలని బాంబులతో
అసలు మా రోజుల్లో దీపావళి తో పోలిస్తే ఈ రోజుల్లో దీపావళి ఎందుకూ పనికిరాదు. అదే మా రోజుల్లో ఐతేనా..... వయసయిపోయిన తర్వాత అందరూ ఇలాగే మాట్లాడతారు అని అనుకుంటున్నారు కదూ? కాదండీ బాబూ. ఇది నిజ్జంగా నిజం. మారిన కాలంతో పాటూ మారిపోతున్న అలవాట్లు, మనుషులకి పండగ అంటే అందులో వుండే అసలు మజా రోజు రోజుకీ తగ్గిపోయి - ఒక సెలవు అనో .. లేదా సినిమా అనో.. లేదా నాలుగు దీపాలు పెడితే, నలభై - టపాకాయలు కాలిస్తే దీపావళి అనో అనిపించేలా చేస్తోంది. అసలు పండగ అంటే నా దృష్టిలో సందడి. మళ్ళీ మా రోజుల్లోకి వెళ్ళిపోతే...
అసలు దీపావళి ఒస్తుందంటే ఎంత ముందుగా సిద్ధం కావాలి. ఇంట్లో చిన్నపిల్లల లెక్క పెట్టుకుని, ఎంత మంది వుంటే అంత ఎక్కువగా మతాబులు, చిచ్చుబుడ్డ్లు చేసుకోవాలి. వీటి తయ్యారీకి మందు పొడి తయ్యారు చేసుకుని ఎండ బెట్టాలి. బయట దొరికే మట్టి బుడ్లు కొనుక్కుని, న్యూస్ పేపర్ కాయితాలతో మైదా చేసుకుని అంటించి మతాబుల గొట్టాలు రెడీ చేసుకోవాలి . ఓపిగ్గా మందు వాటిలో దట్టించి కూరుకోవాలి. ఇంట్లో పెద్ద అన్నయ్యలో. మామయ్యలో, బాబాయిలో వుంటే పేకముక్కలతో తారాజువ్వలు చెయ్యడం పెద్ద గొప్ప. మనకి అవి చూసే అవకాశమే ఇస్తారు, కొంచెం బతిమాలితే- కాయితాలు చిన్నగా కట్ చేసుకుని సిసీన్ద్రీలు తయారు చేసుకోడం లో మనం హెల్ప్ చెయ్యచ్చు. అల్లా చెయ్యకపోతే మనల్ని అసలు కాల్చనివ్వరని మనకి ఒకటే వర్రీ. అబ్బో అవన్నీ ఎండబెడుతూ వుంటే ఎప్పుడు కాలుస్తామా అని ఎంత ఆత్రంగా ఉండేదో. ఇంక పండగ దగ్గరికి ఒచ్చినా ఇంట్లో ఇంకా కాకర పువ్వోత్తులు, బాంబులు కొనట్లేదని ఒకటే టెన్షన్. అమ్మ దగ్గిర రోజూ బోలెడంత గొడవ చేసి, పదో-పావలనో తీసుకుని బయటకు వెళ్లి చిన్న చిన్న టేపులు (అవే తుపాకీలలో పెట్టుకుని కాల్చేవి) లాంటివి తెచ్చుకుని, నేల మీద పరిచి రాయితో కొట్టి పేల్చడం. అలా కాలుస్తే కాసేపు ఆనందం. మన అదృష్టం బావుంటే ఇంటి కొచ్చిన యే చుట్టమో ఐదు రూపాయలిస్తే అది అమ్మ దాచేస్తే, అవి నా డబ్బులు అని డిమాండ్ చేసి తుపాకీ కొనుక్కోడం. పండగ ముందు స్కూల్ లోను, ప్రైవేటు లోనూ ఎవరెవరు ఏమేమి కొనుక్కున్నారు, కొనుక్కోబోతున్నారు అని ఒకటే గుసగుసలు. అసలు పాటం పట్టించుకునే వాడు ఒక్కడూ లేడు.
ఇంక ఇంట్లో సామాన్లు తెచ్చాక వాటి చుట్టూ మూగడం. ఆ తర్వాత ఆస్తి పంపకాలని మించిన గొడవలు సామాను పంపకాల దగ్గర. అందరికీ లక్ష్మి బాంబులు, పురుకోసా బాంబులు, ఏరోప్లైన్లు, వంకాయ బాంబులు కావాలి. కాకర పువ్వోత్తులు, పెన్సిళ్ళు చాలలేదని పెద్ద పద్దు చెప్పి ఒకటే గొడవ. ఎవరి వాటా వాళ్ళు సెపరేట్ పళ్ళేలలో ఎండ బెట్టుకోవటం- పైగా వాటికి కుక్కలా కాపలా ఒకటి. ఎవరు ముందుగా శాంపిల్ కని ఏదైనా కాలిస్తే, అది మన వాటాలోంచి కొట్టేసారేమోనని అన్నీ ఒక సారి లెక్కపెట్టుకోవడం. ఈ హడావిడిలో పండగ ఒచ్చేస్తుంది.
ఇంక పండగ ముందర బట్టల దగ్గర అయితే ఈ సారి నాకు నిక్కరు ఒద్దు, పాంటు కావాలని బిక్క మొహం వేసి సతాయించడం. ఐనా సరే మనకి పండగలు ఎన్ని వెళ్లినా నిక్కర్లు పోడుగయ్యేవి కాదు, పైగా అమ్మ చేసే పువ్వుల చొక్కా సెలక్షన్ నచ్చలేదని ఎప్పుడూ ఏడుపే. అమ్మేమో ఒచ్చే పండగ అని హై కోర్ట్ వాయిదా టైపు లో మళ్ళీ వాయిదా. పొద్దున్నే తలంటుకుని, సాయంత్రం దాకా ఆగలేక ఒకటి రెండు శాంపిల్ పేరుతో బాంబులు కాల్చేయ్యడం. అక్కడినించి ఎప్పుడు చీకటి పడుతుందా అని ఒకటే వెయిటింగ్. అమ్మ చేసిన పులిహార, పాయసం ప్రతి దీపావలికీ స్టాండర్డ్ మెను.. కన్సోలేశున్ గా ఆవడో, చంద్రకాంతమో చేస్తే వాటితో సరిపెట్టుకుని, మనలాంటి ఒకళ్ళిద్దరు గొట్టంగాల్లని వేసుకుని ఊర్లో అందరి టపాకాయల inventory ని సర్వే చెయ్యడం. ఎవడైనా దారిలో భారీగా కాలుస్తుంటే అక్కడ నిలబడి ఇంతిత కల్లేసుకుని దేబిరించుకుంటూ చూడడం. ఐపోయాక ఒక సారి షాప్ కి వెళ్లి thousandwaala , పారాచూట్, ఫ్లవర్ రాకెట్ లాంటివి దగ్గరగా చూసి, అవి కొనుక్కుని వెళ్లే వాడి కేసి ఆశగా చూసి.. ఇంకా సిగ్గు విడిచి యే టైం కి కాలుస్తారో అని కనుక్కోడం (వాళ్ళు మన ఇంటి దగ్గర వుంటే మనం కాల్చకపోయిన చూద్దామని, చూసి అందరికీ గొప్పలు చెప్దామని). ఈ హడావిడిలో అమ్మో చీకటిపడిపోతుంది అని పరిగెడుతూ ఇల్లు చేరడం. అప్పటికి అమ్మ పూజ చేసి,మనం పూజకి లేనందుకు రెండు అక్షింతలు వేసి (పూజ టైం కి ఇంట్లో లేనందుకు), బొట్టు పెట్టి, బట్టలు మార్పించి.. అన్ని జాగ్రత్తలతో గోంగూర కాడలతో ఒత్తులు వెలిగించిన దివిటీలతో పాట పాడించి నేలకేసి కొట్టాక ఇంక మొదలు మన దీపావళి ధమాకా...
ముందుగా కాకర పువ్వోత్తులతో మొదలు పెట్టి, ఒకటి రెండు మతాబులు, చిచ్చుబుడ్లు, పెన్సిళ్ళు కాల్చి.. ఆ తర్వాత భూ చక్రాలు, విష్ణు చక్రాలు.. ఇంకా ముందుకెళ్ళి ఏరోప్లానులు.. ముందు కొంచెం దూరంగా బెట్టి కాల్చి.. ఆ తరవాత ఉత్సాహం పెరిగి, చేతితోనే డైరెక్ట్ గా కాల్చేస్తూ.. మధ్యలో ఆరిపోతున్న దీపాలని వెలిగిస్తూ అమ్మ. చెప్పులు వేసుకోండి, దూరంగా కాల్చండి అని తిట్లు తిట్టే నాయనమ్మ. చివ్వర్లో కొంచం శబ్దాలు సద్దు మణిగాక, మన బాంబులు బయటకు తీసి కాల్చి. బాగా లేటుగా తారా జువ్వలు.. అన్నీ ఐపోయాక రోడ్ల మీద పడి సిసింద్రీలు కాల్చుకోవడం. ఎవడైనా పారచూటు వున్న రాకెట్ కాలిస్తే ఆకాశంలోకి ఆశగా చూడడం, కింద పడ్డ పారచూటు ఏరుకోడం. కాల్చిన కాకర పువ్వోత్తులని జాగ్రత్తగా ఒక పక్కకే పడెయ్యడం. ఒకటో రెండో చోట్ల ఒళ్ళు కాలినా- ఆ సందడిలో మనకి అవేమీ పట్టేవి కాదు.
పండగ అయిపోయిన తర్వాత రొజూ మామూలుగా పొద్దున్న లేవని మనం - ఆ రోజు కోడి కూయకుండానే లేచి, బయటకి ఒచ్చి మున్సిపాలిటీ వాళ్ళు రాకముందే పక్క ఇంటి ముందు, తర్వాత మన ఇంటి ముందు పేలని బాంబుల కోసం చెత్తలో వెతకడము. సగం కాలిన, ఒత్తులు వెలిగి పేలనివి బాంబులు గట్రా లాంటివి అన్నీ ఏరుకుని రావడం. అందులో పేల్చగలిగినవి మళ్ళీ పేల్చడం. మిగిలినవి అన్నీ కలిపి చింపి, వాటిలో మందు బయటకు తీసి ఒక పేపర్ లో వేసి అగ్గి పుల్లతో తగల పెట్టడం. అదో తుత్తి. మళ్ళీ రాత్రికి పాములు, మిగిలిన సామగ్రి నాగుల చవితి దాకా రాత్రి పూట కాల్చుకోవడం. ఇంక పగలంతా కాలిపోయిన కాకర పువ్వోత్తుల సన్నటి ఊసలని కడిగి, ఎండ బెట్టుకుని.. వాటి చివరలని గొడుగు ఆకారంలో ఒంచి, అక్కవో-అమ్మవో గుప్పెడు రబ్బరు బాండ్లు దొబ్బేసి జేబిలో పెట్టుకుని బయట పడడం.. ఆ రబ్బరు బాండు రెండు వేళ్ళ మధ్య సాగ దీసి, కాకర పువ్వోత్తుల సన్నటి ఊసలని ముందు భాగానికి తగిలించి, రబ్బరు బాండు వెనక్కి లాగి.. దానితో కుక్కల్ని, పందుల్ని, ఇంటి పై కప్పులని, వెళ్లే వాహనాలని గురి పెట్టి కొట్టుకుంటూ ఊర్లో షికార్లు చెయ్యడం. ఏరుకున్న పారచూటు ఒక చిన్న రాయికి కట్టి జాగ్రత్తగా చుట్టి గాల్లోకి వేసి, అది విచ్చుకుని కిందకు మెల్లిగా దిగుతుంటే క్యాచ్ పట్టుకుని.. అది డబ్బులు పెట్టి కొని కాల్చిన వాడికంటే పది రెట్లు పొంగిపోవడం. మన టైం బాలేక ఒక్క పారచూటు కూడా దొరకకపోతే, ఒక జేబురుమాలుకి నాలుగు కొసల్లో నాలుగు దారాలు కట్టి, అవన్నీ ఒక రాయికి కట్టి .. అదే మన పారచూటు అని గాలిలోకి విసరడం.
చూసారా పండగ ముందు, పండగ రోజు.. చివరకి పండగ అయిపోయిన తర్వాత కూడా ఎంత ఎంజాయ్మేంటో. అందుకనే అంటున్నాను మళ్ళీ .. అదే మా రోజుల్లో ఐతేనా .......కాలిపోయిన కాకర పువ్వోత్తులు - పేలని బాంబులతో ఫుల్ ఎంజాయ్...

9, నవంబర్ 2010, మంగళవారం
గాల్లో తేలినట్లుంది గుండె పేలినట్లుంది - చివరి భాగం
వెనకడుగు వేసే వుద్దేస్సం నాకు లేదు. కానీ వాడి మొహంలో ఏమైనా వెనక్కి తగ్గేంత భయం ఛాయలు వున్నాయేమో అని వెదికాను. నేను కాదంటే, వాడు కూడా కాదనే పరిస్థితిలో ఉన్నాడని అనిపించింది. ఇలాంటప్పుడే నేను అసలు వెనక్కి తగ్గను. మనల్ని ఎవడైనా ముందు పెట్టారనుకోండి, మనం అసలు ఆగం. ఇంత దాకా ఒచ్చాక ఒక సారి చేసే వెళ్లాలని డిసైడ్ అయ్యా. ఆ మాటే వాడితో అంటే, వాడు కూడా సరే అన్నాడు. పైగా పక్కన కుర్రాళ్ళు మాంచి EXCITED గా వున్నారు, ఇలాంటప్పుడు తప్పుకుంటే మనం వయసు అయిపోయిందని ఒప్పెసుకున్నట్లే. ఇక ప్రేపరషన్ అయ్యింది, బయటకి వెళ్లి రక్షణకి సూట్ తొడుక్కోవడమే.
ఒక అరగంట వేచి ఉన్నాక, తరవాత మీరే అని మాకు తొడిగారు. హమ్మయ్య! ఈ సాహసం తొందరగా ఐపోతే ఒక పని ఐపోతుందని, ఈ టెన్షన్ పోతుందని మేము సూట్ తోడిగేసుకున్నాము - మానసికంగా సాహస ఘడియలకు సంసిద్ధం అయిపోయి. మళ్ళీ ఏం జరిగిందో, మీరు ఇంకా వెయిట్ చెయ్యాలని మా చేత సూట్ ఇప్పించేశారు. ఒక పక్క టెన్షన్, మరో పక్క ఏమీ తిననందుకు ఆకలి. పోనీ వెళ్లి ఏదైనా తిందామంటే, ఇలాంటప్పుడు తిన్నా టెన్షన్ లో ఎక్కుతుందో లేదో, ఎక్కినా సాహసం చేసేటప్పుడు కడుపులో తిప్పిందంటే మళ్ళీ అదో కడుపులో కాందహార్ పరిస్థితి. అందుకని అక్కడే వెయిట్ చేస్తూ కూర్చున్నాము. ఇంతలో ఈ సాహసం వీడియో తీసుకునే వాళ్ళు మీ చేతుల మీద ఏదైనా రాసుకోండి కావాలంటే, అని మాకు మార్కర్ పెన్నులు ఇచ్చారు. అక్కడ ఏమి రాయాలి అన్న విషయం మీద అందరూ చాలా సేపు తర్జన భర్జనలు మొదలు పెట్టారు. కొందరు "ఐ డిడ్ ఇట్" అని, కొందరు "ఐ లవ్ యు", కొందరు "TO MY MOM ", ఇంకొందరు తమ ప్రియురాలి పేర్లు రాసుకున్నారు. మా వాడు మటుకు బుద్ధిగా తన భార్యకి ప్రేమతో అని రాసుకున్నాడు. నేను ఏం రాయాలో తోచలేదు.. అసలు ఇదంతా ఎందుకు మన కిక్ కోసమే కదా అని, చివరకి కిక్ అని రాసుకున్నా.
సమయం చాలా భారీగా గడుస్తోంది, ఏదైనా కొత్త పని చేసే ముందు వుండే టెన్షన్, ముఖ్యంగా అది సాహసం అయితే చాలా భయంకరంగా వుంటుంది. మనసులో అనేక సందేహాలు వస్తూ వుంటాయి, చాలా అవిశ్రాంతంగా ఉంటాము. దేనిని ఎంజాయ్ చేసే పరిస్థితి వుండదు. అటూ ఇటూ కాలు కాలిన పిల్లిలా తిరిగి, ఏం చెయ్యాలో తోచక.. అక్కడ సాహసం పూర్తి చేసిన వాళ్ళని విచారించడం మొదలు పెట్టాము.. మా ముందు వెళ్లినా వాళ్ళలో ఒక వ్యక్తికి సాహసంలో కళ్ళు తిరిగ వాంతులు అయ్యాయట, ఒక అరగంట బాత్రూం లో గడిపి తడిసిన బట్టలతో బయటకు ఒచ్చాడు. మన దగ్గర స్పేరు బట్టలు లేవు, మనకిలా అయితే ఏమిటి పరిస్థితి? ... ఇంతలో అందరూ హడావిడిగా కుడి వైపుకు చూసారు, కొందరు పరిగెత్తడం మొదలెట్టారు.. ఎందుకంటే ఎవర్నోరక్షించడానికి.. వ్హామ్మో! .. అని గుండె గుభేల్మంది... అలా ఎలా అయ్యిందని ఆరా తీస్తే.. అప్పుడప్పుడు ఇలా అవ్వడం మామూలే అని సమాధానం.... ఇంక లాభం లేదు... ఈ సాహసం ఇంకాస్సేపట్లో చెయ్యకపోతే, భయంతో నేను కూడా డ్రాప్ అయ్యేట్టున్నాను - అని అనుకుంటుంటే మమ్మల్ని పిలిచి సూటులు తోడుక్కోండి.. తర్వాత మీరే అన్నారు.
ఇంతలో ఒక వ్యక్తి ఒచ్చి, " నా పేరు బాబ్. నువ్వు నేను కలిసి చేస్తాము" అన్నాడు. ఇంక సాహసం మొదలయ్యింది. అన్నిటికీ ముందు నేనే ఉండేలా చూసుకుని మొదలుపెట్టాము. ఎందుకంటె, మనం ముందు లేకపోతే మా కజిన్ భయ పడే అవకాశం వుందని.
నేను తోడుకున్న సూటు లాంటి సూటు ఒకటి బాబ్ తొడుక్కుని వున్నాడు. నేను- బాబ్, మా కజిన్ తో పాటు ఇంకొకడు.. మా ఫోటోలు, వీడియోలు తియ్యడానికి ఇంకో ఇద్దరు. మేమంతా మమ్మల్ని ఎక్కించుకుని తీసుకెళ్ళే విమానం కోసం రన్ వే దగ్గరికి ఒచ్చాము.మా ముందుకి CESSNA విమానం ఒచ్చి ఆగింది. నేను గతంలో ఒక సారి CESSNA విమానం ఎక్కి ఒక పావు గంట నడిపాను.కాబట్టి దానిలో ఇద్దరు కూర్చడానికి, మహా అయితే నలుగురు ఇరుక్కోడానికి కుదురుతుంది అని నాకు తెలుసు. లెక్క పెడితే మేము ఆరుగురం, మాతో పాటు ఒక ఫైలట్. మొత్తం ఏడుగురు, ఇద్దరు పట్టే చిన్న CESSNA విమానంలో ఇంత మంది ఎలా ఎక్కుతారని నేను ఆలోచిన్చేలోపే, మమ్మల్ని పిల్లుల్లా ఒంగోబెట్టి, మోకాళ్ళ మీద పాకించి మూలన ఇరికించి రెండు వరసలలో నలుగురిని, డోర్ దగ్గర బల్లుల్లా మిగిలిన ఇద్దరినీ ఇరికించారు. మెల్లిగా CESSNA రన్ వే పైన వెళుతుంటే, మనం పది వేల అడుగుల పైకి వెళ్ళాక, నేల మీద పిల్లిలా ముందుకి పాకి, డోర్ దగ్గరకి ఒచ్చి, సైడ్ లో వున్న రాడ్ పట్టుకుని ఒక్క సారిగా కిందకి దూకేయ్యాలి... దూకిన తరవాత రెండు చేతులూ, రెండు కాళ్ళూ విశాలంగా చాచి తల పైకి ఎత్తి ఉంచాలి అని చెప్పారు.
ఇంక గుండె సెర వేగంతో కొట్టుకోడం మొదలెట్టింది. మెదడు పనైతే చేస్తోంది కానీ, దానికి అంతా అయోమయంగా ఉంది. CESSNA గాల్లోకి లేచింది. మా ఇద్దరి మొహాల్లో కత్తి వాటుకు నెత్తుటి చుక్క లేదు, తరవాత ఏమైనా జరగచ్చు అనే ఆలోచన... అసలు ఎందుకిలా చేస్తున్నాం.. ఇలా చేసినందుకు పశ్చ్చాత్తాప పడకుండా వుంటే చాలు.. అనే భావం ... మనసులో దేవుడిని ప్రార్దిన్చాలనే తలపు..... అంతలో ఇలా అవసారాలకే దేవుడిని ప్రార్ధిస్తే.. "ఒరేయ్.. నీ సంగతి నాకు తెలుసు.. నువ్వు నీకు అవసరం అయినప్పుడే ప్రార్దిస్తావు .. నేను అసలు వినను పో" అని కోపగించు కుంటాడేమో.. అని అనుమానం.. ఐనా సరే అని ఏదో క్లుప్తంగా ప్రార్ధించి.. ఇంత కన్న పెద్దగా ఏమి కోరట్లేదు అని బేరం ఆడిన రీతిలో .... చెయ్యాల్సిన స్టెప్స్ ని మరో సారి నెమరు వేసుకుంటూ.. ఏది చెయ్యకపోతే ఎక్కువ రిస్కో ముందే అంచనా వేసుకుంటూ .. మళ్ళీ మళ్ళీ మననం చేసుకున్నాను...
ఒక సారి మా కజిన్ వైపు చూసి... తెచ్చి పెట్టకున్న ధైర్యంతో.. ఒక సారి బొటన వేలు పైకెత్తి "ALL THE బెస్ట్" అన్నాను..నాలో వున్న నిస్సత్తువని కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తూ.. వాడి పరిస్థితి నాకంటే రెండు రెట్లు హీనం...నేను కనీసం PARA సైలింగ్..HOT AIR బలూన్.. హెలికాప్టర్..లాంటి వన్నీ రుచి చూసాను.. వాడికి అన్నీ మొదటి సారి సాహసాలే... CESSNA మూడు వేల అడుగుల దాటాక కొంచెం చలి పెరిగినట్లు లోపల మాకు తగులుతున్న గాలి తెలియ చెప్తోంది. మెల్లిగా పైకి వెళ్లే కొద్దీ చలి ఇంకా పెరగడంతో నా డ్రెస్సింగ్ సరిపోతుందో లేదో అనే ఇంకో అనుమానం.. కిటికీలోంచి చూస్తుంటే అన్నీ బాగా చిన్నగా కనిపిస్తున్నాయి. మొదటి సారి నేను ఎక్కినప్పుడు కేవలం ఐదు వేల అడుగుల ఎత్తులోనే FLY అయ్యాము. అప్పుడే బోలెడంత భయం వేసింది, కాకపోతే మనం కిందకి ఎక్కువ చూసే అవసరం వుండదు కాబట్టి ఎలాగోలా మేనేజ్ చేసాను. నిజానికి నాకు కొంచెం ఎత్తులంటే భయం- దూకేస్తానేమోనని. నేను ఎత్తైన బిల్డింగ్ల మీద వున్నప్పుడు అంచుల దగ్గరికి ఒస్తే నా మెదడు దూకెయ్, దూకెయ్ అని అంటున్నట్లు వుంటుంది... దీన్నే VERTIGO అనో, ఇంకేదో అనో అంటారు. అలాంటి నేను - నా అంతట- పది వేల అడుగుల పైనించి నేలని చూస్తూ దూకేయ్యడమే... నో వే... నాట్ ఎట్ అల్.....
"మనం తొమ్మిది వేల అడుగుల దాకా ఒచ్చాము... అందరూ మోకాళ్ళ మీద, మో చేతుల మీద సిద్ధంగా వుండండి", అన్నాడు PILOT . అంతే ఇంక మెదడు మొద్దు బారి పోయింది.. ఇంతలో డోర్ తెరిచారు.. ఊపిరి అంత గాలిలోనూ, హోరులోనూ గుండె ల్లోకి వెళ్లి..ఒస్తున్న విషయం తెలుస్తోంది... మెల్లిగా పాకుతూ... సహకరించడానికి మారాం చేస్తున్న మెదడుని బతిమాలుకుంటున్నాను... నేను మననం చేసుకున్నా, ప్రాక్టిసు చేసినా గుర్తు రాని స్టెప్స్ ని .. నా ముందే ఒక photographer కిందకి దూకేసాడు.. వుష్శ్శ్.. మన్న శబ్దం.. వెనకినించి బాబ్ తోస్తుంటే ముందుకి జరుగుతున్న నా మొహమ్మీద.. చల్ల గాలి ఈడ్చి తన్నినట్లు ఫీలింగ్... "జంప్.. జంప్... జంప్.." అని అరుపులు... CESSNA కుడి పక్కన వున్న ROD ని బలంగా పట్టుకున్న నేను కిందకి చూస్తే...కంటి చూపుకి అందినంత వరకూ నేల లేదు... అమ్మో!...... ఒక్క సారి కళ్ళు మెదడుకి సంకేతాలు పంపడం ఆపేశాయి... అప్పటికే మొద్దు బారిన నా మెదడు.. నో సిగ్నల్స్ ప్లీజ్.. అన్నట్లు ఉంది.. ఐనా కూడా ఇక్కడ ఆగిపోవడం అనేది "NOT ONE OF THE CHOICES " అని శరీరంలో ప్రతి భాగము.. మెదడు సంకేతంతో పని లేని అసంకల్పిత ప్రతీకార చర్యలా... తెలియకుండానే... ఒక్క సారిగా దూకేసాను...
ఒళ్లంతా స్పర్స తెలియకుండా చలి.... మగధీర సినిమాలోలా ఫ్రీ ఫాల్..రెండు చేతులూ రెండు కాళ్ళు చాపాలనే ప్రయత్నాన్ని అంత సులువుగా కానివ్వని గాలి.. ఇంతలో మెడ పైకి ఎత్తలేదని నెత్తి మీద ఒకటి ఇచ్చిన photographer , విశ్వ ప్రయత్నం చేసి మెడ ఎత్తి కళ్ళతో చూసి ఆస్వాదించాలనే ఆలోచన ఒచ్చి... వేగంగా నేల మీదకి పడిపోతున్న గమనంలో నూట ఇరవై పై చిలుకు సెకన్లు ఐనప్పటికీ... రెప్ప పాటు కాలంలా అనిపిస్తుంది... అప్పుడే కర్రెక్ట్ గా చెప్పాలంటే " గాల్లో తేలినట్లుంది గుండె పేలినట్లుంది."
ఇంతలో బాబ్ నా సూటుకి తన సూటు లంకె వేసుకుని వున్నాడు కదా..తన మొదటి పారాచూట్ వోదిలాడు. విపరీతమైన కుదుపు... కళ్ళు తిరిగాయి... కాసేపు ఏదీ సరిగా చూడలేని.. స్తితి... బుర్రలో CONCUSSION ఒచ్చినట్లు ఫీలింగ్... అలా ఒక నాలుగు నిమిషాలకి ఏమీ అర్ధం కానీ పరిస్థితి.. అదుపు తప్పి మన ప్రాణాలు పోతున్నాయి అనిపించింది... ఇంక బతికే ఆస్కారం లేదు అని తెలిసిపోయిన నిస్సహాయ స్థితి..BRIAN డెడ్...
ఇంతలోకి బాబ్ పరిస్థితిని అదుపులోకి తెచ్చి ... రెండో పారాచూట్ వోదిలాడు... కాసేపు అయ్యాక బతికే అవకాశం ఉందన్న ఆలోచన మెల్లగా చలనం తీసుకొచ్చి.. చుట్టూ చూసేలా చేసింది... ఎంత ప్రయత్నించినా .. మనసుని వారించినా,. చూపు కిందకే పోతుంది... కింద చూస్తే మనకి భయ్యం... అదే భయ్యం...ఎత్తులంటే....అదే VERTIGO ..కాకపోతే.. ఇప్పుడు ఆల్రెడీ దూకేసాం.. కాళ్ళు, చేతులు, వెన్ను విరిగినా బతికే అవకాశం ఉండేలా ఎక్కడ పడితే బావుంటుందో అని చూపులు వెతుకుతున్నాయి... . లాండింగ్ కోసం ప్రయత్నం... ఇక్కడి అన్నీ చేసేది బాబ్ అయినా సరే.. ఆ భయంలోనే చుట్టో చూసే ప్రయత్నం చేస్తుండగానే.. "కాలు పైకి పెట్టుకో... లాండింగ్..." అని బాబ్ హెచ్చరిక.. కింద డామ్మంటూ.. bottom బ్రేక్ ఐన ఫీలింగ్ తో లాండ్ అయ్యాము..

'ఎలా ఉంది... ఎలా ఉంది..." అని ప్రశ్నలు.. నీరసంగా రెండు బొటన వేళ్ళు పైకి పెట్టి.. బలవంతపు నవ్వుతో ... SUCCESS అన్న సూచన చేసాను... నిజానికి నాకు సాహసం చేసిన ఫీలింగ్ కన్నా... అయిపోయిందన్న రిలీఫ్ ఆనందానిచ్చింది..
వెంటనే ఏదో మర్సిపోయనని అనిపించింది.. మై కజిన్... వామ్మో!.... వాడికేం కాలేదు కదా... అని చుట్టూ చూసాను...వాడు నా తర్వాత దూకి ఉంటాడు కాబట్టి.. ఆకాశం వైపు చూడాలని గుర్తుకొచ్చి.. పైకి చూసాను.. వెయ్యి అడుగుల ఎత్తులో కిందకి ఒస్తున్న పారాచూట్ కనిపించింది... వాడేమోనని ఆశగా చూస్తూ.. వాడు సేఫ్ గా లాండ్ అవ్వాలని ప్రార్దిస్తున్నా.. నాకు రెండొందల అడుగుల దూరంలో ల్యాండ్ అయ్యాడు...వెంటనే వాడి ఆనందానికి అవధుల్లేవు... గడ్డిలో పిల్లి మొగ్గలు వేసాడు.... దగ్గరకి ఒచ్చి నన్ను గట్టిగా కౌగిలించుకున్నాడు..వాడు ఎన్ని ఇంతలు బయపడి ఉంటాడో... ఇప్పుడు నాకు పదింతలు రిలీఫ్ ఉన్నట్లుంది..
మా సాహసానికి మేము బోలెడంత ముచ్చట పది.. ఫోటోలు.. వీడియోలు తీస్కుని ఇంటికోచ్చాము.. అప్పుడు చెప్పాము ఇంట్లో.. నమ్మలేదు.. వీడియో చూపించాము..
వీడియో చూసిన నా కూతురు... "డాడీ! I WANT TO FLY LIKE A BIRD... JUST LIKE YOU"..అంది.. తరవాత చేద్దువుగానిలే అని సర్ది చెప్పి..ఫోటోలు, వీడియోలు.. దానికి కనపడకుండా పెట్టేసా. మళ్ళీ మళ్ళీ అడుగుతుందని భయమేసి...
"నేనైతే పరవాలేదు కానీ... నా బంగారు కొండ చేస్తానంటే ఊరుకుంటానా.. అమ్మో! అలాంటి సాహసం గట్రా.. నాట్ అలోడ్...ఎంత సాహసి నైనా నేను కూడా తండ్రినేగా..."
(సమాప్తం)
ఇలా దూకేయ్యడాన్నిTandem Sky Diving అని అంటారు.

5, నవంబర్ 2010, శుక్రవారం
గాల్లో తేలినట్లుంది గుండె పేలినట్లుంది - రెండవ భాగం
ఆ గదిలో ఈ సాహసానికి ఒడిగట్టిన మా లాంటి వాళ్ళు ఏ విధంగా ఉంటారో అని ఊహించుకుంటూ మేము ఆ గదిలోకి అడుగుపెట్టాము. అక్కడ మాకు ముగ్గురు చాకులాంటి కుర్రాళ్ళు కనిపించారు. వారి వయసు పదహారు- పద్దెనిమిది మధ్యలో వుంటుంది. వాళ్ళు అంతా వయసులో వుండే వుద్రేకం తో ఒచ్చిన ఊపులో ఒక రకమైన ఉత్సాహం తో వున్నారు. "ఆ వయసులో చేస్తే ఒక సాహసం, ఈ వయసులో చేస్తే ఏం పోయేకాలం అని జనం అనుకుంటారు ...", అంటూ నా అంతరాత్మ మళ్ళీ లేచి మొత్తుకోబోయింది. "చస్స్.. నోర్ముయ్యసే.." అని దాన్ని తుంగలో తొక్కి, ఇంక నిశబ్దంగా వుంటే వీడు ఇలాగే లేస్తాడని, పక్క నున్న కుర్ర కారుని ప్రశ్నలతో గోకాను.. "ఎందుకు ఈ సాహసం చేస్తున్నావు? ఇంట్లో తెలుసా ఇలా చేస్తున్నట్లు?" అని. దానికి వాడు "ఇది చెయ్యకపోతే నన్ను నేను క్షమించుకోలేను, ఈ రోజు కోసం ఎన్నాళ్ళో ఎదురు చూసా. నేను ఇలా చేస్తున్నట్లు మా అమ్మకి తెలిస్తే నన్ను చంపేస్తుంది" అన్నాడు. బుద్ధున్న ఏ పెద్ద వెధవైనా ఇలాగే చెప్తారు.. ఈ మెంటలోడు తప్పితే.. అని మళ్ళీ నా అంతరాత్మ లేస్తూంటే... "నువ్వు ఒల్లకోరా!.. వూ.. జెల్ల కొట్టీస్తన్నావు.. " అని వాడిని అదమాయించే లోపు.. "అందరూ వృత్తాకారంలో మూగండి" అన్న కేకకి నేను అందరితోపాటు అక్కడ గుమిగూడాను.
ఇంకో పిల్లవాడు దీని కోసం వాడు డబ్బులు ఎలా పోగేసిందీ చెపుతున్నాడు. అది వింటే ఏదో రిక్షా తొక్కే పేద వాడు పొదుపు చేసి నానో కారు కొన్న స్టొరీ కన్నా కూడా జాలిగా ఉంది. అందరూ వాళ్ళ తల్లి తండ్రులకి తెలిస్తే వాళ్ళని ఎలా చంపేస్తారు అన్న దాని మీద ఒకడిని మించి ఒకడు రేంజ్ పెంచుకుంటూ గొప్పలు పోతున్నారు. ఆ పిల్ల కాయల మధ్యలో మేమిద్దరమూ, ఇంకొక నడి వయసు ఆడా-మగా వున్నాము. మేము నలుగురం మాత్రము డాక్టర్ విజిట్ కి వెళ్ళిన పేషెంట్, వెయిటింగ్ రూం లో నిశబ్దంగా చుట్టు పక్కల వాళ్ళని గమనిస్తూ ఆలోచిస్తాడు చూడండి- అలా ఉన్నామన్న మాట. అక్కడ మన జబ్బు పక్కన పెట్టి -- పక్కన వాడికి ఎంత భయంకరమైన జబ్బో అనే అనుమానంతో మౌనంగా, అతనికీ మనకీ వున్న దూరం (ఆ జబ్బు మనకు అన్టనంత వుండాలి అని) మనసులోనే లెక్క వేసుకుంటూ కొంచెం దూరం జరుగుతూ...మనం మాట్లాడితే మన జబ్బు గురించి చెప్పాల్సిన అవకాశం ఎక్కడ వుంటుందో అని మౌనంగా ఉంటాము కదా, అల్లా అన్న మాట.
అందరం వృత్తాకారంలో గూడాక, "క్వయిట్ ప్లీజ్.." అనే అరుపుతో, అందరూ సంభాషణని ఆపేశారు. "ఈ సాహసానికి మీరంతా తయ్యారా? " అన్న ఇంస్త్రుక్టర్ ప్రశ్నకి "యే..." అని కుర్రాళ్ళ కేకలు.. అందులో సన్నగా "య" అన్న మా నలుగురి గొణుగుడు కలిసిపోయింది. ఈ సాహసం ఎలా చెయ్యాలి అన్న దానికి ముందు తర్ఫీదు ఇస్తుంటే, మెదడులో ఎన్నో ఆలోచనలు... "ఇవన్నీ నాకు అప్పుడు గుర్తున్టాయా?... ఒక వేళ భయంతో మెదడు ఫ్రీజ్ ఐపోతే, ఏంటి పరిస్థితి? దేని తరవాత ఏది చెయ్యాలో ఎలా గుర్తుపెట్టుకోవాలి?... ఇక్కడ ఇన్నిఅనుమానాలూ నా ఒక్కడికేనా? అందరికీ అర్ధం అయ్యి, నాకు అర్ధం కాకపోతే మళ్ళీ ఎన్ని సార్లు అడిగినా చెప్తారా? అసలు మళ్ళీ చెప్పమంటే ఏమనుకుంటారో?.." లాంటి అనుమానాలతో నిశబ్దంగా ... మొదటి రోజు డ్రిల్ కి ఒచ్చిన కుర్రాడి లాగా - మందని ఫాలో అయ్యి టీచర్ కంట్లో పడకుండా మేనేజ్ చేసినట్లు చేసేసాను. ఇప్పుడు అనుమానాలతో డ్రిల్ అయ్యింది.. అసలు సాహసం ఇప్పుడుంది.. ముందుంది ముసళ్ళ పండగ అనుకుంటూ.. మిగిలిన మూడు ముసళ్ళనీ ... అదే ముసలాళ్ళనీ నా కళ్ళతో వెతికాను..
"ఇప్పుడు ఎవరికైనా భయంగా వుంటే ఇప్పుడే ఆపెయ్యచ్చు.. " అని ప్రకటించాడు instructor ... పక్క వాడు "నా వల్ల కాదు".. అంటే బావుండును అని అనుకుంటూ వున్నాను నేను... అలా అనే ధైర్యం చెయ్యడం కూడా ఒక గొప్ప అనిపించింది ఆ క్షణంలో .. మన భయాన్ని ఒప్పుకునే ధైర్యం చెయ్యకపోతే.. మనం ధైర్యం నటిస్తూ భయం మాటున ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ఈ సాహసం చెయ్యడం ఎంత కష్టమో అని మెదడు బేరీజు వేయడానికి ట్రై చేసి ఫెయిల్ అయ్యింది.. "నేను డ్రాప్.. " అన్నాడు మూడో ముసలి... కళ్ళల్లో మెరుపుతో మెచ్చుకున్నట్లు మా ముగ్గురి చూపులు... "నేను కూడా డ్రాప్" అంది అతనితో వున్న ఆడ ముసలి..
హమ్మయ్య!.. మనం ముందు డ్రాప్ అయ్యి ఎవ్వరూ అవ్వకపోతే అది పిరికితనం అని అనిపించుకుంటుంది.. అదే ఆల్రెడీ ఇద్దరు డ్రాప్ అయితే మనం అందరిలో ఒకడు.. అసలు ప్రపంచంలో ప్రతీ మనిషీ ఈ గుంపులో ఉండడానికే ఇష్టపడతాడు. అందుకే ముందు కోచ్చేవాళ్ళు తక్కువ.. ఎవడైనా ఒస్తే.. ఆ ఒకడికి ఇద్దరు తోడైతే.. మందలో చేరడానికి అందరూ సిద్ధమే..
నెక్స్ట్ నీదే వంతు అన్నట్లుగా ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నాము.. నేనూ.. నా కజినూ...
(క్షమించండి.. రాత్రి ఒకటిన్నర.. రేపు ఆఫీసు..కాబట్టి ... Climax తరువాత టపాలో.. కొంచెం ఓపిక పట్టండి...... సశేషం)

4, నవంబర్ 2010, గురువారం
గాల్లో తేలినట్లుంది గుండె పేలినట్లుంది - మొదటి భాగం
"గాల్లో తేలినట్లుందే గుండె పేలినట్లుందే తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్లుందే" అని పదే పదే పాడుకుంటూ వుండేవాన్ని, జల్సా చూసిన తరవాత. అబ్బో ఏమి పోలిక అని జనాలు పొలికేక పెట్టేలా రాశారు మా గురువు గారు. అంతటితో ఆగకుండా
"ఒళ్ళు తూలినట్లుందే దమ్ము లాగినట్లుందే ఫుళ్ళు బాటిలేత్తి దించకుండా తాగినట్లుందే" అనేసరికి,
అబ్బో! మా దమ్ము భాయీలు మరియు మందు భాయీలు అయితే చిందులేసి తీన్ మార్ డాన్సు చేసి కేక పెట్టారు.
మరి అలా క్లిక్ అయ్యింది మా గురువుగారి పాట.
అయితే ఈ ఫీలింగ్ ప్రేమలో కాకుండా ఇంకో రకంగా నాకు ఈ మధ్య అనుభవంలోకి ఒచ్చింది.
ఈ మధ్య మా బాబాయి కొడుకు ఒచ్చాడు మొదటి సారి అమెరికాకి. అదే మా చేపలు కొన్న కజిన్. వాడికి ఏదో ఒకటి గుర్తు ఉండేలా చెయ్యాలని అనుకున్నాను. మెల్లిగా ఒక సారి మా ఆవిడని, కూతురిని తప్పించుకుని పొద్దున్నే వాడిని తీసుకుని మా ఇంటి దగ్గర ఎత్తైన పర్వత శ్రేణులు వున్న పోకేనోస్ అనే ప్రాంతానికి తీసుకెల్లా. అక్కడ చెయ్య బోయే విషయం చాలా సీక్రెట్ అనీ వాడికి ముందు నించీ చెప్తూ ఒచ్చా. దాని గురించి ఎవ్వరికీ ఏ మాత్రం అనుమానం రాకుడదని వాడికి గాట్టి హెచ్చరికలు జారీ చేశా. చెయ్యబోయే పని గురించి వాడికి విపరీతమైన ఉత్కంట కలిగేలా వాడికి దాని గురించి ఎన్నో విషయాలు గొప్పగా చెప్పా. ఇలాంటి అవకాశం చాలా తక్కువ మందికి ఒస్తుందని. ఒచ్చిన ఆ అవకాశం తీసుకుని చేసే ధైర్యం, తెగింపు చాలా అరుదని. నీకు తెలిసిన వాళ్ళలో బహుశా ఎవరూ ఇలాటివి చేసి ఉండరని చెప్పి వాడిని మానసికంగా ఎలాగైనా ఇది చెయ్యాలనే స్థితికి తీసుకొచ్చా. నేను పక్కనున్న ధైర్యం వల్ల ముందుకు ఒచ్చాడు గాని, వాడిలో ఇది చెయ్యలా-వొద్దా? అనే సందిగ్దం, దానితో పాటు ఎన్నో భయాలు, అనుమానాలు వాడి మొహంలో నాకు బాగా కనిపించాయి.
నాకు చెయ్యాలని ధైర్యం అయితే ఉంది గాని, అనుకోకుండా ఏదైనా జరిగితే? అమ్మో! అసలే పెద్ద వాడిని, వాడిని చేస్తుంటే వారిన్చాల్సింది పోయి, ఉసికోల్పినందుకు నన్ను అందరూ ఏమంటారని తలచుకుంటే నాకు ఒక్క సారి ఒళ్ళు గగ్గుర్పోడిచింది. అమ్మో! ఇలాంటి ఆలోచనలు మన మనసులోకి రానియ్యకూడదు. ఐనా ఒక్క సారి కమిట్ అయితే నా మాట నేనే వినకూడదు, వింటే పూరీ-మహేష్ కలిసి, నువ్వు పోకిరీ కాదురా ఎందుకీ ఫోజులు అని నన్ను చపాతీ చేసేస్తారు అని అనుకుని ఆ ఆలోచనలని తోవ మళ్ళించాను. అయితే, దీనికి వాడు నా బలవంతం మీద రావట్లేదని రేపు రుజువు కోసం, "ఒరేయ్! నీకు భయం వేస్తే నువ్వు చెయ్యకు. నేను చేస్తున్నానని, చెప్తున్నానని నువ్వు కమిట్ అవ్వకు" అన్నాను. వాడు కొంచెం బెరుగ్గానే "లేదన్నయ్యా. నేను చేస్తాను" అన్నాడు.
మాటలలో మేము చుట్టూ వున్న ప్రకృతిని, దాని అందాలని సరిగ్గా చూడలేదు. నిజం చెప్పాలంటే మేము చెయ్యబోయే సాహసానికి కళ్ళ ముందు ఎంత సౌందర్యం అయినా మేము ఆస్వాదించ లేకపోదుము. ఆ సమయంలో సినిమా నటి తమన్నా ఒచ్చినా - తప్పుకోవమ్మా అని తల తిప్పుకుని వెళ్ళిపోయే పరిస్థితి. అంతటి టెన్షన్ ఉంది మాలో.
అప్పుడప్పుడూ ఆలోచనల ముసురులో మా ఇద్దరి మధ్య నిశబ్ధం అలా ఒచ్చి వెళ్తోంది. ఇద్దరిలోని బెరుకునీ బయటకి కనిపించనీయకుండా (ముఖ్యంగా నేను) కేవలం మేము చెయ్యబోయే సాహసం గురించి మాత్రమే అప్పుడప్పుడు మేము క్లుప్తంగా మాట్లాడుతున్నాము. అది కూడా మేము చేసిన తర్వాత అది ఎంత గొప్పో అని మేము ప్రపంచానికి ఎలా చెప్పబోతామో అన్న టాపిక్ మీదే. నిజానికి మా భయాన్ని వెనక్కి నెట్టే ప్రయత్నం మా చేత అలా మాట్లాడేలా చేస్తోంది. మేము సాహసం చెయ్యబోయే పర్వతాల దగ్గరికి ఒచ్చాము. మా టెన్షన్ కనపడనీయకుండా రెండు దమ్ములు లాగి, ఒకటికి రెండు సార్లు బాత్రూం కెళ్ళి, వున్న మంచి నీళ్ళ బాటిల్స్ తాగేసాము.
చివరికి వెళ్లి ధైర్యంగా డబ్బులు కట్టి ఎంత త్వరగా సాహసం చెయ్యచ్చో కనుక్కున్నాము. ఒక గంట కనీసం పడుతుందని చెప్పింది, ఇంతలో మీకు ముందుగా కొంత వర్క్ చెయ్యాలని మా ముందు కాయితాలు పెట్టింది. ఏదైనా జరిగితే వాళ్ళ భాద్యత లేదని, కోర్ట్ లో వాళ్ళని మేము సు చెయ్యకుండా పత్రాలు. సంతకం చెయ్యబోతే చెయ్య వొణికింది. మేము చెయ్యబోయే సాహసం ఎంత ప్రమాదకరమో మరో సారి అంతరాత్మ గట్టిగా వద్దని వారిన్చబోయింది. మళ్ళీ పోకిరీ గుర్తొచ్చి - జగడమే టైపు లో కేక పెట్టి అంత రాత్మ పీక నొక్కాను. తరవాత మీకు కొంచెం ట్రైనింగ్ఇవ్వాలని మమ్మల్ని ఇంకొంత మంది కుర్రాళ్ళతో ఒక గదిలోకి పంపింది.
(సాహసం - తరవాత టపాలో)

31, అక్టోబర్ 2010, ఆదివారం
యురేకా! అక్టోబర్ లో రోజు కో బ్లాగ్ ఈ రోజుతో ముగిసింది
యురేకా! అనుకోకుండా ఈ అక్టోబర్ లో రోజు కో బ్లాగ్ పోటీ గురించి తెలిసింది. తెలిసాక సరదాగా ప్రయత్నిద్దామని అనుకున్నాను.నేను అసలు సిసలు ఆంధ్రుడ్ని కదా! అందుకని ఇది అయ్యే పని కాదులే అని నాకు నేను సరిపెట్టేసుకున్నాను. అదే నండీ మన ఆంధ్రులు ఆరంభ శూరులు అన్నారు కదా - అందుకని అన్న మాట. పైగా నా విషయంలో ఇది వున్న మాట, నలుగురి నోటిలో నేను విన్న మాట. అలా మొదలయ్యింది ఈ టప-టప టపా రాయాల్సిన అవసరం.
మన శ్రీ శ్రీ గారు చెప్పినట్లు: కుక్క పిల్ల, సబ్బు బిళ్ళ, అగ్గి పుల్ల - కావేవోయ్ కవిత కనర్హం అని. ఒక సారి నన్ను నేను వెన్ను తట్టుకుని, వేళ్ళు విరుచుకుని కంప్యూటర్ మీద, నా వేళ్ళతో అడ్డొచ్చిన టాపిక్ మీద ఇష్టం ఒచ్చిన పద్ధతిలో టపాలు వోదిలాను.
రోబో తో మొదలెట్టి, యానిమేషన్ తో పొడిగించి, ఆలోచనలకో తాడూ బొంగరం కలిపించి, రాజకీయం మీద కవిత కక్కి, లక్ష్మణుడి గీత ని, చిత్ర పటాలని, నా బ్లాగు పేరు వెనుక ఉద్దేశ్యాన్ని పరిచయం చేసాను.
ఆ తరవాత మా అమ్మాయి kaleidoscope లో నాకు కనిపించిన రంగులు, నిండుగా తిరిగొచ్చే మా అమ్మాయి లంచ్ బాక్స్ మాకు చూపించే చుక్కలు, ఎంత సాగినా మారని ఆకతాయి బాండ్ లు, వలస వెళ్ళిన చేపలతో కొంచెం టపాలు రాయడానికి అలవాటుపడ్డాను.
అనంతరం రివ్యూ లలో లేని ఖలేజా ని, మా లాంటి వాళ్ళ వయసులో వృద్ధాప్యాన్ని, ఏకాకి జీవితాన్ని, నా జీవిత పల్లపు ఆలోచనలని కొంచం వివరించాను.
ఆ తరవాత అంతగా ఆకట్టుకోని చంటిపిల్లల అనారోగ్యం చార్టు, రేపటి స్వప్నాల పాట, బృందావనం రివ్యూ తో కొంత విసిగేత్తించాను. ఆలోచించి తల గోక్కుని ఆధిపత్యాల పోరు కవితతో, కుక్క పిల్ల మీద కట్టు కధతో, అలరించిన చందమామ పాటతో, పురి విప్పిన నెమలి ఆర్టుతో బానే బ్లాగులోకంలో రెక్కలు విచ్చుకున్నాను.
చివరలో బెండకాయ బాధితుల్ని, మా అమ్మాయి నా కళ్ళు తెరిపించిన కలని, విదేశాలలో స్వదేసీలతో పడే బాధలని, మా బ్లాకు పార్టీ ని పరిచయం చేసాను.
అంతటితో ఆగక, నా కిళ్ళీ కొట్టు అనుభవాలు, నోములు నోచే బార్యల భర్తలు పడే కష్టాలు, మా ఎదురింటి పరిచయాలు చెప్పి - కుక్క పిల్ల టపా కి అనర్హం కాదని మరో సారి గుర్తు చేస్తూ "బౌ బెల్లా -అనే కుక్క పిల్ల" టపా ప్రచురించాను.
ఈ రోజుతో అక్టోబర్ ముగిసింది. ఈ పోటీ పరిచయం చేసిన sree కి నా కృతజ్ఞతలు. ఈ పోటీలో బహుమతి ఏమిటంటే, నాకు ఒచ్చిన కామెంట్లు, హిట్లు మరియు తిట్లు. సరదాకి మొదలు పెట్టినా, నేను ఈ నెల రోజులూ బాగా ఎంజాయ్ చేసాను. ఇన్నాళ్ళు నా బ్లాగులను చదివిన మీ కందరికీ నా కృతజ్ఞతలు. ఇక నించి రోజూ కాకపోయినా, అప్పుడప్పుడు బ్లాగుతూ వుంటాను.
ఈ పోటీ వివరాలు కావాలంటే ఈ లింక్ క్లిక్ చెయ్యండి.
http://www.nablowrimo.blogspot.com/

30, అక్టోబర్ 2010, శనివారం
బౌ బెల్లా - అనే కుక్కపిల్ల
"బౌ బెల్లా - అనే కుక్కపిల్ల" - బావుంది నాయనా నీ టైటిల్. తరవాత ఏమిటీ, అగ్గి పుల్లా- సబ్బు బిల్లా? అని మీరు ఎటకారం చేస్తే ఇక నేను కట్టు కధలు కట్టి పెట్టాలి నా టపాలో. నిన్న రాత్రి పడుకునే టప్పుడు పుస్తకం చదవమంది మా అమ్మాయి, రొటీన్ గా. దాని పుస్తకాలు చాలా బరువు ఎక్కువ, పడుక్కుని చదివితే పొట్ట మీద పెట్టుకుని పట్టుకోవాలి. అసలే నాకు భుక్తాయాసం. అదేదో ఒక కధ తో ఐపోతే పరవాలేదు, ఒకటి తరవాత ఒకటి చదువుతూనే వుండాలి. అందుకని ఈ సారి మనమే ఒక కధ చెప్తే పోలా అనిపించింది.
కధ- పైగా అదీ కట్టు కధ చెప్పాలంటే ఏదో ఒక సబ్జెక్టు వుండాలి కదా. కొంచెం నా మొద్దు బుర్రకి పదును పెట్టి, ఒక ప్రశ్న సంధించా. నీకు ఏ జంతువు ఇష్టం అని అడిగాను, కుక్క పిల్ల అని చెప్పింది. కొంచెం ఆలోచించి ఈ మధ్య అది నాకు చెప్పిన విషయాల నెమరు వేసుకున్నా.
రెండు రోజుల క్రితం కల ఒచ్చిందని ఒక కధ చెప్పింది. అందులో తను రాకుమారిట, దానిని ఎవరో రాకుమారుడు fight చేసి రక్షిస్తున్నాడట. (అది కధ చెప్పినప్పుడు నా గుండె కలుక్కు మంది. దీనికి ఇప్పుడే ఇంత ప్రిన్సు అండ్ ప్రిన్సెస్ పిచ్చి - మనం దీనికి సంబంధం వెతకాలంటే ఏ రేంజ్ లో వుండాలి అని). "కధ చెప్పు నాన్నా", అని పది సార్లు అడిగే లోపు ఆలోచిన్చేసా.
ఇక కధలోకి - అదేనండి కట్టు కధలోకి ఒస్తే. మనం సంపాదించిన సమాచారంతో అప్పటికప్పుడు ఒక కధ అల్లాను. అదే "బౌ బెల్లా" అన్న మాట.
అనగనగా ఒక చిన్న పిల్లవాడు, వాడి పేరు లిటిల్ పీట్. (ఇలా పేరు ముందు లిటిల్ అని పెడ్తే మనకి తరవాత నాన్నపేరు వేరే ఆలోచించక్కర్లా) వాడికి జంతువులంటే చాలా ఇష్టం. వాళ్ళ నాన్న పేరు బిగ్ పీట్. లిటిల్ పీట్, బిగ్ పీట్ ని ఎప్పుడూ ఒక పెట్ కావాలని అడుగుతూ ఉంటాడు. వాడికి నాలుగేళ్ళు. రేపే వాడి ఐదో పుట్టినరోజు. రేపు వాడి పుట్టినరోజు అని చాలా సంతోషంగా ఉంటాడు. రేపు రాబోయే బహుమతుల గురించి, స్నేహితులతో చేయబోయే సందడి గురించి, తన కేకు గురించి, వాళ్ళ నాన్న తేబోయే గిఫ్ట్ గురించి ఊహిస్తూ పడుకుంటాడు. లిటిల్ పీట్ నిద్రపోయాక, బిగ్ పీట్ పెట్ స్టోర్ కి వెళ్తాడు. (అక్కడ కాసేపు మనకి తెలిసిన జంతువుల గురించి చెప్పి, అవి చేసే సౌండ్స్ గురించి వర్ణిస్తూ కావాలంటే కధ పోడిగించుకోడమే) అప్పుడు ఒక బోనులో ముద్దుగా, బుజ్జిగా, తెల్ల బొచ్చుతో, మెత్తటి తెల్లటి మబ్బులాంటి ఒక కుక్క పిల్ల చిన్నగా బౌ బౌ మంటుంది. దాని చెవులు కళ్ళను కప్పేస్తూ చాలా పొడుగ్గా వుంటాయి. చెవులు అడ్డు వున్నాయి కాబట్టి చూసేముందు అది తల అటూ ఇటూ విసుర్తుంటుంది. అలా విసురుతుంటే దాని మెడలో వున్న ఘంట 'డింగ్ డింగ్' మని మోగుతూ వుంటుంది. చీకట్లో దాని నీలి కళ్ళు మెరుస్తూ వుంటాయి. చీకట్లో దాని అరుపు విని, కళ్ళని ఫాలో అయ్యి బిగ్ పీట్ బోను దగ్గరికి వెళ్తాడు. బోనులో బిగ్ పీట్ వేలు పెడితే అది నాకుతుంది. అది బిగ్ పీట్ కి బాగా నచ్చి, దాన్ని కొంటాడు. అది బౌ బౌ మంటూ వుంటే చూసాడు కాబట్టి, దాని మెడలో ఘంట ఉంది కాబట్టి, దానికి "బౌ బెల్లా" అని పేరు పెడతాడు. ఇంటికి తీసుకొస్తాడు.
లిటిల్ పీట్ తన ఐదో పుట్టినరోజు కోసం రాత్రంతా చాలా excite అయ్యి, ఎన్నో ఆలోచనలతో పడుక్కుంటాడు కాబట్టి, వాడికి ఒక కల ఒస్తుంది. (ఇక్కడ ప్రిన్సుస్స్ స్టొరీ మా అమ్మాయి చెప్పింది చొప్పించా) అందులో వాడే ప్రిన్సు. వాడికి ఒక కుక్క పిల్ల వుంటుంది. వాడు PRINCESS ని రక్షించడానికి ఒక CASTLE కి వెళ్తాడు. ఆ CASTLE ని ఒక డ్రాగన్ కాపలా కాస్తూ వుంటుంది. (ఇది ష్రెక్ స్టొరీ కాపీ) ఆ కలలో వాడు డ్రాగన్ని FIGHT చేసి CASTLE పైనించి పడి పోతాడు. వాడి కుక్క బౌ బౌ మని డ్రాగన్ తో ఇంకా FIGHT చేస్తూ వుంటుంది. కలలో పడిపోతే మెలకువ ఒస్తుంది కదా, లేచి చూస్తే వెలుతురు కనిపిస్తుంది. తెల్లరిపోయిన్దన్నమాట అనుకుంటాడు. మళ్ళీ బౌ బౌ అని సౌండ్ వినిపిస్తుంది. కల ఐపోయింది కదా ఇంకా కుక్క అరుపు వినపడుతోందేమిటి, అని గదంతా వెతుకుతూ ఉంటాడు. ఇంతలో మళ్ళీ కుక్క బౌ బౌ మంటుంది. లేచి చూస్తే మంచ కింద నించి సౌండ్ వొస్తుంది. అది వాళ్ళ నాన్న బిగ్ పీట్ వాడికి తెచ్చిన SURPRISE అన్న మాట.
కధ మాంచి కాపీ కధ అనిపించిందా? కాపీయే. కానీ ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే మా అమ్మాయినించి ఒచ్చిన ఇన్పుట్ తో కధ అల్లినందుకు, దానికి చాలా ఆనందం అనిపించింది. నాకు కూడా ఏదో కష్టపడి కధ అల్లితే, తీరా నచ్చకపోతే నిరాశే కాబట్టి - ఈ కాన్సెప్ట్ ఇద్దరికీ వర్క్ అవుట్ అయ్యింది. ఈ సారి మీ పిల్లలకు కధ చెప్పాలంటే ఇలా ట్రై చేసి చూడండి.
అయితే వీటిలో చిన్న రిస్క్ కూడా లేకపోలేదు. పై కధ చివ్వర్లో సమాప్తం చెపుతుండగా ,నాకెందుకో నేను నా గొయ్యి నేనే తవ్వుతున్నానా అనే అనుమానం కలిగింది. ఆరు నెలల్లో రాబోయే మా అమ్మాయి ఐదవ పుట్టిన రోజుకి కుక్క తెమ్మంటే - నా బతుకు కుక్క బతుకే కదా! కాబట్టి ఇలాంటి రిస్కులకు మీరే బాధ్యత వహించే పక్షంలో కట్టు కధలు కుమ్మేసుకోండి.
29, అక్టోబర్ 2010, శుక్రవారం
మా ఎదురింటి గీతాంజలి యువ జంట
మా ఎదురింటి యువ జంటని చూస్తే నాకు చాలా ముచ్చటేస్తుంది. మరీ యువ జంట మీద కన్ను వేసి - వారిని చూసే వెదవ బుద్ది అని అనుకునేలోపే మీకు వాళ్ళ వయసు చెప్పాలి. అతని వయసు డెబ్భై పైన, ఆమె వయసు అరవై పైన. కాకపోతే మేము ఈ ఇంట్లో దిగిన రెండు సంవత్సరాలకు, వాళ్ళు కూడా ఎదురింట్లో దిగారు (అంటే ఎదురింటి పక్కిల్లు అనుకోండి). వయసుకి ముసలి వాళ్ళు ఐనా, జంట మాత్రం యువ జంటే. ఎందుకంటె ఇంట్లోకి దిగే ముందే పెళ్లి చేసుకున్నారు. అసలు దిగక ముందు ఇద్దరూ చెరొక కొత్త ఇల్లు కొనుకున్నారట. ఇంతలో ఇద్దరికీ ఏ చర్చి లోనో పరిచయం - తదుపరి ప్రణయం. ఆ రెండూ అమ్మేసి ఈ ఇల్లు కొనుక్కుని సెటిల్ అయ్యారు.
ఇద్దరికీ ఇది రెండో పెళ్లి, పైగా ఇద్దరికీ మనుమలు, మనుమరాళ్ళు వున్నారు. కానీ ఇద్దరూ చాలా అన్యోనంగా వుంటారు. ఇద్దరి మనస్తత్వాలు చాలా తేడాగా వుంటాయి. అతని పేరు జిమ్ము, ఆమె పేరు రూతు. జిమ్ము చిన్న పిల్లాడిలా ఎప్పుడూ నవ్వుతో ఉంటాడు. చెయ్యత్తు మనిషి, భారీ ఖాయం. మాట్లాడితే మా ఆవిడ బోదర కప్ప గొంతు అంటుంది. కంచు కంటం. అందరినీ పలకరిస్తాడు, ఒక సారి మొదలు పెట్టడంటే ఆపడు. కలుపుగోలు మనిషి. ఇంటి దగ్గరే ఉంటాడు. మా అమ్మాయి పుట్టిన రోజు పార్టీ లకి పిలిస్తే ఒస్తాడు. అన్నీ కొంచెం కొంచెం తిని, నచ్చినవి బాగా గుర్తు పెట్టుకుంటాడు.
రూతు మరీ మిత భాషి. అంత తొందరగా కలిసే రకం కాదు. మా అమ్మాయి పుట్టిన రోజుకి పిలిచినా ఎప్పుడూ ఒచ్చిన గుర్తు లేదు. స్కూల్ లో ప్రిన్సిపాల్ గా ఇంకా వుద్యోగం చేస్తోంది. కొంచెం తెలియని వాటికి దూరంగా వుండే రకం అనిపిస్తుంది. కానీ పలకరిస్తే మాట్లాడుతుంది. వారాంతాలలో బయట తోట పని చేస్తూ కనిపిస్తుంది.
మొన్నామధ్య జిమ్ముకి బాగా అనారోగ్యం చేసింది, చాలా కంగారు పెట్టాడు. అప్పుడు వాళ్ళతో కొంత సమయం గడిపాను, అప్పుడు వాళ్ళ అనుబంధం చూస్తే ఆశ్చర్యమేసింది. ఇంతకీ వీళ్ళ గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఇలా వృద్ధాప్యంలో తోడు వెతుక్కోడం అనేది మన దేశంలో జరగదు. అసలు ఆ వయసులో వాళ్లకి తనతో పాటు ఇంట్లో ఇంకో మనిషి వుండడం, ఒకళ్ళ బాగోగులు ఇంకొల్లు చూసుకోడం వాళ్లకు చాలా అద్రుష్టం. దాని మూలంగా ఒకరి పట్ల ఒకరికి కృతజ్ఞత తో కూడిన ప్రేమ వుంటుంది. ఈ వయసులో ఆకర్షణతో తీసుకునే నిర్ణయాలు ఎలాగో వుండవు. అంత వయసు ఒచ్చాక ఎవరిని నమ్మి, ఎవరి మీద ఆధారపడగలరు. వీళ్ళని చూస్తే నాకు గీతాంజలి సినిమా ప్రేమ అనిపిస్తుంది. అందులో చివరకి చెప్పినట్లు "ఎంత కాలం బతుకుతారో తెలియదు, కానీ బతికినంత కాలం కలిసే బతుకుతారు"
అదండీ మా ఎదురింటి గీతాంజలి యువ జంట కధ.

28, అక్టోబర్ 2010, గురువారం
వాయినాలతో వాచిపోతోంది
ఈ మధ్య పెళ్ళాం మాట బుద్ధిగా వినే- భార్యకి భక్తి డివిజన్ లో పూర్తి సహాయ సహకారాలు ఇచ్చే సంఘంలో కొందరు సభ్యులతో మాములుగా పెట్టుకున్న ముచ్చట్లలో తేలినది ఏమిటయ్య అంటే. దేశం కాని దేశం లో భక్తి ప్రపత్తుల్లతో సాంప్రదాయాన్ని గౌరవించి గృహిణులు నోచుకున్న నోములు అందరికీ ఆమోదయోగ్యంగా వున్నా, ఒకే కారుతో సంసారం నెట్టుకొస్తున్న భర్తలకు మటుకు ఇలా అనిపించింది.
"వాయినాలతో వాచిపోతోంది
నోములతో నడుం పడిపోతోంది"
వాయినాల ఖర్చు విషయంలో ఒకింత ప్రాస కోసం అనుకుని సరి పెట్టుకున్నా, నోములో భాగంగా వాటి పంపిణీకి పని రోజులలో అందరి ఇంటికీ భార్యని తిప్పాలంటే సదరు భర్తలకు నడుం పడిపోతున్నదన్న విషయము ఇక్కడ గమనార్హము.
కావునా, స్త్రీ మూర్తులు - మీ కష్టంతో పాటు పాలు పంచుకున్న భర్తలపైన కొంచెం జాలి చూపండి. అదే నండి పంపకాలు అయ్యాక, "ఎంత మంచి భర్తో!, అందుకనే జన్మ జన్మలకి మీరే కావాలని ఈ నోము" టైపు వుబ్బేసే మాటలతో అన్నమాట.

27, అక్టోబర్ 2010, బుధవారం
మాంచి మిటాయి కిళ్ళీ కట్టు బాబు
చిన్నప్పుడు పెద్ద వాళ్ళు తినే మిటాయి కిళ్ళీ అంటే చాలా మోజు వుంటుంది. ముఖ్యంగా అందులో వుండే తీపి ITEMS మూలంగా. అప్పుడప్పుడు అమ్మ కోసం తెచ్చిన మిటాయి కిళ్ళీ అమ్మ వెంట పడి సతాయిస్తే అందులో చిన్న ముక్క కొరుక్కోనిచ్చేది. అలా మొదలయ్యింది నాకు మిటాయి కిళ్ళీ మోజు. అప్పుడప్పుడు ఇంట్లో అమ్మ, నాన్న లేకపోతే - అక్కనో, అన్నయనో పట్టుకుని నీకు మీటా పాన్ చేస్తానని చెప్పి బతిమాలేవాడిని. వాళ్ళు ఒప్పుకుంటే, తమలపాకులు రెండు తీసుకుని వాటి మీద పేస్టు కొంచెం సున్నం లాగ అద్దేవాడిని. ఆ తర్వాత కిచెన్ లో వండే సామాన్ల లో నాకు నచ్చినవి అంటే కొంచెం కొబ్బరి, పంచదార పొడి, బెల్లం, యాలకులు లాంటివి వేసి, చివరలో వొక్కపొడి వేసి చుట్టి ఇచ్చేవాడిని. ఒక్కో సారి నచ్చేది, కానీ ప్రతీసారి "ఇందులో ఏమి వేసావు?" అనే ప్రశ్న ఒచ్చేది. ఏమి వేసామో చెప్తే వాళ్లకి తప్పకుండా నచ్చదు. ఇలా సాగేది నా కిళ్ళీ కట్టుడు అలవాటు. అయితే ఇక్కడితో అయిపోలేదు.
నేను ఇంటర్ చదివే రోజుల్లో, మా బావ వాళ్ళ ఇంట్లో వుండే వాడిని. కొన్ని అనుకోని పరిస్థుతులలో అక్కడ కిళ్ళీ కొట్టు ఒకటి వుండేది. మా బావ చేసేది వుద్యోగం, నేను చదివేది చదువు కాబట్టి. నేను సాయంత్రాలు కిళ్ళీ కొట్టు తెరిచే లా నాకు ఆర్డర్లు జారి అయ్యాయి. అది విజయవాడ లో సీతారాంపురం పెట్రోల్ బంక్ దగ్గర అన్న మాట.
నేను కాలేజీకి వెళ్ళే ముందు, కాలేజీ అయ్యాక కొట్టు తెరవాలి. అంటే ముందుగా చిన్న డబ్బా తాళం తీసి, ఆ డబ్బాలో దూరి రేకు కిటికీ తీసి, కొక్కేలు తగిలిస్తే మన బడ్డి కొట్టు ఓపెన్ అన్న మాట. అయితే వెంటనే బయట ఒక చాంతాడు వెలిగింఛి పక్కన వున్న పోలు కి కట్టాలి. ఆ తర్వాత పెద్ద జాడీలు తుడుచుకుని వాటిలో చిక్కీలు, మర మరాల ఉండలు, జన్తికీలు, చేగోడీలు, సోం పాపిడి, బిస్చ్కట్లు, చాక్లెట్లు, ఇంకా మరేమో పిప్పెరమెంటు బిళ్ళలు లాంటివి అవసరాన్ని బట్టి నింపుకోవాలి. మర్చిపోయాను వుంటే అరటి గెల బయట కట్టేయ్యాలి. ఇంటి నించి తెచ్చుకున్న చిల్లర పోసుకోవాలి. ఆ తరవాత సిగేరెట్లు విడిగా పెట్టుకోవాలి. ఇంటి నించి తెచ్చుకున్న తమలపాకులు నీళ్ళల్లో వేసుకోవాలి. కొత్తల్లో పేపర్ కూడా అమ్మేవాడిని, అవి బయట జాడీల కింద వేళ్ళాడ దియ్యాలి. ఇంకా ఏమైనా పీచు మిటాయి లాంటివి వుంటే పైనించి వేళ్ళాడుతున్న కొక్కేలకి తగిలించాలి. ఇంకా మన కిళ్ళీ బడ్డీ రెడీ.
ఆ తరవాత మనకి ఒచ్చే బేరాలు అయితే పొద్దున్న ఎక్కువగా పేపర్, మధ్యాన్నం నించీ కిళ్ళీలు ఎక్కువగా ఒస్తాయి. పాపం చిన్న పిల్లలు ఒక్కో సారి జీడికని, పిప్పెర్మేంట్ కనీ ఒస్తే వాళ్ళ దగ్గర ఐదు పైసలు తక్కువ అయినా ఇచ్చేసేవాడిని. ఎందుకంటె కిళ్ళీ బడ్డి మనది కాదు, పైగా మనకి చినప్పుడు అనుభవాలు గుర్తుకొచ్చేవి. ఆశగా డబ్బులు పట్టుకుని వెళ్తే డబ్బులు తక్కువ అయ్యాయని కొట్టు వాడు పొమ్మంటే చాలా కోపం ఒచ్చి అడ్డమైన తిట్లు తిట్టుకున్నాము కదా! అందుకని మనల్ని వాళ్ళు అలా తిట్టుకోకుండా ఇచ్చేసేవాడిని. ఇవన్నీ కాలేజీ కెళ్ళే కుర్రాడిని నేను చెయ్యడం నచ్చక పోయినా, ఎవడైనా కిళ్ళీ అడిగితే బలే హుషారుగా కట్టేవాడిని. అదే మిటాయి కిళ్ళీ అడిగితే ఇరగదీసి లావు కిళ్ళీ కట్టేవాడిని. సరుకులు ఐపోతే పెద్ద బజార్ కి వెళ్లి ఆకులు, సిగరట్టు తేవాల్సి ఒచ్చేది. వాటితో పాటు కిళ్ళీ సరుకులు అవసరం లేకపోయినా ఎక్కువ తేవడం లాంటివి చేసేవాడిని. ఎవడైనా మన బడ్డీ కొచ్చి "మాంచి మిటాయి కిళ్ళీ కట్టు బాబు", అంటే ఇప్పుడు టీవీ లో ఒచ్చే డయరీ మిల్క్ చాక్ యాడ్ లో లాగ "లడ్డూ కావాలా నాయనా?" అన్నట్లు వినిపించేది. ఇంక చూసుకోండి, మన ప్రతాపం చూపించి (చిలకలు కట్టి నోట్లో పెట్టడం తప్ప) మాంచి కిళ్ళీ కట్టే వాడిని.
ఇప్పటికీ మా అమ్మాయి పుట్టిన రోజు పార్టీ చేస్తే చివర్లో అందరికీ మిటాయి కిళ్ళీ సప్లయ్ మస్ట్ అండ్ షుడ్డు అన్న మాట. నా కిళ్ళీ బడ్డీ అనుభవం చాలా మందికి తెలీదు గానీ లేకపోతే అందరూ "కొన్నారా? మీరే కట్టేరా?" అని అడిగేవాళ్ళు.
26, అక్టోబర్ 2010, మంగళవారం
మా కమ్యూనిటీ బ్లాక్ పార్టీ - 2010
ఏడాది కి ఒకసారి మా కమ్యూనిటీ లో బ్లాక్ పార్టీ చెయ్యడం రివాజు. ఈ సంవత్సరం కూడా చేసారు. పిల్లలు బాగా ఎంజాయ్ చేసారు.
మూన్ బౌన్సు దగ్గర బారులు తీరిన పిల్లలు. దీనిలో పడి గెంతుతుంటే పిల్లలకి టైం తెలీదు - అలసట గుర్తుకు రాదు.
డాన్సు టైం. మకరిన మరియు కొన్ని లేటెస్ట్ పాటలు.
మా అమ్మాయి రంగేసుకున్న పంప్ కిన్.
మొత్తానికి ఈ శనివారం ప్లాన్ చెయ్యకపోయినా, ఇలా ఎంజాయ్ చేసాము.
మూన్ బౌన్సు దగ్గర బారులు తీరిన పిల్లలు. దీనిలో పడి గెంతుతుంటే పిల్లలకి టైం తెలీదు - అలసట గుర్తుకు రాదు.
ఈ ఆటలో చివరికి మిగిలిన వాళ్ళు తప్పకుండా పొట్టి వాళ్ళు అయ్యుంటారు అని నా గట్టి నమ్మకం.
పాట ఆగిందా, నీ ప్లేస్ గోవిందా. మన కుర్చీ ఆటలాంటిదే.డాన్సు టైం. మకరిన మరియు కొన్ని లేటెస్ట్ పాటలు.
మా అమ్మాయి రంగేసుకున్న పంప్ కిన్.
మొత్తానికి ఈ శనివారం ప్లాన్ చెయ్యకపోయినా, ఇలా ఎంజాయ్ చేసాము.
25, అక్టోబర్ 2010, సోమవారం
దేశీ గాడికి దేశీ గాడే శత్రువు
"దేశి గాడికి దేశి గాడే శత్రువు" అని అంటే నమ్మాలి మరి. ఉదాహరణకి మీరు అమెరికాలో ఇంటర్వ్యూ కి వెళ్లారు. తెల్ల వాళ్ళు అందరికీ మీరు నచ్చుతారు. ఒక నల్ల వాడు వున్నా, వాడికి కూడా నచ్చుతారు. కానీ అందులో ఒక దేశి - తమిళ్ గాని, తెలుగు గాని, నార్త్ ఇండియన్ గానీ ఉన్నాడంటే, వాడు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి మీకు ఏది రాదో నిరూపించాలని తెగ ప్రయత్నం చేస్తాడు. మిమ్మల్ని ఎలాగైనా తిరస్కరించాలి. అదీ వాడి వుద్దేస్సం. ఎందుకంటె వాడికి అక్కడ వున్న వాళ్ళెవరూ పోటీ కాదు, మీకు వుద్యోగం ఒస్తే మీరు పోటీ అవుతారని వాడి భయ్యం. అందుకని మిమ్ములని వాడు మొదట్లోనే తున్చేయ్యాలి. ఇలా దేశి గాళ్ళు చేసే ఇంటర్వ్యూ అంతా నీకేమి ఒచ్చు, ఉద్యోగానికి సరిపోతావా అని చూడకుండా, నీకేమి రాదో కని పెట్టి -నువ్వు పనికి రావని చెప్పడానికి కారణాల కోసం జరుగుతుంది. ఈ జబ్బు మన వాళ్ళకే వుంటుంది.
దీనికి ముఖ్య కారణం అభద్రతా భావం. మనకి మనమే శత్రువులం. అలాగని అవతల మనల్ని ఇంటర్వ్యూ చేసే వాడు పెద్ద ప్రతిభావంతుడు, నిజాయితీ పరుడు అనుకుంటే పొరపాటే. వాడు దొంగ అనుభవాలతో, తక్కువ పరిజ్ఞానం తో ఉద్యోగంలో కొచ్చి - పగలూ రాత్రీ కష్టపడి పని చేసి ఒక రకంగా అక్కడ కొంత స్థిరపడి ఉంటాడు (అందరూ కాదనుకోండి). మీ రాక వాడి ఉనికికి ప్రమాదం, అందుకని వాడు మిమ్మల్ని అంతా త్వరగా రానివ్వడు.
నేను ఒక్కోసారి గ్రూప్ గా ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు నాతో పాటు ప్రశ్నలు వేసే దేశీలని చూస్తుంటాను. వాళ్ళు ప్రశ్నించే పద్ధతి, నేను నీకంటే గొప్ప- నీకు, ఉద్యోగానికి మధ్య నేను అడ్డు, నిన్ను ఎలా ఏడిపిస్తానో చూడు అన్న తరహాలో వుంటాయి. ఒక సారి అయితే నేను చిర్రెత్తి, "చూడు బాబు. మనం ఇక్కడ జనాలని ఏడిపించి మన ఆధిపత్యం చూపించక్కర్లేదు. వుద్యోగం చెయ్యగలడా? కష్ట పడే మనిషా? అని చూస్తే చాలు" అని చెప్పాల్సొచ్చింది.
ఉద్యోగాలలో కూడా ఎక్కువ మంది దేశీలు వుంటే, అక్కడ రాజకీయాలు మొదలు. పక్కవాడి కంటే ముందే మనం పైకి వెళ్ళిపోవాలని ఉండటంలో తప్పులేదు, కానీ అది దేశి గాడు అయితే అస్సలు తట్టుకోలేరు.
అసలు ఈ జబ్బు మన వాళ్ళలో చాలా ఎక్కువ. మిగిలిన వాళ్ళు అయితే ఒకళ్ళకి ఒకళ్ళు బాగా సాయం చేసుకుంటారు. నేను పని చేసిన కొన్ని కంపెనీ లలో అయితే ITALIANS , RUSSIANS , ఫిల్లిపిన్స్ బాగా వాళ్ళ మనుషులకి సాయం చేసుకుంటారు. పైకి వెళ్ళిన వాడు వాళ్ళ దేసస్తున్ని పైకి తీసుకొచ్చేవాళ్ళు. మన వాళ్ళు మటుకు ఒకడు పైకి వెళ్తుంటే, ఇంకోడు వాడిని కిందకి లాగే ప్రయత్నం చేస్తూంటారు. ఈ విషయంలో మనకన్నా CHINESE చాలా నయం.
మన వాళ్ళలో ఇంకో జబ్బు ఏమిటంటే, ఎవడికి వాడు "నేను ఒచ్చేవరకూ అంతా బానే వుంది, కానీ ఆ తరవాతే ఎవడు పడితే వాడు ఒచ్చేస్తున్నాడు" అనే ధోరణి. మళ్ళీ మనకి లేని గ్రీన్ కార్డు పక్క వాడికి వుంటే కడుపు మంట, మనకంటే ఎక్కువ ఎవడైనా సంపాదిస్తే "ఛాన్స్ కొట్టాడు". అదే మనమైతే మన ప్రతిభ అని, మనం స్పెషల్ అనీ ఫీలింగ్.
మళ్ళీ కులాలు, మతాలు, జిల్లాలు, వర్గాలు, పార్టీలు, ఫాన్స్ ఇవన్నీ మనిషికీ మనిషికీ అడ్డు.
ఒక్కో సారి నేను అనుకుంటాను గ్లోబల్ డిమాండ్, టెక్నాలజీ బూం, ఔట్సౌర్సింగ్ ఇవన్నీ కలిసొచ్చి, చాలా మందికి నడి మంత్రపు సిరి ఒచ్చింది. అందుకేనేమో ఈ శత్రుత్వాలు. అదే మిగిలిన దేశాల వాళ్ళలాగా ప్రాణం గుప్పెట్లో పెట్టుకుని శరణార్ధులుగా ఒస్తే కలిసి వుండే వాళ్ళమేమో.
నేను ఒచ్చిన కొత్తలో కొందరు RUSSIANS నా కలీగ్స్, మా ఇంటికి ఒచ్చి కుర్చీలు గట్రా సామాన్లు తెచ్చి పడేసేవాళ్ళు. వాళ్ళు అంతా శరణార్ధులుగా ఇక్కడికి ఒచ్చారు. వాళ్ళు నాకు అన్నీ తెచ్చి ఇస్తుంటే వొద్దని ఎంత చెప్పినా వినేవాళ్ళు కాదు. ఒక రోజు అందరినీ కూర్చో బెట్టి, బాబూ నాకు కావాలంటే నేను అన్నీ కొనుక్కోగలను, మీరు ఇవన్నీ ఎవడైనా లేని వాడికి ఇవ్వండి అని చెప్పాను. అప్పుడు వాళ్ళు చెప్పారు, ఇక్కడికి ఒచ్చినప్పుడు వాళ్లకి తిండి కూడా లేదుట, తోటి దేశస్తులు దయతో వాడుకున్నవి ఇస్తే వాటితో బతికే వాళ్ళట. ఏది కొనాలన్నా, వాడేసినవి అమ్మే త్రిఫ్ట్ షాప్ లో కొనుక్కునే వాళ్ళట. నేను అలాగే అనుకుని, వాళ్ళతో కలిసిపోయనని నాకోసం అందరూ ఇలా తలోకటీ అనుకున్నారట. బాబూ! నాకు లేనిది కారు ఒక్కటే, అది కూడా నాలుగు నెలలు జీతం ఒస్తే కొనుకుంటాను, కాబట్టి మీరు నాకు పిక్ అప్, డ్రాప్ అఫ్ మాత్రమే సాయం చెయ్యండని చెప్పాను. పాపం నాకే కాదు, నా స్నేహితులని కూడా పిక్ చేసుకునే వారు. ఇది మన వాళ్ళలో చాలా అరుదుగా జరుగుతుంది అమెరికాలో.
నేనే కాదు, చాలా మందికి జరిగిన అనుభవాలతో అప్పుడప్పుడు అనుకుంటాను "అమెరికాలాంటి దేశాలలో, దేశీ గాడికి దేశీ గాడే శత్రువు - ముఖ్యంగా ఉద్యోగాలలో".
గమనిక: ఇవి నా అభిప్రాయాలు మాత్రమే. అందరూ ఇలా వుండరు. మీరు నా టపా చదువుతున్నారు కాబట్టి, మీరు ఆ కోవలోకి చెందరు- అమెరికాలో వున్న సరే.

24, అక్టోబర్ 2010, ఆదివారం
That's OK Daddy.. It's just a dream
ఈ రోజు పొద్దునే నా కూతురు నన్ను నిద్ర లేపి, "డాడీ. I had a bad Dream" అంది. మనం మామూలుగా అన్నీ వినేసి వోదిలేసే టైపు కాదు కదా? అందుకని నిద్ర మత్తులో మంచం దిగకుండానే, ఎప్పటి లాగే "Tell me what happened." అన్నాను. క్లుప్తంగా దాని కల, దాని బాషలో ఇలా.
"నువ్వు, నేను, అమ్మ ఎక్కడికో వెళుతున్నాము అంట. నువ్వేమో కార్ డ్రైవ్ చేస్తున్నావు. నేను అమ్మ కూర్చున్నాము. ఇంతలో ఒక అబ్బాయి ఒచ్చి నా లంచ్ బాక్స్ దొంగతనం చేసాడు. నేను నీకు చెప్పినా నువ్వు అస్సలు పట్టించుకోలేదు. అలా డ్రైవ్ చేస్తూనే వున్నావు. ఆ అబ్బాయి నా లంచ్ బాక్స్ దొంగతనం చేసాడు. ఆ అబ్బాయి చాలా చెడ్డ అబ్బాయి."
నేనేదో దాన్ని ఊరుకోపెడుతున్నట్లు నిద్ర మత్తులో "పోన్లే తల్లి, నీకు ఇంకో లంచ్ బాక్స్ కొనిపెదతానులే" అన్నాను.
దానికి సమాధానం గా, "That's OK Daddy.. It's just a dream. I still have my lunch box. You don't have to buy me one."
మత్తు ఒదిలి మంచం మీద నించి లేచి కూర్చున్నా. పళ్ళు తోముకుంటూ ఆలోచిస్తు అనుకున్నాను,
"దీనికి కలకి - వాస్తవానికీ తేడా తెలిసిపోయింది. నాకే ఎప్పుడు ఏ భరోసా ఇవ్వాలో తెలియదు".

23, అక్టోబర్ 2010, శనివారం
బెండకాయలేరే మొగాళ్ళు లోకువ
బెండకాయలేరే మొగాళ్ళు అంటే సాటి మగవాళ్ళకు లోకువ. ఆడవాళ్ళకు అయితే మరి ఇంక చెప్పకర్లేదు. ఆ ఏరేది మొగుడు అయితే కొంచెం రిలీఫ్ అని నేను అనుకుంటున్నాను. అసలు చాలా మంది ఆడవాళ్ళకు వంట వొచ్చిన మగ వాళ్ళతో పెద్ద తంటా. ఈ టాపిక్ మీద మనం మళ్ళీ మరో టపా వేసుకుందాము తరవాత. ఇంతకీ బెండకాయలేరే మొగాళ్ళ గురించి మాట్లాడుకుందాం.
అసలు గ్రోసరీ కి లిస్టు రాసుకుని, తీరిగ్గా కూరగాయల షాప్ కి వెళ్లే మగ వాళ్ళు అంటే కొంత మిగిలిన మొగవాళ్ళకు లోకువ. వంట ఆడవాళ్ళ పని అనే వాళ్ళ ఉద్దేశ్యం. నేను పెళ్ళికి ముందు కూడా తీరిగ్గా ఇండియన్ సబ్జీ మండి కి వెళ్లి అన్ని కూరగాయలు తెచ్చేవాడిని. అందులో బెండ కాయలు ఏరడం పెద్ద తంటా, దొండకాయలు తరగటం పెద్ద కడుపు మంట. మా రూమ్మేట్ దొండ కాయలు తరిగేటప్పుడు నన్ను తిట్టుకున్న సందర్భాలు కూడా చాలా వున్నాయి. కూరల దుకాణంలో కేవలం బెండకాయల దగ్గరే ఎక్కువ రష్ వుంటుంది. ఎందుకంటె మిగిలినవి అన్నీ గిచ్చో,రక్కో,నొక్కో లేదా రంగుతోనో, రూపంతోనో ఏరి పారేయ్యచ్చు. కానీ ఈ బెండకాయలు మటుకు తోక విరగ్గోట్టాలి. పోనీ పక్క వాడు ఆల్రెడీ విరిచేసిన బెండకాయ మనం యేరుకుంటామా అంటే అదీ కుదరదు. ఎందుకంటె మనం విరిచినప్పుడే టక్కు మనాలి. అదీ మరీ కొసలో, తోక చివరన అయితే ముదురుది ఐనా విరిగిపోతుంది. కాబట్టి ఈ బెండకాయల ఎంపికలో మా చెడ్డ చిక్కు ఉంది. పోనీ ఏదో ఒకటి అని చేతికందినవి తెచ్చి కూర చేసి పారేసామా, ముదురు బెండకాయలతో ఏమి చేసినా అస్సలు బావుండదు.
అసలే నా కూతురు ఇష్టంగా తినేది ఈ కూర ఒక్కటే. ఇది తప్ప అన్నీ అమెరికన్ కూరగాయల షాప్ లో ఇంచుమించు దొరికేస్తాయి. కనీసం దానికి కూర చెయ్యడానికైనా సరిపడా తేవాలని కక్కుర్తి కొద్దీ దూరం డ్రైవ్ చేసుకుని వెళ్తానా, అక్కడ లేతవన్నీ జనాలు ఎరేసుకున్నాక అడుక్కి వున్నవి మన కంట పడ్డాయంటే - నరక యాతన. అక్కడ సముద్రంలో ముత్యాలు పట్టినట్లు పట్టాలి, పావు గంట తర్వాత చూసుకుంటే పది కూడా దొరకవు. వాటితో కూర చేస్తే నంచుకోడానికే సరిపోవు. పోనీ మన అదృష్టం బావుండీ వాడు కొత్త బాక్స్ తీసి కుమ్మరించాడో, వెంటనే ఒక పది మండి లేడీస్ ఇవి మా ఫింగర్స్ అని వాటి మీద చేతులేసి ఏరుతుంటారు. ముగ్గురు పట్టే ప్లేస్ లో ఆల్రెడీ పది మంది లేడీస్ లేడీ ఫింగెర్స్ ని విరగ్గోడుతుంటే, తోసుకుని నా లాంటి వాడు వెళ్లి, సరిగ్గా కనపడక ఏ లేడీ ఫింగరో పట్టుకుని తోక అనుకుని గోరు విరిచానో, నా పని "దుకాణంలో మద్దెల దరువు - ఇంటి దగ్గర (ఎగిరెగిరి) పసుపు దంపు". అసలే మనకి మొహమాటం, పైగా కొంత మంది ఏరే టప్పుడు "ఈ లెఫ్ట్ నా ఏరియా అక్కడ చెయ్యి పెట్టావో విరిగేది బెండకాయ కాదు" అన్న రేంజ్ లో ఒక లుక్ ఇస్తారు. అందుకని ఒక మూలగా ఎవరికీ తగలకుండా బురదలో మట్టి పిసుక్కునే వాడి లాగ కింద నించి పైకి చేసి కొన్ని లేత బెండకాయలు ఏరే ప్రయత్నం చేస్తానా, ఇంతలో తను యేరు తుంటే దొరకబోయిన వజ్రం మీద నేనేదో మట్టి కప్పేసినట్లు ఇంకొక లేడీ చూస్తుంది. మొగుడు తంతుంటే, తోటి కోడలు వీడియో తీసినట్లు ఎక్కడినించో ఒక మగాడు సెల్ ఫోన్ లో పెళ్ళాంతో మాట్లాడుతూ సంచీలో మూడు గుప్పిళ్ళు బెండకాయలు వేసుకుని ఒక సారి పైకి కిందకి ఊపి (తూకం - ఒక్క ఊపుతో, కంటి చూపుతో లెక్కేసే టైపు లో) "ఆ తీసేసుకున్నా. దొండ కాయలు కావాలా?" అని మాయమైపోతాడు. అప్పుడు పక్కన ఆడవాళ్ళు నాకేసి చూసే చూపుకి లేడీస్ బాత్రూం కెళ్ళిన జెంట్ లాగ వుంటుంది నా పరిస్థితి.
ఇంతా ఏరి హీరో లా తెచ్చానని అనుకుని రిలీఫ్ గా పట్టి కెళ్ళి మా కార్ట్ లో వేస్తుంటే "అది దానికి ఒక్కదానికే సరిపోతాయి" అని మా ఆవిడ అంటుంటే పంపు దగ్గర నీళ్ళు పట్టే మొగాడికి పెళ్ళాం మీద వచ్చినంత కోపం వొస్తుంది. అదే ఏ మగ ఫ్రెండ్ తోటో వెళ్తానా, నేను బెండకాయల దగ్గరికి వెళ్ళేటప్పుడు వాడు ఇంక వీడు అరగంటైనా రాడు అని మెల్లిగా బయటకి జారుకుంటాడు. ఒక పక్క ఏరుతూ, ఇంకో పక్క వాడిని ట్రాక్ చెయ్యడం కాన్ఫరెన్స్ మాట్లుడుతూ కోడింగ్ చేసినంత కష్టం.
అందుకనేనండి నేనంటున్నా "బెండకాయలేరే మొగాళ్ళు అందరికీ లోకువ". ఎవరేమనుకుంటే నాకేంటి, బెండ కాయ వేపుడు అన్నంలో నెయ్యతో కలిపి ముద్దలు పెడుతుంటే నా కూతురు తింటుంటే నాకనిపిస్తుంది, "దీని కోసం వెళ్లే దూరాలు, ఆడవాళ్ళ చూపుల ఘోరాలే కాదు - లేత బెండకాయ చోరీ లాంటి పేపర్లో పడ తగ్గ నేరాలైనా చేసెయ్యచ్చు" అని.

22, అక్టోబర్ 2010, శుక్రవారం
ఆర్ట్ పీస్ బావుంది. ఎక్కడ కొన్నారు.
ఆర్ట్ పీస్ బావుంది. ఎక్కడ కొన్నారు. ఈ మాట చాలా మంది అడిగారు. నిజానిని ఇది అసలు ఆర్ట్ పీసు కాదు. కేవలం ఒక గ్రీటింగ్ కార్డు కొంచెం ఆర్టిస్టిక్ గా తయారు చెయ్యబడ్డది. ఇలాంటివి ఒక పది కొని, వాటికి సరిపడా ఫ్రేం లని మా దగ్గర వున్న IKEA లో తెచ్చి, వాటిలో ఈ గ్రీటింగ్ కార్డు ఇరికించా. ఇప్పుడు డబ్బులకు డబ్బులు మిగులు, మన ఇంటికొచ్చిన జనాలకు మనమేదో ఆర్ట్ పీసు లతో అలంకరించిన గొప్పలు పోవచ్చు.
నా దగ్గర ఇలాంటి తొక్కలో ఐడియాలు చాలా వున్నాయని అప్పుడప్పుడు మా ఆవిడ నిజంగా బోలెడు డబ్బులెట్టి ఏదైనా కొన్నా సరే, నా మీద నమ్మకంతో అది తక్కువకే ఒచ్చిందని గాట్టిగా చెప్పేస్తుంది. ఒక సారి అలాంటి ముద్ర పడ్డాక మనం మటుకు ఎక్కువ పెట్టి ఎందుకు కొంటాం.
అన్నట్లు ఆభరణాల దగ్గర ఈ ఎత్తు పని చెయ్యదన్దోయ్! కాసులు రాలాల్సిందే. అక్కడ ధగ ధగ, నిగ నిగ లతో పాటు కేరట్ మరియు కరెన్సీ తక్కువైతే ఆభరణానికి, అది తెచ్చిన వాళ్లకి అస్సలు విలువ వుండదు.
ఇది మా ఆర్ట్ పీసు కధ.
21, అక్టోబర్ 2010, గురువారం
మాంచి చందమామ పాట
పాట లింక్:
ఈ మధ్య మా అమ్మాయికి పాడే చంద మామ పాట బోర్ కొట్టి, ఇంకా ఏమైనా మంచి జోల పాటలు దొరుకుతాయేమో అని వెదుకుతుంటే ఇది కనిపించింది. ఇది హిందీ కాబట్టి మా అమ్మాయికి పెద్దగా నచ్చదులే అని అనుకున్నా. ఇంతలో మా అమ్మాయి నాన్నా, నాకు అది పెట్టు అని కంప్యూటర్ మీద బొమ్మ చూసి అడిగింది. ఒకటి రెండు సార్లు చూసింది. ఇక దీనికి నచ్చింది కదా అని మెల్లిగా పాట అర్ధం చేసుకుని మనం జోల పాట పాడగలమా? అని ప్రయత్నం మొదలు పెట్టా. వినగా, వినగా పాట బావుంది.
ఇది పాత హిందీ సినిమా "వచన్" లోని పాట. ఆషా బొంస్లె పాడింది. మాంచి లాలి పాటగాను, తినిపించేటప్పుడు అలరించ డానికి కూడా ఉపయోగ పడుతుంది.
మీరు పాడుకోవడానికి వీలుగా కింద ఈ పాట లిరిక్స్ ఇస్తున్నాను.
(chandaamaamaa door ke, pue pakaaen boor ke)-2
(aap khaaen thaali men, munne ko den pyaali men)-2
chandaamaamaa door ke, pue pakaaen boor ke
(pyaali gai toot, munnaa gayaa rooth)-2
(laaenge nai pyaaliyaan,bajaa bajaa ke taaliyaan)-2
munne ko manaaenge,ham doodh malaai khaaenge,
chandaamaamaa door ke.....
(udanakhatole baith ke munnaa chandaa ke ghar jaaegaa)-2
taaron ke sang aankh michauli khel ke dil bahalaaegaa
khel kud se jab mere munne kaa dil bhar jaaegaa,
thumak thumak meraa munnaa, vaapas ghar ko aaegaa,
chandaamaamaa door ke.....
******************************************
(चंदामामा दूर के, पुए पकाएं बूर के)-२
(आप खाएं थाली में, मुनने को दें प्याली में)-२
चंदामामा दूर के, पुए पकाएं बूर के
(प्याली गई टूट, मुन्ना गया रूठ)-२
(लाएंगे नई प्यालियाँ,बजा बजा के तालियाँ)-२
मुन्ने को मनाएंगे,हम दूध मलाई खाएंगे,
चंदामामा दूर के.....
(उड़नखटोले बैठ के मुन्ना चंदा के घर जाएगा)-२
तारों के संग आँख मिचौली खेल के दिल बहलाएगा
खेल कूद से जब मेरे मुन्ने का दिल भर जाएगा,
ठुमक ठुमक मेरा मुन्ना, वापस घर को आएगा,
चंदामामा दूर के.....
Lyrics Courtesy: http://www.lyricsmasti.com/
వీడియో Courtesy : http://www.youtube.com
20, అక్టోబర్ 2010, బుధవారం
కట్టు కధ - స్నానం చెయ్యని కుక్కపిల్ల నోబి
ఈ మధ్య మా అమ్మాయిని పొద్దున్న నిద్ర లేపడం ఒక ప్రహసనం. అందులో కొన్ని అరుపులు, కేకలు, తన్నులు (మా అమ్మాయి కాలు విసిరితే) , ఏడుపులు లాంటివి సర్వ సాధారణం ఐపోయాయి. నేను కొంచెం పిల్లల పెంపకంలో అరుపులు సహించలేను - అవి నా అరుపులు కాకపోతే అస్సలు భరించలేను. ఆ టైం కి పరిస్థితిని బట్టి ప్రత్యక్షం అయ్యి, ఏదో ఒక లాగ మా అమ్మాయి దృష్టి ఏడుపు నించి తప్పించి ఒక సారి కళ్ళు తిడిచి మొహం కడిగేసి ఒంటి మీద నీళ్ళు పోస్తే ఇంకా మా అమ్మాయి స్వింగ్ లోకి ఒచ్చేస్తుంది. అలాంటి సందర్భంలో ఇవ్వాళ్ళ మనం చేసిన రోబో వేషాలు చెల్లలేదు. అప్పటికీ వొస్తువులు పట్టి తెచ్చే రోబో, తేలు లాగ కుట్టే రోబో, పాట పాడుతూ డాన్సు చేసే రోబో లాంటి చిన్నెలు చూపించా. దాని ఏడుపు పెరిగింది గానీ తగ్గలేదు. రోబో దిక్కు తోచక బిక్కుమంది. ఇంతలో తట్టిన కట్టు కధే "కుక్క పిల్ల నోబి".
ఒక ఇంట్లో పిల్లలకి రోడ్డు మీద ఒక కుక్క పిల్ల దొరికింది. అది వాళ్ళ అమ్మ, నాన్న మాట వినకుండా దిక్కులు చూసుకుంటూ వెళ్ళిపోయింది, అందుకని తప్పి పోయింది. దానికి చాలా భయం వేసి, కూ కూ అని ఏడ్చుకుంటూ రోడ్డు మీద మెల్లగా వెళ్తోంది, వెతుక్కుంటూ. ఆ కుక్కని ఇంటికి తీసుకొచ్చి పిల్లలు ఆడుకుంటారు. అయితే ఇది ఎప్పుడు స్నానం చేయించాలన్నా అసలు చేయించ నివ్వదు. 'బౌ బౌ నో బాత్, బౌ బౌ నో బాత్" అని అరుస్తుంది. ఇక్కడ కొంచెం మిమిక్రీ అవసరం. కుక్క పిల్ల లా అరిస్తే పిల్లల ఏడుపు సగం తగ్గుతుంది, పైగా ఆసక్తి పెరుగుతుంది. అసలు ఇంట్రో లేకుండా కూడా ఈ అరుపుతో స్టొరీ మొదలు పెట్టాల్సిన అవసరం పడచ్చు. ఇంక కధలో కొస్తే, ఆ కుక్కపిల్ల పేరు నోబి, ఎందుకంటె అది "NO BATH BABY " కాబట్టి. (మీకు పేరు నచ్చకపోతే మార్చుకోండి, అంత కంటే బెటర్ పేరు ఆ ఫ్లో లో తట్టలేదు మరి).
ఇలా స్నానం చెయ్యని నోబి ని పిల్లలు పెట్ చెయ్యాలని వున్నా, అది కంపు కుక్క అని (స్టిన్కి), డర్టీ అని పిల్లలు పెట్ చెయ్యరు. ఇంక లాభం లేదని ఒక రోజు అందరూ బలవంతంగా నోబి ని పట్టుకుని స్నానం చేయించే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ కొంచెం సబ్బు, నురుగ, నీళ్ళు మన టాలెంట్ ని సందర్భాన్ని పట్టి ఉపయోగించి నోబి మీద ఇలా పోశారు అని చెప్పి స్నానం చేయిన్చేయ్యాలి.
ఇంతేనా స్టొరీ అయిపోయిందా అని అనుకుంటున్నారా. లేదు, మా అమ్మాయి స్నానం ఐపోయింది. మళ్ళీ అవసరం అయ్యి, పనికి ఒస్తే కధ జరిగిన కధ చెప్పి మళ్ళీ కొనసాగించే అవకాశం రావొచ్చు.
అయినా ఇదేమన్న స్టొరీ సిట్టింగ్ అనుకున్నారా- కధ కంటిన్యూ చెయ్యడానికి. నా కసలే పొద్దున్న తప్పకుండా అటెండ్ అవ్వాల్సిన ఎనిమిదింటి ఆఫీసు కాన్ఫరెన్స్ కాల్ టైం అయ్యింది. అది లేక పోతే ఇలాంటి కట్టు కధలు లక్ష చెప్పినా నేను లేవను- మా అమ్మాయి సంగతి పక్కన పెట్టండి. చిన్నప్పుడు మా నాన్న గారి దెబ్బల కి బయపడి లేచేవాడిని, లేక పోతీ మా నాన్న ఇల్లాంటి కధలు చెప్పలేక ఏం చేసేవారో? పిల్లలని భయపెట్టకుండా పెంచాలంటే కొంచెం కష్టమే మరి.
Image source: blogspot

దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)